హమీర్‌పూర్ (హిమాచల్ ప్రదేశ్)
హమీర్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 31°41′N 76°31′E / 31.68°N 76.52°E | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | హమీర్‌పూర్ |
Government | |
విస్తీర్ణం | |
• Total | 5.2 కి.మీ2 (2.0 చ. మై) |
జనాభా (2011)[2] | |
• Total | 17,604 |
• జనసాంద్రత | 3,385/కి.మీ2 (8,770/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
టెలిఫోన్ కోడ్ | 01972 |
హమీర్‌పూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, హమీర్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. హమీర్‌పూర్, దిగువ హిమాలయాలలో సముద్ర మట్టానికి 790 మీటర్ల ఎత్తున ఉంది. ఉత్తరాన ఉన్న ఎత్తైన ధౌలాధర్ శ్రేణులు నగరానికి నేపథ్యంగా ఉంటాయి. ఆధునిక నిర్మాణాలతో హమీర్‌పూర్, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది జాతీయ రహదారి 3 పైనున్న ఒక ప్రధానమైన కూడలి. జాతీయ రహదారి 103 ఇక్కడే ప్రారంభమవుతుంది. హమీర్‌పూర్ అధిక అక్షరాస్యతకు, విద్యాసంస్థలకు, సాంప్రదాయిక ఉత్సవం హమీర్ ఉత్సవ్ కూ ప్రసిద్ది చెందింది. హమీర్‌పూర్ నగరం ఝనియారీ నుండి భోటా వరకు NH 3, NH 103 ల వెంట విస్తరించి ఉంది. ఇది జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రం. ఇక్క్కడి నుండి హెచ్‌ఆర్‌టిసి, జాతీయ రాజధానికి బస్సులు నడుపుతుంది. సమీప విమానాశ్రయాలు కాంగ్రా విమానాశ్రయం, మొహాలి అంతర్జాతీయ విమానాశ్రయం. సమీప రైల్వేస్టేషను 79 కి.మీ. దూరంలో ఉన్న ఊనాలో ఉంది. హమీర్‌పూర్ నగరం చుట్టూ పైన్ అడవులు వ్యాపించి ఉన్నాయి. ఎన్‌ఐటి, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నైపుణ్య అభ్యాస కేంద్రాల వంటి విద్యాసంస్థలు పట్టణంలో ఉన్నాయి.
భౌగోళికం
[మార్చు]హమీర్‌పూర్ 31°41′N 76°31′E / 31.68°N 76.52°E నిర్దేశాంకాల వద్ద ఉంది. [3] సముద్ర మట్తం నుండి ఎత్తు 799 మీ. హమీర్‌పూర్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశపు ఎత్తు 1250 మీ. హమీర్‌పూర్ ఏప్రిల్ చివరి నుండి జూన్ వరకు వెచ్చని వేసవి కాలం ఉంటుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత 40°C వరకు పోతుంది. అక్టోబరు మధ్య నుండి ఏప్రిల్ వరకు చల్లటి శీతాకాలం ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రత -2°C వరకు పడిపోతుంది. రుతుపవనాలు జూన్ చివరలో మొదలై సెప్టెంబరు ఆరంభం వరకు వర్షాలు కురుస్తాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 2012 జనవరి లోను, 2019 ఫిబ్రవరి లోనూ మంచు కురిసింది.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వివరాలు కింది పట్తికలో ఉన్నాయి. "పెరుగుదల" అనేది 2001 జనాభా లెక్కల ఆధారంగా: [1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "WELCOME TO CENSUS OF INDIA : Census of India Library". Registrar General and Census Commissioner of India. Retrieved 8 September 2014.
- ↑ "Hamirpur Population Census 2011". Census 2011 India. Retrieved 15 May 2018.
- ↑ Falling Rain Genomics, Inc - Hamirpur