హజారీబాగ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హజారీబాగ్ జిల్లా
హజారీబాగ్ జాతీయ పార్కు
హజారీబాగ్ జాతీయ పార్కు
జార్ఖండ్ పటంలో జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో జిల్లా స్థానం
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుఉత్తర ఛోటానాగ్‌పూర్
ముఖ్యపట్టణంహజారీబాగ్
ప్రభుత్వం
 • లోక్‌సభహజారీబాగ్
విస్తీర్ణం
 • మొత్తం4,313 km2 (1,665 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం17,34,495
 • సాంద్రత400/km2 (1,000/sq mi)
జనాభా
 • అక్షరాస్యత70.48%
కాలమానంUTC+05:30 (IST)
రహదారులుNH2(GT ROAD), NH33(Lifeline of Jharkhand from Barhi{Hazaribag} to Bahragodda{Jamshedpur}) ,NH100(Bagodar to Chatra via Hazaribag)
జాలస్థలిhttp://hazaribag.nic.in/

జార్ఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో హజారీబాగ్ జిల్లా ఒకటి. హజారీబాగ్ [1] దీనికి ముఖ్యపట్టణం. ఇది మావోయిస్టుల రెడ్ కారిడార్‌లో భాగం.[2]

పేరు వ్యుత్పత్తి[మార్చు]

జిల్లా పేరు, దాని ముఖ్యపట్టణం హజారీబాగ్ పేరిట వచ్చింది. హజారీబాగ్ పేరులో రెండు పర్షియన్ పదాలు ఉన్నాయి. హజార్ అంటే "వెయ్యి", బాగ్ అంటే "తోట" - కాబట్టి, హజారీబాగ్‌కు 'వెయ్యి తోటల నగరం' అని అర్థం. ప్రముఖ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ సర్ జాన్ హోల్టన్ ప్రకారం, ఈ పట్టణం పేరు ఓక్ని, హజారీ అనే చిన్న గ్రామాల నుండి వచ్చింది. పాత పటాలలో దీన్ని ఓకున్‌హజ్రీగా చూపారు. ఆ పేరులోని ద్వితీయ పదం బహుశా మామిడి తోట నుండి వచ్చి ఉంటుంది. కోల్‌కతా వారణాసిల మధ్య 1782 లో నిర్మించిన 'కొత్త సైనిక రహదారి' వెంట ప్రయాణిస్తున్న సైనికులు, ప్రయాణికులూ ఇక్కడ విశ్రాంతి కోసం ఆగేవారు.[3]

చరిత్ర[మార్చు]

హజారీబాగ్ జిల్లాలోని ఇస్కోలో మెజో-చాల్‌కోలిథిక్ కాలం (క్రీ.పూ 9,000-5,000) నాటి పురాతన గుహ చిత్రాలు ఉన్నాయి.[4] బర్గాగావ్‌కి దగ్గరగా, హజారీబాగ్ పట్టణం నుండి 25 కి.మీ. దూరంలోని పుంక్రి బార్వాడి వద్ద మెగాలిత్‌ల సమూహం ఉంది. ఇది సా.పూ. 3000 నాటివని భావిస్తున్నారు.[5]

1972 డిసెంబరు 6 న, హజారీబాగ్ నుండి విడదీసి, గిరిడి జిల్లా ఏర్పడింది.[6] 1999 లో మళ్ళీ జిల్లాను విభజించి ఛత్రా, కోడర్మా జిల్లాలను ఏర్పరచారు.[6] 2000 నవంబరు 15 న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హజారీబాగ్ జిల్లా బీహార్ నుండి జార్ఖండ్ లోకి పోయింది.[6] 2007 సెప్టెంబరు 12 న, హజారీబాగ్ జిల్లా నుండి మరొక జిల్లా, రామ్‌గఢ్, ఏర్పడింది.[6]

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

ఈ జిల్లాలో లభించే ప్రధాన ఖనిజం బొగ్గు. జిల్లా లోని ముఖ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉత్తర కరణ్‌పురా కోల్‌ఫీల్డ్స్ లోని చార్హి, కుజూ, ఘటో తండ్, బర్కాగావ్ లున్నాయి. ఈ జిల్లా వాసులకు బొగ్గు గనులే ప్రధాన జీవనాధారం.

భారత ప్రభుత్వం 2006 లో, దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా హజారీబాగ్‌ని పేర్కొంది.[7] వెనకబడ్డ ప్రాంతాల గ్రాంట్ నిధి (BRGF) కార్యక్రమం నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాల్లో ఇది ఒకటి.[7]

హజారీబాగ్ మతం[8]
మతం శాతం
హిందూమతం
  
80.56%
ఇస్లాం
  
16.21%
సర్నా
  
1.97%
క్రైస్తవం
  
0.99%
వెల్లడించలేదు
  
0.27%
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19012,41,612—    
19112,64,297+9.4%
19212,61,915−0.9%
19313,11,227+18.8%
19413,59,218+15.4%
19513,97,342+10.6%
19614,98,034+25.3%
19716,43,086+29.1%
19818,54,377+32.9%
199111,01,171+28.9%
200113,78,881+25.2%
201117,34,495+25.8%

పరిపాలన[మార్చు]

బ్లాకులు/మండలాలు[మార్చు]

హజారీబాగ్ జిల్లాలో 16 బ్లాక్‌లు ఉన్నాయి.ఆ బ్లాకుల జాబితా ఇది:

  1. బర్హి బ్లాక్
  2. డాడీ బ్లాక్
  3. బర్కతా బ్లాక్
  4. దారు బ్లాక్
  5. బిష్ణుగఢ్ బ్లాక్
  6. కట్కమ్‌డాగ్ బ్లాక్
  7. బార్కాగాన్ బ్లాక్
  8. కట్కంసండీ బ్లాక్
  9. చౌపరాన్ బ్లాక్
  10. ఇచక్ బ్లాక్
  11. పద్మ బ్లాక్
  12. చర్చూ బ్లాక్
  13. సదర్ బ్లాక్
  14. చల్కుషా బ్లాక్
  15. తాటి ఝరియా బ్లాక్
  16. కేరిడారి బ్లాక్

జిల్లాలో హజారీబాగ్, బర్హి అనే రెండు ఉప విభాగాలున్నాయి.

హజారీబాగ్ ఉప విభాగంలో 11 బ్లాకులున్నాయి: సదర్, హజారీబాగ్, కట్కంసందీ, బిష్ణుగఢ్, బర్కాగావ్, కెరడారీ, ఇచక్, చర్చూ, దారు, తాటి ఝరియా, కట్కమ్‌దాగ్, దాడీ.

బార్హి ఉప విభాగంలో పద్మ, బార్హి, చుపారన్, బర్కాథా, చల్‌కుషా అనే 5 బ్లాకులున్నాయి.

ఈ జిల్లాలో 5 విధానసభ నియోజకవర్గాలు ఉన్నాయి: బర్కాథా, బర్హి, బర్కాగావ్, మండూ, హజారీబాగ్. ఇవన్నీ హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, హజారీబాగ్ జిల్లాలో జనాభా 17,34,495.[8] ఇది గాంబియా దేశానికి సమానం.[9] ఇది అమెరికా రాష్ట్రం నెబ్రాస్కా జనాభాతో సమానం.[10] జనాభా పరంగా ఇది భారతదేశపు జిల్లాల్లో 279 వ స్థానంలో ఉంది.[8] జనసాంద్రత 403/చ.కి.మీ.[8] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 25.75%.[8] హజారీబాగ్ జిల్లా లింగనిష్పత్తి, ప్రతి 1000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు.[8] అక్షరాస్యత రేటు 70.48%.[8] మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాలు 17.50% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 7.02%.

జనాభాలో హిందువులు 80.56%, ముస్లింలు 16.21% ఉన్నారు. సర్నా 1.97%, క్రైస్తవులు 0.99% ఉన్నారు.[8]

హజారీబాగ్ జిల్లా భాషలు, 2011

  ఖోర్తా భాష (61.58%)
  హిందీ (23.59%)
  ఉర్దూ (7.73%)
  Santali (3.48%)
  ఇతరాలు (3.62%)

2011 భారత జనగణన ప్రకారం, జిల్లా జనాభాలో 61,58% మంది ఖోర్తా, 23.59% మంది హిందీ, 7,73% మంది ఉర్దూ, 3.48% మంది సంతాలీ భాషలను తమ మొదటి భాషగా మాట్లాడుతారు.[11]

మూలాలు[మార్చు]

  1. "Hazaribagh Road Map". www.mapsofindia.com.
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  3. Houlton, Sir John, Bihar, the Heart of India, Orient Longmans, 1949.
  4. "Cave paintings lie in neglect". The Telegraph. 13 March 2008.
  5. Choudhury, Indrajit Roy (3 December 2017). "Ancient megaliths of Hazaribagh". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 సెప్టెంబరు 2021.
  6. 6.0 6.1 6.2 6.3 Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on April 5, 2012. Retrieved September 27, 2011.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 8.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341
  11. 2011 Census of India, Population By Mother Tongue