స్మైలింగ్ బుద్ధ
స్మైలింగ్ బుద్ధ (పోఖ్రాన్-1) అనేది భారత ప్రభుత్వం 1974 మే 18న రహస్యంగా చేపట్టిన అణ్వస్త్ర పరీక్ష. ఇది రాజస్థాన్ లోని పోఖ్రాన్ అనే ప్రాంతంలో భారత సైన్యం పరిధిలో ఒక పరమాణు విచ్ఛిత్తి ద్వారా పేలే అణుబాంబును ప్రయోగాత్మకంగా పేల్చారు. అమెరికా రక్షణశాఖ ఇంటెలిజెన్స్ ప్రకారం ఈ పరీక్ష పేరు హ్యాపీ కృష్ణ. దీనిని భారత విదేశీ వ్యవహారాల శాఖ శాంతియుతమైన అణుపరీక్షగా అభివర్ణించింది.
ఈ బాంబును భాభా అణు పరిశోధనా కేంద్రం కు చెందిన రాజారామన్న నేతృత్వంలోని శాస్త్రవేత్తలు, బి.డి నాగ్ చౌదరి ఆధ్వర్యంలోని డిఆర్‌డివో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. కెనడా దేశం ఇచ్చిన సిరస్ అణురియాక్టరు, న్యూట్రాన్ మోడరేటరుగా వాడేందుకు అమెరికా ఇచ్చిన భారజలాన్ని వాడి బాంబుకు కావలసిన అణుపదార్థాన్ని తయారు చేశారు. ఈ పరీక్షకు సన్నాహాలు, పేల్చడం వంటివి అత్యంత రహస్యంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సాక్షాత్తూ భారత ప్రధాని ఇందిరా గాంధీ, ఇందులో పనిచేసిన శాస్త్రవేత్తలు, బయటివారు చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసేలా జాగ్రత్త పడ్డారు.
నేపథ్యం
[మార్చు]1945లో హోమీ భాభా టాటా గ్రూప్ సహాయంతో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనే శాస్త్రపరిశోధనా సంస్థను నెలకొల్పాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948, ఏప్రిల్ 15 న అణుశక్తి కార్యక్రమాల కోసం ఒక చట్టాన్ని తయారు చేశారు. ఇందులో భాగంగా ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమీషన్ అనే సంస్థ ఏర్పాటయింది.[1]
మూలాలు
[మార్చు]- ↑ Sublette, Carey. "Origins of Indian nuclear program". Nuclear weapon Archive. Retrieved 13 November 2011.