Jump to content

స్వరాభిషేకం (సినిమా)

వికీపీడియా నుండి
స్వరాభిషేకం
(2004 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.విశ్వనాథ్
నిర్మాణం సి.కౌసల్యేంద్ర రావు
కథ కె.విశ్వనాథ్
చిత్రానువాదం కె.విశ్వనాథ్
తారాగణం కె.విశ్వనాథ్,
శ్రీకాంత్,
లయ,
శివాజీ,
ఆముక్త మాల్యద,
ఊర్వశి,
నరేష్,
సాక్షి రంగారావు
సంగీతం విద్యాసాగర్
సంభాషణలు రమేష్ గోపి
కూర్పు జిజి.కృష్ణా రావు
నిర్మాణ సంస్థ ప్రేమ్ మూవీస్
విడుదల తేదీ 2004 నవంబరు 5
భాష తెలుగు

స్వరాభిషేకం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన 2004 లో విడుదలైన సంగీత ప్రధానమైన చిత్రం. ఇందులో సంగీత విద్వాంసులు శ్రీరంగం బ్రదర్స్ గా విశ్వనాథ్, శ్రీకాంత్ నటించారు. ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చినందుకు సంగీత దర్శకుడు సి.హెచ్. విద్యాసాగర్ కు జాతీయ పురస్కారం లభించింది.[1]

పురస్కారాలు

[మార్చు]
  • 2004 సంవత్సరానికి గాను ఈ సినిమాకు సంగీతం సమకూర్చిన విద్యాసాగర్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారం లభించింది.
  • ప్రాంతీయ చిత్రాల విభాగంలో తెలుగులో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

పాటలు

[మార్చు]
కస్తూరి తిలకం. రచన:వేటూరి, గానం. శంకర్ మహదేవన్, సుజాత
కుడి కన్ను అదిరినే. రచన: కె. విశ్వనాథ్, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సునీత
ఒక్క క్షణం. రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ
రమా వినోది వల్లభా , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం. మధు బాలకృష్ణన్ , మనో, శ్రీరామ్ పార్ధసారధి, కె ఎస్ చిత్ర
అనుజుడై లక్ష్మణుడు , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె జె జేసుదాస్

ఇది నాదని అది నీదని , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

నీచెంత ఒక , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.మనో, కె ఎస్ చిత్ర

శ్రీమాన్ మనోహర , రచన: గానం.శ్రీరామ్ పార్ధసారధి , కె ఎస్ చిత్ర

మంగళం , గానం.శ్రీరామ్ పార్ధసారధి , కె ఎస్ చిత్ర .

మూలాలు

[మార్చు]
  1. S.R, Ashok Kumar (13 April 2013). "హిందూ పేపర్లో వార్త". Kasturi and Sons. Retrieved 11 May 2016.

బయటి మూలాలు

[మార్చు]