Jump to content

హఫీజ్ కాంట్రాక్టర్

వికీపీడియా నుండి
హఫీజ్ సొరాబ్ కాంట్రాక్టర్
2016 లో హఫీజ్ కాంట్రాక్టర్
జననం (1950-06-19) 1950 జూన్ 19 (వయసు: 76)
పాఠశాల/కళాశాలలు
వృత్తిఆర్కిటెక్ట్
భాగస్వామి
పెర్ల్ కాంట్రాక్టర్
(m. 1962)
పిల్లలు2
తల్లిదండ్రులుసొరాబ్ కాంట్రాక్టర్
రోషన్ కాంట్రాక్టర్
పురస్కారాలుపద్మభూషణ
Practiceఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్
భవనాలు
  • 23 మరీనా
  • ది ఇంపీరియల్
  • నిట్స్ పిలానీ గోవా
  • ఇన్‌ఫోసిస్ శిక్షణా కేంద్రం మైసూరు
  • ది 42 (కోల్‌కతా)
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టు టర్మినల్ 1
  • డి.వై.పాటిల్ స్టేడియం

హఫీజ్ సోరాబ్ కాంట్రాక్టర్ (జననం 1950) భారతీయ వాస్తుశిల్పి.[1] అతను భారతదేశంలో, ప్రధానంగా ముంబై నగరంలో అనేక ఆకాశహర్మ్యాలను రూపొందించాడు.[2] 2019 నాటికి, అతను భారతదేశంలోని మూడు ఎత్తైన భవనాల వాస్తుశిల్పి - కోల్‌కతాలోని ది 42,[3] [4] ముంబైలోని ది ఇంపీరియల్ జంట టవర్లు.[5][6] అతనికి భారత ప్రభుత్వం 2016 జనవరిలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.[7]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

హఫీజ్ కాంట్రాక్టర్ 1950 జూన్ 19 న ముంబైలోని పార్సీ కుటుంబంలో జన్మించాడు.[8] అతను నాసిక్‌లోని బాయ్స్ టౌన్ పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. 1975 లో ముంబై విశ్వవిద్యాలయం అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో చేరాడు. ఆ తరువాత కొలంబియా విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్ పొంది, మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు.[9]

కెరీర్

[మార్చు]

తన ఆర్కిటెక్చర్ డిగ్రీని అభ్యసిస్తున్నప్పుడు కాంట్రాక్టర్, 1968లో తన మామ, గురువు అయిన తెహ్మాస్ప్ ఖరేఘాట్ పర్యవేక్షణలో అప్రెంటిస్‌గా పనిచేయడం ప్రారంభించాడు.[10][11] అతను 1977లో తన మామ కంపెనీ టి. ఖరేఘాట్‌లో అసోసియేట్ భాగస్వామిగా చేరాడు.[11]

1991లో, ఇన్ఫోసిస్ బెంగళూరు ప్రాంగణంలో కూత్త భవనాలు కట్టేందుకు హఫీజ్‌ను తీసుకున్నారు.[12][9] అతను పూణే వెలుపల ఆ సంస్థ యొక్క మొట్టమొదటి సాఫ్ట్వేర్-డెవలప్మెంట్ పార్కు, మైసూరు సమీపంలో ఉన్న దాని కార్పొరేట్ విద్యా సదుపాయాన్ని రూపొందించాడు.[13][9][14] అతని అత్యంత ప్రసిద్ధ ప్రాజెక్ట్ హిరానందాని గార్డెన్స్. ఇది ముంబై శివారు ప్రాంతమైన పోవాయ్‌ లోని ఒక టౌన్షిప్.[9] 2005లో హఫీజ్, ది ఇంపీరియల్ అనే జంట-టవర్ల నివాస ఆకాశహర్మ్యాన్ని రూపొందించాడు. దీని పొడవు 254 మీటర్లు. టవర్ I భారతదేశంలో ఎత్తైన నివాస భవనం. 2017 లో వన్ అవిఘ్న పార్క్ (266 మీటర్లు) దీని రికార్డును బద్దలు కొట్టింది. మళ్ళీ దీని కొత్త రికార్డును కోల్కతాలోని ది 42 ఛేదించింది. దీనిని కూడా హఫీజే రూపొందించాడు. నిర్మాణపరంగా 260 మీటర్ల ఎత్తులో అగ్రస్థానంలో ఉంది.[3] అతను దుబాయ్ లోని 23 మెరీనా భవనాన్ని కూడా రూపొందించాడు. కొద్దికాలం పాటు ఇది ప్రపంచంలోనే ఎత్తైన నివాస భవనంగా ఉంది. ఇప్పుడు న్యూయార్క్ నగరం ప్రిన్సెస్ టవర్, 432 పార్క్ అవెన్యూ తర్వాత మూడవ స్థానంలో ఉంది.[15]

హఫీజ్ ఇతర ప్రాజెక్టులలో ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయం దేశీయ టెర్మినల్, ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టు, ముంబై సిటీ ఎఫ్సి ఫుట్బాల్ జట్టు రెండింటికీ హోమ్ స్టేడియంగా పనిచేసే డివై పాటిల్ స్టేడియం ఉన్నాయి.[16] అతను నవీ ముంబై తుర్బే రైల్వే స్టేషన్ కూడా రూపొందించాడు. 2018లో 19 రైల్వే స్టేషన్లకు ఉచితంగా ఆఫర్ చేశాడు.[17] 2016 నవంబరులో పూర్తయిన తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్ కు ఆయన వాస్తుశిల్పి. విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ క్యాంపస్‌కు రూపకల్పన చేసాడు. అతని ఇంటర్వ్యూ అధికారిక 8వ తరగతి ఆంగ్ల పుస్తకంలో ప్రచురించబడింది.

నిర్మాణ శైలి

[మార్చు]

పాశ్చాత్య దేశాలలో గ్రీన్ భవనాలను ధృవీకరించడానికి ఉపయోగించే ప్రామాణిక రేటింగులను హఫీజ్, ఒక "జోక్" అంటాడు.[18] అతని అభిప్రాయం ప్రకారం, భారతదేశంలోని పరిస్థితులకు వ్యవసాయ భూముల నష్టం వంటి ఆ దేశం ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను పరిగణనలోకి తీసుకునే రేటింగ్ వ్యవస్థ అవసరం.[18]

న్యూయార్క్ టైమ్స్ ప్రొఫైల్‌లో ఆయనను బాలీవుడ్ లోని " స్టార్కిటెక్ట్ " అని అభివర్ణించారు. ఆ వ్యాసం హఫీజ్ శైలిని "సంతకం లేదు, మెరుపుల పట్ల మక్కువ తప్ప" అని వర్ణించింది. కాంట్రాక్టర్ తన పని గురించి ఇలా అన్నాడు, "[మీరు] లిప్‌స్టిక్, రూజ్, కనురెప్పలు ఉన్న స్త్రీని ఖచ్చితంగా ఇష్టపడతారు. అలాగే, మీ భవనాన్ని కొన్ని అప్లిక్‌లతో మరింత అందంగా చేస్తే, అందులో తప్పేమీ లేదు." [9]

నిర్మాణాల జాబితా

[మార్చు]
పేరు పూర్తయిన సంవత్సరం చిత్రం నగరం గమనికలు రెఫ్
అపోలో హాస్పిటల్, ఇంద్రప్రస్థ
సరళ బిర్లా అకాడమీ
ఐటీసీ గ్రాండ్ సెంట్రల్ 2004 ముంబై ఆర్ట్ డెకో శైలిలో నిర్మించిన హోటల్ ఆకాశహర్మ్యం
ఐటీసీ రాయల్ బెంగాల్ 2019 కోల్‌కతా ఆర్ట్ డెకో శైలిలో నిర్మించిన హోటల్ ఆకాశహర్మ్యం
డివై పాటిల్ స్టేడియం 2008 నవీ ముంబై
ది ఇంపీరియల్ 2010 ముంబై 2010 - 2018 మధ్య భారతదేశంలో ఎత్తైన భవనం [5] [6]
23 మెరీనా 2012 దుబాయ్
వన్ హారిజన్ సెంటర్ 2014 గుర్గావ్ [19]
మంత్రి శిఖరం 2016 బెంగళూరు బెంగళూరులో ఎత్తైన భవనం [20]
ది 42 2019 కోల్‌కతా 2018 - 2019 మధ్య భారతదేశంలో ఎత్తైన భవనం [3]
లోఖండ్‌వాలా మినర్వా ముంబై [21]
తుర్బే రైల్వే స్టేషన్ నవీ ముంబై
CIDCO స్పఘెట్టి హౌసింగ్ 2005 నవీ ముంబై

పురస్కారాలు, గుర్తింపు

[మార్చు]
  • 2016 : హఫీజ్‌కు 2016లో భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. [22]

మూలాలు

[మార్చు]
  1. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  2. "Mantri Pinnacle – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  3. 1 2 3 "The 42 – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ నుండి 22 September 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-09-21.
  4. "Lokhandwala Minerva – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  5. 1 2 "The Imperial I – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ నుండి 2 October 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-09-21.
  6. 1 2 "The Imperial II – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ నుండి 11 September 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-09-21.
  7. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  8. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  9. 1 2 3 4 5 Brook, Daniel (2014-06-19). "The Slumdog Millionaire Architect". The New York Times. ISSN 0362-4331. ఒరిజినల్ నుండి 22 June 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-09-21.Brook, Daniel (19 June 2014). "The Slumdog Millionaire Architect". The New York Times. ISSN 0362-4331. Archived from the original on 22 June 2017. Retrieved 21 September 2017.
  10. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  11. 1 2 "Hafeez Contractor AIIAGD ARCH. MS ARCH. & UD (USA): Executive Profile & Biography – Bloomberg". Bloomberg L.P. ఒరిజినల్ నుండి 22 September 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2017-09-21.
  12. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  13. "Mantri Pinnacle – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  14. "Lokhandwala Minerva – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  15. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  16. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  17. "Mantri Pinnacle – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  18. 1 2 "Green buildings are a joke: Hafeez Contractor". The Times of India. 2011-09-14. ఒరిజినల్ నుండి 21 October 2011 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 April 2012.
  19. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  20. "Mantri Pinnacle – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  21. "Lokhandwala Minerva – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.
  22. "One Horizon Center – The Skyscraper Center". skyscrapercenter.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-12-04.