Jump to content

స్మైలీ సూరి

వికీపీడియా నుండి
స్మైలీ సూరి
జననంముంబై, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2005–2015
బంధువులుభట్ కుటుంబం

స్మైలీ సూరి భారతీయ మోడల్, నటి, నర్తకి. 2005లో వచ్చిన బాలీవుడ్ సినిమా కలియుగ్ తో ఆమె నటిగా రంగ ప్రవేశం చేసింది. ఆమె సోదరుడు మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.[1]

ఆమె మహేష్ భట్, ముఖేష్ భట్ లకు మేనకోడలు.[2] అలాగే పూజా భట్, అలియా భట్, షాహీన్ భట్, ఇమ్రాన్ హష్మిలకు బంధువు.

కెరీర్

[మార్చు]

2005లో కలియుగ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. జేహర్ సినిమా చిత్రీకరణ సమయంలో స్మైలీ తన సోదరుడు మోహిత్ కు సహాయం చేసింది. కలియుగ్ తరువాత ఆమె ఎన్. చంద్ర యే మేరా ఇండియాలో నటించింది. క్రూక్, డౌన్ టౌన్ చిత్రాలకు కూడా ఆమె పనిచేసింది.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె ఒక శిక్షణ పొందిన నర్తకి, ఒలింపిక్స్ క్రీడాకారిణి కూడా. ఆమె 2005లో వచ్చిన కలియుగ్ లో నటిగా అరంగేట్రం చేసింది. ఆమె విజయ్ శ్రీ చౌదరి వద్ద కథక్కూడా నేర్చుకుంది.[4][5]

జూలై 2014లో ఆమె వినీత్ బంగేరాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2005 కలియుగ్ రెనుకా
2006 తీస్రీ ఆంఖ్: ది హిడెన్ కెమెరా బాధితురాలు స్నేహపూర్వక ప్రదర్శన
2008 యే మేరా ఇండియా ఆశా అంబేద్కర్
2010 క్రూక్ షీనా ప్రత్యేక ప్రదర్శన
2011 క్రేకర్స్ కేట్ స్వరం
2012 డౌన్ టౌన్ విడుదల కానివి
2024 హౌజ్ ఆఫ్ లైస్ రాగిని జీ5

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టీవీ షో పాత్ర
2013 జోధా అక్బర్ రుకయ సుల్తాన్ బేగం
2015 నాచ్ బలియే 7 భర్త వినీత్ బంగేరాతో కలిసి

మూలాలు

[మార్చు]
  1. IANS (15 April 2013). "Who is that girl in 'Aashiqui 2' poster?". Times of India. Retrieved 24 June 2013.
  2. PTI (12 February 2013). "Who is Smiley Suri's Valentine?". Hindustan Times. Archived from the original on 14 February 2013. Retrieved 24 June 2013.
  3. IANS (11 February 2013). "Who will be Smiley Suri's Valentine?". The Times of India. Archived from the original on 17 June 2013. Retrieved 24 June 2013.
  4. Bajpai, Shalabh Anand (8 April 2008). "Smili(ey)ng all the way!". The Times of India. Archived from the original on 2 February 2014. Retrieved 24 June 2013.
  5. Udita Goswami- Mohit Suri Wedding: Meet Alia Bhatt's cousin Smiley Suri. Dailybhaskar.com. Archived from the original on 2014-08-17. Retrieved 2025-01-24.