హంపనగౌడ బాదర్లి
| హంపనగౌడ బాదర్లి | |||
కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక & మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్
| |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 జనవరి 26 | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2023 | |||
| ముందు | వెంకటరావు నాదగౌడ | ||
|---|---|---|---|
| పదవీ కాలం 2013 – 2018 | |||
| ముందు | వెంకటరావు నాదగౌడ | ||
| పదవీ కాలం 1999 – 2008 | |||
| ముందు | కె. విరూపాక్షప్ప | ||
| తరువాత | వెంకటరావు నాదగౌడ | ||
| పదవీ కాలం 1989 – 1994 | |||
| ముందు | ఆర్.నారాయణప్ప | ||
| తరువాత | కె. విరూపాక్షప్ప | ||
| నియోజకవర్గం | సింధనూరు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1950 కర్ణాటక, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (2004 – ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ జనతాదళ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హంపనగౌడ బాదర్లి (జననం 1950) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు సింధనూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]హంపనగౌడ బాదర్లి జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1989 శాసనసభ ఎన్నికలలో సింధనూరు శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఆర్. నారాయణప్పపై 28,345 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1994 శాసనసభ ఎన్నికలలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె. విరూపాక్షప్ప చేతిలో 447 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.
హంపనగౌడ బాదర్లి 1999 శాసనసభ ఎన్నికలలో సింధనూరు శాసనసభ నియోజకవర్గం నుండి జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కె. విరూపాక్షప్పపై 5486 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి హనుమానగౌడ అమరేశప్పగౌడపై 48,724 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హంపనగౌడ బాదర్లి 2008 శాసనసభ ఎన్నికలలో సింధనూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి వెంకటరావు నాదగౌడ చేతిలో 14,874 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బదవర శ్రమికర రైతరా కాంగ్రెస్ అభ్యర్థి కె కరియప్పపై 13,016 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2016లో మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[2]
హంపనగౌడ బాదర్లి 2018 శాసనసభ ఎన్నికలలో సింధనూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి వెంకటరావు నాదగౌడ చేతిలో 1,597 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి కె కరియప్పపై 21,942 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4][5]
హంపనగౌడ బాదర్లి 2024 జనవరి 26న కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక & మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (14 May 2023). "బాదర్లి 'పంచ్'పటాకా". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "21 MLAs to head boards, corporations" (in Indian English). The Hindu. 2 November 2016. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Sindhanur". Election Commission of India. 31 May 2023. Archived from the original on 22 April 2025. Retrieved 22 April 2025.
- ↑ "Three first-time MLAs enter Assembly from Yadgir and Raichur districts" (in Indian English). The Hindu. 14 May 2023. Archived from the original on 24 May 2023. Retrieved 20 January 2025.
- ↑ "Karnataka: 34 MLAs made chiefs of boards, Shanti Nagar MLA gets BDA" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 January 2024. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.