హనుమాన్‌గఢ్ జిల్లా
హనుమాన్‌గఢ్ జిల్లా | ||||
---|---|---|---|---|
దేశం | భారతదేశం | |||
రాష్ట్రం | రాజస్థాన్ | |||
పరిపాలనా విభాగం | బికనీర్ | |||
ప్రధాన పరిపాలనా కేంద్రం | హనుమాన్‌గఢ్ | |||
తాలూకాలు | రావత్సర్, సంగారియా, పిలిబంగన్, నోహార్, భదారా, టిబ్బి, హనుమన్‌గఢ్ | |||
Government | ||||
• జిల్లా కలెక్టర్ | జకీర్ హుస్సేన్ | |||
విస్తీర్ణం | ||||
• Total | 9,656 కి.మీ2 (3,728 చ. మై) | |||
జనాభా (2011) | ||||
• Total | 17,74,692[1] | |||
జనాభా | ||||
• అక్షరాస్యత | 67.13% | |||
• లింగ నిష్పత్తి | 960/1000 | |||
Time zone | UTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం) | |||
జాతీయ రహదారులు | ఎన్. ఎచ్-54 |
రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో హనుమాన్‌గఢ్ జిల్లా ఒకటి.హనుమాన్‌గఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.
భౌగోళికం
[మార్చు]జిల్లా రాజస్థాన్ ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా వైశాల్యం 12,645 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1,779,650. జనసాంధ్రత 184. జిల్లా ఉత్తర సరిహద్దులో పంజాబు రాష్ట్రం, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో చురు జిల్లా, పశ్చిమ సరిహద్దులో శ్రీ గంగానగర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో వరి, జొన్నలు, పత్తి, సోనాముఖి, గోధుమ, కూరగాయలు పండిస్తారు. హనుమాన్‌గఢ్ జిల్లా 1994 జూలై 12 లో రాజస్థాన్‌లో 31వ జిల్లాగా అవతరించింది. జిల్లాలో కలిబంగన్ (సింధూ నాగరికత), పల్లు వద్ద ఆర్కియాలజీ ప్రదేశం ఉంది. హనుమాన్‌గఢ్లో భట్నర్ కోట ఉంది.
2011 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,779,650, [2] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 269 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 184 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.24%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 906 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.37%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
[మార్చు]జిల్లా తూర్పు, దక్షిణ భూభాగంలో బగ్రి, టోనల్ వంటి మాండలికాలు వాడుకలో ఉన్నాయి. జిల్లా ఉత్తర, పశ్చిమ భూభాగంలో అధికంగా పంజాబీ భాష వాడుకలో ఉంది.[5] గ్రామీణ గృహాలలో జపద కళలు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అయినప్పటికీ గ్రామీణకళలు తగ్గుముఖం పడుతున్నాయి. జిల్లాలో భగ్రీ సంస్కృతి ఆధిక్యం చేస్తుంది. జిల్లాలోని దక్షిణ భూభాగంలోని గ్రామాలలో బగ్రి స్త్రీలలో ఓధ్ని ఎంబ్రాయిడరీ (అధికంగా ఎర్రరంగు) సాధారణంగా కనిపిస్తుంది. పొడవైన చొక్కా (షర్టు), బొర్లొ (శిరోభూషణం) భగ్రీస్త్రీలకు చిహ్నంగా ఉన్నాయి. పంజాబీ స్త్రీలు సల్వార్, చున్నీ (ముసుగు) ధరిస్తారు. భగ్రీ స్త్రీలు సంప్రదాయ సమయాలలో విడువకుండా ధరిస్తుంటారు. పంజాబీ స్త్రీలు పంజాబీ దుస్తులు ధరిస్తుంటారు. పంజాబీ దుస్తులు ఇతర స్త్రీలలో కూడా ప్రబలమయ్యాయి. పురుషులు సాధారణంగా ప్యాంటు, షర్ట్, కుర్తా, పైజమా, ధోతీ ధరిస్తుంటారు. పంజాబీ సంగీతం ప్రజలలో ప్రబలంగా ఉంది.
తాలూకాలు
[మార్చు]హనుమాన్‌గర్ జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి: హనుమాంగఢ్, శంగరీ, భారతదేశం, రవత్సర్, నొహర్, భద్ర, తిబ్బి, పిలిబంగ.
ఉత్సవాలు
[మార్చు]భద్రకాళీమేళా
[మార్చు]జిల్లాకేంద్రానికి 7 కి.మీ దూరంలో భధ్రకాళీ ఆలయం ఉంది. బికనీర్ సామ్రాజ్య 6 చక్రవర్తి మహారాజా రాం సింగ్ అక్బర్ బాద్షాహ్ కోరిక మీద ఈ ఆలయాన్ని నిర్మించాడని భావిస్తున్నారు. భక్తులు ఈ ఆలయాన్ని సంవత్సరమంతా దర్శిస్తారు. చైత్రం సుడి 8-9 ఉత్సవానికి పంజాబు నుండి వేలాది ప్రజలు భధ్రకాళీ దర్శనానికి వస్తుంటారు.
పల్లు మేళా
[మార్చు]జిల్లాకేంద్రానికి 80కి.మీ దూరంలో ఉన్న పల్లు వద్ద ఇసుక గుట్టల మధ్య ఉన్న మాతా బ్రాహ్మణీ మేళా నవరాత్రి సందర్భంలో నిర్వహించబడుతుంది.
షిలా మాతా మేళా
[మార్చు]హనుమాన్‌గఢ్ బస్ స్టాండ్ వద్ద ప్రతి గురువారం షీలా మాతా మేళా నిర్వహించబడుతుంది. ఇక్కడ ఉన్న 6 అడుగుల రాతి స్థంబాన్ని హిందువులు, సిక్కులు షీలా మాతాగానూ, ముస్లిములు షీలా పీర్ గానూ భావించి పూజిస్తుంటారు.
షైద్ బాబా సుఖ సింగ్‌జీ, మహితాబ్ సుంగ్‌జీ యాద్గిరి మేళా
[మార్చు]షైద్ బాబా సుఖ సింగ్‌జీ మహితాబ్ సుంగ్‌జీ హనుమాన్‌గఢ్ వచ్చినప్పుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. వారు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో ఒక అందమైన గురుద్వారా నిర్మించబడింది. ఇది బికనీర్ కోటకు సమీపంలో ఉంది.25వ భందన్ మహీనా సమయంలో ఇక్కడ ఉత్సవం నిర్వహించబడుతుంది. హనుమాన్‌గఢ్, రాజస్థాన్‌లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలమధ్య ఈ ఆలయం సమైక్యతకు చిహ్నంగా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Name Census 2011, Rajasthan data" (PDF). censusindia.gov.in. 2012. Retrieved 28 Feb 2012.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341
- ↑ M. Paul Lewis, ed. (2009). "Bagri: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.