Jump to content

స్వాల్‌బార్డ్ ఒప్పందం

వికీపీడియా నుండి

స్వాల్‌బార్డ్ ఒప్పందం (ఒరిజినల్‌గా స్పిట్స్‌బెర్గెన్ ఒప్పందం) ఆ సమయంలో స్పిట్స్‌బెర్గెన్ అని పిలువబడే స్వాల్‌బార్డ్ ఆర్కిటిక్ ద్వీపసమూహంపై నార్వే సార్వభౌమత్వాన్ని గుర్తిస్తుంది. అయితే, సార్వభౌమాధికారం అమలు కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుంది. ఇక్కడ నార్వేజియన్ చట్టాలన్నీ వర్తించవు. ఈ ఒప్పందం సైనికంగా ద్వీపసమూహాన్ని ఉపయోగించరాదని చెబుతుంది. సంతకం చేసిన వారికి దీవులలో వాణిజ్య కార్యకలాపాలలో (ప్రధానంగా బొగ్గు తవ్వకం) పాల్గొనడానికి సమాన హక్కులు ఉంటాయి.[1] 2024 నాటికి, నార్వే, రష్యాలు ఈ హక్కును ఉపయోగించుకుంటున్నాయి.

ప్రత్యేకించి ఈ ద్వీపసమూహం, స్వాల్‌బార్డ్ ఒప్పందం నిబంధనల ప్రకారం పూర్తిగా వీసా రహిత జోన్.

ఈ ఒప్పందంపై 1920 ఫిబ్రవరి 9న సంతకాలు చేసారు. 1920 అక్టోబరు 21న లీగ్ ఆఫ్ నేషన్స్ ట్రీటీ సిరీస్‌లో నమోదు కోసం సమర్పించారు. డెన్మార్క్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్ ( ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, భారతదేశంతో సహా), యునైటెడ్ స్టేట్స్ అనేవి 14 ఒరిజినల్‌గా సంతకం పెట్టిన పార్టీలు.[2] సంతకం చేసిన దేశాలలో, జపాన్ 1925 ఏప్రిల్ 2న ఒప్పందాన్ని ఆమోదించిన చివరి దేశం. ఈ ఒప్పందం 1925 ఆగస్టు 14న అమల్లోకి వచ్చింది.

ఈ ఒప్పందం అమలులోకి రాకముందే అనేక దేశాలతో సహా, అసలు సంతకం చేసిన వారు దీనిని ఆమోదించిన తర్వాత అనేక ఇతర దేశాలు దీనికి అంగీకరించాయి. 2024 నాటికి ఈ ఒప్పందంలో 48 పార్టీలు ఉన్నాయి. [3] [4] [5]

ఒప్పందం పేరు

[మార్చు]

అసలు ఒప్పందం పేరు స్పిట్స్‌బెర్గెన్ ద్వీపసమూహంపై నార్వే సార్వభౌమత్వాన్ని గుర్తించే ఒప్పందం. ఇది మొత్తం ద్వీపసమూహాన్ని స్పిట్స్‌బెర్గెన్ అని సూచిస్తుంది, ఇది 1596 నుండి సాధారణ వాడుకలో ఉన్న ఏకైక పేరు (స్పెల్లింగ్‌లో స్వల్ప తేడాలతో). 1925లో, ఒప్పందం ముగిసిన ఐదు సంవత్సరాల తర్వాత, నార్వేజియన్ అధికారులు అధికారికంగా దీవులకు "స్వాల్‌బార్డ్" అని పేరు మార్చారు . ఈ కొత్త పేరు పురాతన టోపోనిమ్ Svalbarði యొక్క ఆధునిక అనుసరణ. 1194 నాటికే నార్స్ గాథలలో ధృవీకరించబడింది. తరువాత ద్వీపసమూహంలోని ప్రధాన ద్వీపానికి మాత్రమే స్పిట్స్‌బెర్గెన్ అనే పేరును వర్తింపజేసారు. [6] [7] దీని ప్రకారం, ఆధునిక చరిత్ర చరిత్రలో స్పిట్స్‌బెర్గెన్ ఒప్పందాన్ని సాధారణంగా పేరు మార్పును ప్రతిబింబించేలా స్వాల్‌బార్డ్ ఒప్పందం అని పిలుస్తారు.

చరిత్ర

[మార్చు]

ఈ ద్వీపసమూహాన్ని 1596 లో డచ్ అన్వేషకుడు విల్లెం బారెంట్జ్ కనుగొన్నాడు. [8] దీనికి స్పిట్స్‌బెర్గెన్ అని పేరు పెట్టాడు. దీని అర్థం 'కోసుగా ఉన్న శిఖరాలు కలిగిన పర్వతాలు' (అక్షరాలా 'స్పిట్స్-బర్గ్'). అది జనావాసాలు లేకుండా ఉండేది. [9] 1920 లలో నార్వే, ఈ దీవుల పేరును స్వాల్‌బార్డ్ అని మార్చింది. [10]

స్పిట్స్‌బెర్గెన్/స్వాల్‌బార్డ్ ఒక దేశం లేని భూభాగంగా ప్రారంభమైంది. వివిధ దేశాల ప్రజలు చేపలు పట్టడం, తిమింగల వేట, మైనింగ్, పరిశోధన, తరువాత పర్యాటకం వంటి పరిశ్రమలలో పాల్గొన్నారు. 17వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్-నార్వే లమధ్య తిమింగల వేట హక్కులు, సార్వభౌమాధికార వివాదాల కారణంగా ఈ ప్రాంతంపై విభేదాలు ఉన్నప్పటికీ, స్వాల్‌బార్డ్ ఏ దేశానికీ చెందకపోవడం వల్ల పెద్దగా నిబంధనలూ, చట్టాలూ ఉండేవి కావు. 20వ శతాబ్దం నాటికి ప్రధాన ద్వీపంలో ఖనిజ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. మైనింగు కార్మికులకూ యజమానులకూ మధ్య నిరంతర ఘర్షణల కారణంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. [11]

కంటెంట్

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సైల్లెస్ చర్చల సందర్భంగా, 1920 ఫిబ్రవరి 9, న పారిస్‌లో స్పిట్స్‌బెర్గెన్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందంలో, అంతర్జాతీయ దౌత్యం, నార్వేజియన్ సార్వభౌమత్వాన్నీ (నార్వేజియన్ పరిపాలన 1925 నాటికి అమలులోకి వచ్చింది) స్వాల్‌బార్డ్‌కు సంబంధించిన ఇతర సూత్రాలనూ గుర్తించింది. ఇందులో కింది అంశాలున్నాయి: [2]

  • స్వాల్‌బార్డ్ నార్వేలో భాగం : స్వాల్‌బార్డ్ పూర్తిగా నార్వే రాజ్యంచే నియంత్రించబడుతుంది, దానిలో భాగంగా ఉంటుంది. అయితే, స్వాల్‌బార్డ్ పై నార్వే అధికారం క్రింద చూపిన పరిమితులకు లోబడి ఉంటుంది:
  • పన్నులు : పన్నులు వసూలు చేయడానికి అనుమతి ఉంది, కానీ స్వాల్‌బార్డ్‌కు, స్వాల్‌బార్డ్ ప్రభుత్వానికీ మద్దతు అవసరమైనంత వరకు మాత్రమే. దీని ఫలితంగా నార్వే ప్రధాన భూభాగం కంటే ఇక్కడ తక్కువ పన్నులు వర్తిస్తాయి. నార్వే ప్రధాన భూభాగానికి నేరుగా మద్దతు ఇచ్చే పన్నులు స్వాల్‌బార్డ్‌లో వర్తించవు. స్వాల్‌బార్డ్ ఆదాయాలు, ఖర్చులు నార్వే ప్రధాన భూభాగం నుండి విడిగా బడ్జెట్ చేయబడ్డాయి.
  • పర్యావరణ పరిరక్షణ : నార్వే స్వాల్‌బార్డ్ పర్యావరణాన్ని గౌరవించి, సంరక్షించాలి.
  • వివక్షత లేకపోవడం : ఈ ఒప్పందం ప్రకారం ప్రతి దేశంలోని పౌరులూ, కంపెనీలూ ఇక్కడ నివాసితులుగా మారడానికీ, చేపలు పట్టడం, వేటాడటం లేదా ఏ రకమైన సముద్ర, పారిశ్రామిక, మైనింగ్ లేదా వాణిజ్య కార్యకలాపాలను చేపట్టే హక్కుతో సహా స్వాల్‌బార్డ్‌లో ప్రవేశం పొందేందుకు అనుమతి ఉంటుంది. స్వాల్‌బార్డ్ నివాసితులు నార్వేజియన్ చట్టాన్ని పాటించాలి. అయితే నార్వేజియన్ అధికారం ఏ దేశీయుల పట్లా వివక్ష చూపకూడదు లేదా అనుకూలంగా ఉండకూడదు. రష్యా ఈ నివాస హక్కును వినియోగించుకుని, 2022 లో బారెంట్స్‌బర్గ్, పిరమిడెన్‌లలో తన ఉనికికి మద్దతు ఇవ్వడానికి కొత్త పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది.[12]
  • సైనిక ఆంక్షలు : ఒప్పందం లోని ఆర్టికల్ 9, నావికా స్థావరాలు, కోటలను నిషేధించింది. యుద్ధ ప్రయోజనాల కోసం స్వాల్‌బార్డ్‌ను వాడుకోవడాన్ని కూడా నిషేధించింది. నార్వే సార్వభౌమత్వాన్ని వినియోగించుకోవడానికీ, పర్యావరణాన్ని పరిరక్షించడానికీ నార్వే సైనిక దళాలు ఆ భూభాగంలోకి ప్రవేశించడానికి ఈ నిబంధన అనుమతిస్తున్నట్లు నార్వే వ్యాఖ్యానిస్తోంది. ఇది ఎక్కువగా నార్వేజియన్ సైనిక దళాలు, ముఖ్యంగా నార్వేజియన్ కోస్ట్ గార్డ్ ఓడలు, ఈ భూభాగాన్ని సందర్శించడాన్ని కలిగి ఉంటుంది. అయితే, సంతకం చేసిన కొన్ని ఇతర దేశాలు, ముఖ్యంగా రష్యా, ఈ వివరణను వివాదం చేస్తున్నాయి. ముఖ్యంగా, స్వాల్‌బార్డ్ చుట్టూ ఉన్న ఖండాంతర షెల్ఫ్‌పై ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టంపై సమావేశం ప్రకారం ప్రత్యేక హక్కులు ఉన్నాయని నార్వే వాదిస్తున్నప్పటికీ, రష్యా ఈ వైఖరిని తిరస్కరిస్తోంది. స్వాల్‌బార్డ్ చుట్టూ నార్వేజియన్ లేదా నాటో సైనిక కార్యకలాపాలను రష్యా కూడా వ్యతిరేకిస్తోంది. ఇది ఒప్పందం లోని సైనిక ఆంక్షలను బలహీనపరుస్తుందని రష్యా పేర్కొంది.[13]

సహజ వనరులకు సంబంధించిన వివాదాలు

[మార్చు]

ఈ ప్రాంతంలో చేపల వేట హక్కులపై ప్రధానంగా నార్వే, రష్యా (దానికి ముందు, సోవియట్ యూనియన్) మధ్య చాలా కాలంగా వివాదం ఉండేది.[14] [15] 1977 లో నార్వే, స్వాల్‌బార్డ్ చుట్టూ 200 nautical miles (370 కి.మీ.) దూరం వరకూ ఉన్న జోన్‌లో (అయితే నార్వే ఈ జోన్‌కు విదేశీయులు రాకుండా మూసివేయలేదు) నియంత్రిత మత్స్యకార వ్యాపారాన్ని స్థాపించింది. [14] సమాన ఆర్థిక ప్రాప్యత ఒప్పందంలోని నిబంధనలు దీవులు, వాటి ప్రాదేశిక జలాలకు (ఆ సమయంలో నాలుగు నాటికల్ మైళ్ళు) మాత్రమే వర్తిస్తాయని కానీ విస్తృత ప్రత్యేక ఆర్థిక మండలానికి కాదని నార్వే వాదిస్తుంది. అదనంగా, ఖండాంతర షెల్ఫ్ నార్వే ప్రధాన భూభాగం యొక్క ఖండాంతర షెల్ఫ్‌లో ఒక భాగమనీ, దీనిని 1958 ఖండాంతర షెల్ఫ్ కన్వెన్షన్ ద్వారా నిర్వహించాలనీ వాదిస్తుంది.[15] సోవియట్ యూనియన్/రష్యా ఈ వైఖరిని వివాదం చేస్తూనే ఉంది. స్పిట్స్‌బెర్గెన్ ఒప్పందాన్ని మొత్తం జోన్‌కు వర్తింపజేయాలని భావిస్తోంది. 1978లో మాస్కోలో చర్చలు జరిగాయి కానీ సమస్య పరిష్కారం కాలేదు.[14] ఫిన్లాండ్, కెనడాలు నార్వే వైఖరికి మద్దతు ఇస్తున్నాయి. ఒప్పందంపై సంతకాలు చేసిన ఇతర దేశాలు అధికారిక వైఖరిని వ్యక్తం చేయలేదు.[14] ఒప్పందంలోని సంబంధిత భాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

అన్ని హై కాంట్రాక్టింగ్ పార్టీల ఓడలు, జాతీయులు ఆర్టికల్ 1లో పేర్కొన్న భూభాగాలలో, వారి ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టే, వేటాడే హక్కులను సమానంగా అనుభవిస్తారు. (ఆర్టికల్ 2 నుండి)

భూమిపైనా, ప్రాదేశిక జలాల్లోని అన్ని సముద్ర, పారిశ్రామిక, మైనింగ్ లేదా వాణిజ్య కార్యకలాపాలకు అవే సమ ఉజ్జీ షరతుల కింద అనుమతించబడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సంస్థకూ ఎటువంటి గుత్తాధిపత్యం ఉండదు. (ఆర్టికల్ 3 నుండి)

"స్వాల్‌బార్డ్ ఒప్పందం 12 నాటికల్ మైళ్ల ప్రాదేశిక సముద్రం వెలుపల కూడా అమలులో ఉంటుందా లేదా అనే దానిపై ప్రధానంగా వివాదం ఉంది" అని నార్వే లోని అతిపెద్ద వార్తాపత్రిక ఆఫ్టెన్‌పోస్టెన్ తెలిపింది. ఈ ఒప్పందం జోన్ వెలుపల అమల్లోకి వస్తే, చమురు, గ్యాస్ ఉత్పత్తిలో నార్వే పూర్తి 78% లాభాలను పొందలేకపోతుందని 2011 లో ఆఫ్టెన్‌పోస్టెన్ రాసింది.

సంతకాలు చేసిన దేశాలు

[మార్చు]

సంతకాలు చేసిన దేశాల జాబితాను క్రింద పట్టికలో చూడవచ్చు; తేదీ, దేశం తన ధృవీకరణ లేదా ప్రవేశ పత్రాన్ని ఎప్పుడు డిపాజిట్ చేసిందో చూపిస్తుంది. [3] [4] [5] క్రింద పేర్కొన్న విధంగా, కొన్ని పార్టీలు ఒప్పందంలో చేరిన దేశాలకు వారస దేశాలు.

దేశం. ధ్రువీకరణ తేదీ గమనికలు
ఆఫ్ఘనిస్తాన్ 23 November 1929
అల్బేనియా 29 April 1930
అర్జెంటీనా 6 May 1927
ఆస్ట్రేలియా 29 December 1923 యునైటెడ్ కింగ్డమ్ ద్వారా పొడిగింపు.
ఆస్ట్రియా 12 March 1930
బెల్జియం 27 May 1925
బల్గేరియా 20 October 1925
కెనడా 29 December 1923 యునైటెడ్ కింగ్డమ్ ద్వారా పొడిగింపు.
చిలీ 17 December 1928
చైనా 1 July 1925 రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆమోదించబడింది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, రిపబ్లిక్ ఆఫ్ చైనా రెండూ తామే వారస దేశమని వాదిస్తున్నాయి. అయితే 2024 నాటికి ఒప్పందంలోని ఇతర పార్టీలన్నీ పీపుల్స్ రిపబ్లికన్ ఆఫ్ చైనాను మాత్రమే గుర్తించాయి.
చెక్ రిపబ్లిక్ 21 June 2006 1930 జూలై 9న చెకోస్లోవేకియా ఈ ఒప్పందానికి అంగీకరించింది. 1993 జనవరి 1న స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి వారసత్వ దేశంగా తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు చెక్ రిపబ్లిక్ 2006 జూన్ 21 న పేర్కొంది.
డెన్మార్క్ 24 January 1924 మొత్తం డానిష్ రాజ్యానికి విస్తరణ.
డొమినికన్ రిపబ్లిక్ 3 February 1927
ఈజిప్ట్ 13 September 1925
ఎస్టోనియా 7 April 1930
ఫిన్లాండ్ 12 August 1925
ఫ్రాన్స్ 6 September 1924
జర్మనీ 16 November 1925 వీమర్ రిపబ్లిక్ ఆమోదించబడింది. 1974 ఆగస్టు 7 నుండి ఈ ఒప్పందాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు 1974 అక్టోబరు 21న తూర్పు జర్మనీ ప్రకటించింది. 1990 అక్టోబరు 3న తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ తిరిగి కలిసిపోయాయి.
గ్రీస్ 21 October 1925
హంగరీ 29 October 1927
ఐస్లాండ్ 31 May 1994
భారత్ 29 December 1923 యునైటెడ్ కింగ్డమ్ ద్వారా పొడిగింపు.
ఐర్లాండ్ 29 December 1923 ఐరిష్ ఫ్రీ స్టేట్ యునైటెడ్ కింగ్డమ్ ఒప్పందంపై సంతకం చేసిన తరువాత, కానీ అది ఆమోదించబడటానికి ముందే వదిలివేసింది. 1976 ఏప్రిల్ 15న, యునైటెడ్ కింగ్డమ్ ఆమోదించినప్పటి నుండి ఈ ఒప్పందాన్ని కూడా వర్తింపజేసినట్లు ఐర్లాండ్ పేర్కొంది.
ఇటలీ 6 August 1924
జపాన్ 2 April 1925
లాట్వియా 13 June 2016
లిథువేనియా 22 January 2013
మొనాకో 22 June 1925
నెదర్లాండ్స్ 3 September 1920 నెదర్లాండ్స్ మొత్తం రాజ్యానికి విస్తరించడం.
న్యూజిలాండ్ 29 December 1923 యునైటెడ్ కింగ్డమ్ ద్వారా పొడిగింపు.
ఉత్తర కొరియా 16 March 2016
నార్వే 8 October 1924
పోలాండ్ 2 September 1931
పోర్చుగల్ 24 October 1927
రొమేనియా 10 July 1925
రష్యా 7 May 1935 సోవియట్ యూనియన్ అంగీకరించబడింది. సోవియట్ యూనియన్ కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేస్తూనే ఉన్నట్లు 1992 జనవరి 27న రష్యా ప్రకటించింది.
సౌదీ అరేబియా 2 September 1925 హిజాజ్ రాజ్యం అంగీకరించబడింది.
సెర్బియా 5 September 2022 1925 జూలై 6న యుగోస్లేవియా ఈ ఒప్పందానికి అంగీకరించింది. 2022 సెప్టెంబరు 5 న, సెర్బియా ఈ ఒప్పందాన్ని అమలు చేయడం కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.
స్లొవేకియా 21 February 2017 1930 జూలై 9న చెకోస్లోవేకియా ఈ ఒప్పందానికి అంగీకరించింది. 1993 జనవరి 1న స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లు స్లోవేకియా 2017 ఫిబ్రవరి 21న పేర్కొంది.
దక్షిణాఫ్రికా 29 December 1923 యునైటెడ్ కింగ్డమ్ ద్వారా పొడిగింపు.
దక్షిణ కొరియా 11 September 2012
స్పెయిన్ 12 November 1925
స్వీడన్ 15 September 1924
స్విట్జర్లాండ్ 30 June 1925
టర్కీ 11 April 2024
యునైటెడ్ కింగ్డమ్ 29 December 1923 ఆస్ట్రేలియా, కెనడా, భారతదేశం, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా విస్తరించింది. యునైటెడ్ కింగ్డమ్ ఆమోదించినప్పటి నుండి ఐర్లాండ్ కూడా ఈ ఒప్పందాన్ని అమలు చేసింది.
యునైటెడ్ స్టేట్స్ 2 April 1924
వెనిజులా 8 February 1928

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • అంటార్కిటిక్ ఒప్పంద వ్యవస్థ

మూలాలు

[మార్చు]
  1. Berg, Roald (2023), Howkins, Adrian; Roberts, Peder (eds.), "The Genesis of the Spitsbergen/Svalbard Treaty, 1871–1920", The Cambridge History of the Polar Regions, Cambridge University Press, pp. 354–377, doi:10.1017/9781108555654.015, ISBN 978-1-108-42993-1
  2. 2.0 2.1 "Original Spitsbergen Treaty". Archived from the original on 2 July 2017. Retrieved 8 August 2021.
  3. 3.0 3.1 "Traités et accords de la France" [Treaties and agreements of France] (in ఫ్రెంచ్). Ministry for Europe and Foreign Affairs of France. Retrieved 1 August 2024.
  4. 4.0 4.1 "Treaty concerning the Archipelago of Spitsbergen, including Bear Island". Treaty Database of the Netherlands. Retrieved 1 August 2024.
  5. 5.0 5.1 "Kundmachung: Geltungsbereich des Vertrages über Spitzbergen" [Announcement: Area of application of the Treaty on Spitsbergen] (in జర్మన్). Federal Law Gazette for the Republic of Austria. 30 July 2024.
  6. "Norwegian place names in polar regions". Norwegian Polar Institute.
  7. "History – Spitsbergen – Svalbard". spitsbergen-svalbard.com.
  8. Grydehøj, Adam (2020), "Svalbard: International Relations in an Exceptionally International Territory", The Palgrave Handbook of Arctic Policy and Politics, Springer International Publishing, pp. 267–282, doi:10.1007/978-3-030-20557-7_17, ISBN 978-3-030-20556-0 Alt URL
  9. Torkildsen, Torbjørn; et al. (1984). Svalbard: vårt nordligste Norge (in నార్వేజియన్). Oslo: Forlaget Det Beste. p. 30. ISBN 82-7010-167-2.
  10. Umbreit, Andreas (2005). Guide to Spitsbergen. Bucks: Bradt. pp. XI–XII. ISBN 1-84162-092-0.
  11. Arlov, Thor B. (1996). Svalbards historie (in నార్వేజియన్). Oslo: Aschehoug. pp. 249, 261, 273. ISBN 82-03-22171-8.
  12. Rosen, Kenneth (17 December 2022). "A Battle for the Arctic Is Underway. And the U.S. Is Already Behind". Politico. Retrieved 2023-08-18.
  13. Wither, James (8 September 2021). "Svalbard: NATO's Arctic 'Achilles' Heel'". Per Concordiam. Retrieved 16 August 2023.
  14. 14.0 14.1 14.2 14.3 Alex G. Oude Elferink (1994). The Law of Maritime Boundary Delimitation: A Case Study of the Russian Federation. Martinus Nijhoff. pp. 230–231.
  15. 15.0 15.1 Willy Østreng (1986). "Norway in Northern Waters". In Clive Archer & David Scrivener (ed.). Northern Waters: Security and Resource Issues. Routledge. pp. 165–167.