హయబూసా
ఇటొకావాపై హయాబూసా - చిత్రకారుడి ఊహ | |
| పేర్లు | Muses-C (before launch) |
|---|---|
| మిషన్ రకం | నమూనాలను భూమికి తేవడం |
| ఆపరేటర్ | జాక్సా (JAXA) |
| COSPAR ID | 2003-019A |
| SATCAT no. | 27809 |
| మిషన్ వ్యవధి | 7 సంవత్సరాలు, 1 నెల and 4 రోజులు |
| అంతరిక్ష నౌక లక్షణాలు | |
| లాంచ్ ద్రవ్యరాశి | 510 kg[1] |
| డ్రై ద్రవ్యారాశి | 380 kg (840 lb) |
| మిషన్ ప్రారంభం | |
| ప్రయోగ తేదీ | 04:29:25, 2003 మే 9 (UTC) |
| రాకెట్ | M-V |
| లాంచ్ సైట్ | ఉచినోరా అంతరిక్ష కేంద్రం |
| మిషన్ ముగింపు | |
| పారవేయడం | నమూనాను తెచ్చే క్యాప్స్యూలు: భూమికి వచ్చింది నౌక: బాలిస్టిక్ పథంలో భూమికి వచ్చింది మినర్వా, రోవరు: సంపర్కం పోయింది |
| చివరి పరిచయం | మినర్వా: 2005 నవంబరు 12 |
| రికవరీ చేయబడిన తేదీ | నమూనా క్యాప్స్యూలు: 2010 జూన్ 14, 07:08 |
| Decay date | అంతరిక్ష నౌక: 2010 జూన్ 13 |
| ల్యాండింగ్ తేదీ | నమూనా క్యాప్స్యూలు: 2010 జూన్ 13 14:12 UT[2] |
| ల్యాండింగ్ ప్రదేశం | ఆస్ట్రేలియా లోని వూమెరా దగ్గరలో |
| మూస:Infobox spaceflight/Instruments | |
హయబూసా అనేది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) అభివృద్ధి చేసిన రోబోటిక్ అంతరిక్ష నౌక. 25143 ఇటోకావా అనే చిన్న సమీప గ్రహశకలం నుండి పదార్థ నమూనాను భూమికి తీసుకొచ్చేందుకు దీన్ని ప్రయోగించారు. హయబూసాకు తొలుత ము స్పేస్ ఇంజనీరింగ్ అంతరిక్ష నౌక సి (MUSES-C) అని పేరుపెట్టారు. 2003 మే 3 న న దీన్ని ప్రయోగించగా, 2005 సెప్టెంబరు మధ్యలో ఇటోకావాను చేరుకుంది. చేరుకున్న తరువాత హయబూసా, గ్రహశకలపు ఆకారం, స్పిన్, స్థలాకృతి, రంగు, కూర్పు, సాంద్రత, చరిత్రలను అధ్యయనం చేసింది. 2005 నవంబరులో ఇది గ్రహశకలంపై దిగి, చిన్న రేణువుల రూపంలో దాని నమూనాలను సేకరించింది. ఇవి 2010 జూన్ 13 న అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చాయి.
ఆ అంతరిక్ష నౌకలో MINERVA అనే విడదీయగల మినీల్యాండర్ కూడా ఉంది. కానీ అది గ్రహశకలం ఉపరితలంపై దిగడంలో విఫలమైంది.
మిషన్ ఫస్ట్స్
[మార్చు]
నాసా వారి గెలీలియో, నియర్ షూమేకర్ అంతరిక్ష నౌకలు అంతకుముందు గ్రహశకలాలను సందర్శించాయి. కానీ విశ్లేషణ కోసం గ్రహశకలం నమూనాను భూమికి తిరిగి తీసుకువచ్చిన మొదటి నౌక హయబూసాయే.[3]
హయబూసా ఉద్దేశపూర్వకంగా ఒక గ్రహశకలంపై దిగి, ఆపై మళ్లీ బయలుదేరడానికి రూపొందించబడిన మొదటి అంతరిక్ష నౌక (నియర్ షూమేకర్ 2000లో 433 ఎరోస్ ఉపరితలంపైకి నియంత్రిత అవరోహణ చేసింది. కానీ అది ల్యాండర్ లాగా రూపొందించబడలేదు. అది చేరిన తర్వాత చివరికి నిష్క్రియ అయిపోయింది). సాంకేతికంగా, హయబూసా "దిగడానికి" రూపొందించబడలేదు; అది కేవలం దాని నమూనా సంగ్రహణ పరికరంతో ఉపరితలాన్ని తాకి, ఆపై దూరంగా వెళుతుంది. అయితే, ఇది ఒక గ్రహశకలం యొక్క ఉపరితలంతో భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మొదటి నుంచే రూపొందించబడిన మొదటి నౌక. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ కు చెందిన జునిచిరో కవాగుచి ఈ మిషన్ కు నాయకుడు.[4]
రూపకర్తలు హయబూసాను క్షణికమైన స్పర్శ కోసమే ఉద్దేశించినప్పటికీ, అది గ్రహశకలం ఉపరితలంపై దిగి సుమారు 30 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయింది.
మిషన్ ప్రొఫైల్
[మార్చు]హయబూసా అంతరిక్ష నౌకను 2003 మే 9 న 04:29:25 UTCకి , ఉచినౌరా అంతరిక్ష కేంద్రం (ఆ సమయంలో దీనిని కగోషిమా అంతరిక్ష కేంద్రం అని పిలిచేవారు) నుండి ఒక M-V రాకెట్ ద్వారా ప్రయోగించారు. ప్రయోగం తరువాత, అంతరిక్ష నౌక పేరును దాని అసలు పేరైన MUSES-C నుండి హయబూసాగా మార్చారు. అంతరిక్ష నౌక లోని జెనాన్ అయాన్ ఇంజన్లు (నాలుగు వేర్వేరు యూనిట్లు), రెండు సంవత్సరాల పాటు దాదాపు నిరంతరాయంగా పనిచేస్తూ, 2005 సెప్టెంబరులో ఇటోకావాతో కలవడానికి హయబూసాను నెమ్మదిగా ముందుకు నడిపించాయి. అది అక్కడికి చేరుకున్నప్పుడు, అంతరిక్ష నౌక గ్రహశకలం చుట్టూ కక్ష్యలోకి వెళ్ళకుండా, దానికి సమీపంలోనే ఒక స్థిర సూర్యకేంద్రక కక్ష్యలో కొనసాగింది.

హయబూసా సుమారు 20 km (12 mi) దూరం లోని "గేట్ పొజిషన్" నుండి గ్రహశకలం ఉపరితలాన్ని సర్వే చేసింది. దీని తరువాత అంతరిక్ష నౌక ఉపరితలానికి మరింత దగ్గరగా ("హోమ్ పొజిషన్") కదిలింది. ఆపై వరుస సాఫ్ట్ ల్యాండింగ్‌ల కోసం, ఒక సురక్షిత ప్రదేశంలో నమూనాలను సేకరించడం కోసం గ్రహశకలాన్ని సమీపించింది. ఈ కాలంలో స్వయంప్రతిపత్తి గల ఆప్టికల్ నావిగేషన్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ఎందుకంటే సుదీర్ఘమైన కమ్యూనికేషన్ ఆలస్యం వలన భూమి నుండి రియల్-టైమ్‌లో ఆదేశాలను పంపడం కుదరదు. హయబూసా గ్రహశకలంపై దిగిన తక్షణమే, విస్తరించగల దాని సేకరణ హార్న్‌తో అంతరిక్ష నౌక ఉపరితలంపైకి చిన్న ప్రక్షేపకాలను విసిరి, దాని ఫలితంగా ఎగసిన దుమ్ము తుంపరలను సేకరించేలా దాన్ని ప్రోగ్రామ్ చేసారు. భూమికి తీసుకువచ్చి విశ్లేషించడం కోసం అంతరిక్ష నౌక కొన్ని చిన్న రేణువులను సేకరించింది.
గ్రహశకలానికి సమీపంలో కొన్ని నెలలు గడిపిన తర్వాత, అంతరిక్ష నౌక భూమికి తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇంజిన్‌లను మండించాల్సి ఉంది. అయితే, నౌక లోని యాటిట్యూడ్ కంట్రోల్ (దిశ), థ్రస్టర్‌లలోని సమస్యల కారణంగా ఈ విన్యాసం ఆలస్యమైంది. అది తన తిరుగు ప్రయాణ మార్గంలోకి వచ్చిన తర్వాత, భూ వాతావరణం లోకి తిరిగి ప్రవేశించడానికి మూడు గంటల ముందు ప్రధాన అంతరిక్ష నౌక నుండి రీ-ఎంట్రీ క్యాప్సూల్‌ను విడుదల చేశారు. ఆ క్యాప్సూల్ ఒక బాలిస్టిక్ పథంలో ప్రయాణిస్తూ, 2010 జూన్ 13 న 13:51 గంటలకు భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ క్యాప్సూల్ సుమారు 25 G గరిష్ట అవత్వరణాన్ని, అపోలో అంతరిక్ష నౌక అనుభవించిన దాని కంటే సుమారు 30 రెట్లు అధిక ఉష్ణోగ్రతలను అనుభవించిందని అంచనా. ఇది ఆస్ట్రేలియాలోని వూమెరా సమీపంలో పారాచూట్ ద్వారా నేలపై దిగింది.
మిషన్ ప్రొఫైల్‌కు సంబంధించి, హయబూసా అంతరిక్ష నౌక ప్రయోగానికి ముందు JAXA కొన్ని విజయ ప్రమాణాలను, మిషన్‌లోని ప్రధాన మైలురాళ్లకు సంబంధించిన స్కోర్‌లనూ నిర్వచించుకుంది.[5] హయబూసా అంతరిక్ష నౌక, కొత్త సాంకేతికతలను పరీక్షించడానికి ఒక వేదిక. ఈ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యం ప్రపంచంలోనే మొట్టమొదటి మైక్రోవేవ్ డిశ్చార్జ్ అయాన్ ఇంజిన్‌లను వాడడం. అందువల్ల '1000 గంటలకు పైగా అయాన్ ఇంజిన్‌లను పనిచేయించడం' అనేది 100 పాయింట్ల పూర్తి స్కోర్‌ను ఇచ్చే విజయం. మిగిలిన మైలురాళ్లు దానిపై నిర్మించిన, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రయోగాల శ్రేణి.

| హయబూసాకు విజయ ప్రమాణాలు | పాయింట్లు | స్థితి |
|---|---|---|
| అయాన్ ఇంజిన్ల పనితీరు | 50 పాయింట్లు | విజయం |
| 1000 గంటలకు పైగా అయాన్ ఇంజిన్ల ఆపరేషన్ | 100 పాయింట్లు | విజయం |
| అయాన్ ఇంజిన్‌లతో భూమి గురుత్వాకర్షణ సహాయం | 150 పాయింట్లు | విజయం |
| స్వయంప్రతిపత్తి నావిగేషన్‌తో ఇటోకావాతో కలయిక | 200 పాయింట్లు | విజయం |
| ఇటోకావా శాస్త్రీయ పరిశీలన | 250 పాయింట్లు | విజయం |
| ల్యాండింగు, నమూనా సేకరణ | 275 పాయింట్లు | విజయం |
| క్యాప్సూల్ తిరిగి పొందడం | 400 పాయింట్లు | విజయం |
| విశ్లేషణ కోసం నమూనాను తేవడం | 500 పాయింట్లు | విజయం |
మినర్వా మినీ-ల్యాండర్
[మార్చు]హయబూసా 591 గ్రాముల బరువు, సుమారు 10 సెం.మీ. పొడవు, 12 సెం.మీ. వ్యాసమూ ఉన్న MINERVA (MI cro- Nano Experimental Robot Vehicle for the Asteroid కు సంక్షిప్త రూపం) అనే పేరు పెట్టబడిన ఒక చిన్న మినీ- ల్యాండర్‌ను మోసుకెళ్లింది. వ్యోమనౌకను మోహరించే సమయంలో జరిగిన ఒక లోపం కారణంగా అది విఫలమైంది.
ఈ సౌరశక్తితో నడిచే వాహనం, ఇటోకావా యొక్క చాలా తక్కువ గురుత్వాకర్షణను సద్వినియోగం చేసుకోవడానికి రూపొందించబడింది. ఇది ఒక అంతర్గత ఫ్లైవీల్ అసెంబ్లీని ఉపయోగించి గ్రహశకలం ఉపరితలంపై దూకుతూ, రెండు అంతరిక్ష నౌకలు ఒకదానికొకటి కనిపించినప్పుడల్లా దాని కెమెరాల నుండి చిత్రాలను హయబూసాకు ప్రసారం చేస్తుంది.
మినర్వాను 2005 నవంబరు 12 న ప్రయోగించారు. భూమి నుండి ల్యాండర్‌ను విడుదల చేసే ఆదేశం పంపబడింది. కానీ ఆ ఆదేశం గమ్యస్థానానికి చేరకముందే, హయబూసా లోని ఆల్టిమీటర్ ఇటోకావా నుండి దాని దూరాన్ని 44 m (144 ft) గా కొలిచింది. తద్వారా స్వయంచాలక ఎత్తును నిలబెట్టుకునే క్రమం ప్రారంభమైంది. ఫలితంగా, MINERVA విడుదల ఆదేశం వచ్చినప్పుడు, ప్రోబ్ ఉద్దేశించిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఉంది, పైగా అది పైకి వెళ్తోంది. ఆ స్థితిలో MINERVA ను విడుదల చేసింది. దాంతో అది ఇటోకావా గురుత్వాకర్షణ శక్తి నుండి తప్పించుకుని అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది.[6][7]
ఒకవేళ అది విజయవంతమై ఉంటే, మినర్వా మొట్టమొదటి హాపింగ్ స్పేస్ రోవర్ అయ్యేది. సోవియట్ మిషన్ ఫోబోస్ 2 కూడా ఒక హాపింగ్ రోవర్‌ను మోహరించే ప్రయత్నంలో సాంకేతిక లోపాన్ని ఎదుర్కొంది.
శాస్త్రీయ, ఇంజనీరింగ్ ప్రాముఖ్యత
[మార్చు]గ్రహశకలాల గురించిన శాస్త్రవేత్తల అవగాహన ఉల్కా నమూనాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. కానీ ఉల్కా నమూనాలను, అవి ఎక్కడి నుండి వచ్చాయో ఆ గ్రహశకలాలతో ఖచ్చితంగా సరిపోల్చడం చాలా కష్టం. ఒక నిర్దుష్టమైన, బాగా వర్గీకరించబడిన గ్రహశకలం నుండి స్వచ్ఛమైన నమూనాలను తిరిగి తీసుకురావడం ద్వారా హయబూసా ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. హయబూసా గ్రహశకలాల భూ పరిశీలన డేటా, ఉల్క విశ్వ ధూళి సేకరణల ప్రయోగశాల విశ్లేషణ మధ్య అంతరాన్ని తగ్గించింది. అలాగే హయబూసాలోని ఆన్‌బోర్డ్ పరికరాల నుండి వచ్చిన డేటాను <i id="mwyA">నియర్ షూమేకర్</i> మిషన్ నుండి వచ్చిన డేటాతో పోల్చడం జ్ఞానాన్ని విస్తృత స్థాయికి తీసుకువెళుతుంది.
మిషన్ ప్రణాళికలో మార్పులు
[మార్చు]హయబూసా మిషన్ ప్రొఫైల్‌ను ప్రయోగానికి ముందు, తర్వాత కూడా అనేక సార్లు సవరించారు.
- ఈ అంతరిక్ష నౌకను వాస్తవానికి 2002 జూలైలో 4660 నెరియస్ అనే గ్రహశకలం వద్దకు ప్రయోగించాలని ఉద్దేశించారు (ప్రత్యామ్నాయ లక్ష్యంగా 10302) 1989 ML అనే గ్రహశకలాన్ని పరిగణించారు). అయితే, 2000 జూలైలో జపాన్ వారి M-5 రాకెట్ విఫలమవడంతో ప్రయోగం ఆలస్యం అయింది. దీనివల్ల నెరియస్, 1989 ML రెండూ అందుబాటులో లేకుండా పోయాయి. ఫలితంగా, లక్ష్య గ్రహశకలాన్ని 1998 SF<sub>36</sub> గా మార్చారు. ఆ తర్వాత కొద్దికాలానికే దీనికి జపనీస్ రాకెట్ మార్గదర్శకుడు హిడియో ఇటోకావా పేరు పెట్టారు.[8]
- హయబూసా, నాసా సరఫరా చేసి జెపిఎల్ అభివృద్ధి చేసిన మ్యూసెస్-సిఎన్ అనే ఒక చిన్న రోవర్‌ను గ్రహశకలం ఉపరితలంపైకి పంపాల్సి ఉంది. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా 2000 నవంబరులో నాసా ఆ రోవర్‌ను రద్దు చేసింది.
- 2002 లో దాని రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్ O-రింగ్‌లలో ఒకటి నిర్దేశించిన దానికంటే భిన్నమైన పదార్థాన్ని ఉపయోగిస్తున్నట్లు కనుగొనబడినందున, వాటిని తిరిగి తనిఖీ చేయడానికి ప్రయోగాన్ని 2002 డిసెంబరు నుండి 2003 మేకి వాయిదా వేసారు.[9]
- 2003లో, హయబూసా ఇటోకావాకు వెళ్లే మార్గంలో ఉండగా, చరిత్రలో నమోదైన అతిపెద్ద సౌర జ్వాల అంతరిక్ష నౌకలోని సౌర ఘటాలను దెబ్బతీసింది. విద్యుత్ శక్తిలో ఈ తగ్గుదల వలన అయాన్ ఇంజిన్ల సామర్థ్యం తగ్గిపోయింది. తద్వారా ఇటోకావాకు చేరుకోవడం 2005 జూన్ నుండి సెప్టెంబరు దాకా ఆలస్యమైంది. కక్ష్య యాంత్రిక శాస్త్రం ప్రకారం అంతరిక్ష నౌక 2005 నవంబరు నాటికి గ్రహశకలాన్ని విడిచిపెట్టవలసి ఉన్నందున, అది ఇటోకావాలో గడపగలిగిన సమయం బాగా తగ్గిపోయింది. గ్రహశకలంపై ల్యాండింగ్‌ల సంఖ్య మూడు నుండి రెండుకు తగ్గించారు.
- 2005లో, హయబూసా గమనాన్ని నియంత్రించే రెండు రియాక్షన్ వీల్స్ విఫలమయ్యాయి; X-యాక్సిస్ చక్రం జూలై 31న, Y-యాక్సిస్ చక్రం అక్టోబర్ 2న విఫలమయ్యాయి. ఈ రెండవ వైఫల్యం తర్వాత కూడా, అంతరిక్ష నౌక తన థ్రస్టర్లతో X, Y అక్షాలపై తిరగగలిగింది. ఇటోకావా గ్లోబల్ మ్యాపింగ్ పూర్తయినందున ఇది పెద్ద సమస్య కాదని JAXA పేర్కొన్నప్పటికీ, మిషన్ ప్రణాళికను మార్చారు. విఫలమైన రియాక్షన్ వీల్స్‌ను న్యూయార్క్‌కు చెందిన ఇథాకో స్పేస్ సిస్టమ్స్, ఇంక్. తయారు చేసింది. దీనిని తరువాత గూడ్రిచ్ కంపెనీ కొనుగోలు చేసింది.
- 2005 నవంబరు 4 న ల్యాండింగ్ 'రిహార్సల్' విఫలమై, ల్యాండింగు వాయిదా పడింది.
- గ్రహశకలంపై రెండు వేర్వేరు ప్రదేశాల నుండి నమూనాలను సేకరించాలన్న ఒరిజినల్ నిర్ణయాన్ని మార్చారు. ఆ ప్రదేశాలలో ఒకటైన వూమెరా ఎడారి, సురక్షితంగా దిగడానికి చాలా రాతిమయంగా ఉందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- 2005 నవంబరు 12 న జరిగిన మినర్వా మినీప్రోబ్ విడుదల విఫలమైంది.
డిసెంబర్ 8న, దిశ ఆకస్మికంగా మారినట్లు గమనించారు. హయబూసాతో కమ్యూనికేషన్ తెగిపోయింది. లీకైన 8 లేదా 10 సిసి ఇంధనం ఆవిరైపోవడం వల్ల ఈ అల్లకల్లోలం ఏర్పడి ఉండవచ్చని భావించారు. దీనివల్ల, ప్రిసెషన్‌ను స్వచ్ఛమైన భ్రమణంగా మార్చడం ద్వారా హయబూసా స్థిరపడటానికి ఒకటి లేదా రెండు నెలలు వేచి ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత భ్రమణాక్షాన్ని ఒక నిర్దిష్ట కోణ పరిధిలో సూర్యుడు, భూమి వైపు మళ్లించవలసి వచ్చింది. దీనిని సాధించే సంభావ్యత 2006 డిసెంబరు నాటికి 60%, 2007 వసంతకాలం నాటికి 70%గా అంచనా వేసారు.[10][11]
కోలుకోవడం, భూమికి తిరిగి రావడం
[మార్చు]
· ·
7 మార్చి 2006న, హయబూసాతో కమ్యూనికేషన్ ఈ క్రింది దశలలో పునరుద్ధరించబడిందని JAXA ప్రకటించింది [12] [13] : 23 జనవరిన, ప్రోబ్ నుండి బీకన్ సిగ్నల్ గుర్తించబడింది. 26 జనవరిన, గ్రౌండ్ కంట్రోల్ నుండి వచ్చిన ఆదేశాలకు ప్రోబ్ స్పందించి బీకన్ సిగ్నల్‌ను మార్చింది. 6 ఫిబ్రవరిన, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడానికి యాటిట్యూడ్ కంట్రోల్ కోసం గ్జీనాన్ ప్రొపెల్లెంట్‌ను బయటకు పంపమని ఆదేశించబడింది. స్పిన్ యాక్సిస్ మార్పు రేటు రోజుకు సుమారు రెండు డిగ్రీలు. 25 ఫిబ్రవరిన, తక్కువ-గెయిన్ యాంటెన్నా ద్వారా టెలిమెట్రీ డేటా పొందబడింది. 4 మార్చిన, మీడియం-గెయిన్ యాంటెన్నా ద్వారా టెలిమెట్రీ డేటా పొందబడింది. 6 మార్చిన, హయబూసా యొక్క స్థానం సుమారు 13,000 వద్ద నిర్ధారించబడింది. దాని కక్ష్యలో ఇటోకావాకు కి.మీ. ముందు, సెకనుకు 3 m సాపేక్ష వేగంతో తిరుగుతోంది.
జూన్ 1న, హయబూసా ప్రాజెక్ట్ మేనేజర్ జునిచిరో కవాగుచి [14] నాలుగు అయాన్ ఇంజిన్‌లలో రెండు మామూలుగా పనిచేస్తున్నాయని నివేదించాడు. ఇది తిరుగు ప్రయాణానికి సరిపోతుంది. 2007 జనవరి 30 న 11 బ్యాటరీలలో 7 పనిచేస్తున్నాయనీ, రిటర్న్ క్యాప్సూల్‌ను సీలు చేసామనీ JAXA నివేదించింది. ఏప్రిల్ 25న, హయబూసా తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించిందని JAXA చెప్పింది.[15][16] ఆగస్టు 29న, B, Dతో పాటు, హయబూసాలోని అయాన్ ఇంజిన్ C కూడా విజయవంతంగా తిరిగి మండించబడిందని ప్రకటించబడింది. [17] అక్టోబరు 29న, పథం విన్యాస ఆపరేషన్ యొక్క మొదటి దశ ముగిసిందనీ అంతరిక్ష నౌక ఇప్పుడు స్పిన్-స్థిరీకరించబడిన స్థితిలో ఉందనీ JAXA నివేదించింది.[18] 2009 ఫిబ్రవరి 4 న అయాన్ ఇంజిన్‌లను తిరిగి మండించడంలో, భూమికి తిరిగి రావడానికి పథం దిద్దుబాటు విన్యాసపు రెండవ దశను ప్రారంభించడంలో విజయం సాధించినట్లు JAXA నివేదించింది. [19] 2009 నవంబరు 4 న అయాన్ ఇంజిన్ D స్వయంచాలకంగా పనిచేయడం ఆగిపోయింది.[20]
2009 నవంబరు 19 న అయాన్ ఇంజిన్ B లోని అయాన్ జనరేటర్‌ను అయాన్ ఇంజిన్ A న్యూట్రలైజర్‌ను కలపగలిగామని JAXA ప్రకటించింది [21] ఇది ఉత్తమమైనది కానప్పటికీ, అవసరమైన డెల్టా-విని ఉత్పత్తి చేయడానికి సరిపోతుందని భావించారు. భూమికి తిరిగి రావడానికి అవసరమైన 2,200 m/s డెల్టా-విలో, సుమారు 2,000 m/s ఇప్పటికే సాధించబడింది. ఇంకా సుమారు 200 m/s అవసరం. [22] 2010 మార్చి 5 న హయబూసా, చంద్రుని కక్ష్య లోపల నుండి వెళ్ళే పథంలో ఉంది. భూమి-అంచు పథానికి ట్రాజెక్టరీ కరెక్షన్ మనూవర్ 1 ని నిర్వహించడానికి సన్నాహకంగా ఖచ్చితమైన పథాన్ని కొలవడానికి అయాన్ ఇంజిన్ ఆపరేషన్ నిలిపివేయబడింది.[23] [24] మార్చి 27 06:17 UTCన హయబూసా, భూ కేంద్రం నుండి 20,000 కిలోమీటర్ల ఎత్తు నుండి వెళ్ళే పథంలో ఉంది. దాంతో ఇటోకావా నుండి భూమికి కక్ష్య బదిలీ ఆపరేషన్‌ను పూర్తయింది.[25] ఏప్రిల్ 6 నాటికి, ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్యువర్ (TCM-0) మొదటి దశ పూర్తయింది. ఇది సుమారుగా భూమి అంచు ట్రాజెక్టరీకి దారితీసింది. తిరిగి ప్రవేశించడానికి 60 రోజులు పడుతుందని ప్రణాళిక చేసారు.[26][27][28][29] మే 4 నాటికి, ప్రోబ్ భూమి అంచు ట్రాజెక్టరీకి ఖచ్చితంగా సమలేఖనం చేయడానికి దాని TCM-1 మనూవర్‌ను పూర్తి చేసింది. [30] మే 22న, TCM-2 ప్రారంభమై, సుమారు 92.5 గంటల పాటు కొనసాగి, మే 26న ముగిసింది.[31] దీని తరువాత జూన్ 3 నుండి 5 వరకు TCM-3 ని నిర్వహించారు. ఇది ట్రాజెక్టరీని భూమి అంచు నుండి దక్షిణ ఆస్ట్రేలియాలోని వూమెరాకు మార్చింది. [32] [33] వూమెరా నిషేధిత ప్రాంతానికి ఖచ్చితమైన అవరోహణ కోసం జూన్ 9న సుమారు 2.5 గంటల పాటు TCM-4 నిర్వహించారు.[34]
పునఃప్రవేశం క్యాప్సూల్ పునరుద్ధరణ
[మార్చు]
రీఎంట్రీ క్యాప్సూల్, అంతరిక్ష నౌక 2010 జూన్ 13 న 13:51 UTC (స్థానిక సమయం 23:21)కి భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించాయి. [35] ఉష్ణ-రక్షిత క్యాప్సూల్ దక్షిణ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతంలో పారాచూట్ ల్యాండింగ్ చేయగా, అంతరిక్ష నౌక ముక్కలై ఒక పెద్ద అగ్నిగోళంలాగా కాలిపోయింది. [36]
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం 12.2 కి.మీ./సె వేగంతో వస్తున్న క్యాప్స్యూలును 11.9 kilometres (39,000 feet) ఎత్తు నుండి నాసా యొక్క ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ నేతృత్వంలోని ఒక మిషన్‌లో, SETI ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పీటర్ జెన్నిస్కెన్స్ ప్రాజెక్ట్ శాస్త్రవేత్తగా, నాసా యొక్క DC-8 ఎయిర్‌బోర్న్ లాబొరేటరీలో క్యాప్సూల్ పునఃప్రవేశాన్ని, వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే సమయంలో భౌతిక పరిస్థితులను కొలవడానికి విస్తృత శ్రేణి ఇమేజింగ్, స్పెక్ట్రోగ్రాఫిక్ కెమెరాలను ఉపయోగించి అధ్యయనం చేశారు. [37] [38]
ప్రతిచర్య నియంత్రణ వ్యవస్థ ఇకపై పనిచేయనందున, 510 కిలోల అంతరిక్ష పరిశోధక నౌక, నమూనాల క్యాప్సూల్‌తో పాటు ఒక గ్రహశకలం సమీపించినట్లుగా భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించింది. మిషన్ శాస్త్రవేత్తలు ఊహించినట్లుగానే, ప్రవేశించిన వెంటనే అంతరిక్ష నౌకలో ఎక్కువ భాగం విచ్ఛిన్నమైపోయింది.[39]

తిరిగి వచ్చే క్యాప్సూల్ దక్షిణ ఆస్ట్రేలియాలోని వూమెరా నిషేధిత ప్రాంతంలో 20 km x 200 km విస్తీర్ణంలో దిగుతుందని అంచనా వేసారు. నాలుగు గ్రౌండ్ బృందాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఆప్టికల్ పరిశీలన, రేడియో బీకాన్ ద్వారా రీ-ఎంట్రీ క్యాప్సూల్‌ను గుర్తించాయి. అప్పుడు హెలికాప్టర్‌లో ఒక బృందాన్ని పంపారు. వారు క్యాప్సూల్‌ను గుర్తించి, GPSతో దాని స్థానాన్ని నమోదు చేశారు. 2010 జూన్ 14 న 07:08 UTC (స్థానిక సమయం 16:38)కి క్యాప్సూల్‌ను విజయవంతంగా సేకరించారు.[40] కిందకు దిగేటప్పుడు విసిరివేయబడిన హీట్ షీల్డ్ లోని రెండు భాగాలను కూడా కనుగొన్నారు.[41]
నమూనాలపై శాస్త్రీయ అధ్యయనం
[మార్చు]ప్లాస్టిక్ సంచి రక్షణ నుండి క్యాప్సూల్‌ను బయటకు తీయడానికి ముందు, దాని పరిస్థితిని నిర్ధారించడానికి ఎక్స్-రే CT ఉపయోగించి దానిని తనిఖీ చేశారు. అప్పుడు రీఎంట్రీ క్యాప్సూల్ నుండి నమూనా కానిస్టర్‌ను బయటకు తీశారు. కానిస్టర్ ఉపరితలాన్ని స్వచ్ఛమైన నత్రజని వాయువు, కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి శుభ్రం చేశారు. తరువాత దానిని కానిస్టరును తెరిచే పరికరంలో ఉంచారు. క్లీన్ ఛాంబర్‌లోని పరిసర నత్రజని వాయువు పీడనాన్ని మార్చినప్పుడు కానిస్టర్‌లో కలిగే స్వల్ప వైకల్యాన్ని బట్టి కానిస్టర్ లోని అంతర్గత పీడనాన్ని నిర్ధారించారు. కానిస్టర్ తెరిచినప్పుడు నమూనా నుండి ఏ వాయువు కూడా బయటకు రాకుండా నిరోధించడానికి, నత్రజని వాయువు పీడనాన్ని అంతర్గత కానిస్టర్ పీడనానికి సరిగ్గా సరిపోయేలా సర్దుబాటు చేశారు.[42]
గ్రహశకల కణాల నిర్ధారణ
[మార్చు]2010 నవంబరు 16 న నమూనాలను తెచ్చిన హయబూసా క్యాప్సూల్‌లోని రెండు కంపార్ట్‌మెంట్‌లలో ఒకదానిలో ఉన్న చాలా కణాలు ఇటోకావా నుండే వచ్చాయని JAXA ధృవీకరించింది.[43] JAXA పత్రికా ప్రకటన ప్రకారం, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో చేసిన విశ్లేషణలో సుమారు 1,500 రాతి కణాలను గుర్తించారు.[44] విశ్లేషణ ఫలితాలను మరింత అధ్యయనం చేసి, ఖనిజ కూర్పులను పోల్చిన తర్వాత, వాటిలో చాలా వరకు గ్రహాంతర మూలానికి చెందినవనీ, ఖచ్చితంగా ఇటోకావా గ్రహశకలం నుండి వచ్చినవేననీ నిర్ధారించారు. [45]
జపనీస్ శాస్త్రవేత్తల ప్రకారం, హయబూసా నమూనాల లోని పదార్థాల కూర్పు, భూమిపై తెలిసిన శిలల కంటే ఉల్కలను ఎక్కువగా పోలి ఉంది. వాటి పరిమాణం ఎక్కువగా 10 మైక్రోమీటర్ల కంటే తక్కువగా ఉంది.[46] ఈ పదార్థం హయబూసా రిమోట్ సెన్సింగ్ పరికరాలు విశ్లేషించిన ఇటోకావా రసాయన పటాలతో సరిపోలుతోంది. పరిశోధకులు హయబూసా నమూనాలలో ఒలివిన్, పైరాక్సీన్ సాంద్రతలను కనుగొన్నారు.
పరిశోధన తదుపరి దశలో కణాలను కలుషితం కాకుండా నివారించడానికి పరిశోధకులు ప్రత్యేక నిర్వహణ విధానాలను ఇంకా అభివృద్ధి చేస్తున్నందున, నమూనాల తదుపరి అధ్యయనాన్ని 2011 వరకు వాయిదా వేయవలసి వచ్చింది.
2013లో JAXA, ఒలివిన్, పైరాక్సీన్, ప్లాజియోక్లేస్, ఐరన్ సల్ఫైడ్ వంటి ఖనిజాలతో కూడిన 1500 గ్రహాంతర రేణువులను కనుగొన్నట్లు ప్రకటించింది. ఆ రేణువులు సుమారు 10 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉన్నాయి. JAXA, SPring-8 వద్ద కణాలను విభజించి, వాటి స్ఫటిక నిర్మాణాన్ని పరిశీలించడం ద్వారా నమూనాలపై వివరణాత్మక విశ్లేషణలు నిర్వహించింది.[47]
ఫలితాలు
[మార్చు]సైన్స్ పత్రిక 2011 ఆగస్టు 26 సంచిక, హయబూసా సేకరించిన ధూళి ఆధారంగా కనుగొన్న విషయాలపై ఆరు వ్యాసాలు ప్రచురించింది.[48] ఇటోకావా నుండి వచ్చిన ధూళిపై శాస్త్రవేత్తల విశ్లేషణ, అది బహుశా మొదట ఒక పెద్ద గ్రహశకలంలో భాగంగా ఉండేదని సూచించింది. గ్రహశకలం ఉపరితలం నుండి సేకరించిన ధూళి సుమారు 80 లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉందని భావిస్తున్నారు.[48]
ఇటోకావా నుండి వచ్చిన ధూళి "ఉల్కలలో ఉండే పదార్థంతో సమానంగా" ఉందని కనుగొన్నారు.[48] ఇటోకావా ఒక S-రకం గ్రహశకలం. దీని కూర్పు LL కాండ్రైట్‌తో సరిపోలుతుంది.[49]
ఇవి కూడా చూడండి
[మార్చు]- హయబూసా2 – ర్యుకు గ్రహశకాలనికి జపాన్ చేసిన యాత్ర
- OSIRIS-REx – నాసా వారి గ్రహశకల నమూనాను తెచ్చే యాత్ర (2016-2023)
మూలాలు
[మార్చు]- ↑ "Hayabusa". NASA's Solar System Exploration website. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 30, 2022.
- ↑ "Beyond Earth: A Chronicle of Deep Space Exploration". 20 September 2018.
- ↑ Amos, Jonathan (14 June 2010). "Hayabusa asteroid-sample capsule recovered in Outback". BBC News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 May 2011.
- ↑ "Two-Way Asteroid Trip Takes Off". Astrobiology Magazine. NASA. 12 May 2003. ఒరిజినల్ నుండి 2021-02-25 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2010.
- ↑ "Hot Information HAYABUSA: Resumption of return cruise by combining two ion engines" (PDF). JAXA. 24 November 2009. the original నుండి 13 April 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 November 2009.
- ↑ Oberg, James (14 November 2005). "Asteroid-hopping robot misses its mark". NBC News. the original నుండి 13 August 2014 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 March 2009.
- ↑ "分離後の「ミネルバ」が「はやぶさ」を撮影". JAXA. 13 November 2005. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 April 2009.
- ↑ "Japan's Hayabusa [MUSES-C] Swings By Earth on Way to Asteroid Itokawa – Planetary News | The Planetary Society". Planetary.org. 20 May 2004. the original నుండి 28 November 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ (October 2010). "MUSES-C 打ち上げ延期". ISAS.
- ↑ Japan Aerospace Exploration Agency (14 December 2005). "Status of the Hayabusa / Topics". ISAS. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ in はやぶさリンク. "[Hayabusa link]: Press Conference on 14th Dec.: 松浦晋也のL/D". Smatsu.air-nifty.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ Japan Aerospace Exploration Agency. "Current Status of Hayabusa Spacecraft – Communication and Operation Resumption / Topics". ISAS. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ in はやぶさリンク. "本日午後7時からの記者会見: 松浦晋也のL/D". Smatsu.air-nifty.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ Japan Aerospace Exploration Agency (1 June 2006). "Recent Status of Hayabusa spacecraft as of the end of May, 2006 / Topics". ISAS. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ 宇宙航空研究開発機構(JAXA)宇宙科学研究所. "「はやぶさ」地球帰還に向けた本格巡航運転開始! / トピックス". ISAS. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ "Hayabusa leaves for Earth". JAXA. 1 May 2007. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ "Hayabusa project top". Hayabusa.isas.jaxa.jp. 28 July 2007. the original నుండి 17 May 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ "Hayabusa Finished First Leg of Orbit Maneuver toward Earth". 29 October 2007. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ Japan Aerospace Exploration Agency (4 February 2009). "HAYABUSA: Firing ion engine and starting second phase orbit maneuver to return to Earth / Topics". ISAS. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ "Asteroid Explorer "HAYABUSA" Ion Engine Anomaly" (Press release). JAXA. 9 November 2009. the original నుండి 23 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2009.
- ↑ "Restoration of Asteroid Explorer, HAYABUSA's Return Cruise" (Press release). JAXA. 19 November 2009. the original నుండి 23 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2009.
- ↑ Shinya Matsuura (19 November 2009). "はやぶさリンク:はやぶさ、帰還に向けてイオンエンジン再起動". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2009.
- ↑ 小惑星探査機「はやぶさ」 (in జపనీస్). 10 March 2010. the original నుండి 16 March 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 March 2010.
- ↑ 軌道情報 (in జపనీస్). 5 March 2010. the original నుండి 16 June 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 March 2010.
- ↑ 小惑星探査機「はやぶさ」搭載イオンエンジンの連続運転による軌道制御の終了について (in జపనీస్). JAXA. 27 March 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 March 2010.
- ↑ 小惑星探査機「はやぶさ」搭載カプセルの地球帰還について [Regarding the Arrival of Return Capsule of the Asteroid Probe "Hayabusa"] (in జపనీస్). JAXA. 21 April 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 April 2010.
- ↑ Jun'ichiro Kawaguchi (12 April 2010). 軌道情報 (in జపనీస్). JAXA. the original నుండి 27 March 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 April 2010.
- ↑ 本日より (in జపనీస్). 6 April 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2010.
- ↑ JAXA Space Exploration Center (31 March 2010). 「はやぶさ」試料回収カプセルの再突入に係る計画について (PDF) (in జపనీస్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 March 2010.
- ↑ "TCM-1 operation was successfully completed". 4 May 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 May 2010.
- ↑ "Hayabusa Live Archive". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 May 2010.
- ↑ "TCM-3 operation started, shift the target from Earth's outer rim to WPA". 3 June 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 June 2010.
- ↑ "TCM-3 operation completed, shift the target from Earth's outer rim to WPA". 5 June 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 June 2010.
- ↑ "TCM-4 operation completed, precise guidance to WPA". 9 June 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 June 2010.
- ↑ Mission Accomplished For Japan's Asteroid Explorer Hayabusa Archived 16 జూన్ 2010 at the Wayback Machine
- ↑ "Space Probe, Perhaps with a Chunk of Asteroid, Returns to Earth Sunday". Space.com. 13 June 2010. the original నుండి 16 June 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 June 2010.
- ↑ "Hayabusa Re-Entry airborne observing campaign". The SETI Institute. the original నుండి 28 June 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 May 2010.
- ↑ "NASA Team Captures Hayabusa Spacecraft Reentry". NASA. 14 June 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ Ryall, Julian (11 June 2009). "Asteroid Probe Set to "Collide" With Earth". National Geographic. the original నుండి 14 June 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 June 2010.
- ↑ "Retrieving the Capsule completed". JAXA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ Jonathan Amos (14 June 2010). "Hayabusa asteroid-sample capsule recovered in Outback". BBC News. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 June 2010.
- ↑ "JAXA's 032" (PDF) (in జపనీస్). JAXA. the original (PDF) నుండి 17 June 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 June 2010.
- ↑ "Identification of origin of particles brought back by Hayabusa". JAXA. 16 November 2010. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2010.
- ↑ Stephen Clark (17 November 2010). "Japan says Hayabusa brought back asteroid grains". Spaceflight Now. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 November 2010.
- ↑ Dennis Normile (16 November 2010). "Spacecraft Successfully Returns Asteroid Dust". Science. the original నుండి 20 November 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2010.
- ↑ Tariq Malik (16 November 2010). "Asteroid Dust Successfully Returned by Japanese Space Probe". SPACE.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 17 November 2010.
- ↑ "Dust in Hayabusa asteroid probe capsule could be extraterrestrial". Mainichi Shimbun. 7 October 2010. the original నుండి 9 October 2010 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 6 November 2010.
- 1 2 3 "Asteroid Dust Confirms Meteorite Origins". New York Times. 25 August 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2011."Asteroid Dust Confirms Meteorite Origins".
- ↑ "Most Earth meteorites linked to single asteroid". Los Angeles Times. 26 August 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2011.