స్పైడర్ మాన్ ఫిలిం సిరీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Spider-Man series
({{{year}}} English సినిమా)
200px
Spider-Man complete trilogy box set
దర్శకత్వం Sam Raimi
(Spider-Man 1,2,3)
Marc Webb
(Untitled Spider-Man Reboot)
నిర్మాణం Avi Arad
Laura Ziskin
Grant Curtis
రచన David Koepp
(Spider-Man)
Alvin Sargent
(Spider-Man 2-3)
Ivan Raimi
(Spider-Man 3)
Sam Raimi
(Spider-Man 3)
తారాగణం Tobey Maguire
Kirsten Dunst
James Franco
Rosemary Harris
J. K. Simmons
Cliff Robertson
Willem Dafoe
(Spider-Man 1,2,3)
Andrew Garfield
(Untitled Spider-Man Reboot)
సంగీతం Danny Elfman
(Spider-Man 1-2)
Christopher Young
(Spider-Man 3)
ఛాయాగ్రహణం Don Burgess
(Spider-Man)
Bill Pope
(Spider-Man 2-3)
కూర్పు Arthur Coburn
(Spider-Man)
Bob Murawski
(Spider-Man 1-3)
పంపిణీ Sony Pictures Entertainment
విడుదల తేదీ Trilogy: 2002 - 2007
Reboot: 2012 - present
నిడివి 388 minutes
దేశం United States
భాష English
పెట్టుబడి $597 million
వసూళ్లు $2,496,346,518

ఒకే పేరు గల పాత్రతో ఊహాజనితమైన మార్వెల్ కామిక్స్ ఆధారంగా నిర్మించిన సూపర్ హీరో చిత్రాలే స్పైడర్ మాన్ సినిమాలు గా తీయబడ్డాయి. స్పైడర్ మాన్ ఆధారిత చలన చిత్రాన్ని నిర్మించే హక్కులు మొదట 1985 లో కొనుగోలు చేయబడి, అనేక నిర్మాణ సంస్థలు మరియు స్టూడియోల చుట్టూ తిరిగి చివరికిసోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ వాటిని స్వాధీనం చేసుకునే ముందు ఒక సారి జేమ్స్ కామెరాన్ చే దర్శకత్వం కూడా వహించబడింది.

హాస్య పుస్తకాల అభిమాని అయిన సాంరైమి ను మొదటి మూడు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు సోనీ నియమించుకుంది. ఈ సినిమాల ద్వారా పీటర్ పార్కర్ టోబే మాగుఇర్ తాను ఉన్నత పాఠశాల లో అభిమానించిన మేరీ జాన్ వాట్సన్ కిర్స్టన్ దాంట్ తో సంబంధాలను పెంచుకున్నారు. అంతేకాక స్పైడర్ మాన్ గా గ్రీన్ గోబ్లిన్, విలియం డఫో, డాక్టర్ ఆక్టోపస్ అల్ఫ్రెడ్ మొలినా, న్యూ గోబ్లిన్, జేమ్స్ ఫ్రాంకో, శాండ్ మాన్, థామస్ హేడన్ చర్చి మరియు వెనం తోఫర్ గ్రేస్ వంటి ఎందరో ప్రతినాయకులను వోడించడం జరిగింది.

మొదటి మూడు సినిమాలు మొత్తం 597 మిలియన్ అమెరికన్ డాలర్ల ఖర్చుతో నిర్మించబడి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 2.5 బిలియన్ డాలర్లను వసూలు చేయడం జరిగింది. ప్రతి సినిమా ఎన్నో బాక్స్ ఆఫీసు రికార్డు లను కొల్లగొట్టటమే కాక ఈ మూడు సినిమాలు కూడా దేశీయ సినిమాలలో అత్యధిక వసూళ్ళు సాధించిన 20 సినిమాలలోను, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు సాధించిన 25 సినిమాల జాబితాలోనూ చోటు సంపాదించాయి. మొదటి రెండు సినిమాలు విమర్సకులనుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ మూడవ సినిమాకు మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. ఈ సిరీస్ బ్లూరే మరియు డివిడి రెండింటిలోను విడుదలయ్యింది.

ఈ సిరీస్ లో నాలుగవ సినిమాను 2011 లో విడుదల చేసేందుకు ప్రయతించినప్పటికీ ఈ ప్రాజెక్ట్ నుండి రైమీ తప్పుకోవడంతో 2010 లో దీనిని ఆపివేయడం జరిగింది. అయితే కొత్త దర్శకుడు మార్క్ వెబ్ మరియు కొత్త నటీనటులతో ఈ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభం కానుందని సోనీ ప్రకటించింది. ఉన్నత పాఠశాల లోని సామర్ధ్యాలను మెరుగు పరుస్తూ పీటర్ పార్కర్ పాత్రను తిరిగి తీసుకోవాలని భావిస్తుండగా విలన్ ను ఇంకా ప్రకటించాల్సి వుంది. దీనిని 2012 లో 3-D లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. పీటర్ పార్కర్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించనున్నారు.[1] గార్ఫీల్డ్ వయసును దృష్టిలో ఉంచుకుని పార్కర్ కాలేజి స్టూడెంట్ గా ఈ కొత్త సిరీస్ ప్రారంభం అవుబోతున్నట్లు చెబుతున్నారు.[2]

అభివృద్ధి[మార్చు]

కానన్ ఫిల్మ్స్ అభివృద్ధి దశ[మార్చు]

హాస్య పరిశ్రమ బాగానే అభివృద్ధి చెందినప్పటికీ 1983 లో విడుదలైన సూపర్ మాన్ III బాగా నిరాశ పరచడంతో హాస్య పుస్తకాల ఆధారంగా నిర్మించే సినిమాలకు హాలీవుడ్ లో ప్రాధాన్యత బాగా తగ్గింది.[3] 1985 లో స్పైడర్ మాన్ పై రోగెర్ కార్మాన్ తో ఉన్న ఒప్పందం ముగియడంతో[4] మార్వెల్ కామిక్స్ ఈ హక్కులను కానన్ ఫిల్మ్స్ కు అప్పగించడం జరిగింది. ఒప్పందం ఉన్న ఐదు సంవత్సరాల కాలానికిగానూ 225 ,000 డాలర్ల మొత్తాన్ని మరియు సినిమాల ఆదాయంలో కొంత భాగాన్ని మార్వెల్ కామిక్స్ కు అందించేందుకు గానూ కానన్ అధినేతలు మేనహెం గోలన్ మరియు యోరం గ్లోబస్ అంగీకరించడం జరిగింది.[5] ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 1990 లోపు ఒక సినిమాను కూడా నిర్మించలేకపోతే హక్కులు తిరిగి మార్వెల్ కు స్వాధీనం అవుతాయి.[6]

ఆ సమయానికి ఇన్వేడర్స్ ఫ్రం మార్స్ మరియు ది టెక్సాస్ చైన్సా మసాకర్ 2 వంటి సినిమాలను సిద్ధం చేస్తున్న టోబే హూపర్ ను డైరెక్టర్ గా ఎన్నుకోవడం జరిగింది. పాత్ర యొక్క స్వభావాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న గోలన్ మరియు గ్లోబస్ (డైరెక్టర్ జోసెఫ్ జిటో మాటల్లో చెప్పాలంటే "వాళ్ళు దీనిని ది ఉల్ఫ్ మాన్ పాత్ర లాగా భావించారు")[7] "ది ఔటర్ లిమిట్స్ " సృష్టికర్త అయిన రచయిత లెస్లీ స్టీవెంస్ ను వారు అర్ధం చేసుకున్నదానికి అనుగుణంగానే స్క్రిప్ట్ వ్రాయమని ఆదేశించడం జరిగింది. స్టీవెన్ కథలో ఒక కార్పోరేట్ శాస్త్రవేత్త కావాలనే పీటర్ పార్కర్ అనే ఐడి బాడ్జ్ ఫోటోగ్రాఫర్ ను రేడియో యాక్టివ్ కిరణాలతో తాకించి జూలు కలిగిన, ఎనిమిది చేతులు గలిగిన భూతం లాగా మారుస్తాడు. ఇలా తయారైన ఈ మానవ సాలీడు ఆ శాస్త్రవేత్త రూపొందించిన ఇతర జీవులతో కలవడానికి నిరాకరించి పరిశోధనా శాలలో ఉంచిన ప్రతి రూపాంతరం చెందిన జీవితోను పోరాటం చేస్తూ ఉంటుంది.[7][8]

తన కామిక్ పుస్తకం లోని పాత్రల స్వరూపం ఇలా మారిపోవడంతో సంతృప్తి చెందని మార్వెల్ స్టాన్ లీ కొత్త కథ మరియు స్క్రీన్ ప్లే కు ఒత్తిడి చేయడంతో టెడ్ న్యూసం మరియు జాన్ బ్రాన్క్టోలు కానన్ కు కొత్త కథను రూపొందించడం జరిగింది.[9] మూల కథ నుండి మార్పు చేసిన కథలో కాలేజ్ వయసులో ఉన్న పీటర్ పార్కర్ కు ఒట్టో వొక్తవిఅస్ ఉపాధ్యాయుడు మరియు మార్గదర్సకుడుగా ఉంటాడు. సైక్లోట్రాన్ ప్రమాదంలో స్పైడర్ మాన్ "సృష్టింపబడటమే" కాక ఆ శాస్త్రవేత్త కూడా రూపాంతరం చెంది డాక్టర్ ఆక్టోపస్ గా మారి ఐదవ శక్తి ని నిరూపించేందుకు పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఓక్ సైక్లోట్రాన్ ను పునర్ నిర్మించి, విద్యుదయస్కాంత ఉత్పాతాలు సృష్టించి, గురుత్వాకర్షక వ్యతిరేక ప్రభావాలు న్యూయార్క్ ను మరియు ప్రపంచాన్ని చుట్టుముట్టేలా చేసి భయోత్పాతం సృష్టిస్తాడు. కానన్ విజయవంతమైన సినిమాలైన చక్ నారిస్ మరియు ఇన్వేషన్ యుస్ఎ లకు దర్శకత్వం వహించిన జోసెఫ్ జిటో ను టోబే హూపర్ స్థానంలో నియమించడం జరిగింది. ఈ కొత్త దర్శకుడు బార్నీ కోహెన్ ను స్క్రిప్ట్ తిరిగి రాసేందుకు గానూ ఎంపిక చేసుకున్నాడు. టీవీ లో సబ్రిన ది టీనేజ్ విచ్ మరియు ఫరెవెర్ నైట్ లను సృష్టించిన కోహెన్ యాక్షన్ సన్నివేశాలను జోడించి, విలన్ పాత్రకు అసాధారణమైన హాస్యాన్ని జోడించి, డాక్టర్ ఓక్ కు ఓకే-డోకే అనే ఊతపదాన్ని పెట్టి అతని లక్ష్యాన్ని ఐదవ శక్తిని నిరూపించడం నుండి యాంటి-గ్రావిటీ కి మార్చాడు. కోహెన్ రాసిన కొత్త స్క్రిప్ట్ కు నిర్మాత గోలన్ (ఇతని కలం పేరు "జోసెఫ్ గోల్డ్మాన్") తుది మెరుగులు దిద్దాడు. జిటో యు.ఎస్.మరియు యూరప్ లలో లోకేషన్లు మరియు స్టూడియో సౌకర్యాల కోసం వెతకడమే కాక హార్పర్ గోఫ్ చే పర్యవేక్షించబడిన స్టొరీబోర్డు బ్రేక్డౌన్లను పర్యవేక్షించాడు. అప్పటికి చెప్పుకోదగిన మొత్తమైన 15 నుండి 20 మిలియన్ డాలర్ల ఖర్చుతో కానన్ ఈ సినిమా నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది.[5]

అప్పటికి తారాగణం నిర్ణయం కాకపోవడంతో, జిటో గతంలో కానన్ కు ప్రచార ఫోటోలు మరియు అడ్వర్టైజ్మెంట్ లలో నటించిన నటుడు మరియు ఫైట్ మాన్ అయిన స్కాట్ లెవా పై ఆసక్తి చూపుతూ మార్వెల్ కోసం స్పైడర్ మాన్ వేషంలో బయటకు చూపించడం కూడా జరిగింది. అప్పుడప్పుడే పైకి వస్తున్న నటుడు టాం క్రూయుజ్ ను కూడా ప్రధాన పాత్రకు తీసుకోవాలని ఆలోచించడం జరిగింది. జిటో బాబ్ హాస్కిన్స్ ను డాక్టర్ ఓక్ పాత్ర కు అనుకోవడం జరిగింది. డైలీ బగల్ ఎడిటర్ జె. జోనా జేమ్సన్ పాత్రను పోషించేందుకు స్తాన్ లీ ఆసక్తి వ్యక్తం చేసాడు.[10] ఆంట్ మే పాత్రకు లారెన్ బకాల్ మరియు కాధరిన్ హెప్బర్న్ లను పరిశీలించగా శాస్త్రవేత్త పాత్రకు పీటర్ కుషింగ్ ను, పోలీసు డిటెక్టివ్ పాత్రకు అడాల్ఫ్ సీజర్ ను పరిశీలించారు.[9] కానన్ నిధులన్నింటినీ అత్యంత భారీ సినిమాSuperman IV: The Quest for Peace అయిన మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ లాగేసుకోవడంతో, ప్రతిపాదించిన స్పైడర్ మాన్ బడ్జెట్ ను ఆ కంపెనీ 10 మిలియన్ డాలర్లకు కుదించుకోవలసి వచ్చింది. ఇలా రాజీ పడి స్పైడర్ మాన్ సినిమా నిర్మాణం చేయలేని దర్శకుడు జిటో పక్కకు తప్పుకున్నాడు. కంపెనీ తక్కువ బడ్జెట్ సినిమా గా కథను మార్చేందుకు రచయితలు షెపర్డ్ గోల్డ్మాన్, డాన్ మైకేల్ పాల్ మరియు చివరగా ఎథన్ విలీ ను నియమించి, కంపెనీ లో పనిచేస్తున్న ఆల్బర్ట్ పైన్ ను దర్శకుడుగా నియమించింది. ఇతనే స్క్రిప్ట్ లో మార్పులు చేయడం కూడా జరిగింది.[8]

స్కాట్ లెవా మార్వెల్ ద్వారా ఇంకా పాత్రతో అనుబంధం కలిగి ఉండడంతో (ఈ కామిక్ పుస్తకం యొక్క ఫోటో కవర్లలో ఇతను కనిపించాడు) అన్ని డ్రాఫ్ట్ లు చదివాడు. "టెడ్ న్యూసం మరియు జాన్ బ్రాంకటో ఈ స్క్రిప్ట్ ను రచించారు. అది బాగున్నది కాని కొద్దిపాటి మార్పులు అవసరం ఉన్నాయి. దురదృష్టవశాత్తు తర్వాతి రచయితలు మార్పులు చేసేకొద్దీ ఈ స్క్రిప్ట్ బాగుంది అనేదాని నుండి బాగోలేదు అనేదానికి తర్వాత యెంత మాత్రము బాగోలేదు అనేదానికీ మార్పు చెందుతూ పోయింది." అని లెవా వ్యాఖ్యానించాడు.[10] కానన్ తేరుకోలేని విధంగా ఆర్ధికంగా దెబ్బ తినడంతో 1.5 మిలియన్ డాలర్ల ఖర్చు తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.[7] 1989 లో అవినీతిపరుడైన ఇటాలియన్ ఫైనాన్షియర్ గియన్కార్లో పారెట్టి కు చెందిన పాతే అనే సంస్థ కానన్ ను స్వాధీనం చేసుకుంది. అంతకు ముందు సినిమా నిర్మాణం చేస్తున్న సోదరులిద్దరూ విడిపోయి గ్లోబస్ పాతే తో కలిసి పనిని కొనసాగించగా గోలన్ (స్పైడర్ మాన్ తో సహా) ఎన్నో ఆస్తులను కొనుక్కుని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫిలిం కార్పోరేషన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. స్పైడర్ మాన్ పై మార్వెల్ తో ఉన్న ఒప్పందాన్ని కూడా అతను జనవరి 1992 వరకు కొనసాగించాడు.[6]

గోలన్ తక్కువ బడ్జెట్ స్క్రిప్ట్ లను పక్కన పెట్టి అంతకు ముందే బడ్జెట్ చేయబడి స్టోరీ బోర్డ్ కూడా సిద్ధంగా ఉన్న అసలైన పెద్ద బడ్జెట్ స్క్రిప్ట్ తో సినిమా రూపొందించేందుకే సిద్ధపడ్డాడు.[11] మే 1989 న కేన్స్ లో ట్వంటీ ఫస్ట్ సెంచరీ సెప్టెంబర్ లో ఒక ప్రారంభ తేదీని ప్రకటిస్తూ బారీ కోహెన్, టెడ్ న్యూసం, జాన్ బ్రాంకటో మరియు జోసెఫ్ గోల్డ్ మాన్ లు ఈ స్క్రిప్ట్ ను రూపొందించినట్లు తెలిపింది.[12] సాధారణంగా అమలులో ఉన్న పద్ధతిలో, నిర్మాణ ఖర్చులను సమకూర్చుకునేందుకు గాను గోలన్ ఇంకా తయారు కాని సినిమా హక్కులను అమ్మగా వయాకం టెలివిజన్ హక్కులను మరియు కొలంబియా పిక్చర్స్ వీడియో హక్కులను కొనుగోలు చేసాయి. కొలంబియా స్టూడియో ఫ్రాంచైజీ ను కూడా ప్రారంభించాలనుకుంది. ఈ సమయంలోనే స్టీఫెన్ హీరేక్ ను దర్శకుడుగా అనుకోవడం జరిగింది.[13] గోలన్ ఈ కొత్త స్క్రీన్ ప్లే ను 1989 చివరలో కొలంబియా కు సమర్పించగా (నిజానికి 1989 లోని తేదిని వేసిన 1985 నాటి స్క్రిప్టే) ఆ స్టూడియో తిరిగి కొత్త స్క్రిప్ట్ రాయమని కోరింది. గోలన్ ఫ్రాంక్ లలోగ్గియా ను ఎంపిక చేసుకోగా అతను కొంత డ్రాఫ్ట్ తయారు చేసినప్పటికీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ తో విబేధాలు పెంచుకున్నాడు. నీల్ రుటేన్బర్గ్ మరొక డ్రాఫ్ట్ ను తయారు చేసినప్పటికీ కొలంబియా స్క్రిప్ట్ రీడర్లు దానిని కూడా కొట్టిపారేశారు.[14] కొలంబియా యొక్క స్క్రిప్ట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మూడు స్క్రిప్ట్లులు కూడా "దాదాపుగా ఒకటే కథ". దాదాపుగా ఒక నిర్మాణ ఒప్పందం ఖరారైనట్లే అని 1990 లో స్టాన్ లీ తెలియ చేసారు. "ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్పైడర్ మాన్ ను నిర్మించాలనుకుంది. అయితే వారు ఇప్పుడు కొలంబియా తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న దానిని బట్టి చూస్తే కొలంబియా ట్వంటీ ఫస్ట్ సెంటారీ నుండి స్పైడర్ మాన్ ను కొనుక్కునేలా కనిపిస్తుంది."[15]"

కరోల్కో పిక్చర్స్[మార్చు]

ట్వంటీ ఫస్ట్ సెంచరీ కి చెందిన గోలన్ ఇంకా చురుకుగా పనిచేస్తూ తన స్పైడర్ మాన్ స్క్రిప్ట్ ను పేర్చుకుంటూ, అసలైన డాక్టర్ వోక్ స్క్రిప్ట్ ను నిర్మాణ అవకాశాల కోసం అనేక మంది కి పంపుతూనే వున్నాడు. 1990 లో అతను కెనడా కు చెందిన లైట్ అండ్ మోషన్ కార్పోరేషన్ ను విజువల్ ఎఫెక్ట్స్ కోసం సంప్రదించగా అది ది స్టాప్-మోషన్ కోర్స్ టు స్టీవెన్ ఆర్చర్, క్రల్ , క్లాష్ ఆఫ్ ది టైటన్స్ ను ఆఫర్ చేసింది.[16]

ట్రూ లైస్ , వెరైటీ సినిమాల షూటింగ్ చివరలో కామెరాన్ నుండి ఒక పూర్తి అయిన స్క్రీన్ ప్లే కరోల్కో కు అందినట్లు ప్రకటించడం జరిగింది.[17] ఈ స్క్రిప్ట్ పై జేమ్స్ కామెరాన్, జాన్ బ్రాంకటో, టెడ్ న్యూసం, బారి కోహెన్ మరియు "జోసెఫ్ గోల్డ్ మరి" అనే గోలన్ యొక్క కలం పేరు (జోసెఫ్ గోల్డ్ మాన్) ను సూచించే పేరు మరియు మార్వేల్ ఎగ్జిక్యూటివ్ జోసెఫ్ కలిమారి ల పేర్లు ఉన్నాయి.[18] ఏదో కొత్త 1993 నాటి తేది తప్ప ఈ స్క్రిప్ట్ కూడా దాదాపుగా గోలన్ కొలంబియా కు సమర్పించిన స్క్రిప్ట్ లాగానే ఉన్నది. డాక్టర్ ఆక్టోపస్ కు దర్శకుని ఎంపిక గా కామెరాన్ స్తాల్ల్వార్ట్ ఆర్నాల్డ్ శవర్జేనిగర్ పేరు ఈ ప్రాజెక్ట్ తో తరచుగా వినపడుతూ ఉండేది.[19][20][21] 1995 వరకు కూడా బేస్ లైన్ హాలీవుడ్ వంటి ఇంటర్నెట్ పరిశ్రమ వర్గాలు నీల్ రుటేన్బర్గ్ (కొలంబియా కు 1990 లో సమర్పించిన డాక్టర్ వోక్ స్క్రిప్ట్ రచయితలలో ఒకరు) మరియు జేమ్స్ కామెరాన్ ను సహ రచయితలుగా చెబుతూ ఉండేవి.[22]

కామెరాన్ "స్క్రిప్ట్ మెంట్"[మార్చు]

కొన్ని నెలల తర్వాత, జేమ్స్ కామెరాన్ కొద్ది భాగం స్క్రీన్ ప్లే మరియు కొద్ది భాగం కథా వర్ణన కూడిన ఒక ప్రత్యామ్నాయ కథతో (కాపీ రైట్ రిజిస్ట్రేషన్ 1991 వ తేదీతో ఉన్నది) ఒక 47 పేజీల "స్క్రిప్ట్ మెంట్" ను సమర్పించడం జరిగింది.[23] ఈ స్క్రిప్ట్ మెంట్ లో స్పైడర్ మాన్ మూలాల గురించి చెప్పినప్పటికీ ఎలక్ట్రో మరియు సాండ్ మాన్ అనే కామిక్ పుస్తకంలోని పాత్రలను వాడుకోవడం జరిగింది. ఈ "ఎలక్ట్రో" అనే పాత్ర (మాక్స్ డిలన్ కు బదులుగా కాల్టన్ స్త్రాండ్ పేరు వాడడం జరిగింది) అవినీతి, పదవీ వ్యామోహం కలిగిన ఒక బూర్జువా వర్గానికి చెందిన వ్యక్తి. ఫ్లింట్ మార్కో కు బదులుగా కామెరాన్ వాడిన సాండ్ మాన్ (బోఇడ్ అనే పేరు పెట్టారు) పాత్ర బీచ్ లో అణు విస్పోటనానికి గురవడం కాక ఫిలడెల్ఫియా ఎక్స్పరిమెంట్-స్టైల్ బైలొకేషన్ మరియు ఆటం-మిక్సింగ్ ల వలన యాక్సిడెంట్ కు గురయ్యి రూపాంతరం చెందుతాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై భాగంలో జరిగే పోరుతో జరిగే క్లైమాక్స్ లో పీటర్ పార్కర్ తన నిజ స్వరూపాన్ని మేరీ జేన్ వాట్సన్ కు తెలియ చేస్తాడు. ఇంతే కాక, స్పైడర్ మాన్ మరియు మేరీ జెన్ శృంగారంలో పాల్గొన్నట్లు చూపించడం వలన కథ నడిపించే తీరు కూడా అసభ్యకరంగా మారింది.[24]

ఈ కథా చిత్రణ కొంత వరకు గత స్క్రిప్ట్ ల లోని కొన్ని అంశాలను స్వీకరించి జరిగింది. స్టీవెన్ కథలోని ఆర్గానిక్ వెబ్ షూటర్లు, స్పైడర్ మాన్ ను రాబోయే రూపాంతర జాతుల యొక్క మాస్టర్ రేస్ లో కలపడానికి ప్రయత్నించే విలన్, మూల కథ మరియు స్క్రీన్ ప్లే లోని బ్లాకుఅవుట్ లు, ఫ్రీక్ మాగ్నటిక్ ఈవెంట్లు మరియు బై లొకేషన్ల ను కలుగచేసే విద్యుత్ తుఫానులు; ఎథన్ విలే స్క్రిప్ట్ లోని భయంకరమైన అతీంద్రియ శక్తులకు వశమైన ఒక విలన్ నుండి ఒక భయంకరమైన సాలీడు తప్పించుకుని ఫ్రాంజ్ కాఫ్క యొక్క శారీరక రూపాన్ని సంతరించుకుని రాత్రిపూట చేసే విధ్వంసం; ఫ్రాంక్ లలోగ్గియా స్క్రిప్ట్ లోని న్యూయార్క్ మొత్తం ఆశ్చర్య పోయేలా వర్షంలా పడే దొంగిలించిన సొమ్ము; నీల్ రుటెన్బర్గ్ స్క్రీన్ ప్లే లోని యెన్.వై.సి.స్టాక్ ఎక్స్చేంజ్ పై దుండగులు చేసే దాడి వంటి అంశాలెన్నో ఈ కథ లో చొప్పించడం జరిగింది.[8] 1991 లో, కరోల్కో పిక్చర్స్ గోలన్ కు మార్వేల్ తో ఉన్న ఒప్పందాన్ని మే 1996 వరకు పొడిగించినప్పటికీ,[6] కరోల్కో కు నిరంతరం ఎదురవుతున్న చట్టపరమైన మరియు ఆర్ధిక సమస్యల వలన స్పైడర్ మాన్ నిర్మాణాన్ని నిలిపి వేసింది.[25]

వ్యాజ్యానికి సంబంధించిన సమస్యలు[మార్చు]

జేమ్స్ కామెరాన్ స్పైడర్ మాన్ చేయడానికి అంగీకరించగానే కరోల్కో లాయర్లు అంతకు ముందు టెర్మినేటర్ 2 కు ఉపయోగించిన కాంట్రాక్ట్ ఫారం నమునానే ఉపయోగించారు. ఈ ఒప్పందం లోని ఒక క్లాజు ప్రకారం కామెరాన్ కు సినిమా పై సర్వ హక్కులు ఉండటమే కాక ఎడ్వర్టైజ్మెంట్ హక్కులు కూడా లభిస్తాయి. వ్యాపార లావాదేవీలకు ఎడ్వర్టైజ్మెంట్లకు సంబంధించి ఇంకా సినిమాకు సంబంధించిన ఏర్పాట్లను చురుకుగా చేసుకుంటున్న గోలన్ యొక్క ప్రస్తావనే లేదు.[6] 1993 లో, నిర్మాతగా తన కాంట్రాక్ట్ ను ఉల్లంఘించాడనే ఆరోపణపై కామెరాన్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవలసిందిగా గోలన్ కోరడం జరిగింది. మరోవైపు, కామెరాన్ కు క్రెడిట్ ల పై సర్వ హక్కులు ఉన్నట్లు కాంట్రాక్ట్ చెబుతుంది.[8] తరువాత, కరోల్కో కంపెనీ వియాకం, కొలంబియాల పై ప్రసార మరియు వీడియో హక్కుల కొరకు కేసు వేయగా ఈ రెండు స్టూడియో లు తిరిగి కౌంటర్ కేసు దాఖలు చేసాయి.[5] ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్, ఈ వ్యాజ్యం తో సంబంధం లేకపోయినప్పటికీ కామెరాన్ భాగస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ మరొక కాంట్రాక్ట్ ప్రకారం ఆయన సేవలు కేవలం దర్శకుడుగా మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది.[23] 1996 లో కారోల్కో, ట్వంటీ ఫస్ట్ సెంచరీ మరియు మార్వెల్ అన్నీ దివాలా తీసాయి.

మార్చ్ 28 , 1995 తేదీతో కరోల్కో దాఖలు చేసిన ఒక క్విట్ క్లయిం ద్వారా ఎం.జి.ఎం సంస్థ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫిలిం లైబ్రరీ, ఆస్తులు మరియు "జేమ్స్ కామెరాన్, టెడ్ న్యూసం & జాన్ బ్రాంకటో, మెనహెం గోలన్, జోన్ మైకేల్ పాల్, ఎథన్ విలే, లేస్లి స్టీవెన్, ఫ్రాంక్ లలోగ్గియా, నీల్ రుటెన్బర్గ్, బార్నీ కోహెన్, షెపర్డ్ గోల్డ్ మాన్ ఇంకా ఎవరైనా ఇతర రచయితలు రచించిన అన్నీ స్పైడర్ మాన్ స్క్రీన్ ప్లీలు డ్రాఫ్ట్ లు" స్వాధీనం చేసుకుంది.[26] ఇంతేకాక ట్వంటీ ఫస్ట్ సెంచరీ, మార్వెల్ కామిక్స్ మరియు వియాకం లపై ఎం.జి.ఎం కానన్ మరియు మార్వెల్ మధ్య ఉన్న ఒప్పందం లో మోసం చేసారంటూ కేసు దాఖలు చేసింది. 1998 లో మార్వెల్ దివాలా నుండి కోలుకుని కొత్త నిర్మాణ ప్రణాళికలో భాగం గా టాయ్ బిజ్ అనే సంస్థ తో కలిసి పోయింది.[6] మార్వెల్ గోలన్ కు ఇచ్చిన హక్కుల ఒప్పంద కాల పరిమితి ముగియడంతో ఆ హక్కులను తిరిగి మార్వెల్ కు స్వాధీనం చేసేందుకు కోర్ట్ లు నిశ్చయించినప్పటికీ ఈ విషయం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. 1999 లో, 7 మిలియన్ డాలర్లకు స్పైడర్ మాన్ హక్కులను మార్వెల్ కొలంబియాకు (ఆ సమయానికి సోనీ ఆధీనంలో ఉన్న)అప్పగించింది. అయితే ఎం.జి.ఎం స్పైడర్ మాన్ హక్కులు కానన్, ట్వంటీ ఫస్ట్ సెంచరీ మరియు కరోల్కో ద్వారా తనకు వచ్చాయంటూ దేని చట్టబద్దతను సవాలు చేయడమే కాక దీనికి పోటీగా మరొక సినిమాను తీస్తానని హెచ్చరించింది.[27]

007 vs. స్పైడర్ మాన్[మార్చు]

ఈ లోగానే ఎం.జి.ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన జాన్ కాలే కొలంబియాలో చేరారు. నిర్మాత కెవిన్ మెక్ క్లోరీ కి థన్దర్ బాల్ మరియు సంబంధిత జేమ్స్ బాండ్ పాత్రలపై ఉన్న హక్కులకు సంబంధించిన చరిత్ర ను దృష్టిలో పెట్టుకుని మెక్ క్లోరి కథ ఆధారంగా కొలంబియా మరొక 007 సిరీస్ ను రూపొందించనుందని కాలే ప్రకటించాడు.[28] (కొలంబియా నాన్-యియోన్ నిర్మాణంలో ఒరిజినల్ సినిమా కాసినో రాయల్ ను 1967 లోనే రూపొందించింది).

ప్రస్తుతం రెండు స్టూడియో లు కూడా పోటీ ప్రాజెక్ట్ లను చేపట్టడంతో వారి వారి స్వంత దీర్ఘ కాల ఆర్ధిక సుస్థిరత మరియు ప్రణాళికలకు విఘాతం ఏర్పడింది. కొలంబియా కు ఏ విధమైన స్ధిరమైన సినిమా ఒప్పందాలు లేక 1989 వరకు స్పైడర్ మాన్ నే చేయాలని ఆశించగా; ఎం.జి.ఎం/యుఏ కు మాత్రం ప్రతి రెండు లేక మూడు సంవత్సరాలకు విడుదల అయ్యే జేమ్స్ బాండ్ సినిమాలే స్థిరమైన ఆదాయాన్ని అందిస్తూ వచ్చాయి. ప్రత్యామ్నాయ బాండ్ సినిమాలు ఎం.జి.ఎం/యుఏ కు బాండ్ సినిమాల సిరీస్ పై ఉన్న పట్టును పోగొట్టే అవకాశం ఉంది. అదే విధంగా, ఎం.జి.ఎం/యుఏ స్పైడర్ మాన్ సినిమా రూపొందిస్తే కొలంబియా కు వచ్చే ఆదాయ మార్గాలపై దెబ్బ కొట్టినట్లు అవుతుంది. రెండు వైపులా కూడా ఆయా సినిమాలు రూపొందించే హక్కులకు సంబంధించి బలమైన వాదనలు ఉన్నాయి.[29]

మార్చ్ 1999 లో ఈ రెండు స్టూడియో లు ఒక రాజీ మార్గాన్ని రూపొందించుకున్నాయి. కొలంబియా కొత్త 007 సిరీస్ పై ఉన్న హక్కులను వదులుకోగా ఎం.జి.ఎం స్పైడర్ మాన్ పై ఉన్న హక్కులను కొలంబియా కు వదిలి వేసింది.[30] చివరకు 2000 సంవత్సరం లో కొలంబియా గతం లో రూపొందించిన అన్ని స్క్రిప్ట్ లపై హక్కులను స్వాధీనం చేసుకున్నప్పటికీ[14], "కామెరాన్ మెటీరియల్" అంటే అనేక రచయితలు పూర్తి చేసిన స్క్రీన్ ప్లే మరియు తరువాత రూపొందిన 'స్క్రిప్ట్ మెంట్' ను మాత్రమే వినియోగించుకుంది.[7] దాదాపు దశాబ్ద కాలం పైగా ప్రయత్నాలు జరిగిన తరువాత స్పైడర్ మాన్ నిర్మాణం నిజంగా ప్రారంభమయింది.[5]

ఫిలిం సిరీస్[మార్చు]

సుదీర్ఘ చరిత్ర అనంతరం, అన్ని స్పైడర్ మాన్ సినిమాలను సోనీ సినీ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలో లారా జిస్కిన్ నిర్మించగా కొలంబియా పిక్చర్స్ పంపిణీ చేసింది. మొదటి మూడింటికీ శాం రైమి దర్శకత్వం వహించగా పునః ప్రారంభమైన చిత్రానికి మార్క్ వెబ్ దర్శకత్వం వహించనున్నారు.

స్పైడర్-మాన్ (2002)[మార్చు]

మేరీ జేన్ వాట్సన్ (కిర్స్టన్ దంట్) అనే పక్కింటి అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉండే పీటర్ పార్కర్ (టోబే మాగురే) అనే అనాధ ఉన్నత పాఠశాల విద్యార్థి స్పైడర్ మాన్ గా మారతాడు. ఒక సైన్సు విజ్ఞాన యాత్రకు వెళ్ళిన పీటర్ ను జన్యు మార్పులు చేయబడిన 'సూపర్ సాలీడు' కుడుతుంది. ఫలితంగా, పీటర్ కు అతీంద్రియ శక్తులు సంక్రమిస్తాయి. అతని బలం, వేగం పెరగడంతో పాటు గోడలపై పాకే శక్తి మరియు సహజంగా గూడును అల్లగలిగే శక్తి కూడా లభిస్తాయి. పీటర్ కు ఎంతో ప్రియమైన అతని అంకుల్ (క్లిఫ్ రాబర్త్సన్)హత్య కావించబడటంతో, ఆ హత్యను తానూ తేలికగా ఆపగలిగి ఉండే వాడినని గ్రహించిన పీటర్ ఇకపై తనకు కొత్తగా సంక్రమించిన శక్తులను న్యూయార్క్ నగర రక్షణకు వాడాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా, పీటర్ స్నేహితుడైన హారీ అస్బార్న్ (జేమ్స్ ఫ్రాంకో)తండ్రి, సంపన్న వ్యాపారవేత్త అయిన నార్మన్ అస్బార్న్ (విలెం డఫో) పనితీరును మెరుగు పరిచే మందులను తనపై తను ప్రయోగించుకోగా అవి వికటించి అతనిని సైకోగా హంతక స్వభావం గల స్ప్లిట్ పర్సనాలిటీగా మారుస్తాయి. మిలటరీ యుద్ధ దుస్తులలో తయారైన నార్మన్ చంచలమైన 'గ్రీన్ గోబ్లిన్' గా మారి నగరాన్ని భయభ్రాంతులకు గురిచేస్తాడు. మేరీ జేన్ పై తన అనురాగాన్ని ప్రకటిస్తూనే స్పైడర్ మాన్ గా పీటర్ గోబ్లిన్ తో తలపడాల్సి వస్తుంది.

స్పైడర్-మాన్ 2 (2004)[మార్చు]

మొదటి సినిమా కథ జరిగిన రెండు సంవత్సరాల తర్వాత స్పైడర్ మాన్ 2 కథ ప్రారంభమవుతుంది. అతని సూపర్ హీరో జీవితానికి, సాధారణ పౌరుడి జీవితానికీ మధ్య సయోధ్య కుదర్చలేక నలిగిపోతున్న పీటర్ ఇంకా మేరీ జేన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఆమెకు వేరొకరితో సంబంధం ఖరారై ఉంటుంది. మరోవైపు హారి స్పైడర్ మాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తుంటాడు. రెండు జీవితాల ఒత్తిడి పీటర్ అతీంద్రియ శక్తులను కొంత తగ్గించినప్పటికీ, తన వెన్నుముకకు నాలుగు యాంత్రిక టెన్టకల్స్ ను తగిలించుకుని న్యూయార్క్ నగరాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తున్న వొటో అక్టవియాస్ (అల్ఫ్రెడ్ మొలినా) అలియాస్ డాక్టర్ ఆక్టోపస్ అనే పిచ్చి శాస్త్రవేత్తతో అతను తలపడాల్సి వస్తుంది. విలన్ నగరం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుండగా పీటర్ కు తాను కోరుకుంటున్నట్లు సాధారణ జీవితం గడపాలా లేక స్పైడర్ మాన్ గా మారి న్యూయార్క్ ను కాపాడే బాధ్యత తీసుకోవాలా అనే సందిగ్ధం ఏర్పడుతుంది.

స్పైడర్-మాన్ 3 (2007)[మార్చు]

స్పైడర్ మాన్ 3 నాటికి పీటర్ స్పైడర్ మాన్ గా తనకు వొచ్చిన గుర్తింపును అనుభవిస్తూనే, తన సూపర్ హీరో ఇమేజ్ కు, మేరీ జేన్ వాట్సన్‌తో తన ప్రేమకు మధ్య సమతూకం సాధించే పనిలో ఉంటాడు. హారి చివరకు మేరీ జేన్ ద్వారా తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకుని కొత్త గోబ్లిన్ గా మారి పీటర్ జీవితంలో ప్రవేశించి భయపెడతాడు. ఎడ్డీ బ్రాక్ (టోఫర్ గ్రేస్) అనే ఫోటోగ్రాఫర్ స్పైడర్ మాన్ ను విమర్శిస్తూ అతని పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటాడు. తప్పించుకున్న ఖైదీ అయిన ఫ్లింట్ మార్కో లేక విలియం బేకర్ (థామస్ హెడెన్ చర్చి) ఒక పార్టికల్ యాక్సలరేటార్ పై పడి రూపం మారి ఇసుక భూతంగా అవతరించి తరువాత శాండ్ మాన్ గా పిలువబడతాడు. తీవ్రంగా జబ్బుతో ఉన్న తన కూతురు నుండే డబ్బు దొంగలించేందుకు అతను సిద్ధపడతాడు. ఈ మార్కోనే తన అంకుల్ బెన్ ను హత్య చేసిన వ్యక్తి అని తెలుసుకున్న పీటర్ అతనిపై కసి పెంచుకుంటాడు. ఒక నల్లని అతీంద్రియ పదార్థం పీటర్ కు కనబడి ఒక కొత్త కారు నల్లని దుస్తులను సృస్టించడం ద్వారా ఈ కసి మరింత పెరిగినట్లు కనబడుతుంది. ఈ అతీంద్రియ పదార్థం పీటర్ నుండి వేరయ్యి బ్రాక్ లో ప్రవేశించి వెనం అనే కొత్త పాత్రను సృష్టిస్తుంది.

భవిష్యత్తు ప్రణాళికలు[మార్చు]

స్పైడర్-మాన్ 4 రద్దు మరియు పునః ప్రారంభం[మార్చు]

2007 లో రైమి దర్శకుడుగా, మాగురే, దంట్ మరియు ఇతర నటీ నటులు వారి పాత్రలను తిరిగి పోషించేందుకు సిద్ధం కావడంతో స్పైడర్ మాన్ 4 రూపుదిద్దుకోవడం ప్రారంభమయింది. నాలుగవ మరియు ఐదవ సినిమాకు కూడా ప్రణాళికలు సిద్దమయి ఒక సమయంలో ఈ రెండు సీక్వెల్స్ ను సమాంతరంగా నిర్మించాలనే ఆలోచన కూడా జరిగింది. అయితే, మార్చి 2009 లో ప్రస్తుతం నాలుగవ సినిమా ఒక్కటే రూపుదిద్దుకుంటుంది అనీ, ఐదవ మరియు ఆరవ సినిమాలు తీయాలనుకుంటే ఒక దాని తర్వాతా ఒకటి తీయడం మాత్రమే జరుగుతుందని రైమి తెలిపారు.[31][32][33][34] 2007 లో మొదటి స్పైడర్ మాన్ సినిమాకు స్క్రీన్ ప్లే రాసిన డేవిడ్ కోప్‌తో సోనీ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చినప్పటికీ, అక్టోబరు 2007 లో జేమ్స్ వాండర్బిల్ట్ను స్క్రీన్ ప్లే రాసేందుకు ఎంపిక చేసుకోవడం జరిగింది.[35][36] తరువాత ఈ స్క్రిప్ట్ పులిట్జర్ అవార్డ్ పొందిన నాటక రచయిత డేవిడ్ లిండ్సే-అబైర్ చే తిరిగి వ్రాయబడగా అక్టోబరు 2009 లో గారి రాస్ మళ్లీ స్క్రిప్ట్ ను తిరగరాయడం జరిగింది.[37] స్పైడర్ మాన్ 5 మరియు స్పైడర్ మాన్ 6కు కూడా స్క్రిప్ట్ లను రూపొందించేటందుకు సోనీ వాండర్బిల్ట్ ను నియమించుకుంది.[36]

2007 లో డాక్టర్ కర్ట్ కన్నోర్స్ పాత్రను అతని మరో స్వభావమైన బల్లి రూపంలోనికి మార్చేందుకు రైమి ప్రతిపాదించగా, కారక్టర్ నటుడు డిలన్ బేకర్ మరియు నిర్మాత గ్రాంట్ కర్టిస్ లు కూడా అందుకు ఆసక్తి కనపరచారు.[38][39][40] రాబందు పాత్రకు జాన్ మల్కొవిచ్తో సంప్రదింపులు జరుపుతున్నట్లుగాను, కామిక్ లో ఉన్నట్లు నల్ల పిల్లి పాత్రలోకి మారనప్పటికీ ఫెలికా హార్డీ పాత్రను అన్నే హాత్వే పోషించనున్నట్లు గాను డిసెంబరు 2009 లో వార్తలు వెలువడ్డాయి. నల్ల పిల్లికి బదులుగా రైమి రూపొందిస్తున్న ఫెలికా పాత్ర ఒక సరి కొత్త మానవాతీత శక్తులు గల ఆడ రాబందుగా మారుతుందని కూడా వార్తలు వచ్చాయి.[41]

జనవరి 2010 లో రైమి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో స్పైడర్ మాన్ 4 రూపకల్పనను రద్దు చేస్తున్నట్లు సోనీ ప్రకటించింది. సినిమాను సృజనాత్మకంగా తీయాలంటే 2011 మే 6 అనే డెడ్ లైన్ నాటికి సాధ్యం కాదనే అనుమానంతోనే రైమి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలిసింది.[42]

స్పైడర్ మాన్ 4ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే కొత్త దర్శకుడు, కొత్త తారాగణంతో దీనిని తిరిగి ప్రారంభిస్తామని సోనీ ప్రకటించింది. పీటర్ పార్కర్ హై స్కూల్ నాటికి ఉన్న సామర్ధ్యాలను అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలపై దృష్టి పెడుతూ 3-డిలో 2012 జూలై 3 నాటికి ఈ పునః ప్రారంభమయ్యే సినిమా విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.[42][43] జేమ్స్ వాండర్బిల్ట్ ఈ కొత్త సినిమా స్క్రిప్ట్ ను రాయనున్నట్లు, మార్క్ వెబ్ రాబోయే స్పైడర్ మాన్ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు కూడా సోనీ ప్రకటించింది.[44] వాండర్బిల్ట్ స్క్రిప్ట్ వాస్తవికంగా ఉన్నదని వ్యాఖ్యానించిన ఎంటర్టైన్మెంట్ వీక్లీ దీనిని బాట్ మాన్ బిగిన్స్తో పోల్చింది. క్రిస్టోఫర్ నోలన్ యొక్క బాట్ మాన్ ఫిలిం సిరీస్ మొత్తం సిరీస్ యొక్క స్వరూపాన్నే మార్చివేసింది.[45] అల్టిమేట్ స్పైడర్ మాన్ కామిక్స్ ఆధారంగా ఈ కొత్త సిరీస్ రూపుదిద్దుకుంటుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అల్టిమేట్ స్పైడర్ మాన్ సృష్టి కర్త బ్రెయిన్ మైకేల్ బెండిస్ ఈ సినిమా రూపకర్తలతో కలవడమే ఇందుకు రుజువుగా చెబుతున్నారు. "కేవలం సోనీలో మొత్తం స్పైడర్ మాన్ సినిమా టీంతో ఒక రోజు ఆసక్తికరంగా గడిపాను!! చాలా సంతోషం గా ఉంది" అని బెండిస్ [46] చిన్నగా వ్యాఖ్యానించాడు[46].[46] ఆల్విన్ సార్జంట్‌ను స్క్రిప్ట్ ను తిరిగి రాయడానికి నియమించారు.[47] 2010 జూన్ 9 న ఈ కొత్త సినిమా విలన్ లిజార్డ్ కావచ్చనే వదంతులు వినవచ్చాయి.[48] ఈ సినిమా షూటింగ్ డిసెంబరు 2010 లో ప్రారంభం కానుంది.[1]

మే 2010 నాటికి స్పైడర్ మాన్ లో నటించనున్న తారల జాబితాలో జేమి బెల్, జోష్ హచర్సన్, ఫ్రాంక్ డిలన్, అల్డెన్ ఎరేన్రిచ్ మరియు ఆండ్రూ గార్ఫీల్డ్ ఉన్నారు.[49] అయితే, జూన్ 2010 లో ఈ జాబితాలో ఆరన్ జాన్సన్, ఆన్తాన్ ఎల్చిన్లు కూడా ఉన్నట్లు లాస్ఏంజిల్స్ టైమ్స్ ప్రచురించింది.[50] తుది జాబితా ప్రకారం లోగాన్ లేర్మన్ మరియు మైకేల్ అంగరానోలు కూడా ఈ సినిమాలో నటించనున్నారు.[51] 2010 జూన్ 27 న కచ్చితమైన తుది జాబితాను ప్రకటించడం జరిగింది. జేమి బెల్ (ఫ్లాగ్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్ ), ఆన్తాన్ ఎల్చిన్ (స్టార్ ట్రెక్ ), ఆరోన్ జాన్సన్ (కిక్-యాస్ ), ఆండ్రూ గార్ఫీల్డ్ (ది ఇమాజినేరియం ఆఫ్ డాక్టర్ పర్నాసాస్ ), లోగాన్ లేర్మన్ (Percy Jackson & the Olympians: The Lightning Thief ), మరియు అల్డెన్ ఎరేన్రిచ్ (టెట్రో )వంటి వారందరూ ఇందులో ఉన్నారు.[52] 2010 జూలై 1 న ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మాన్ పాత్రను పోషించనున్నట్లు అధికారికంగా ఖరారు చేయడం జరిగింది.[1] 27 సంవత్సరాల వయసున్న గార్ఫీల్డ్ హై స్కూల్ విద్యార్థి పాత్రను పోషించగలిగేందుకు తనకు గల సామర్ధ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. హిట్ ఫిక్స్ అనే వెబ్ సైట్ సోనీ దీనిని గుర్తించిందనీ అందుకే కొత్త సినిమాలో పార్కర్ కాలేజి స్టూడెంట్ గా ఈ సిరీస్ ప్రారంభం కానుందని తెలియచేసింది.[2] మేరీ జేన్ వాట్సన్ పాత్రకు నటి ఎలెనా సటైన్ను పరిశీలించడం జరిగింది.[53]

వెనం[మార్చు]

జూలై 2007 లో వెనం పాత్రలో మార్పులు చేయనున్నట్లు అవీ అరాద్ తెలియ చేసారు.[54] జాకోబ్ ఆరన్ ఎస్తేస్ను స్క్రిప్ట్ రాసేందుకు స్టూడియో నియమించినప్పటికీ తర్వాత సంవత్సరంలో దీనిని తిరస్కరించడం జరిగింది. సెప్టెంబరు 2008 లో పాల్ వెర్నిక్ మరియు రెట్ రీజ్ లు స్క్రిప్ట్ రాసేందుకు అంగీకరించారు.[55] స్టాన్ లీ ఈ సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించేందుకు అంగీకరించారు.[56] ఈ సినిమాకు రెండు డ్రాఫ్ట్ లు తాము సిద్ధం చేసామని, స్టూడియో సినిమా నిర్మాణాన్ని ప్రారంభించనున్నదని రెట్ రీజ్ తర్వాత వెల్లడించారు.[57] ఈ స్క్రిప్ట్ ను తిరిగి రాసేందుకు అంగీకరించిన గారి రోజ్ దర్శకత్వం కూడా చేసే అవకాశం ఉంది.[58] వెనం విలన్‌గా కాక యాంటి-హీరోగా మారతాడని వెరైటి తెలిపారు. మార్పులు చేసిన కామిక్ పుస్తకంలో ఉన్నట్లు వెనం యాంటి-హీరో గా, స్పైడర్ మాన్ కేవలం అతిథి పాత్రగా ఉండే అవకాశం ఉన్నట్లుVenom: Lethal Protector దీనిని బట్టి తెలుస్తుంది.[59]

నటులు మరియు పాత్రలు[మార్చు]

సూచికల జాబితా

 • డార్క్ గ్రే రంగు లో ఉన్న గడి లో చూపించిన పాత్రలు సినిమాలో లేవని సూచన.
పాత్ర చలనచిత్రం
స్పైడర్-మాన్ స్పైడర్-మాన్ 2 స్పైడర్-మాన్ 3
పీటర్ పార్కర్/ స్పైడర్-మాన్ టోబే మగుఇరే
మేరీ జేన్ వాట్సన్ కిర్స్టన్ దంట్
హార్రీ ఒస్బోర్న్/న్యూ గొబ్లిన్ జేమ్స్ ఫ్రాంకో
మే పార్కర్ రోజ్ మేరీ హార్రిస్
బెన్ పార్కర్ క్లిఫ్ రాబర్ట్సన్
నార్మన్ ఒస్బోర్న్/గ్రీన్ గొబ్లిన్ విలెం డఫో
జె. జోనా జేమ్సన్ జె.కే. సిమ్మోన్స్
జోసెఫ్ "రోబి"రాబర్ట్సన్ బిల్ నన్
డాక్టర్.కార్ట్ కన్నోర్స్ colspan="1" style="background:#d3d3d3;" డిలన్ బేకర్
బెట్టి బ్రాంట్ ఎలిజబెత్ బ్యాంక్స్
హాఫ్ మాన్ టెడ్ రైమి
బెర్నార్డ్ జాన్ పాక్స్తన్
డెన్నిస్ కరడైన్ మైకేల్ పాపాజాన్ colspan="1" style="background:#d3d3d3;" మైకేల్ పాపా జాన్
ఫ్లాష్ థాంప్సన్ జో మంగనిఎలో colspan="1" style="background:#d3d3d3;" జో మంగనిఎలో
బోన్ సా మెకగ్రా రాండి సావేజ్ colspan="2" style="background:#d3d3d3;"
మెండెల్ స్ట్రోం రాన్ పెర్కిన్స్ colspan="2" style="background:#d3d3d3;"
రింగ్ అనౌన్సర్ బ్రూస్ క్యాంపుబెల్ colspan="2" style="background:#d3d3d3;"
స్నూటి ఉషెర్ colspan="1" style="background:#d3d3d3;" బ్రూస్ క్యాంపుబెల్ colspan="1" style="background:#d3d3d3;"
మైతర్ డి colspan="2" style="background:#d3d3d3;" బ్రూస్ క్యాంపుబెల్
ఒట్టో ఆక్టవియాస్/ డాక్టర్ ఆక్టోపస్ colspan="1" style="background:#d3d3d3;" అల్ఫ్రెడ్ మోలినా colspan="1" style="background:#d3d3d3;"
రోసాలీ ఆక్టావియాస్ colspan="1" style="background:#d3d3d3;" డోన ముర్ఫి colspan="1" style="background:#d3d3d3;"
జాన్ జేమ్సన్ colspan="1" style="background:#d3d3d3;" డానియల్ గిల్లీస్ colspan="1" style="background:#d3d3d3;"
డిత్కోవిచ్ colspan="1" style="background:#d3d3d3;" ఎల్య బస్కిన్
ఉర్సుల డిత్కోవిచ్ colspan="1" style="background:#d3d3d3;" మాగిన తోవ
అజీజ్ colspan="1" style="background:#d3d3d3;" ఆసిఫ్ మాండ్వి colspan="1" style="background:#d3d3d3;"
ఎడ్డి బరాక్ జూనియర్. వెనొం colspan="2" style="background:#d3d3d3;" టోఫర్ గ్రేస్
ఫ్లింట్ మార్కో /సాండ్ మాన్ colspan="2" style="background:#d3d3d3;" థామస్ హడేన్ చర్చి
గ్వెన్ స్టాసి colspan="2" style="background:#d3d3d3;" బ్రెస్ డల్లాస్ హోవార్డ్
కెప్టెన్ జార్జ్ స్టాసి colspan="2" style="background:#d3d3d3;" జేమ్స్ క్రోంవెల్
ఎమ్మా మార్కో colspan="2" style="background:#d3d3d3;" తెరెసా రస్సెల్
పెన్నీ మార్కో colspan="2" style="background:#d3d3d3;" పెర్ల హనీ-జార్డిన్
స్టాన్ లీ కామియో ఓన్లీ

ఆదరణ[మార్చు]

బాక్సాఫీసు పనితీరు[మార్చు]

యు.ఎస్.ఏ లోనే కాక ఇంకా ఇతర విడుదలైన అన్ని ప్రాంతాలలోను మూడు స్పైడర్ మాన్ సినిమాలు సరి కొత్త తోలి రోజు రికార్డ్ లను సృష్టించాయి.[60] మార్వేల్ కామిక్స్ ఆధారంగా తీసిన సినిమాలన్నిటిలోనూ దేశీయ స్థాయిలో ఈ సినిమాలే అగ్ర భాగంలో ఉన్నాయి. స్పైడర్ మాన్ 1 మొదటి రాంక్ లో, స్పైడర్ మాన్ 2 రెండవ రాంక్ లో మరియు స్పైడర్ మాన్ 3 మూడవ రాంక్ లో ఉన్నాయి.[61] దేశ స్థాయిలో అన్ని సూపర్ హీరో సినిమాలలో కూడా స్పైడర్ మాన్ 1, స్పైడర్ మాన్ 2, స్పైడర్ మాన్ 3 వరుసగా రెండవ, మూడవ మరియు నాలుగవ స్థానంలో ఉన్నాయి.వీటిలో మూడవ సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హీరో సినిమాలలో ది డార్క్ నైట్ తర్వాత రెండవ స్థానంలో ఉంది.[62] యునైటెడ్ స్టేట్స్ లో సోనీ/కొలంబియా నిర్మించిన చిత్రాలలోకెల్లా స్పైడర్ మాన్, స్పైడర్ మాన్ 2 మరియు స్పైడర్ మాన్ 3 చిత్రాలే అత్యంత విజయవంతమైన చిత్రాలు.[63]

చలనచిత్రం విడుదల తేదీలు రాబడి వరుస బడ్జెట్ వివరణ
అమెరికా సంయుక్త రాష్ట్రాలు విదేశాలు ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా ప్రపంచ వ్యాప్తంగా
స్పైడర్-మాన్ 2010 మే 3 $403,706,375 $418,002,176 $821,708,551 9
#35 (A)
23 $139,000,000 [64]
స్పైడర్-మాన్ 2 2008 జూన్ 30 $373,585,825 $410,180,516 $783,766,341 #14
#53 (A)
+30 $200,000,000 [65]
స్పైడర్-మాన్ 3 2007 మే 25 $336,530,303 $554,341,323 $890,871,626 #19
#95 (A)
16 $258,000,000 [66]
మొత్తం $1,113,822,503 $1,382,524,015 $2,496,346,518 $597,000,000
సూచికల జాబితా
 • (A) అనేది ప్రస్తుత టిక్కెట్ ధరలను బట్టి సవరించిన మొత్తాలను సూచిస్తుంది. (బాక్స్ ఆఫీస్ మోజో చే లెక్కించబడినది)

విమర్శనాత్మక ప్రతిస్పందన[మార్చు]

న్యూస్ వీక్‌కు చెందిన డేవిడ్ అన్సెన్ స్పైడర్ మాన్ సరదాగా చూసి ఆనందించదగ్గ సినిమా అయినప్పటికీ స్పైడర్ మాన్ 2 మాత్రం కొంత స్వప్రాముఖ్యత గల సినిమాగా ఉన్నదని భావించారు. అన్సెన్ స్పైడర్ మాన్ 3ను అత్యంత గందరగోళం, సంక్లిష్టమైన సినిమాగా అభివర్ణించారు.[67] సి.యెన్.యెన్‌కు చెందిన టాం చారిటి ఈ సినిమాలు నైతిక విలువలను పెంపొందించేవిగా ఉన్నాయని ప్రశంసించడమే కాక మొదటి సినిమా నుండి మూడవ సినిమా వరకు విజువల్ ఎఫెక్ట్ లలో వచ్చిన మెరుగుదలను కూడా గుర్తించారు. రెండవ సినిమాలోని డాక్టర్ వోక్ ను చాలా గొప్ప విలన్ గా అభివర్ణించిన ఈయన మూడవ సినిమా లోని శాండ్ మాన్ ను సి.జి.ఐ నైపుణ్యం యొక్క విజయంగా వర్ణించారు.[68] టైంకు చెందిన రిచర్డ్ కోర్లిస్ ఈ సినిమాలలోని యాక్షన్ సన్నివేశాలను ఆస్వాదించినట్లు చెబుతూనే "పాత్రలు, నిర్మాణ కంపెనీ మరియు అన్ని సినిమా విభాగాల గురించి పునరాలోచన" చేసి అన్ని యాక్షన్ సినిమా ల కన్నా మిన్నగా వీటిని రూపొందించినట్టు అభిప్రాయపడ్డారు.[69]

స్టార్ ట్రిబ్యూన్‌కు చెందిన కోలిన్ కోవర్ట్ ఒక సూపర్ హీరో యొక్క సూపర్ తోలి చిత్రంగా స్పైడర్ మాన్‌ను ప్రశంసించడమే కాక స్పైడర్ మాన్ 2 దానికి అత్యద్భుతమైన కొనసాగింపు అనీ, సినిమా వీక్షకులకు ఒక అద్భుత దృశ్య కావ్యం అని మెచ్చుకున్నారు. స్పైడర్ మాన్ 3 మాత్రం అనేక కథలు కలగలిసి గందరగోళంగా మారి ప్రేక్షకులను నిరాశ పరిచిందని కోవర్ట్ అభిప్రాయపడ్డారు.[70] ది న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన మనోహ్ల డర్గిస్ మొదటి రెండు సినిమాలలోని హాస్యాన్ని బాగా ఆస్వాదించినప్పటికీ మూడవ సినిమాలో ఇది లోపించినట్లు భావించారు. "తీయనిచేదు లాంటి వైరుధ్యం ఏమిటంటే ఒక్కొక్క సినిమాకి కథ రాను రాను బలహీన పడుతుంటే స్పెషల్ ఎఫెక్ట్స్ మాత్రం సినిమా సినిమాకి అద్భుతంగా మెరుగు పడ్డాయని" కూడా డర్గిస్ గమనించారు.[71] రాకీ మౌంటైన్ న్యూస్‌కు చెందిన రాబర్ట్ డేనేర్స్టీన్ తనకు అత్యంత ఎక్కువ ఇష్టమైన సినిమా నుండి తక్కువ ఇష్టమైన సినిమా వరకు ఇలా రాంక్ లు ఇచ్చారు: స్పైడర్ మాన్ 2, స్పైడర్ మాన్, స్పైడర్ మాన్ 3 . డాక్టర్ వోక్ గా అల్ఫ్రెడ్ మొలినా రెండవ సినిమా నుండి లేకపోవడం ఒక లోటుగా భావించిన డేనేర్స్టీన్, మూడవ సినిమా పెద్దగా ఉన్నప్పటికీ ఒక సంతృప్తికరమైన ముగింపుకు తగినంత మెరుగ్గా లేదని కూడా అభిప్రాయం వ్యక్తం చేసారు.[72]

చలనచిత్రం రోటేన్ టమేతోస్ మెటా క్రిటిక్ యాహూ! మూవీస్
మొత్తం కరీం ఆఫ్ ది క్రాప్
స్పైడర్-మాన్ 89% (206 reviews)[73] 83% (36 reviews)[74] 73 (37 reviews)[75] B+ (12 reviews)[76]
స్పైడర్-మాన్ 2 93% (232 reviews)[77] 95% (44 reviews)[78] 83 (41 reviews)[79] A- (13 reviews)[80]
స్పైడర్-మాన్ 3 63% (237 reviews)[81] 41% (44 reviews)[82] 59 (40 reviews)[83] B- (14 reviews)[84]
సగటు రేటింగులు 82% 73% 72 N/ఎ

హోం మీడియా విడుదల[మార్చు]

ఈ మూడు సినిమాలకు కూడా డివిడిలు విడుదల అయ్యాయి.మొదటి రెండు ప్రత్యేకంగా రెండు డిస్క్ ల సెట్లుగా విడుదల కాగా మూడవ దానిని ఒకే డిస్క్ మరియు రెండు డిస్క్ లుగా కూడా విడుదల చేయడం జరిగింది. ఈ మూడు సినిమాలు కలిపి తర్వాత ఒకే "మోషన్ పిక్చర్ డివిడి ట్రిలోగి " బాక్స్ సెట్ గా విడుదల అయ్యాయి.

హై డెఫనేషన్ బ్లూ-రే ఫార్మాట్ లో ప్రత్యేకంగా విడుదలైన ఏకైక స్పైడర్ మాన్ చిత్రం స్పైడర్ మాన్ 3 . మిగిలిన రెండు కూడా బ్లూ-రే ఫార్మాట్ లో ఉన్నప్పటికీ అవి మూడవ సినిమాతో కలిసి స్పైడర్ మాన్: ది హై డెఫనేషన్ ట్రిలోగి అనే సెట్ గా లభిస్తాయి.

యు.ఎస్ లోని ఐట్యూన్స్ స్టోర్‌లో ఈ మూడు సినిమాలు లభిస్తాయి.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 "It's Official! Andrew Garfield to Play Spider-Man!". ComingSoon.net. July 1, 2010. Retrieved July 1, 2010. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 "Peter Parker is a College Student in "Spider-Man" Reboot?". HitFix.com. July 3, 2010. Retrieved July 3, 2010. Cite web requires |website= (help)
 3. Michael A. Hiltzik (1998-09-29). "Spidey's Movie Mess". Los Angeles Times. Retrieved 2007-11-05. Cite news requires |newspaper= (help)
 4. "Roger Corman Interview". M. J. Simpson. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 5.2 5.3 Ronald Grover (2002-04-15). "Unraveling Spider-Man's Tangled Web". Business Week. Retrieved 2007-01-22. Cite news requires |newspaper= (help)
 6. 7.0 7.1 7.2 7.3 Michael A. Hiltzik (2002-03-24). "Untangling the Web". Los Angeles Times Magazine. Cite news requires |newspaper= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "Hiltzik" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 7. 8.0 8.1 8.2 8.3 Edward Gross (2002). Spider-Man Confidential. Hyperion. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "Gross" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 8. 9.0 9.1 Patrick Daniel O’Neill (1990). "Screenwriter Ted Newsom". Fictioneer Books Ltd. Text " Comics Interview Magazine #85 " ignored (help); Unknown parameter |month= ignored (help); Cite magazine requires |magazine= (help)
 9. 10.0 10.1 Jankiewicz, Pat (2002). "Scott Leva, the Man Who Was Almost Spider-Man". Starlog/Comics Scene Presents Spider-Man. 1 (1): 62–64. Unknown parameter |month= ignored (help); |access-date= requires |url= (help)
 10. Sheldon Teitelbaum (1987). "Spider-Man - The Movie: For Cannon Films it was a web too far". Cinefantastique. Unknown parameter |month= ignored (help); Cite news requires |newspaper= (help); |access-date= requires |url= (help)
 11. "21stCenturyAd1989". Variety. 1989-05-05. p. 11. Cite news requires |newspaper= (help); |access-date= requires |url= (help)
 12. డేవిడ్ హుఘేస్. ది గ్రేటేస్ట్ Sci-Fi మూవీస్ నెవర్ మేడ్ ISBN 1-55652-449-8
 13. 14.0 14.1 Steve Ryfle (May/June 2002). "Spider-Man's Tangled Web". CS Publications. Text " Creative Screenwriting magazine " ignored (help); Cite magazine requires |magazine= (help); Check date values in: |date= (help)
 14. Dan Hagen (1990). "Publisher Stan Lee Speaks". Fictioneer Books Ltd. journal=David Anthony Kraft's Comics Interview Magazine. Missing pipe in: |publisher= (help); Cite news requires |newspaper= (help)
 15. Archer, Steven (1993). Willis O’Brien, Special Effects Genius. McFarland & Co. p. 177. ISBN 0-89950-833-2.
 16. Moerk, Christian (1993-09-01). "Cameron Delivers Spider-Man Script". Variety. p. 3. Retrieved 2007-11-07. Cite news requires |newspaper= (help)
 17. Barry Cohen; Ted Newson; James Cameron; Joseph Goldmari; James Cameron; John Brancato. "Spider-Man". Carolco. Retrieved 2009-05-20. Cite web requires |website= (help)
 18. "Spider-Man". Sci-Fi Trivia Reel. Retrieved 2007-11-07. Cite web requires |website= (help)
 19. David Wong. "10 Most Awesome Movies Hollywood Ever Killed". Cracked.com. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 20. dg. "If Spiderman Were Made in the 90s". RetroJunk. Retrieved 2007-11-07. Cite web requires |website= (help)
 21. "Spider-Man the Movie" (Dead link). Baseline/The New York Times. Retrieved 2007-05-15. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 22. 23.0 23.1 Michael A. Hiltzik (2002-03-24). "Untangling the Web". Los Angeles Times Magazine. Cite news requires |newspaper= (help)
 23. Scott Chitwood (2000-02-15). "Review of James Cameron's Spider-Man Scriptment". IGN. Retrieved 2007-04-28. Cite news requires |newspaper= (help)
 24. Jim Bullard (1992-04-17). "Spider-Man now 30". St. Petersburg Times. Cite news requires |newspaper= (help); |access-date= requires |url= (help)
 25. Securities and Exchange Commission (1995-04-15). "Securities and Exchange Commission document 1-09264". settlement. SEC. Retrieved 2007-11-05.
 26. "Movie/TV News". Cite web requires |website= (help)
 27. "Past 007 Attempts". MI6, Home of James Bond. 2004-09-14. Retrieved 2007-11-07. Cite web requires |website= (help)
 28. Anne Thompson (2002-08-18). "A League of Her Own". Variety. Retrieved 2007-11-07. Cite news requires |newspaper= (help)
 29. dg (2006-11-29). "Kevin McClory (1926-2006)". MI6, Home of James Bond. Retrieved 2007-11-07. Cite web requires |website= (help)
 30. Shawn Adler (September 5, 2008). "Tobey Maguire, Sam Raimi Sign On For 'Spider-Man 4': Report". MTV News. Retrieved October 9, 2009.
 31. Larry Carroll (2008-10-16). "Sam Raimi Talks 'Spider-Man' Sequel Double-Shoot, Futures of Kirsten Dunst & The Lizard". MTV Splash Page. Retrieved October 16, 2008.
 32. John Harlow (September 14, 2008). "Spider-Man Tobey Maguire spins deal for fatherhood". The Sunday Times. London. Retrieved September 16, 2008.
 33. "Sam Raimi 'Can't Imagine' Doing 'Spider-Man 4' Without Kirsten Dunst, Only Working On Fourth Film". MTV Splash Page. March 15, 2009. Retrieved March 16, 2009.
 34. Michael Fleming (January 21, 2007). "Columbia, Koepp talk 'Spider-Man'". Variety. Retrieved January 24, 2007.
 35. 36.0 36.1 Fleming, Michael (August 16, 2009). "Sony sets writer to spin 'Spider-Man'". Variety. Retrieved October 9, 2009. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 36. Eric Ditzian (October 9, 2009). "Sam Raimi Hopes To Start Shooting 'Spider-Man 4' In March 2010". MTV News. Retrieved October 11, 2009.
 37. Eric Goldman (January 23, 2007). "Exclusive: Lizard Leapin' Into Spidey 4?". IGN. Retrieved 2007-05-29.
 38. Sean Elliott (May 29, 2007). "Exclusive Interview: 'Spider-Man 3' Producer Grant Curtis talks about villains for 'Spidey 4' + His own origins - Part 1". iF Magazine. Retrieved May 29, 2007.
 39. Larry Carroll (June 26, 2007). "Sam Raimi May Not Helm 'Spider-Man 4'; Wants Carnage, Vulture As Villains If He Does". MTV.
 40. "EXCLUSIVE: Spider-Man 4 Circling John Malkovich, Anne Hathaway". MoveLine. December 8, 2009. http://www.movieline.com/2009/12/exclusive-spider-man-4-circling-john-malkovich-anne-hathaway.php?page=all. Retrieved December 12, 2009. 
 41. 42.0 42.1 "EXCLUSIVE: 'Spider-Man 4' Scrapped; Sam Rami & Tobey Maguire & Cast Out; Franchise Reboot for 2012". Deadline Hollywood. January 11, 2010. Retrieved January 11, 2010. Cite news requires |newspaper= (help)
 42. స్పైడర్-మాన్ స్వింగ్స్ ఇంటు ధియేటర్స్ ఇన్ 3D
 43. Sciretta, Peter (January 19, 2010). "Marc Webb To Direct New Spider-Man Trilogy!?". Slashfilm. Retrieved January 20, 2010. Cite web requires |website= (help)
 44. Sperling, Nicole (January 11, 2010). "Next 'Spider-Man' film will be a gritty, contemporary reboot of the franchise". Entertainment Weekly. Retrieved May 17, 2010. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 45. 46.0 46.1 46.2 Caleb Goellner (February 18, 2010). "Brian Bendis Meets With 'Spider-Man' Movie Team". MTV.com. Retrieved June 5, 2010. Cite web requires |website= (help)
 46. "Alvin Sargent spit-shining 'Spider-Man' reboot (exclusive)". Heat Vision. May 14, 2010. Retrieved May 15, 2010. Cite web requires |website= (help)
 47. Matthew Tyler (June 9, 2010). "Is The Lizard The Villain For The Spider Man Reboot?". The Film Stage. Retrieved June 9, 2010. Cite web requires |website= (help); External link in |publisher= (help)
 48. "Jamie Bell, Josh Hutcherson and Andrew Garfield Top Spidermand 3D Reboot List". The Film Stage. May 26, 2010. Retrieved June 5, 2010. Cite web requires |website= (help); External link in |publisher= (help)
 49. Steven Zeitchik (June 11, 2010). "'Kick-Ass' star Aaron Johnson on the shortlist for Spider-Man reboot". Los Angeles Times. Retrieved June 12, 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 50. Mike Fleming (June 26, 2010). "Sony Views Screen Tests of 'Spider-Man' Finalists; Decision Expected Shortly". Deadline Hollywood. Retrieved June 27, 2010. Cite web requires |website= (help)
 51. Owen Williams (June 28, 2010). "Spider-Man: The Final List". Empire. Retrieved July 12, 2010.
 52. Christopher Campbell (July 13, 2010). "'Spider-Man' Casting Rumors: Anton Yelchin, Elena Satine". cinematical.com. మూలం నుండి July 28, 2012 న ఆర్కైవు చేసారు. Retrieved July 12, 2010. Cite web requires |website= (help)
 53. Paul Fischer (2007-07-24). "Exclusive Interview: Avi Arad for "Bratz"". Dark Horizons. Retrieved 2009-05-20.
 54. Leslie Simmons (2008-09 -06). "Two more 'Spider-Man' films on the way". The Hollywood Reporter. మూలం (Registration required) నుండి 2008-09-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-09-06. line feed character in |date= at position 8 (help); Check date values in: |date= (help)
 55. [1] స్టాన్ లీ ఇన్ వేనోమ్
 56. వేనోమ్ మూవీ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్
 57. గారి రోస్స్ టు రైట్ అండ్ పోటేన్శియల్లీ డైరెక్ట్ 'స్పైడర్-మాన్' స్పినోఫ్ఫ్ 'వేనోమ్'
 58. వేనోమ్ యాజ్ యాన్ యాంటి-హీరో
 59. "Spider-Man Special Briefing". Box Office Mojo. Retrieved 2007-05-22. Cite web requires |website= (help)
 60. "Marvel Comics Movies". Box Office Mojo. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 61. "Superhero Movies". Box Office Mojo. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 62. "Sony / Columbia All Time Box Office Results". Box Office Mojo. Retrieved 2007-05-17. Cite web requires |website= (help)
 63. "Spider-Man (2002)". Box Office Mojo. Retrieved 2010-07-26. Cite web requires |website= (help)
 64. "Spider-Man 2 (2004)". Box Office Mojo. Retrieved 2010-07-26. Cite web requires |website= (help)
 65. "Spider-Man 3 (2007)". Box Office Mojo. Retrieved 2010-07-26. Cite web requires |website= (help)
 66. David Ansen (2007-05-07). "Spidey the Swinger". Newsweek. Retrieved 2009-05-20. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 67. Tom Charity (2007-05-03). "Review: 'Spider-Man 3' mixes highs and lows". CNN. Retrieved 2007-05-15. Cite news requires |newspaper= (help)
 68. Richard Corliss (2007-05-03). "Spider-Man Gets Sensitive". Time. Retrieved 2007-05-15. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 69. Colin Covert (2007-05-03). "Movie review: 'Spider-Man' weaves tangled web". Star Tribune. Retrieved 2009-05-20. Cite news requires |newspaper= (help)
 70. Manohla Dargis (2007-05-04). "Superhero Sandbagged". The New York Times. Retrieved 2007-05-15. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 71. Robert Denerstein (2007-05-04). "Denerstein: Spidey sense and sensibility". Rocky Mountain News. Retrieved 2007-05-15. Cite news requires |newspaper= (help)
 72. "Spider-Man". Rotten Tomatoes. Retrieved 2009-12-04. Cite web requires |website= (help)
 73. "Spider-Man (Cream of the Crop)". Rotten Tomatoes. Retrieved 2009-12-04. Cite web requires |website= (help)
 74. "Spider-Man (2002): Reviews". Metacritic. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 75. "Spider-Man - Critics Reviews". Yahoo! Movies. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 76. "Spider-Man 2". Rotten Tomatoes. Retrieved 2009-12-04. Cite web requires |website= (help)
 77. "Spider-Man 2 (Cream of the Crop)". Rotten Tomatoes. Retrieved 2009-12-14. Cite web requires |website= (help)
 78. "Spider-Man 2 (2004): Reviews". Metacritic. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 79. "Spider-Man 2 - Critics Reviews". Yahoo! Movies. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 80. "Spider-Man 3". Rotten Tomatoes. Retrieved 2009-12-04. Cite web requires |website= (help)
 81. "Spider-Man 3 (Cream of the Crop)". Rotten Tomatoes. Retrieved 2009-12-04. Cite web requires |website= (help)
 82. "Spider-Man 3 (2007): Reviews". Metacritic. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)
 83. "Spider-Man 3 - Critics Reviews". Yahoo! Movies. Retrieved 2007-05-15. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Spider-Man మూస:Spider-Man in popular media మూస:Marvel Comics films మూస:Spider-Man film series మూస:Sam Raimi