స్వేచ్చాయుత వాణిజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వేచ్చాయుత వాణిజ్యం (Free Trade) అంటే వర్తకులు ప్రభుత్వము యొక్క ప్రమేయము లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించు వాణిజ్య విధానం. తులనాత్మక ప్రయోజన సూత్రము ప్రకారము ఈ విధానం వస్తువుల మరియు సేవల యొక్క వాణిజ్యంలో లాభాలు ఇరుపక్షాలు పొందుటకు వీలు కల్పిస్తుంది.

ఈ స్వేచ్చాయుత విధానంలో ధరలు అనేవి సరఫరా మరియు గిరాకీల యొక్క నిజమైన ప్రతిబింబాలు. ఇవి వనరుల కేటాయింపులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్వేచ్చాయుత వాణిజ్య విధానం కంటే భిన్నంగా ఇతర వాణిజ్య విధానాలలో వాణిజ్య దేశాల మధ్య వస్తువుల మరియు సేవల యొక్క కేటాయింపు, నిజమైన సరఫరా మరియు గిరాకి యొక్క స్వభావాన్ని అందించని కృత్రిమమైన ధరల ఆధారంగా జరుగుతుంది. ఈ కృత్రిమ ధరలు సంరక్షణాత్మక వాణిజ్య విధానాల యొక్క ఫలితంగా ఏర్పడతాయి. ఇందులో ప్రభుత్వము విపణి యందు ధరల యొక్క సవరణలు మరియు సరఫరా యొక్క నియంత్రణ రూపకంగా కలుగచేసుకొంటుంది. ప్రభుత్వము యొక్క ఇటువంటి చర్యల వలన వినియోగదారులకు మరియు ఉత్పత్తిదారులకు వస్తువుల మరియు సేవల యొక్క ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

ప్రభుత్వ ప్రమేయాలు రాయితీలు, పన్నులు మరియు టారిఫ్‌ లు, చట్టబద్దమైన సవరణలు మరియు కోటాలు వంటి నాన్-టారిఫ్ అడ్డంకులు, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (NAFTA) మరియు సెంట్రల్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (CAFTA) (వాటి పూర్వపు పేర్లకు విరుద్ధంగా) వంటి రెండు ప్రభుత్వాల ద్వారా నిర్వహింపబడు వాణిజ్య ఒప్పందాలు మరియు కృత్రిమ ధరలకు దారి తీసే ఏదైనా ప్రభుత్వ విపణి ప్రమేయాలు మొదలైనవి కలిగి ఉంటాయి.

స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క లక్షణాలు[మార్చు]

స్వేచ్చాయుత వాణిజ్యం దిగువ లక్షణాలు కలిగియుంటుంది[ఉల్లేఖన అవసరం]:

 • పన్నులు లేకుండా వస్తువుల యొక్క వాణిజ్యం (టారిఫ్‌లు కలిపి) లేదా ఇతర వాణిజ్య అడ్డంకులు (ఉదాహరణకు దిగుమతుల పై కోటాలు లేదా ఉత్పత్తిదారులకు రాయితీలు)
 • సేవల యొక్క వాణిజ్యం పన్నులు లేక ఇతర వాణిజ్య అడ్డంకులు లేకుండా
 • ట్రేడ్-డిస్‌టార్టింగ్ విధానాలు లేకుండుట (ఉదాహరణకు పన్ను లు, రాయితీ లు, సవరణలు లేక చట్టాలు). వీటి వల్ల కొన్ని పరిశ్రమలు, గ్రుహోపయోగాలు లేక ఉత్పత్తి కారకాలు ఇతరముల కంటే లాభదాయకంగా ఉంటాయి.
 • విపణిలకు స్వేచ్చాయుత ప్రవేశం
 • విపణి సమాచారమునకు స్వేచ్చాయుత ప్రవేశం
 • ప్రభుత్వముచే విధించబడిన మోనోపొలి లేక ఒలిగోపోలి యొక్క శక్తి ద్వారా విపణిని చిన్నాభిన్నం చేయడంలో పరిశ్రమల యొక్క అసమర్ధత
 • దేశంలో మరియు దేశాల మధ్య కార్మికుల యొక్క స్వేచ్చాయుత గమనము.
 • దేశంలో మరియు దేశాల మధ్య పెట్టుబడి యొక్క స్వేచ్చాయుత గమనం.

ప్రస్తుత పరిస్థితి[మార్చు]

మూడు సభ్య దేశాల కంటే ఎక్కువ ఉన్న ప్రస్తుత స్వేచ్చాయుత వాణిజ్య ప్రాంతాలు.
WTO రాయబారాల పరిస్థితి:[3] [4] [5] [6] [7] [8] [9]


ప్రపంచంలోని చాలా దేశాలు (అన్ని కాదు) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్[1] యొక్క సభ్యులు. (పటము చూడండి) ఈ సంస్థ టారీఫ్‌లు మరియు ఇతర వాణిజ్య అడ్డంకులను కొంతవరకు పరిమితము చేస్తుంది కాని వాటిని తొలగించదు. చాలా దేశాలు ప్రాంతీయ స్వేచ్చాయుత వాణిజ్యం పరిధులలో సభ్యులు. ఇవి సభ్యత్వ దేశాల మధ్యన వాణిజ్య అడ్డంకులను తగ్గిస్తాయి.

ఎన్నో రాష్ట్రాలు ఎంతో కొంత సంరక్షణాత్మకమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తాయి.[ఉల్లేఖన అవసరం]రాష్ట్రాలు ఉపయోగించే సర్వవ్యాపియైన సంరక్షణా విధానాలలో వ్యవసాయక రాయితీలు ఒకటి. వీటి ద్వారా దేశాలు తమ వ్యవసాయక పరిశ్రమలను బయటి పోటీ నుండి రక్షించుటకు వ్యవసాయ ఉత్పత్తులకు కృత్రిమమైన తక్కువ ధరలు సృస్టిస్తాయి.[ఉల్లేఖన అవసరం] స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాలు కస్టమ్స్ యునియన్ లు మరియు స్వేచ్చాయుత వాణిజ్య ప్రాంతాలకు ఎంతో కీలకమైనవి.

గణనీయమైన సమకాలీన వాణిజ్య అడ్డంకులు: కొనసాగుతున్న టారిఫ్ లు, దిగుమతి కోటాలు, అనుమతులు మరియు నిషేధాలు, చైనా యొక్క యాన్ U.S.డాలర్ కు ఉన్న మారక ద్రవ్య వ్యత్యాసాలు, అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయక రాయితీలు మరియు అమెరికా కొనుగోలు చట్టాలు.[ఉల్లేఖన అవసరం]చాలా దేశాలు విదేశీ విమానయాన సంస్థల యొక్క కాబొటేజ్ (ప్రయాణీకులను రెండు స్వదేశీ ప్రాంతాలకు తరలించడం)ను, విదేశీ ల్యాండింగ్ హక్కులను నిషేధించాయి. అయితే ఓపెన్ స్కైస్ ఒప్పందాలు చాలా సాధారణమైనాయి.[ఉల్లేఖన అవసరం]

సాన్ ఫ్రాన్సిస్కో బేలోని బే బ్రిడ్జ్ ను సమీపిస్తున్న ఒక దక్షిణ కొరియా కంటైనర్ ఓడ.

సాహిత్యంలో[మార్చు]

ఆడం స్మిత్ 1776లో ది వెల్త్ ఆఫ్ నేషన్స్లో స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క విలువను మొదట గుర్తించి దాని గురించిన పత్రం రాశారు.[2] ఆయన ఈ విధంగా రాసారు:

"వివేకవంతుడైన ప్రతి కుటుంబ పెద్ద చెప్పే సూత్రం ప్రకారం ఏదైతే కొనడం కంటే ఇంట్లో తయారు చేయుటకు ఎక్కువ ఖర్చు అవుతుందో దానిని ఇంట్లో తయారు చేసే ప్రయత్నం చేయకూడదు... ఒక పదార్ధమును మనము తయారు చేసుకునే కంటే విదేశం నుండి తక్కువ ఖర్చుతో దిగుమతి చేసుకోగలిగితే, ఆ దేశం నుండి దానిని కొనడం మంచిది. అయితే మన సొంత పరిశ్రమలోని ఉత్పత్తులను ఏదైనా లాభదాయకమైన పద్ధతిలో తప్పక ఉపయోగించాలాి".[3]

ఈ వాక్యము వర్తకవ్యాపార విధానాన్ని గణనీయమైన లాభము అనే సూత్రం సహాయంతో వ్యతిరేకిస్తుంది. వర్తకవ్యాపారము అనేది ఆ సమయంలో వాణిజ్యంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఆలోచన. ఈ రకమైన ఆలోచన ఒక దేశాన్ని దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని ఎక్కువ లాభాలు పొందమని సూచిస్తుంది.[4] స్మిత్ వాదన ప్రకారము తాము ఎక్కువగా చేయగలిగే వస్తు ఉత్పత్తి చేస్తూ వినియోగమునకు అవసరమైన వస్తువులకి ఇతర దేశాలతో వ్యాపారం చేస్తూ రెండు దేశాలు లాభపడగలవు. ఈ క్రమంలో ఎగుమతుల మరియు దిగుమతుల విలువలు ముఖ్యం కాదు కాని ఆ దేశం ఉత్పత్తి చేసే వస్తువులు చాలా విలువైనవి. ఒక దేశానికి వస్తువు యొక్క ఉత్పత్తి యందు ఎటువంటి లాభము లేని పరిస్థితిలో సంపూర్ణ లాభమనే ప్రసక్తి ఉండదు.[5]

ఈ సిద్ధాంతపరమైన సూత్రము తులనాత్మక ప్రయోజన సిద్ధాంతము ద్వారా తెలుపబడింది. 1817లో డేవిడ్ రికార్డో రచించిన ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్ [6]లో విశదీకరించిన ప్రకారం, ఒక వస్తువు యొక్క ఉత్పత్తి యందు నిర్దిష్ట ప్రయోజనము పై కాకుండా ఆ వస్తువు యొక్క ఉత్పత్తిలో ఉన్న రిలేటివ్ ఆపర్చునిటి కాస్ట్ పై స్వేచ్చాయుత వాణిజ్యము ఆధారపడి ఉంటుంది. ఒక దేశం తాను తక్కువ ఖర్చుతో చేయగల వస్తువు యొక్క ఉత్పత్తి యందు ప్రత్యేకత సాధించి, ఆ వస్తువు యొక్క వ్యాపారముతో తనకు అవసమైన వినియోగపు వస్తువులను కొనుగోలు చేయాలి. దీని వలన ఆ దేశాలకు ఏదైనా ఉత్పత్తి రంగంలో నిర్దిష్ట ప్రయోజనము లేకున్నప్పటికి వాణిజ్యంలో లాభాపడుటకు వీలు కలుగుతుంది. వాణిజ్యం నుండి వచ్చిన ఈ లాభాలు అన్ని వస్తువుల ఉత్పత్తిలో ముందు ఉన్న దేశం కంటే సమానము కానప్పటికీ అటార్కి స్థితిలో ఉన్న దాని కంటే వాణిజ్యంలో ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంటారు. [7][8]

స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క చరిత్ర[మార్చు]

స్వేచ్చాయుత వాణిజ్యము యొక్క సిద్ధాంతము వెలువడక ముందు మరియు ప్రస్తుతము దానికి వ్యతిరేకముగా కొనసాగుతున్న వర్తకవ్యాపార విధానము 16వ శతాబ్దంలో యూరోప్ లో మొదలయ్యింది. వర్తకవ్యాపారమునకు వ్యతిరేకులైన అప్పటి ఇద్దరు ఆర్థిక శాస్త్రవేత్తలుగా డేవిడ్ రికార్డో మరియు ఆడం స్మిత్ గుర్తించబడ్డారు.

కొన్ని నాగరికతలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు కారణం వాణిజ్యమేనని స్వేచ్చాయుత వాణిజ్యాన్ని బలపరిచిన ఆర్థిక శాస్త్రవేత్తల నమ్మకం. ఉదాహరణకు ఆడం స్మిత్ ప్రకారము ఈజిప్ట్, గ్రీస్ మరియు రోమ్ లు మాత్రమే కాకుండా బెంగాల్ (తూర్పు ఇండియా) మరియు చైనా యొక్క నాగరికతలు కూడా అభివృద్ధి చెందుటకు పెరిగిన వాణిజ్యమే కారణము. స్పెయిన్ యొక్క సార్వభౌమత్వ పరిపాలన తొలగింపు మరియు స్వేచ్చాయుత వాణిజ్య విధానము[9] అనుసరించడం వలన నెదర్‌ల్యాండ్స్ అత్యున్నత పురోగతి సాధించింది. తద్వారా శతాబ్దాలుగా స్వేచ్చాయుత వాణిజ్యం మరియు వర్తకవాణిజ్యం మధ్య వైరం ప్రధాన ప్రశ్నగా నిలిచింది. స్వేచ్చాయుత వాణిజ్య విధానాలు వర్తకవ్యాపారవేత్త, పరిరక్షణదారుడు, ఏకాంతవాది, కమ్యూనిస్ట్, పాపులిస్ట్ మరియు ఇతర విధానాలతో ఎన్నో శతాబ్దాలుగా పోరు సాగిస్తున్నాయి.

వాణిజ్యము పై ఎన్నో యుద్ధాలు జరపబడ్డాయి. ఉదాహరణకు ఎథెన్స్ మరియు స్పార్ట ల నడుమ పెలోపొంనేసియన్ యుద్ధం, చైనా మరియు గ్రేట్ బ్రిటన్ మధ్య ఓపియం యుద్ధాలు మరియు ఇతర కొలోనియల్ యుద్ధాలు. ఆదాయాన్ని పెంచుటకు, చిన్న పరిశ్రమలను రక్షించుటకు, ప్రత్యేక ఒత్తిడి మరియు 19వ శతాబ్దానికి ముందు వర్తకవ్యాపారములో నమ్మకము - వీటన్నిటి కారణంగా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు సంరక్షణావాదమును ఉపయోగించాయి.[ఉల్లేఖన అవసరం]

దస్త్రం:Punch Free Trade.jpg
పంచ్ కార్టూన్ (1906); బ్రిటీష్ సామ్రాజ్యములో స్వేచ్చాయుత వాణిజ్యమునకు అనుకూలముగా విధానాలు అనుసరించడము వలన భద్రతావాదంపై స్వేచ్చాయుత వాణిజ్యం గెలుపు సాధించింది.

సాంప్రదాయక లిబరల్స్ చాలా మంది, ముఖ్యంగా 19వ మరియు తొలి 20వ శతాబ్దంలో బ్రిటన్ (ఉదాహరణకు జాన్ స్టువర్ట్ మిల్) మరియు 20వ శతాబ్దానికి యునైటెడ్ స్టేట్స్ లో (ఉదాహరణకు కార్దేల్ హల్) స్వేచ్చాయుత వాణిజ్యం శాంతిని వృద్ధిచేస్తుందని నమ్మారు.[ఉల్లేఖన అవసరం] బ్రిటీష్ ఆర్థికశాస్త్రవేత్త అయిన జాన్ మేనార్డ్ కీన్స్ (1883-1946) ఈ నమ్మకము పై పెరిగాడు. ఇది 1919లో ట్రీటి ఆఫ్ వెర్సైలేస్ గురించి, అది పరస్పర ఆధారితమైన యురోపియన్ ఆర్థిక వ్యవస్థకు చేసిన చేటు పై అతను చేసిన విమర్శను అణిచివేసింది. తోలి 1930లలో సంరక్షణావాదము పై కొంత సంక్షిప్త చెణుకుల తరువాత ఆయన స్వేచ్చాయుత వాణిజ్యమును బలపరిచాడు. ఈ స్వేచ్చాయుత వాణిజ్యము అంతర్జాతీయంగా సహకారము అందుతున్న స్వదేశీ ఆర్థిక విధానాలతో కలిసి ఉన్నంత వరకు ఈ మద్దతు అందించాడు. ఇలా కలిసి ఉండటం ఉన్నత స్థాయి ఉద్యోగాల కల్పన సాధ్యపడుతుంది అని చెప్పాడు. దేశాల యొక్క ప్రయోజనాలు పరస్పరం దెబ్బతీయకుండా చూచు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను కూడా బలపరిచాడు. ఈ పరిస్థితులలో 'ఆడం స్మిత్ యొక్క వివేకము' మళ్ళీ వర్తిస్తుంది అని ఆయన అన్నారు.[ఉల్లేఖన అవసరం]

కిక్కింగ్ అవే ది లాడర్లో అభివృద్ధి ఆర్థికశాస్త్రవేత్త హా-జూన్ చాంగ్ స్వేచ్చాయుత వాణిజ్య విధానాల యొక్క చరిత్రను మరియు ఆర్థికాభివృద్ధిని పరిశీలించి ఇప్పటి పారిశ్రామిక దేశాలు ఎన్నో వాటి చరిత్రలో ప్రముఖ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. స్వేచ్చాయుత వాణిజ్యానికి ఇళ్లుగా చెప్పబడే యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్ లు సంరక్షణావాదులే. బ్రిటన్ తన సంరక్షణావాదాన్ని 1850లో అది సాంకేతికంగా ఆధిక్యత సాధించిన తరువాత, కార్న్ చట్టము కొట్టివేయబడిన తరువాత విడిచిపెట్టింది. అయితే తయారుచేయబడ్డ ఉత్పత్తుల పై టారిఫ్‌లు 1950 నాటికి తిరిగి 23% వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ తయారైన ఉత్పత్తుల పైన సగటు టారిఫ్‌లు సుమారు 40-50% వరకు విధించింది. ఇది 19వ శతాబ్దం నాటికి అధిక రవాణా ఖర్చుల యొక్క సంరక్షణావాదము వలన పెరిగింది.[10] స్వేచ్చాయుత వాణిజ్యమును నిలకడగా ఉపయోగించిన దేశాలు స్విట్జెర్లాండ్, ది నెదర్లాండ్స్ మరియు కొద్దిగా తక్కువగా ఉపయోగించిన దేశం బెల్జియం.[11] ఏషియన్ టైగర్స్ యొక్క ఎగుమతి ప్రధాన పారిశ్రామీకరణ విధానాలను చాంగ్ "చారిత్రిక సమముల కంటే ఎంతో కుతర్కమైనవి మరియు అభివృద్ధి చేయబడినవి" అని అభివర్ణించారు.[12]

సంరక్షణావాదము కొంత శాతం ప్రపంచం అంతటా ఉంది. అభివృద్ధి చెందిన ఎన్నో దేశాలలో వివాదాస్పదమైన వ్యవసాయ టారిఫ్‌లు అనుసరించబడుతున్నాయి. 1820 నుండి 1980 మధ్య కాలంలో, పన్నెండు పారిశ్రామిక దేశాలలో ఉత్పత్తిదారుల పై ఉన్న సగటు టారిఫ్ లు 11 నుండి 32% మధ్య ఉండేది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉత్పత్తి అయిన వస్తువుల పై సగటు టారిఫ్‌లు సుమారు 34%.[13]

ప్రస్తుతము ప్రపంచ బ్యాంకు నమ్మిక ప్రకారము అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధ్యమైనంత వరకు 20% రేట్లు అనుమతించవచ్చు. కాని హా-జూన్ చాంగ్ నమ్మిక ప్రకారము ఎక్కువ స్థాయిలు కూడా న్యాయ సమ్మతమే ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాల మధ్య ఉత్పాదకతా వ్యత్యాసము పారిశ్రామిక దేశాలు ఎదుర్కొన్న ఉత్పాదకతా వ్యత్యాసము కంటే చాలా ఎక్కువ. (ఒక సాధారణ లక్షణము ఏమిటంటే ఇప్పటి అభివృద్ధి చెందని దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి సాంకేతిక స్థాయిలో ఒకప్పుడు ఉన్న పరిస్థితి వలె, లేవు . ఎందుకంటే ఈ పోటీ వ్యవస్థలో వారు బలహీన ఆటగాళ్లే. అభివృద్ధి చెందిన దేశాలు ఇంతకు ముందు తక్కువ స్థాయిలోనైనా కూడా బలవంతమైన ఆటగాళ్లే.) ఒకవేళ టారిఫ్‌ల యొక్క ముఖ్య ఉద్దేశము చిన్న పరిశ్రమలను ఉత్తేజపరచడమే అయితే, ఆ టారిఫ్‌ విజయవంతము అవడానికి స్వదేశీ తయారి వస్తువులు పోటీ పడే విధంగా ఎక్కువగా ఉండాలి. ఇంపోర్ట్ సబ్స్టిట్యుషన్ ఇండస్ట్రియలైజేషన్ అనబడే ఈ సిద్ధాంతము ఇప్పటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిరుపయోగంగా పరిగణించబడుతుంది.[14] ప్రపంచ బ్యాంకు యొక్క పరిశీలనలలో తెలిపిన విధంగా ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ ఇండస్ట్రియలైజేషన్ విధానాలు అధిక ఆర్థిక అభివృద్ధిని ఇస్తాయి. దీనికి ఫోర్ ఏషియన్ టైగర్స్ ఉదాహరణలుగా చెప్పవచ్చు.[ఉల్లేఖన అవసరం] ఈ బేరీజులు ముఖ్యంగా కోరిలేషన్స్ యొక్క సిద్ధాంతము మరియు పరిశీలనాత్మక అధ్యయనం పై ఆధారపడి ఉన్నాయి. ఈ కారణంగా ఇవి చిన్న నమూనా పరిమాణము మరియు వివిధ వేరియబుల్స్ (దిగువ ఇవ్వబడిన క్రిటికల్ రివ్యు విభాగం చూడండి) వంటి ఎన్నో బలహీనతల వలన బాధపడుతాయి.

ది యునైటెడ్ స్టేట్స్ మరియు స్వేచ్చాయుత వాణిజ్యం[మార్చు]

దస్త్రం:Freetradeclipper.jpg
స్వేచ్చాయుత వాణిజ్య క్లిప్పర్ షిప్

కొలోనియల్ అమెరికాలో వాణిజ్యము ఆక్ట్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ నావిగేషన్ ద్వారా బ్రిటీషు వర్తక వ్యవస్థచే క్రమబద్దీకరించబడింది. 1760ల వరకు కొంతమంది సామ్రాజ్య వాదులు స్వేచ్చాయుత వాణిజ్యం గురించి బహిరంగంగానే సూచించేవారు. ఎందుకంటే క్రమబద్దీకరణలు కచ్చితంగా అమలు చేయబడేవికావు--న్యూ ఇంగ్లాండ్ స్మగ్లింగ్ కు పేరుగాంచింది--ఇంకొక కారణమేమిటంటే సామ్రాజ్యవాద వర్తకులు విదేశీ వస్తువులు మరియు షిప్పింగ్ తో పోటీ పడుటకు ఇష్టపడే వారు కాదు. చరిత్రకారుడైన ఒలివర్ డికర్సన్ ప్రకారము అమెరికన్ విప్లవమునకు స్వేచ్చాయుత వాణిజ్యము పట్ల ఇష్టము ఒక కారణము కాదు. డికర్సన్ వ్రాసిన ప్రకారం పద్దెనిమిదవ శతాబ్దమునకు చెందిన వ్యాపారస్తుల ప్రాథమిక వర్తక సూత్రాలు తప్పు అన్న అభిప్రాయము విప్లవ నాయకుల ఆలోచనా ధోరణిలో ఒక భాగము కాదు.[15] అమరికన్ విప్లవాత్మక యుద్ధం ఫలితంగా ఏర్పడ్డ యునైటెడ్ స్టేట్స్ కు స్వేచ్చాయుత వాణిజ్యము విస్తరించింది. ఇది బ్రిటీష్ పార్లమెంటు కొలోనియల్ పోర్టులను అడ్డుకునే నిషేధ చట్టాన్ని విడుదల చేసిన సమయంలో జరిగింది. కాంటినెంటల్ కాంగ్రెస్ ప్రతిస్పందించి ఆర్థిక స్వాతంత్ర్యము ప్రకటించి 1776, ఏప్రిల్ 6న అమరికన్ ఓడరేవులను విదేశీ వాణిజ్యమునకు తెరచాయి. చరిత్రకారుడు జాన్ W.టైలర్ ప్రకారము "ఇష్టము ఉన్నా లేకున్నా, అమెరికన్ల పై స్వేచ్చాయుత వాణిజ్యము విధించబడింది".[16]

మొదటి U.S. సెక్రెటరి ఆఫ్ ది ట్రెషరి, అలెక్సాండర్ హామిల్టన్ తను వ్రాసిన "రిపోర్ట్ ఆన్ మ్యానుఫాక్చర్స్"లో టారిఫ్‌లు చిన్న పరిశ్రమలను రక్షించేవిగా సూచించారు. "జెఫ్ఫార్సోనియన్స్" ఎక్కువ భాగము వ్యతిరేకించినా కూడా ఇది అల్పసంఖ్యాకముగా ఉంది. తరువాత 19వ శతాబ్దంలో సెనేటర్ హెన్రి క్లే వంటి వారు హామిల్టన్ యొక్క సిద్ధాంతాలను "అమెరికన్ సిస్టం" పేరుతో విగ్ పార్టిలో కొనసాగించారు. ప్రత్యర్ధ సదరన్ డెమొక్రటిక్ పార్టీ 1830లలో, 1840లలో, మరియు 1850లలో కొంత భాగంలో సుంకాల యొక్క సమస్య మీద మరియు పరిశ్రమ యొక్క సంరక్షణ కొరకు అనేక ఎన్నికలలో పోటీ చేసింది. డెమోక్రటిక్ పార్టీ సామాన్య టారిఫ్‌లను ప్రభుత్వ ఆదాయం కొరకు మాత్రమే ఉపయోగించేది కాని విగ్‌లు అనుకూల పరిశ్రమలను రక్షించేందుకు అధిక సంరక్షణా టారిఫ్‌లను బలపరిచారు. ఆర్థికశాస్త్రవేత్త హెన్రి చార్లెస్ కారే "అమెరికన్ సిస్టం" ఆఫ్ ఎకనామిక్స్ కు ముఖ్య మద్దతుదారుగా మారారు. ఆండ్రూ జాక్సన్, మార్టిన్ వాన్ బురెన్, జేమ్స్ కే.పొక్, ఫ్రాన్క్లిన్ పియర్స్ మరియు జేమ్స్ బుచానన్లు సభ్యులైన డెమాక్రటిక్ పార్టీ ఈ "అమెరికన్ సిస్టం" అనే వర్తకవ్యాపారాన్ని వ్యతిరేకించింది.

తనని తాను హెన్రి క్లే టారిఫ్ విగ్ గా పిలుచుకునే అబ్రహాం లింకన్ సారథ్యం వహించిన రిపబ్లికన్ పార్టీ స్వేచ్చాయుత వాణిజ్యమును వ్యతిరేకించింది. సివిల్ వార్ సమయంలో రైలురోడ్డు రాయితీలు కట్టుటకు, యుద్ద ప్రయత్నమునకు మరియు అనుకూల పరిశ్రమల సంరక్షణకు 44 శాతము టారిఫ్‌ను విధించాడు.[17] రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఉన్న పరిస్థితిని ప్రెసిడెంట్ విలియం మెక్‌కిన్లే ఈ క్రింది విధంగా చెప్పారు (రిపబ్లికన్ పార్టీ 1912 వరకు ప్రెసిడెంట్ పదవి కోసం జరిగిన ఎన్నికలలో ప్రతిసారి గ్రోవేర్ క్లీవ్లాండ్ వచ్చినప్పుడు తప్ప గెలిచింది):

"స్వేచ్చా వాణిజ్యంలో వర్తకుడే అధీశుడు మరియు ఉత్పత్తిదారుడే దాసుడు. రక్షణ అనేది ప్రాకృతికంగా ఉన్న చట్టం, స్వీయ-రక్షణ చట్టం, స్వీయ-అభివృద్ధి చట్టం, మనిషి అత్యున్నత గమ్యం పొందడానికి సహకరించునది. [ఇలా చెప్పబడింది] ఈ సంరక్షణ అనైతికమైనది... ఎందుకు....ఒకవేళ సంరక్షణ పెరిగి 63,000,000 [U.S. జనాభా] మందికి ఉన్నత స్థితికి తెస్తే మరియు 63,000,000 మంది యొక్క ప్రభావం మిగిలిన ప్రపంచంలోని ప్రజలను ఉన్నత స్థితికి తీసుకువస్తే. పురోగతి మార్గంలో మానవజాతికి ప్రతిచోటా లాభదాయకం కాని చర్యను మనం తీసుకోలేము. వారు చెప్తారు, ‘మీరు బాగా చవకగా ఎక్కడ దొరుకుతుందో అక్కడ కొనవచ్చు'…. అయిననూ, ప్రతిదాని లాగానే అది కార్మికులకు కూడా వర్తిస్తుంది. దీనికన్నా వెయ్యి రెట్లు మంచిదైన ఒక సూత్రాన్ని నన్ను మీకు ఇవ్వనీయండి. అది సంరక్షణ సూత్రం: ‘సులభతరంగా మీరు ఎక్కడ కొనగలరో అక్కడ కొనండి.' భూమి మీద ఎక్కడ కార్మికులు గెలుస్తారో అక్కడ అత్యంత అధిక నజరానా ఇవ్వబడుతుంది."[18]

ఇంకొక ప్రక్క:

పెరుగుతున్న స్వేచ్చాయుత వాణిజ్య సంచలనం తమ వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తూ టారిఫ్‌లకు మరియు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అవినీతికి స్వస్తి పలికాయి. ఇది చాలా రకములైన ప్రభావాలను చూపింది. అన్నిటికంటే ముఖ్యమైనది గ్రోవేర్ క్లేవ్లాండ్ మంత్రిగా ఉన్న డెమాక్రటిక్ పార్టి యొక్క ఎదుగుదల. తరువాత ముఖ్యమైనది రిపబ్లికన్ పార్టిలో మగ్‌వంప్ ల యొక్క ఎదుగుదల. జేఫ్ఫర్సోనియాన్ తిరుగుబాటుదారులు ఎంతో దూరం ముందుకు కొనసాగలేకపోయారు, పైగా వారి ప్రయత్నం ప్రభావంతంగా లేదు కాబట్టి ప్రత్యామ్నాయాల కోసం చూశారు.

తిరుగుబాటు జేఫ్ఫర్సోనియన్ల మొదటి ముఖ్య సంచలనము ఫైర్ బ్రాండ్ అయిన ఒక యువ విలేఖరి హెన్రి జార్జ్ - కెన్నెత్ ఆర్.గ్రెగ్, జార్గ్ మాసన్ యునివర్సిటి హిస్టరీ న్యూస్ నెట్వర్క్ యొక్క ఆలోచనల నుండి మొదలయ్యింది.[ఉల్లేఖన అవసరం]

ఆ తరువాత టారిఫ్ మరియు సంరక్షణకు మద్దతు ద్వారా అవస్థాపన సౌకర్యాల పెరుగుదల మరియు జాతి పారిశ్రామీకరణ రిపబ్లిక్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమయ్యింది. ఈ పరిస్థితి యైసేన్హోవర్ అడ్మినిస్ట్రేషన్ మరియు కోల్డ్ వార్ మొదలు వరకు కొనసాగింది. అప్పుడు డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీల యొక్క స్థానాలు మారాయి.[ఉల్లేఖన అవసరం]

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత నుండి, పారిశ్రామిక ఆధిపత్యం సాధించాలానే కోరికతో మరియు కోల్డ్ వార్ ప్రవేశం వలన తగ్గించిన టారిఫ్ అడ్డంకులకు మరియు స్వేచ్చాయుత వాణిజ్యమునకు U.S. ప్రభుత్వం ముఖ్యమైన మద్దతుదారుగా అవతరించింది. దీని కారణంగానే జనరల్ అగ్రీమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ (GATT) మరియు తరువాతి కాలంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) స్థాపనకు సహకరించింది (1950లలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ITO) స్థాపనకు వ్యతిరేకించినప్పటికీ కూడా).[ఉల్లేఖన అవసరం] 1970ల నుండి U.S. ప్రభుత్వము ఎన్నో వాణిజ్య ఒప్పందాలను నిర్వహించింది. ఉదాహరణకు 1990లలో నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ (NAFTA), 2006లో ది డొమినికన్ రిపబ్లిక్ సెంట్రల్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ (CAFTA) మరియు ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు (జోర్డాన్తో చేసిన ఒప్పందం)వంటివి.[ఉల్లేఖన అవసరం]

స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క ఆర్ధికశాస్త్రం[మార్చు]

ఆర్ధిక మాతృకలు[మార్చు]

డేవిడ్ రికార్డో యొక్క తులనాత్మక ప్రయోజన పద్ధతి మరియు టారిఫ్ లేక దిగుమతి కోట యొక్క ప్రభావ విశ్లేషణ - ఇవి రెండు స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క లాభాలు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే మార్గాలు. స్వేచ్చాయుత వాణిజ్యము యొక్క సిద్ధాంతపరమైన లాభాలను మరియు నష్టాలను చూపించుటకు సరఫరా మరియు గిరాకి సూత్రము మరియు పన్ను యొక్క ఆర్థిక ప్రభావాలను ఉపయోగించవచ్చు.[19][20]

టారిఫ్ ఉండటం వలన సమాజానికి ఏర్పడిన నికర నష్టము గులాబి ప్రాంతం సూచిస్తుంది.

టారిఫ్‌ల యొక్క ఉపయోగాలు[మార్చు]

ఈ రేఖచిత్రము టారిఫ్‌ల యొక్క ప్రయోజనాలను స్వదేశీ పరిశ్రమలను సంరక్షించే మార్గాలుగా చూపిస్తుంది. ఒకవేళ జపాను p టారిఫ్ పై విడ్జెట్లను ఉత్పత్తి మరియు అమ్మకం చేయగల ఒక స్వదేశీ పరిశ్రమను పరిరక్షించాలాని అనుకుంటే. ఇటువంటి విడ్జెట్లను p వరల్డ్ ధరకే ఎగుమతి చేసే ఇతర దేశాలు ఉండటం వలన, ఈ విడ్జెట్లను ఎటువంటి టారిఫ్ లేకుండా తమ దేశంలోనికి దిగుమతి చేసుకుంటే జపాన్ పరిశ్రమ వ్యాపారము నుండి వైదొలగవలసిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఈ రేఖాచిత్రం చూపిస్తున్న విధంగా p టారిఫ్ సరఫరా మరియు గిరాకి రేఖల ఖండన బిందువుకు ఎగువకు చేరనంత వరకు, సరఫరా యొక్క కొరతలు మరియు గిరాకి ఆధిక్యత లేని ఒక సమతౌల్య పరిస్థితిని చేరవచ్చు. దీని వలన జపాన్ వినియోగదారులు విడ్జెట్లను ఇతర దేశాల మాదిరిగానే పొందవచ్చు.[20][21]

ఈ సందర్భంలో, పెరిగిన ధర స్వదేశీ ఉత్పత్తిని Q S1 నుండి Q S2కు పెంచదు. ఎందుకంటే మనము ముందుగా చెప్పుకున్నట్లు ఇతర దేశాలు P వరల్డ్ ధరకు ఉత్పత్తి చేసే విడ్జెట్లను జపాన్ P టారిఫ్ ధరకు అంతే విడ్జెట్లను ఉత్పత్తి చేస్తుంది. టారిఫ్ యొక్క ప్రభావము చేత దిగుమతులు పరిమితం చేయబడి స్వదేశంగా ఉత్పత్తి చేయబడ్డ విడ్జెట్లకు గిరాకి పెంచుతాయి. అయితే దీని వలన వినియోగ ధరలు ప్రభావితం కావు. రేఖాచిత్రం చూపించిన విధంగా సరఫరా మరియు గిరాకి వక్ర రేఖల ఖండన బిందువుకు ఎడమవైపు ఉన్న పరిమాణములకు గాను వినియోగదారులు విపణిలోనికి వచ్చిన ఏవైనా విడ్జెట్లను కొనుగోలు చేస్తారు. జపానులో ఒకసారి విడ్జెట్ల యొక్క దిగుమతి చేసుకొన్న మరియు స్వదేశి సరఫరా Q S2 స్థాయికి చేరితే ఇక జపాను పరిశ్రమను పరిరక్షించేందుకు టారిఫ్ అవసరము ఉండదు. ఎందుకంటే విపణి ప్రాబల్యము వలన స్వదేశి మరియు ప్రపంచ ధరలు సమానమౌతాయి మరియు జపాన్ విజిట్టు యొక్క విపణి ధర ఉత్పత్తిదారులను వ్యాపారములో కొనసాగుటకు తోడ్పడుతుంది.[22]

"సొషియెటల్ లాస్" అని పేర్కొనబడిన గులాబి ప్రాంతము ఈ పరిస్థితిలోకి వర్తించదు.

టారిఫ్‌ల యొక్క నిస్ప్రయోజనాలు.[మార్చు]

కుడి ప్రక్కనున్న పటము కొన్ని ఊహాత్మక వస్తువుల పై దిగుమతి టారిఫ్ విధింపు వలన ప్రభావము విశ్లేషిస్తుంది. P వరల్డ్ అనేది టారిఫ్ మునుపు ప్రపంచ విపణిలో (తద్వారా స్వదేశి విపణిలో) వస్తువు యొక్క ధర. టారిఫ్ వలన స్వదేశి ధర P టారిఫ్కు పెరుగుతుంది. పెరిగిన ధరలు స్వదేశి ఉత్పత్తిని Q S1 నుండి Q S2కు పెంచుతాయి. దీనితో స్వదేశి వినియోగం Q C1 నుండి Q C2కు తగ్గుతుంది. సాంఘిక సంక్షేమం పై ఇది మూడు ముఖ్య ప్రభావాలు కలిగిస్తుంది. వినియోగ మిగులు (ఆకుపచ్చ ప్రాంతము) తగ్గిపోవడం వలన వినియోగదారులు ఇంకా అధ్వాన్న పరిస్థితికి వస్తారు. ఉత్పత్తి మిగులు (పసుపు ప్రాంతము) పెరగడం వలన ఉత్పత్తిదారులు మంచి స్థితిలో ఉంటారు. ప్రభుత్వమునకు కూడా అదనపు పన్నుల ఆదాయం (నీలి రంగు ప్రాంతము) ఉంటుంది. అయితే ఉత్పత్తిదారుల మరియు ప్రభుత్వము యొక్క లాభాల కంటే వినియోగాదారుల నష్టమే ఎక్కువ. ఈ సాంఘిక నష్టము యొక్క స్థూలత్వము రెండు గులాబి త్రికోణాల ద్వారా చూపించబడింది. టారిఫ్‌ను తొలగించి స్వేచ్చాయుత వాణిజ్యమును ప్రోత్సహించడము వలన సమాజానికి నికర లాభము చేకూరుతుంది.[22][23]

దేశ నికర ఉత్పత్తికి సంబంధించి టారిఫ్ గురించిన ఇంచుమించు ఇటువంటి తద్రూప విశ్లేషణ సమాంతర ఫలితాలు ఇస్తుంది. దేశానికి సంబంధించి, టారిఫ్ ఉత్పత్తిదారులను అధ్వాన్న పరిస్థితిలో మరియు వినియోగదారులను ఉన్నత స్థితిలోనూ ఉంచుతుంది కాని ఉత్పత్తిదారులకు కలిగే నష్టము వినియోగదారులకు వచ్చే లాభము కంటే ఎంతో ఎక్కువ (ఈ స్థితిలో విశ్లేషించబడిన దేశము టారిఫ్ వసూలు చేయనందున పన్ను సంబంధిత ఆదాయం ఉండదు). ఇటువంటి ఒకేరకమైన విశ్లేషణలలో, ఎగుమతి టారిఫ్‌లు, దిగుమతి కోటాలు మరియు ఎగుమతి కోటాలు అన్నీ ఇంచుమించు ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి. కొన్నిసార్లు వినియోగదారులు ఉన్నత స్థితిలో మరియు ఉత్పత్తిదారులు అధ్వాన్న పరిస్థితిలో ఇంకొన్నిసార్లు వినియోగదారులు అధ్వాన్న పరిస్థితిలో మరియు ఉత్పత్తిదారులు ఉన్నత స్థితిలో ఉంటారు కాని వాణిజ్య ప్రతిబంధకాలు విధించడం సమాజానికి నష్టము కలిగిస్తుంది. ఎందుకంటే వాణిజ్య ప్రతిబంధకాల నుండి కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ. స్వేచ్చాయుత వాణిజ్యం విజేతలను మరియు పరాజితులను తయారుచేస్తుంది కానీ సిద్ధాంత ప్రకారంగా మరియు అనుభవపూర్వక ఋజువులు తెలిపే విధంగా స్వేచ్చాయుత వాణిజ్యం వలన కలిగే విజయాల పరిమాణం నష్టాల పరిమాణం కంటే పెద్దది.[19]

వాణిజ్య మళ్లింపు[మార్చు]

మెయిన్‌స్ట్రీమ్ ఆర్థిక సిద్ధాంతము ప్రకారము, భౌగోళిక స్వేచ్చాయుత వాణిజ్యము సమాజానికి లాభదాయకమైనది. అయితే కొన్ని దేశాలకు వర్తించే ఎంపిక చేయబడ్డ స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాలు మరియు ఇంకొన్ని దేశాల పై టారిఫ్‌లు కొన్నిసార్లు వాణిజ్య మళ్లింపుల ద్వారా ఆర్థిక అసమర్ధతకు దారితీస్తుంది. ఒక వస్తువు తక్కువ ఉత్పత్తి ఖర్చు ఉన్న దేశములో ఉత్పత్తి చేయడము ఆర్థికముగా ప్రయోజనము కలిగియుంటుంది కాని అధిక ఖర్చు ఉత్పత్తిదారుడు స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందము కలిగియున్నా మరియు తక్కువ ఖర్చు ఉత్పత్తిదారుడు అధిక టారిఫ్‌లు ఎదుర్కొంటున్నా ఇది సాధ్యపడదు. అధిక ఖర్చు ఉత్పత్తిదారునికి స్వేచ్చాయుత వాణిజ్యం వర్తింపజేయడం వలన (తక్కువ ఖర్చు ఉత్పత్తిదారునికి కాకుండా) వాణిజ్య మళ్లింపులకు తద్వారా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఈ కారణంగానే ఎంతోమంది ఆర్థికశాస్త్రవేత్తలు భౌగోళిక టారిఫ్ తగ్గింపులకు జరిపే రాయబారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఉదాహరణకు దోహా రౌండ్.[19]

వకాల్తా సంఘాల అభిప్రాయం[మార్చు]

స్వేచ్చాయుత వాణిజ్య సంఘము యొక్క వాదన ప్రకారము:

"సంరక్షణా వాదము పేదరికాన్ని సృష్టిస్తుంది కాని సంపన్నతని కాదు. సంరక్షణావాదము స్వదేశీ ఉద్యోగాలను లేక పరిశ్రమలను "సంరక్షించదు"; ఎగుమతి పరిశ్రమలు మరియు తమ వస్తువులను తయారు చేయుటకు దిగుమతుల పై ఆధారపడే పరిశ్రమలకు హాని కలిగించి వాటిని నాశనము చేస్తుంది. ప్రాంతీయ ఉక్కు పరిశ్రమలను "పరిరక్షించుటకు" ఉక్కు యొక్క ప్రాంతీయ ధరలను పెంచడం కార్ల యొక్క మరియు ఉక్కు ద్వారా తయారయ్యే ఇతర వస్తువుల ఉత్పత్తి ఖర్చును పెంచుతుంది. సంరక్షనావాదము ఒక అవివేకి ఆట."

ఆర్ధికశాస్త్రవేత్తల యొక్క అభిప్రాయము[మార్చు]

స్వేచ్చాయుత వాణిజ్యము యొక్క ఆర్థికశాస్త్రమును విశ్లేషించే సాహిత్యము సిద్ధాంతపరమైన మరియు అనుభవపూర్వక విశ్లేషణలతో ఎంతో గొప్పగా వ్రాయబడింది. U.S.లోని ఆర్థికరంగ వృత్తి సభ్యుల యొక్క విశాలమైన ఏకాభిప్రాయము ప్రకారము స్వేచ్చాయుత వాణిజ్యము విజేతలను మరియు పరాజితులను సృష్టించినను అసందిగ్ధముగా సమాజానికి అది లాభదాయకమే.[24] [25] అమెరికా ఆర్థికశాస్త్రవేత్తలు 2006లో జరిపిన సర్వేలో (83 ప్రతిస్పందనలు), "87.5% మంది U.S. మిగిలిన టారిఫ్‌లను మరియు వాణిజ్యమునకు ఇతర అడ్డంకులను తొలగించాలాని" మరియు "90.1% మంది ప్రజలు U.S. తన దేశంలోని యజామానులు విదేశాలకు పనిని ఔట్‌సోర్స్ చేయకూడదనే అభిప్రాయంతో విభేదించారు."[26]

హార్వర్డ్ ప్రొఫెసర్ అయిన యన్.గ్రెగరీ మాన్కివ్ చెప్పిన ప్రకారం, "కొన్ని ప్రపోజీషన్లు వృత్తిపరమైన ఆర్ధిక శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయాన్ని ఆదేశిస్తాయి. ఇవి బహిరంగ ప్రపంచ వాణిజ్యాన్ని ఆర్ధిక అభివృద్ధి మరియు జీవన శైలిని పెంచే విధంగా ఉంటాయని వారి అభిప్రాయము."[27] మాలర్దాలేన్ యునివర్సిటి, స్వీడెన్ కు చెందిన ప్రొఫెసర్.పీటర్ సోడర్బాం చెప్పిన ప్రకారము, "ఈ ఆధునిక వాణిజ్య సిద్ధాంతము ఒకే విషయం పై దృష్టి కేంద్రీకరిస్తుంది. అంటే ఒక వస్తువు లభ్యమయ్యే ధర పై గురిపెడుతుంది. ఇది వివిధ దేశాలలోని ఉద్యోగావకాశాలు, పర్యావరణ అంశాలు మరియు సంస్కృతి వంటి ఎన్నో విషయాలను పరిగణించదు." [28]

ఎంతో మంది స్వేచ్చాయుత వాణిజ్య వర్తుకులు ఒప్పుకున్నట్టుగా, పెరుగుతున్న కొలవదగ్గ లాభాలు అంటే కంపారిటివ్ ప్రయోజనం వలన వచ్చిన ఎటువంటి బలమైన ఆర్థిక కారణము లేకపోయినా, ఒక పరిశ్రమ భౌగోళికంగా స్థిరపడగలదు. ఇది స్వేచ్చాయుత వాణిజ్యమునకు వ్యతిరేకంగా వాదించడానికి కారణం కాదు. ఎందుకంటే "విజేతలు" మరియు "పరాజితులు" అనుభవించే నిర్దిష్ట ఫలితాంశ స్థాయి "విజేతలు" "పరాజితుల" కంటే ఎక్కవ లాభాపడేటట్టు చేస్తుంది. ఈ లాభం అంతకు ముందు ఉన్న నిర్దిష్టమైన స్థాయి కంటే ఎక్కువ ఉంటుంది.

అయినప్పటికీ, స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క లాభాలను మరియు వాటి పరిధిని ప్రశ్నించే ఆర్థికశాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు. ఇన్ఫాంట్ ఇండస్ట్రీ ఆర్గ్యుమెంట్ అనేది స్వేచ్చాయుత వాణిజ్యం గురించి ఎంతో కాలంగా ఉన్న ఆర్థిక విమర్శ. దీనికి మొదటిసారిగా 1790లలో మొదటి యునైటెడ్ స్టేట్స్ రాష్ట్ర కార్యదర్శి అయిన అలెక్సాండర్ హామిల్టన్ ప్రచారం కల్పించారు.[ఉల్లేఖన అవసరం] ఈ వాదన ప్రకారం, సంరక్షణావాదము కొత్తగా మొదలైన పరిశ్రమల యొక్క అభివృద్ధికి అవసరమవుతుంది. ఎందుకంటే వారి పోటీదారులు ప్రముఖ ఆర్థిక కొలమానాలను ఉపయోగిస్తూనే ఉంటారు. ఈ కొలమానాలు ఆ పరిశ్రమ యొక్క పరిమాణాన్ని బట్టి లేక చాలా కాలము నుండి ఏర్పడ్డ అభివృద్ధికి సంబంధించి ఉంటాయి.[29] సంరక్షణావాదము యొక్క రూపమైన దిగుమతైన ప్రత్యామ్నాయ పారిశ్రామీకరణ అనేది ఈ విమర్శ పై ఆధారపడ్డ ఒక విధానము.

ప్రత్యర్థి[మార్చు]

అకెడమిక్స్, ప్రభుత్వాలు మరియు ఉత్సాహవంతులైన సంఘాలు, రిలేటివ్ ఖర్చులు, స్వేచ్చాయుత వాణిజ్యం యొక్క ప్రయోజనాలు మరియు ప్రయోజనం పొందినవారితో చర్చిస్తారు.

సంరక్షణావాదము పై వాదనలు ఆర్థిక విభాగానికి (వాణిజ్యము ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది) లేదా నైతిక విభాగానికి (వాణిజ్యము యొక్క ప్రభావాలు ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయి, కాని మిగతా ప్రాంతాలలో చెడు ప్రభావాలు ఉంటాయి) చెందుతాయి; స్వేచ్చాయుత వాణిజ్యమునకు వ్యతిరేకంగా ఉన్న ఒక వాదన ఏమిటంటే అది మారువేషంలో ఉన్న కోలోనియలిజం లేక సామ్రాజ్యవాదము. నైతిక విభాగము చాలా విస్తృతమైనది. దీనిలో ఆదాయ అసమానతలు, పరిసరాల స్థాయిని తగ్గించడం, బాలకార్మికులు మరియు స్వీట్ షాప్స్, రేస్ టు ది బాటం, వేతన బానిసత్వం, పేద దేశాలలో దరిద్రాన్ని లెక్కించడం, జాతీయ రక్షణకు హానిచేయడం మరియు సాంస్కృతిక మార్పుకు బలవంతం చేయడం వాటివి ఉంటాయి.[30]

స్వేచ్చాయుత వాణిజ్యం తరచూ స్వదేశీ పరిశ్రమలచే వ్యతిరేకించబడుతుంది. ఎందుకంటే దాని వలన వారి లాభాలు మరియు వ్యాపారము యందు భాగము దిగుమతి చేసుకున్న వస్తువుల యొక్క ధరలు తగ్గడంతో తగ్గించబడుతుంది[31][32]. ఉదాహరణకు, చక్కర పై యునైటెడ్ స్టేట్స్ యొక్క టారిఫ్‌లు తగ్గించబడితే, U.S. చక్కర ఉత్పత్తిదారులు తక్కువ ధరలు మరియు లాభాలు పొందుతారు. అయితే U.S. చక్కర వినియోగదారులు ఈ తగ్గిన ధరల వలన అదే మోతాదు చక్కర కోసం తక్కువ ఖర్చు చేస్తారు. డేవిడ్ రికార్డో యొక్క ఆర్థిక సిద్ధాంతము ప్రకారము ఉత్పత్తిదారులు నష్టపోయే దానికన్నా వినియోగదారులు పొందే లాభమే ఎక్కువ.[33][34] ప్రతి ఒక్క స్వదేశీ చక్కర ఉత్పత్తిదారుడు చాలా నష్టపోతాడు కాని ఎంతో మంది వినియోగదారులు చాలా కొంచెం మాత్రమే లాభపడతారు. ఈ కారణంగా ఉత్పత్తిదారులు టారిఫ్‌లు ఎత్తివేయడానికి వ్యతిరేకంగా పోరాడతారు.[32] సాధారణంగా ఉత్పత్తిదారులు తమ దేశంలో దిగుమతుల పై స్వదేశీ రాయితీలు మరియు టారిఫ్‌లకు మద్దతుగా ఉంటారు. వీరు ఎగుమతి విపణులలో రాయితీలు మరియు టారిఫ్‌లను వ్యతిరేకిస్తారు.

సోషలిస్టులు తరచుగా స్వేచ్చాయుత వాణిజ్యమును వ్యతిరేకిస్తారు. వీరి అభిప్రాయము ప్రకారము స్వేచ్చాయుత వాణిజ్యము పెట్టుబడి ద్వారా అత్యధికంగా కార్మికుల ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తుంది. ఉదాహరణకు కారల్ మార్క్స్ ది కమ్యునిస్ట్ మానిఫెస్టోలో, ""ది బూర్జుఒసీ ...హస్ సెట్ అప్ తట్ సింగిల్, అన్కన్సియనబుల్ ఫ్రీడం---ఫ్రీ ట్రేడ్ అని రచించాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం, మతపరమైన మరియు రాజకీయ భ్రాంతులతో కప్పి వేయడంతో ఇది నగ్న, సిగ్గులేని, నేరుగా, క్రోరమైన ఎక్స్‌ప్లాయిటేషన్ కు ప్రత్యామ్నాయమయ్యింది." మార్క్స్ స్వేచ్చాయుత వాణిజ్యమును ఒంటరిగా [35] బలపరిచారు. ఎందుకంటే అది సాంఘిక విప్లవాన్ని త్వరితం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సోషలిజాన్ని వ్యతిరేకించేవారికి ఇది స్వేచ్చాయుత వాణిజ్యమునకు విరుద్ధమైన వాదన అనిపిస్తుంది.

"స్వేచ్చాయుత వాణిజ్యం" ఎన్నో ప్రపంచీకరణ వ్యతిరేక సంఘాల వలన వ్యతిరేకించబడింది. వీరు స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాలు సాధారణంగా పేదల లేక పనిచేయు వర్గము యొక్క ఆర్థిక స్వేచ్చను పెంచదు మరియు ఇంకా పేదలను చేస్తుందని నమ్మడము వలననే ఈ వ్యతిరేకత కలిగింది. విదేశీ సరఫరాదారు శ్రామికుల యొక్క దే ఫాక్తో ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం వలన స్వదేశీ శ్రామికులు కూడా వారితో పోటీ పడవలసి వస్తుంది. దీని కారణంగా "స్వదేశీ పనిచేయు వర్గము నెమ్మదిగా హేలోట్రి స్థాయికి తగ్గించబడతారు".[36] ఈ రకంగా చూస్తే, స్వేచ్చాయుత వాణిజ్యం అనేది వ్యక్తిగత స్వేచ్చను కాపాడే చట్టాల చుట్టూ తిరిగే ముఖ్య ఉద్దేశం కలది. యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి చెందిన పదమూడవ సవరణ (బానిసత్వము మరియు ఇండెంజర్డ్ సర్విట్యుడ్) ఇటువంటి ఒక చట్టము. ఈ సందర్భంగా సంరక్షణా విధానాలు స్వదేశీ ఉత్పత్తిదారులను రక్షించేవిగా కాకుండా స్వేచ్చనే రక్షించేవిగా చూడబడతాయి. ఈ వాదన స్వేచ్చాయుత వాణిజ్యము యొక్క ఆర్థిక విశ్లేషణకు దారి తీస్తుంది. దీని ప్రకారము "బానిసత్వము మరియు ఖచ్చితమైన పోటీ పారేటో ఆప్టిమల్ అనే సంత్వములో ఉంటాయి." [37] ఇందువల్ల, స్వేచ్చాయుత వాణిజ్య విధానాలను అవలంబించడం వలన తక్కువ సమయంలో సమర్ధత విషయంలో కొంత లాభము చేకూరినప్పటికి దీర్ఘకాలికంగా స్వేచ్చ యొక్క నష్టము రూపంలో సమర్థత యొక్క వెల ఎంత అనే ప్రశ్న ఉండిపోతుంది.

స్వేచ్చాయుత వాణిజ్య సిద్ధాంతమునకు వ్యతిరేకంగా ఉన్న వాదనలు మరియు స్వేచ్చాయుత వాణిజ్య ఒప్పందాలకు మధ్య తేడాలను గుర్తించతము చాలా ముఖ్యము. NAFTA యొక్క కొందరు వ్యతిరేకదారులు ఒప్పందమును సాధారణ ప్రజానీకానికి హానికరమైనదిగా గుర్తిస్తున్నారు, కాని కొన్ని వ్యతిరేక వాదనలు పర్ సే స్వేచ్చాయుత వాణిజ్యమునకు కాకుండా ప్రభుత్వము నిర్వహించే వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు U.S నుండి రాయితీ గల జొన్నలను మెక్సికోకు NAFTA ఆధ్వర్యంలో ఎగుమతి చేయడం తప్పనే వాదన [38] ఉంది. ఉత్పత్తి ఖర్చు కంటే తక్కువ ఖర్చుకే ఈ జొన్నలను అందించడము ద్వారా (డంపింగ్) మెక్సికన్ రైతుల పై చెడు ప్రబ్భావం చూపిస్తుంది. ఇలాంటి రాయితీలు స్వేచ్చాయుత వాణిజ్య సిద్ధాంతాలను అతిక్రమిస్తాయి కాబట్టి ఈ వాదన స్వేచ్చాయుత వాణిజ్యానికి వ్యతిరేకంగా కంటే దాని యొక్క అనుసరణ పద్ధతిని వ్యతిరేకిస్తుంది.

1980లు మరియు 1990లలో టారిఫ్ కోతలు మొదలైనప్పటి నుండి గమనిస్తే, సంరక్షణావాది అయిన చైనా మరియు ఈశాన్య ఆసియా కంటే లాటిన్ అమెరికా యొక్క ఆచరణ చాలా తక్కువగా ఉంది.[ఉల్లేఖన అవసరం] సామ్యూల్సన్ ప్రకారము, పరాజయాలపై విజయాల మిగులు గురించి ఆలోచించడం తప్పు.[this quote needs a citation] విల్ ఇన్వెన్షన్స్ A ఆర్ B లోవర్ ఆర్ రైస్ ది న్యు మార్కెట్-క్లియరింగ్ రియల్ వెజ్ రేట్స్ దట్ సస్టేయిన్ హై-టు-ఫుల్ ఎంప్లాయ్‌మెంట్"[ఉల్లేఖన అవసరం] అనే పేపరు ఆర్ధిక శాస్త్రవేత్తలను ప్రపంచీకరణ గురించి చిన్నపాటి తృప్తి పొందడమును ఖండించింది. దీని ప్రకారం కార్మికులు ఎల్లప్పుడూ గెలవరు.[అస్పష్టంగా ఉంది] కొంత మంది ఆర్ధిక శాస్త్రవేత్తలు[ఎవరు?] ఈ క్రింది విధంగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు: పేద దేశాలు స్వదేశీ పరిశ్రమలు స్థాపించుకొనుటకు మరియు సంపన్న దేశాలు కార్మికులకు తిరిగి శిక్షణ ఇవ్వడానికి సహకరించేందుకు వాణిజ్య అడ్డంకులు ఉండాలి.[39].

వలసవాదం[మార్చు]

స్వేచ్చాయుత వాణిజ్యం ఒక విధమైన సామ్రాజ్యవాదమని కొందరి వాదన. ఆర్ధిక జాతీయత్వం మరియు వర్తకవ్యాపారములను బలపరిచే కొందరి అనుకూలవాదులు ఈ పరిస్థితి కల్పిస్తారు. 19వ శతాబ్దంలో బ్రిటీషు యొక్క పిలుపులను బ్రిటీషు సామ్రాజ్యము యొక్క విస్తరణ కొరకే అని వీరు విమర్శించారు. ముఖ్యంగా అమెరికన్ వ్యవస్థ[40] యొక్క శిల్పిగా పేరుగాంచిన అమెరికన్ అయిన హెన్రి క్లే మరియు జర్మన్ అమెరికన్ ఆర్ధిక శాస్త్రవేత్త అయిన ఫ్రెడ్‌రిచ్ లిస్టు[41] యొక్క రచనలలో ఇది కనబడుతుంది.

ఈ మధ్యకాలంలో, ఈక్వడోర్ ఇయన్ ప్రెసిడెంట్ అయిన రాఫెల్ కోర్రియ ది హిద్దెన్ ఫేస్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అక్కార్డ్స్ అనే పుస్తకములో తను వ్రాసిన ముందుమాటలో "స్వేచ్చాయుత వాణిజ్యము యొక్క కుతర్కము" అని ప్రకటించారు. ఈ పుస్తకంలో కొంత భాగాన్ని కోర్రియా సారథ్యంలో ఎనర్జీ మంత్రి అయిన అల్బర్టో అకోస్టా రచించారు. హ జూన్ చాంగ్ రచించిన కిక్కింగ్ అవే ది లాడర్ను ప్రామాణికంగా పరిగణిస్తూ కోర్రియా స్వేచ్చాయుత వాణిజ్యానికి సంబంధించి "అమెరికా విధానానికి" మరియు "బ్రిటిషు విధానానికి" మధ్య తేడాలను కనుగొన్నాడు. ఆయన చెప్పిన విధంగా బ్రిటిషు విధానాన్ని అమెరికన్లు "బ్రిటిష్ సామ్రాజ్యవాద పద్దతిగా" చూసారు. కొర్రియా ప్రకారము, పారిశ్రామిక పరిరక్షణ గురించి క్రమబద్ధమైన వాదనను మొదటిసారిగా అందించినది ట్రెషరి కార్యదర్శి అయిన అలెక్సాండర్ హామిల్టన్, అంతేకాని ఫ్రెడ్రిచ్ లిస్ట్ కాదు.

ప్రత్యామ్నాయాలు[మార్చు]

స్వేచ్చాయుత వాణిజ్యం కొరకు ఈ క్రింది ప్రత్యామ్నాయాలు సూచించబడ్డాయి[by whom?]: సమతుల్య వాణిజ్యం, చౌక వాణిజ్యం, భద్రతావాదం మరియు టాబిన్ పన్ను.

వీటిని కూడా చూడండి[మార్చు]

ప్రత్యయాలు/విషయాలు:

 • స్వదేశీ వస్తు రక్షణ విధానం (భద్రతావాదం)
 • స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం
 • స్వేచ్చా వాణిజ్యం తర్కం
 • స్వేచ్చా వాణిజ్య పరిధి
 • చౌక వాణిజ్యం
 • అంతర్జాతీయ వర్తకం
 • వాణిజ్య అవరోధాలు
 • వాణిజ్య పోరు
 • దిగుమతి (ధర విధానం)
 • జన్యుపరంగా మార్పు చేయబడ్డ ఆహారము యొక్క వాణిజ్య పోరు.
 • ఆఫ్‌షోర్ ఔట్‌సోర్సింగ్
 • ఆఫ్‌షోరింగ్
 • ఎల్లలులేని అమ్మకాలు
 • సమతుల్య వాణిజ్యం
 • వాణిజ్య విభాగం
 • వర్తకము
 • లెయిస్సేజ్-ఫెయిర్
 • ఆర్థిక ప్రపంచీకరణ

వాణిజ్య సంస్థలు:

 • జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ (GATT)
 • వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO)
 • దక్షిణ అమెరికా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం
 • ఫ్రీ ట్రేడ్ ఏరియ ఆఫ్ ది అమెరికన్స్ (FTAA)
 • యూరోపియన్ యూనియన్

సూచనలు[మార్చు]

 1. "Members and Observers". World Trade Organisation. Retrieved 3 January 2011. Cite web requires |website= (help)
 2. భగవతి (2002), ఫ్రీ ట్రేడ్ టుడే , p 3
 3. స్మిత్, వెల్త్ ఆఫ్ నేషన్స్ , pp 264-265
 4. ప్యుగెల్ (2007), అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రం p 33
 5. ప్యుగెల్ (2007), అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రం p 34
 6. రికార్డో (1817), ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్ , చాప్టర్ 7 'ఆన్ ఫారిన్ ట్రేడ్'
 7. భగవతి (2002), ఫ్రీ ట్రేడ్ టుడే , p 1
 8. ప్యుగెల్ (2007), అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రం , pp 35-38 మరియు p 40
 9. Appleby, Joyce (2010). The Relentless Revolution: A History of Capitalism. New York, New York: W.W. Norton & Company.
 10. చాంగ్ (2003), కిక్కింగ్ అవే ది లాడర్ , p 17
 11. చాంగ్ (2003), కిక్కింగ్ అవే ది లాడర్ , p 59
 12. చాంగ్ (2003), కిక్కింగ్ అవే ది లాడర్ , p 50
 13. చాంగ్ (2003), కిక్కింగ్ అవే ది లాడర్ , p 66
 14. ప్యుగెల్ (2007), అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రం , pp 311-312
 15. డికర్సన్, ది నావిగేషన్ ఆక్ట్స్ అండ్ ది అమెరికన్ రెవల్యూషన్ , p 140.
 16. టైలర్, స్మగ్లర్స్ & పేట్రియాట్స్ , p 238.
 17. Lind, Matthew. "Free Trade Fallacy". Prospect. Retrieved 3 January 2011. Cite web requires |website= (help)
 18. విలియం మెక్‌కిన్లీ ఉపన్యాసం, బోస్టన్ లో అక్టోబర్. 4, 1892 , MA విలియం మెక్‌కిన్లీ పేపర్స్ (కాంగ్రెస్ యొక్క గ్రంథాలయం)
 19. 19.0 19.1 19.2 స్టీవెన్ ఈ. లాండ్స్‌బర్గ్ "ప్రైస్ థియరీ అండ్ అప్లికేషన్స్" ఆరవ సంచిక చాప్టర్ 8
 20. 20.0 20.1 థాం హార్ట్‌మాన్ "అనీక్వల్ ప్రొటెక్షన్" రెండవ సంచిక చాప్టర్ 20. p.255
 21. హరాల్డ్ జేమ్స్ "ది ఎండ్ ఆఫ్ గ్లోబలైజేషన్" మూడవ ప్రచురణ, 2001, p. 109 (ISBN 0-674-00474-4)
 22. 22.0 22.1 అలాన్ సి.స్టొకాం "ఇంట్రోడక్షన్ టు ఎకనామిక్స్" రెండవ సంచిక చాప్టర్ 9
 23. యన్.గ్రెగోరి మాన్కివ్ "మాక్రోఎకనామిక్స్" ఐదవ సంచిక చాప్టర్ 7
 24. Fuller, Dan (Fall 2003). "Consensus Among Economists: Revisited" (PDF). Journal of Economic Review. 34 (4): 369–387. మూలం నుండి 2004-09-20 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2011-02-14. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 25. Friedman, Milton. "The Case for Free Trade". Hoover Digest. 1997 (4). మూలం నుండి 2007-01-22 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-02-14.
 26. Whaples, Robert (2006). "Do Economists Agree on Anything? Yes!". The Economists' Voice. 3 (9). doi:10.2202/1553-3832.1156.
 27. Mankiw, Gregory (2006-05-07). "Outsourcing Redux". Retrieved 2007-01-22. Cite web requires |website= (help)
 28. పోస్ట్-ఆటిస్టిక్ ఎకనామిక్ రివ్యు, సెప్టెంబరు.2007
 29. Krueger, Anne (1982). "An Empirical Test of the Infant Industry Argument" (PDF). The American Economic Review. 72 (5): 1142–1144. Retrieved 4 January 2011. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Unknown parameter |month= ignored (help)
 30. బౌడ్రేక్స్, డాన్ గ్లోబలైజేషన్ , 2007
 31. విలియం బామల్ మరియు అలాన్ బ్లిండర్, ఆర్ధిక శాస్త్రం: సూత్రాలు మరియు విధానాలు, p. 722.
 32. 32.0 32.1 Brakman, Steven (2006). Nations and Firms in the Global Economy : An Introduction to International Economics and Business. Cambridge: Cambridge University Press. ISBN 9780521832984. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 33. రిచర్డ్ యల్. స్ట్రూప్, జేమ్స్ డి. గ్వార్ట్ని, రసెల్ యస్. సోబెల్, ఆర్ధిక శాస్త్రం: ప్రైవేట్ మరియు పబ్లిక్ చాయిస్, p. 46.
 34. Pugel, Thomas A. (2003). International economics. Boston: McGraw-Hill. ISBN 007119875X.
 35. "ఇటువంటి విప్లవాత్మక భావాల వలన మాత్రమే ఈ స్వేచ్చాయుత వాణిజ్యం పరంగా నేను సమ్మతము తెలుపుతాను." మార్క్స్, కారల్ స్వేచ్చాయుత వాణిజ్యము గురించిన ప్రశ్నకు 1848, జనవరి 9 నాడు ఒక బహిరంగ సభలో డెమాక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ బ్రూసేల్స్ కు ఇచ్చిన ఉపన్యాసంలో చెప్పారు.
 36. మార్క్స్, కారల్ ది సివిల్ వార్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, ¶ 23.
 37. హాలక్, సర్దార్, ఎ మైక్రోఎకనామిక్ అనాలిసిస్ ఆఫ్ స్లేవరి ఇన్ కంపారిజన్ టు ఫ్రీ లేబర్ బిల్కెంట్ యునివర్సిటి, అంకార, టర్కీ
 38. ఇన్స్టిట్యుట్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ ట్రేడ్ పాలసి Archived 2007-09-27 at the Wayback Machine. NAFTA ట్రూత్ అండ్ కాన్సిక్వెంసేస్: కార్న్
 39. ఉద్యోగ అవకాశాలు: స్వేచ్చాయుత వాణిజ్యము వలన కలిగిన బాధ నుండి రెండవ అభిప్రాయము కలుగుతుంది; మి.బ్లిండర్ యొక్క షిఫ్ట్ స్పాట్లైట్ వార్నిన్గ్స్ ఆఫ్ డీపర్ డౌన్‌సైడ్, డేవిడ్ వెస్సెల్ అండ్ బాబ్ డేవిస్. వాల్ స్ట్రీట్ జర్నల్ , 28 మార్చ్ 2007, p. A1
 40. జెంటిల్‌మెన్ తమని తాము మోసం చేసుకుంటారు. మన సమ్మతి కోసం స్వేచ్చాయుత వాణిజ్యాన్ని వారు సిఫారసు చేయడంలేదు. వాస్తవికతలో మనము బ్రిటిష్ సామ్రాజ్య పద్దతిని అనుసరించడానికి ఆహ్వానించబడ్డాము; ఒకవేళ వారి విధానము అనుసరించినట్లయితే అది గ్రేట్ బ్రిటన్ యొక్క వర్తక సంబంధమైన ఆధిపత్యంలో రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణకు అంతిమంగా దారి తీస్తుంది. "అమెరికన్ విధానానికి రక్షణగా గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్య పద్ధతికి వ్యతిరేకంగా." 1832, ఫెబ్రవరి 2, 3, and 6, Clay, Henry (1843). "The Life and Speeches of Henry Clay". II: pp. 23–24. Cite journal requires |journal= (help)
 41. "ఆంగ్లేయులు అంటా తమకే ఉంచుకుంటే--లైస్సేజ్ ఫెయిర్, లైస్సేజ్ అల్లెర్, ప్రముఖ ఆర్ధిక పాఠశాల సూచించినట్టుగా--స్టీల్‌యార్డు కు చెందిన (జర్మన్) వ్యాపారస్తులు లండన్ లో ఇప్పటికి వ్యాపారాన్ని కొనసాగించేవారు, బెల్జియన్లు ఇప్పటికీ ఆంగ్లేయులకోరకు వస్త్రాల తయారి చేపట్టేవారు, ఇంగ్లాండ్ దేశము హన్సార్డ్స్ యొక్క గొర్రెల మందలను నిర్వహించడం కొనసాగించేది, ఎలాగైతే పోర్చ్యుగల్ ఇంగ్లాండ్ యొక్క వైన్ యార్డ్ గా కొనసాగుతుండేది. వీటన్నిటికి కుతంత్రపరుడైన సామ్రాజ్యవాడి యొక్క విధానాలే కారణము".

గ్రంథ పట్టిక[మార్చు]

 • చాంగ్, హ-జూన్. కిక్కింగ్ అవే ది లాడర్: డెవలప్‌మెంట్ స్ట్రాటెజి ఇన్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ . లండన్: ఆంథెం ప్రెస్ 2003. ISBN 978-1-84331-027-3.
 • ప్యుగెల్, థామస్ ఏ. ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, 13వ సంచిక. న్యూ యార్క్: మెక్‌గ్రా-హిల్ ఇర్విన్ (2007). ISBN 978-0-07-352302-6
 • డికర్సన్, ఒలివర్ యం. ది నేవిగేషన్ ఆక్ట్స్ అండ్ ది అమెరికన్ రెవల్యూషన్ . న్యూ యార్క్: బార్న్స్ (1963). ISBN
 • టైలర్, జాన్ W. స్మగ్లర్స్ & పేట్రియాట్స్: బాస్టన్ మర్చంట్స్ అండ్ ది అడ్వెంట్ ఆఫ్ ది అమెరికన్ రేవల్యుషన్ . బాస్టన్: నార్త్ ఈస్టర్న్ యునివర్సిటి ప్రెస్ (1986). ISBN 0-19-512350-6
 • స్మిత్, ఆడం. ఆన్ ఇంక్వైరీ ఇన్ టు ది నేచర్ అండ్ కాసెస్ ఆఫ్ ది వెల్త్ ఆఫ్ నేషన్, డిజిరీడ్స్ ముద్రణ (2009), ISBN 1-4209-3206-3
 • భగవతి, జగదీష్. ఫ్రీ ట్రేడ్ టుడే . ప్రిన్స్టన్: ప్రిన్స్టన్ యునివర్సిటి ప్రెస్ (2002).. ISBN 0-631-20497-0.
 • రికార్డో, డేవిడ్. ఆన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్, ఎకనామిక్స్ మరియు లిబర్టి గ్రంథాలయం (1999)
Vrijhandel]]