Jump to content

స్వాల్‌బార్డ్

వికీపీడియా నుండి
స్వాల్‌బార్డ్
స్వాల్‌బార్డ్ ఉపగ్రహ దృశ్యం
స్వాల్‌బార్డ్ ఉపగ్రహ దృశ్యం
నార్వేతో పోలికలో స్వాల్‌బార్డ్ స్థానం
Location of  స్వాల్‌బార్డ్  (dark green)
స్వాల్‌బార్డ్ ఒప్పందం1920 ఫిబ్రవరి 9
స్వాల్‌బార్డ్ చట్తం1925 జూలై 17
పాలనా కేంద్రంలాంగ్‌యియర్‌బయెన్
78°13′N 15°39′E / 78.22°N 15.65°E / 78.22; 15.65
Largest అతిపెద్ద పట్టణంరాజధాని
Official languagesనార్వేజియన్
Ethnic groups
(2021)
61.1% నార్వేజియన్లు
38.9% other[a][1]
Demonym(s)నాత్వేజియన్లు
Governmentరాజ్యాంగ రాచరిక వ్యవస్థలో స్థానిక ప్రభుత్వం
 రాచరిక వ్యవస్థ
హెరాల్డ్ V
Area
 Total
62,045[2] km2 (23,956 sq mi) (not ranked)
Highest elevation
1,718 మీ (5,636 అ.)
Population
 2023 estimate
2,530[3]
 Density
0.044/km2 (0.1/sq mi) (248 వ)
Currencyనార్వేజియన్ క్రోన్ (NOK)
Time zoneUTC+01:00 (CET)
  Summer (DST)
UTC+02:00 (CEST)
Date formatdd.mm.yyyy
Driving sideright
Calling code+47
Postal code
917x
ISO 3166 code
Internet TLD

స్వాల్‌బార్డ్ ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంతో కలిసే ప్రదేశంలో ఉన్న నార్వేజియన్ ద్వీపసమూహం. దీన్ని గతంలో స్పిట్స్‌బెర్గెన్ లేదా స్పిట్జ్‌బెర్గెన్ అనేవారు. ఇది యూరప్ ప్రధాన భూభాగానికి ఉత్తరాన, నార్వే ఉత్తర తీరానికీ ఉత్తర ధ్రువానికీ మధ్యలో ఉంది. ఈ ద్వీపాల సమూహంలోని ద్వీపాలు 74° నుండి 81° ఉత్తర అక్షాంశాల మధ్యన, 10° నుండి 35° తూర్పు రేఖాంశాల మధ్యనా ఉంటాయి. ఇక్కడి అతిపెద్ద ద్వీపం స్పిట్స్‌బెర్గెన్ (37,673 కి.మీ. 2 ). ఆ తరువాత పరిమాణంలో నోర్డాస్ట్‌ల్యాండెట్ (14,443 కి.మీ. 2 ), ఎడ్గోయా (5,073 కి.మీ 2 ), బారెంట్సోయా (1,288 కి.మీ 2 ) లు ఉంటాయి. స్పిట్స్‌బెర్గెన్‌కు దక్షిణంగా 147 కి.మీ. దూరంలో ఉన్న బ్జోర్నోయ లేదా బేర్ ఐలాండ్ (178 కి.మీ. 2 ) అనేది ఓ భూభాగంలో దక్షిణ కొసన ఉన్న ద్వీపం. ఈ సమూహంలోని ఇతర చిన్న దీవులలో ఎడ్జియోయాకు ఆగ్నేయంగా హోపెన్, తూర్పున కొంగ్సోయా, స్వెన్స్కోయా, ఈశాన్యంలో క్విటోయా ఉన్నాయి. ఇక్కడి అతిపెద్ద నివాస స్థానం లాంగియర్‌బైన్, ఇది స్పిట్స్‌బెర్గెన్ పశ్చిమ తీరంలో ఇస్ఫ్‌జోర్డెన్‌లో ఉంది.

17 వ, 18వ శతాబ్దాలలో ఉత్తర దిశగా వెళ్ళిన తిమింగల వేటగాళ్ళు ఈ దీవులను స్థావరంగా ఉపయోగించేవారు. ఆ తరువాత ఈ ద్వీపసమూహాలు నిర్జనమయ్యాయి.[4][5] 20వ శతాబ్దం ప్రారంభంలో బొగ్గు తవ్వకం ప్రారంభమైంది. పిరమిడెన్ లేదా బారెంట్స్‌బర్గ్ వంటి అనేక శాశ్వత స్థావరాలు ఏర్పడ్డాయి,[6] 1920 నాటి స్వాల్‌బార్డ్ ఒప్పందం ఈ ద్వీపసమూహంపై నార్వేజియన్ సార్వభౌమత్వాన్ని గుర్తిస్తుంది. 1925 నాటి నార్వేజియన్ స్వాల్‌బార్డ్ చట్టం స్వాల్‌బార్డ్‌ను నార్వే రాజ్యంలో పూర్తి భాగంగా చేసింది. స్వాల్‌బార్డ్ ఒప్పందం ప్రకారం స్వాల్‌బార్డ్‌, స్వేచ్ఛా ఆర్థిక మండలంగా ఏర్పడింది. ద్వీపసమూహాన్ని సైనికంగా వినియోగించకుండా ఈ ఒప్పందం నిరోధించింది. నార్వే సంస్థ స్టోర్ నోర్స్కే, రష్యా సంస్థ ఆర్క్‌టికుగోల్ అనే మైనింగ్ కంపెనీలు మాత్రమే ఇంకా ఇక్కడ ఉన్నాయి.

పరిశోధన, పర్యాటకం ఇక్కడి ముఖ్యమైన అనుబంధ పరిశ్రమలు. స్వాల్‌బార్డ్‌లోని విశ్వవిద్యాలయ కేంద్రం, స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ స్థానిక ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. లాంగ్‌ఇయర్‌బైన్ కాకుండా, ఇతర స్థావరాలలో బారెంట్స్‌బర్గ్‌లోని రష్యన్ మైనింగ్ కమ్యూనిటీ, నార్వేజియన్ పరిశోధనా కేంద్రం నై-అలేసుండ్, పోలిష్ పరిశోధనా కేంద్రం హార్న్‌సుండ్, నైబియన్ స్థావరం, స్వీడిష్-నార్వేజియన్ మైనింగ్ అవుట్‌పోస్ట్ స్వెగ్రువా (దీన్ని 2020లో మూసివేసారు) ఉన్నాయి.[7] ఇతర స్థావరాలు ఉత్తరాన చాలా దూరంలో ఉన్నాయి, కానీ అక్కడ పరిశోధకులు మాత్రమే ఉంటారు. స్థావరాలను కలిపేందుకు ఇక్కడ రోడ్లు లేవు; అందుకు స్నోమొబైల్స్, విమానాలు, పడవలను రవాణాకు వాడతారు. స్వాల్‌బార్డ్ విమానాశ్రయం ప్రధాన ద్వారంగా పనిచేస్తుంది.

ఈ ద్వీపసమూహం, దాదాపు 60% హిమానీనదాలతో కప్పబడి ఉంది. ఈ ద్వీపాలలో అనేక పర్వతాలు, ఫ్జోర్డ్‌లూ ఉన్నాయి. [8] ఇక్కడి వాతావరణం ఆర్కిటిక్ వాతావరణం. అయితే అట్లాంటిక్ మహాసముద్రం నుండి వచ్చే గల్ఫ్ స్ట్రీమ్ ప్రభావం కారణంగా, ఇదే అక్షాంశాల్లో ఉండే ఇతర ప్రాంతాల కంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా ఎక్కువగా ఉంటాయి. ధ్రువ రాత్రులలో సూర్యరశ్మి లేమిని భర్తీ చేయడానికి, అర్ధరాత్రి సూర్యుని దీర్ఘకాలాన్ని సద్వినియోగం చేసుకునేలా ఇక్కడి వృక్షజాలం అలవాటు పడింది.[9] అనేక సముద్ర పక్షులు స్వాల్‌బార్డ్‌ను సంతానోత్పత్తి ప్రదేశంగా ఉపయోగిస్తాయి. ఇది ధ్రువ ఎలుగుబంట్లు, రెయిన్ డీర్, ఆర్కిటిక్ నక్కలకూ, కొన్ని సముద్ర క్షీరదాలకూ నిలయం. ఏడు జాతీయ ఉద్యానవనాలు, 23 ప్రకృతి నిల్వలు ఈ ద్వీపసమూహంలో మూడింట రెండు వంతులను ఆక్రమించి, ఇక్కడి దుర్బలమైన వాతావరణాన్ని కాపాడుతున్నాయి. స్వాల్‌బార్డ్‌లోని వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని రక్షించడానికి నార్వే, 2024 ఫిబ్రవరిలో పర్యాటకానికి సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించింది, ఇందులో ఓడలో గరిష్టంగా 200 మంది వ్యక్తులు మాత్రమే ప్రయాణించేలా నియంత్రణ విధించింది.[10]

1925 నుండి నార్వే రాజ్యంలో భాగంగా ఉన్నప్పటికీ స్వాల్‌బార్డ్, భౌగోళిక నార్వేలో భాగం కాదు; పరిపాలనాపరంగా, ఈ ద్వీపసమూహం ఏ నార్వేజియన్ కౌంటీలోనూ భాగం కాదు, కానీ ఒక ఇన్కార్పొరేటెడ్ ప్రాంతంగా ఉంది. దీని అర్థం దీన్ని నార్వేజియన్ ప్రభుత్వం నియమించే గవర్నరు నేరుగా పాలిస్తారు. స్కెంజెన్ ప్రాంతం, నార్డిక్ పాస్‌పోర్ట్ యూనియన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా వెలుపల ఉన్న స్వాల్‌బార్డ్ ఒప్పందానికి లోబడి ప్రత్యేక అధికార పరిధిని కలిగి ఉంటుంది. స్వాల్‌బార్డ్, జాన్ మాయెన్ లకు సమిష్టిగా ISO 3166-1 ఆల్ఫా-2 కంట్రీ-కోడ్ "SJ" కేటాయించబడింది. రెండు ప్రాంతాలు నార్వే పాలనలో ఉన్నప్పటికీ అవి 950 kilometres (510 nautical miles) పైబడిన దూరాన ఉన్నాయి. ఇక్కడ చాలా భిన్నమైన పరిపాలనా నిర్మాణం ఉంది.

భౌగోళికం

[మార్చు]
వేసవి చివరి రోజుల్లో స్పిట్స్‌బెర్జెన్ ఉపగ్రహ చిత్రం. మంచు కరగగా ఏర్పడిన నీటి మడుగులను చూడవచ్చు.

1920 నాటి స్వాల్‌బార్డ్ ఒప్పందం ప్రకారం[11] స్వాల్‌బార్డ్‌ 74° నుండి 81° ఉత్తర అక్షాంశాల మధ్యన, 10° నుండి 35° తూర్పు రేఖాంశాల మధ్యనా ఉన్న ద్వీపాలు, లంకలు, స్కెరీలుగా నిర్వచించారు.[12][13] ఇక్కడి భూమి విస్తీర్ణం 61,022 km2 (23,561 sq mi). ద్వీపసమూహంలో సగానికి పైగా ఉన్న స్పిట్స్‌బెర్గెన్ ద్వీపం అతి పెద్దది. తరువాత నోర్డాస్ట్‌లాండెట్, ఎడ్జియోయాలు ఉన్నాయి. [14]

బ్జోర్నోయా, హోపెన్‌లలోని వాతావరణ కేంద్రాలు తప్ప, ఇక్కడి నివాస స్థావరాలన్నీ స్పిట్స్‌బెర్గెన్‌లోనే ఉన్నాయి. [11] స్వాల్‌బార్డ్ ఒప్పందం అమల్లోకి వచ్చే సమయానికి మొత్తం ద్వీపసమూహంలో 95.2% నార్వే అధీనంలో ఉండగా, నార్వేజియన్ బొగ్గు మైనింగ్ కంపెనీ స్టోర్ నోర్స్కే కు 4%, రష్యన్ బొగ్గు మైనింగ్ కంపెనీ ఆర్కిటికుగోల్ కు 0.4%, ఇతర ప్రైవేట్ యజమానులకు 0.4% వాటా ఉంది.[15]

స్వాల్‌బార్డ్ ఆర్కిటిక్ వలయానికి ఉత్తరాన ఉన్నందున, వేసవిలో అర్ధరాత్రి సూర్యుడు, శీతాకాలంలో ధ్రువ రాత్రి ఉంటుంది. 74° ఉత్తర అక్షంశాన, అర్ధరాత్రి సూర్యుడు 99 రోజులు, ధ్రువ రాత్రి 84 రోజులు ఉంటుంది. అయితే 81° ఉత్తర అక్షాంశాన ఇది 141 రోజులు, 128 రోజులూ ఉంటాయి. లాంగ్‌ఇయర్‌బైన్‌లో, అర్ధరాత్రి సూర్యుడు ఏప్రిల్ 20 నుండి ఆగస్టు 23 వరకు ఉండగా, ధ్రువ రాత్రి అక్టోబరు 26 నుండి ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. [12] శీతాకాలంలో, పౌర్ణమి, ప్రతిబింబించే మంచూ కలిసి అదనపు కాంతిని ఇస్తాయి.[16]

భూమి వంపు, ఉన్నత అక్షాంశాల కారణంగా, స్వాల్‌బార్డ్‌లో విస్తృతమైన సంధ్యవేళలుంటాయి. లాంగ్‌ఇయర్‌బైన్‌లో ధ్రువ రాత్రి మొదటి, చివరి రోజుల్లో ఏడున్నర గంటల సంధ్యా సమయం ఉంటుంది. అయితే శాశ్వత కాంతి, అర్ధరాత్రి సూర్యుడి కంటే రెండు వారాల పాటు ఎక్కువ ఉంటుంది. [17][18] వేసవి అయనాంతం నాడు, సూర్యుడు అర్ధరాత్రి 12° సూర్య కోణంలో అస్తమిస్తాడు. ఇది నార్వే ప్రధాన భూభాగ ధ్రువ కాంతి ప్రాంతాల కంటే రాత్రి సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. [19] అయితే, పగటిపూట సూర్యుని బలం 35° కంటే తక్కువగా ఉంటుంది.

స్వాల్‌బార్డ్‌లో 36,502 km2 (14,094 sq mi) ప్రాంతాన్ని (60%) హిమనదీయ మంచు కప్పేస్తుంది. 30% బంజరు రాతినేల కాగా 10% వృక్షసంపదతో కూడుకుని ఉంటుంది. అతిపెద్ద హిమానీనదం ఆస్ట్‌ఫోన్నా ( 8,412 km2 or 3,248 sq mi) వేసవిలో, స్పిట్స్‌బెర్గెన్‌కు దక్షిణాన సోర్కాప్ నుండి ఉత్తరం వరకు స్కీయింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. మంచు లేదా హిమానీనదంతో కప్పబడని ప్రాంతం అతి కొద్దిగానే ఉంటుంది. క్విటోయా 99.3% హిమానీనదంతో కప్పబడి ఉంది.

జనాభా

[మార్చు]
బేరెంట్స్‌బర్గ్‌లో ఒక ఇల్లు
ధ్రువ ఎలుగుబంట్లు ఉన్నాయని హెచ్చరించే రోడ్డు పక్క బోర్డు

2016 లో స్వాల్‌బార్డ్ జనాభా 2,667. వీరిలో 423 మంది రష్యన్లు, ఉక్రేనియన్లు, 10 మంది పోలిష్, 322 మంది ఇతర నార్వేజియనేతరులు ఉన్నారు.[20] 2005లో లాంగ్‌ఇయర్‌బైన్‌లో అతిపెద్ద నార్వేజియనేతర సమూహాలు రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, థాయిలాండ్ నుండి వచ్చాయి. [21]

2023 మధ్యలో స్పిట్స్‌బెర్గెన్‌లో 3,094 మంది నివాసితులు ఉన్నారు, వీరిలో లాంగ్‌ఇయర్‌బైన్‌లో 2,465 మంది, నై-అలెసుండ్‌లో 130 మంది, హార్న్‌సుండ్ (ఇస్బ్జోర్న్‌హామ్నా) పరిశోధనా కేంద్రంలో 10 మంది (పోలిష్) ఉన్నారు; బారెంట్స్‌బర్గ్‌లో 440 మంది రష్యన్లు, పిరమిడెన్‌లో దాదాపు 50 మంది ఉన్నారు. బేర్ ద్వీపంలోని (హెర్విఘమ్నా వద్ద) వాతావరణ కేంద్రంలో 9 మంది, హోపెన్‌లోని ఒక దీవిలో 4 మంది తప్ప మిగిలిన దీవులలో నివాసితులెవరూ లేరు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. Consists primarily of Russians, Thais, Swedes, Filipinos, and Ukrainians.
  2. .sj allocated, but not used.

మూలాలు

[మార్చు]
  1. "World Factbook: Svalbard". www.cia.gov. Archived from the original on 13 January 2021. Retrieved 17 April 2019.
  2. "Svalbard". Central Intelligence Agency. 15 February 2023. Archived from the original on 20 ఏప్రిల్ 2024. Retrieved 16 March 2023 via CIA.gov.
  3. "Population of Svalbard". Statistics Norway. Archived from the original on 7 August 2020. Retrieved 4 July 2020. Table 2: Population in the settlements. Svalbard
  4. "Whaling - Svalbard Museum". svalbardmuseum.no. Retrieved 13 May 2024.
  5. Norum, Roger; Proctor, James (3 May 2018). Svalbard: Spitsbergen, Jan Mayen and Franz Josef Land (in ఇంగ్లీష్). Bradt Travel Guides. pp. 29–30, 43. ISBN 978-1-78477-047-1.
  6. Norum, Roger; Proctor, James (3 May 2018). Svalbard: Spitsbergen, Jan Mayen and Franz Josef Land (in ఇంగ్లీష్). Bradt Travel Guides. p. 60. ISBN 978-1-78477-047-1.
  7. Stange, Rolf (26 February 2020). "Svea Nord is history". Spitsbergen | Svalbard (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 19 May 2024.
  8. Godone, Danilo (4 October 2017). Glacier Evolution in a Changing World (in ఇంగ్లీష్). BoD – Books on Demand. pp. 11–12. ISBN 978-953-51-3543-2.
  9. "Svalbard: Svalbard". ncpor.res.in. Retrieved 15 May 2024.
  10. "Stricter rules apply to tourists heading to Svalbard". The Barents Observer (in ఇంగ్లీష్). 9 February 2024. Retrieved 9 April 2024. The Norwegian Government on Friday adopted amendments to the environmental regulations in Svalbard. "We are now tightening the environmental regulations in Svalbard to strengthen the protection of flora and fauna," says Minister of Climate and Environment, Andreas Bjelland Eriksen.
  11. 1 2 "Svalbard". World Fact Book. Central Intelligence Agency. 15 January 2010. Archived from the original on 13 January 2021. Retrieved 24 March 2010.
  12. 1 2 "Svalbard". Norwegian Polar Institute. Archived from the original on 15 April 2012. Retrieved 24 March 2010.
  13. "Svalbard Treaty". Wikisource. 9 February 1920. Archived from the original on 24 March 2010. Retrieved 24 March 2010.
  14. "Population in the settlements. Svalbard". Statistics Norway. 22 October 2009. Retrieved 24 March 2010.
  15. "7 Industrial, mining and commercial activities". Report No. 9 to the Storting (1999–2000): Svalbard. Norwegian Ministry of Justice and the Police. 29 October 1999. Archived from the original on 11 October 2012. Retrieved 24 March 2010.
  16. Torkilsen (1984): 96–97
  17. "Sunrise and sunset in Longyearbyen October 2019". Timeanddate.com. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  18. "Sunrise and sunset in Longyearbyen April 2019". Timeanddate.com. Archived from the original on 13 December 2019. Retrieved 29 October 2019.
  19. "Sunrise and sunset in Longyearbyen June". Timeanddate.com. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  20. "Population in the settlements. Svalbard". Statistics Norway. 22 October 2009. Retrieved 24 March 2010.
  21. "Non-Norwegian population in Longyearbyen, by nationality. Per 1 January. 2004 and 2005. Number of persons". Statistics Norway. Archived from the original on 23 May 2010. Retrieved 24 March 2010.