హథీరాం బావాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాతీరాం జీ స్వామి వారితో పాచికలాడుతున్న దృశ్యం, తిరుమలలోని ఒక చిత్రం

హాథీరాంజీ, సా.శ. 1500 కాలంలో ఉత్తర భారతదేశంనుండి తిరుమలకు వచ్చిన భక్తుడు. ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలున్నాయి. పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హథీరాంజీ మఠం, ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం[1] కథ ప్రకారం ఇతనిగురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు. అతనిని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు. ఒక బండెడు చెరకు గడలు అతనిగదిలో పెట్టి తాళం వేశారు. ఆ చెఱకు గడలను తినగలిగితే అతనిని శ్రీహరీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజు అన్నాడు. స్వామి ఏనుగు రూపంలో వచ్చి చెఱకు గడలన్నీ తినివేశాడు. అప్పటినుండి బావాజీని హాథీరాం బాలాజీ అని పిలువసాగారు.

హాథీరాంజీతో పాచికలాడి స్వామి తిరుమలలో తన ఆస్తున్నింటినీ పందెంగా పెట్టి ఓడిపోయాడని, అప్పటినుండి తిరుమల ఆలయం అతని వారసుల అధీనంలో ఉన్నదనీ కూడా ఒక కథనం ఉంది. ఈస్టిండియా కంపెనీవారు దేవాలయాల నిర్వహణలో జోక్యం కలుగ జేసుకోకూడదని నిర్ణయించుకొన్న తరువాత (ఈ కథనం ఆధారంగా కావచ్చును) 1843లో ఆర్కాటు జిల్లా కలెక్టరు సనదు (ఉత్తర్వు) తో తిరుమల నిర్వహణను హాథీరాంజీ మఠం అధిపతికి అప్పగించారు.[2][3]

హాతీరాంజీ మఠం: తిరుపతి

1932లో తి.తి.దే. చట్టం అమలులోకి వచ్చింది. అంతకు మునుపు మహంతుల ఆధీనంలో ఉండేది. హథీరాంజీ మఠానికి పెద్ద సంఖ్యలో లంబాడీలు దర్శనం చేసుకోవటానికి వస్తారు. లంబాడీలు హథీరాంజీ తమ తెగకు చెందినవాడని భావిస్తారు. అందువలన తిరుమలలో దర్శనమైన వెంటనే హథీరాంజీ ఆశీర్వాదం పొందడానికి మఠానికి వస్తారు. మఠంలో లంబాడీలకు ఉచిత బస ఏర్పాట్లు ఉన్నాయి.[4]

మూలాలు, వనరులు[మార్చు]

  1. God inside out: Śiva's Game of Dice By Don Handelman, David Dean Shulman పేజీ.106
  2. The Tirumala Temple By N. Ramesan
  3. The Madras law journal, Volume 17 పేజీ.237
  4. Recent trends in historical studies: festschrift to Professor Ravula Soma Reddy By A. Satyanarayana, Pedarapu Chenna Reddy, Ravula Soma Reddy పేజీ.227
  • తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002) - వ్యాసంలో అధిక భాగం ఈ పుస్తకంనుండి తీసుకోబడింది.