Jump to content

స్వధర్మప్రకాశిని

వికీపీడియా నుండి
స్వధర్మప్రకాశిని
సంపాదకులుద్వైతం కోటేశ్వరశాస్త్రి (1873-76)
సంపాదకులుకనుపర్తి మార్కండేయశర్మ (1924-32)
తరచుదనంమాసపత్రిక
ప్రచురణకర్తద్వైతం కోటేశ్వరశాస్త్రి (1873-76)
కనుపర్తి మార్కండేయశర్మ (1924-32)
మొదటి సంచిక1873
ఆఖరి సంచిక1932
దేశంభారతదేశం
కేంద్రస్థానంమచిలీపట్నం (1873-76)
మద్రాసు (1924-32)
భాషతెలుగు

స్వధర్మప్రకాశిని మచిలీపట్నం నుండి వెలువడిన మాసపత్రిక. ద్వైతం కోటేశ్వరశాస్త్రి సంపాదకత్వంలో 1873 లో ఈ పత్రిక వెలువడింది. ఆయన తర్వాత ఆయన శిష్యుడైన కనుపర్తి మార్కండేయశర్మ ఈ పత్రికను నడిపాడు. శంకరాచార్య చరిత్ర, 32 మంత్రుల కథలు మొదలైనవాటిని పత్రికలో ప్రచురించారు.[1] పత్రిక 1876 లో ఆగిపోగా, మార్మండేయ శర్మ పత్రికను పునరుద్ధరించాడు. ఆ తరువాత పత్రికను మచిలీపట్నం నుండి మద్రాసుకు తరలించాడు. 1910 నాటికి అది మద్రాసులో ప్రచురితమౌతోందని బ్రిటిషు ప్రభుత్వ అధికారులు పంపిన రహస్య నివేదికల్లో ఉంది. 1910 జూన్‌లో బ్రిటిషు ప్రభుత్వాధికారులు ప్రభుత్వానికి పంపించిన రహస్య నివేదికలో స్వధర్మప్రకాశిని సర్క్యులేషను 1000 అని చూపించారు. పత్రిక నరసింగాపురం నుండి ప్రచురితమౌతుందనీ, మద్రాసులో ముద్రిస్తారనీ కూడా ఆ నివేదికలో రాసారు. 1932 లో పత్రిక ఆగిపోయింది. సాహిత్య విలువలు గల పెక్కువ్యాసాలు ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి.[2]

బందరులో కేశవరాజు అండ్‌కో వారు “'స్వధర్మప్రకాశిని” పేరుతో ఒక ముద్రణాలయాన్ని స్థాపించారు. అక్కడే ఈ పత్రికను ముద్రించేవారు. సనాతన ధర్మప్రతిష్ఠాపనకై వెలువడిన పత్రిక ఇది.[3] వీరేశలింగం చేపట్టిన వితంతు పునర్వివాహాలను స్వథర్మప్రకాశిని వ్యతిరేకించి విమర్శించేది.[3]

మూలాలు

[మార్చు]
  1. ఆరుద్ర (2007). సమగ్ర ఆంధ్ర సాహిత్యం. 4. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 617.
  2. వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 20.
  3. 3.0 3.1 వెలగపూడి, వైదేహి (2013). మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు ఒక సమీక్ష. హైదరాబాదు: మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితి. p. 348.