స్వామిరారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వామిరారా
Swamy Ra Ra poster.jpg
దర్శకత్వంసుధీర్ వర్మ
కథసుధీర్ వర్మ
నిర్మాతచక్రి చిగురుపాటి
తారాగణంనిఖిల్
కలర్స్ స్వాతి
ఛాయాగ్రహణంరిచర్డ్ ప్రసాద్
కూర్పుఎస్. ఆర్. శేఖర్
సంగీతంసన్ని ఎం.ఆర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2013 ఫిబ్రవరి 14 (2013-02-14)
దేశంభారత్
భాషతెలుగు

స్వామిరారా 2013, ఫిబ్రవరి 14న సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠ భరిత తెలుగు చిత్రం.[1] ఇందులో నిఖిల్, స్వాతి ప్రధాన పాత్రలు పోషించారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొంగిలింపబడిన ఓ చిన్ని విగ్రహం చుట్టూ అల్లుకోబడిన కథ ఇది.

కథ[మార్చు]

ఈ సినిమా తిరువనంతపురంలోని పద్మనాభస్వామి గుడిలోని అత్యంత మహిమ గల గణేష్ విగ్రహాన్ని దొంగలించడంతో మొదలవుతుంది. ఈ విగ్రహం అత్యంత పురాతనమైనది కావడం వల్లన మార్కెట్లో భారీగా ధర పలుకుతుంది. ఈ విగ్రహం ఒకరి చేతిలో నుండి మరొకరి చేతిలోకి మారుతూ వుంటుంది. అలా నిధానంగా గ్యాంగ్ స్టర్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి ఒక్కరు ఈ విగ్రహాన్ని ఒకరి దగ్గర నుంచి ఒకరు దొంగిలించి అమ్మడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఇదిలా ఉండగా సూర్య (నిఖిల్) ఒక జేబు దొంగ, తనతో పాటు మరో ముగ్గురు వుంటారు. వారు బ్రతకడం కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వుంటారు.

ఒకరోజు అనుకోకుండా సూర్య, జర్నలిస్ట్ గా పనిచేస్తున్న స్వాతి (స్వాతి)ని కలుసుకుంటాడు. వీరు మంచి స్నేహితులుగా మారుతారు. గ్యాంగ్ స్టర్స్ దగ్గర గల గణేష్ విగ్రహం చేతులు మారుతూ మారుతూ అనుకోకుండా స్వాతి హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఈ విషయం దుర్గకి తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం రవిబాబు స్వాతి, సూర్యల వెంట పడతాడు. ఈ గ్యాంగ్ స్టర్ నుండి సూర్య, స్వాతి ఎలా బయట పడ్డారు? చివరికి ఆ విగ్రహం ఏమవుతుంది? అనేది మిగతా కథ.

నటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • లైఫంటేనే పెద్ద చేజురా
  • కృష్ణుడి వారసులంతా

మూలాలు[మార్చు]

  1. "స్వామిరారా సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 28 November 2017.