హరప్రసాద్ శాస్త్రి

మహామహోపాధ్యాయ హరప్రసాద్ శాస్త్రి ( బెంగాలీ) : হরপ্রসাদ শ্ত্রী) (డిసెంబర్ 6, 1853 - నవంబర్ 17, 1931) ఒక భారతీయ విద్యావేత్త, సంస్కృత పండితుడు, ఇండాలజిస్ట్, బెంగాలీ సాహిత్య చరిత్రకారుడు. ఆయన అసలు పేరు 'హర్ ప్రసాద్ భట్టాచార్య'. బెంగాలీ సాహిత్యానికి పురాతన ఉదాహరణ అయిన చర్యపదను కనుగొన్నందుకు ఆయన ప్రసిద్ధి చెందారు.
జీవిత విశేషాలు
[మార్చు]హర్ ప్రసాద్ శాస్త్రి బ్రిటిష్ బెంగాల్ లోని ఖుల్నా జిల్లాలోని కుమిరా గ్రామంలో జన్మించారు. ఇది ఆసమయంలో ఇప్పటొ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఒకటి. ఆయన అక్కడ గ్రామ పాఠశాలలో ప్రాథమిక విద్యను పొందిన తరువాత, ఆయన కలకత్తా సంస్కృత కాలేజియేట్ పాఠశాల, ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. కలకత్తాలో ఆయన తన అన్నయ్య నందకుమార్ న్యాయచంచు, ప్రముఖ సంఘ సంస్కర్త, పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లతో నివసించారు. 1871 సంవత్సరంలో ఆయన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1873 సంవత్సరంలో ఆయన 'ఫస్ట్ ఆర్ట్స్ ఎగ్జామినేషన్'లో ఉత్తీర్ణులయ్యారు. 1876 సంవత్సరంలో ఆయన బి.ఎ. డిగ్రీని పొందారు. 1877 సంవత్సరంలో సంస్కృతంలో ఆనర్స్ పొందారు. తరువాత ఆయన ఎం.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై 'శాస్త్రి' బిరుదును పొందారు. ఈ పరీక్షలో హర్ ప్రసాద్ మొదటి డివిజన్ లో ఉత్తీర్ణుడయ్యారు.
రచనలు
[మార్చు]- కాంచనమల
- బన్యేరే మేయే (ది బనియాస్ డాటర్)
- బాల్మీకి జయ
- మేఘదూత్ వ్యాఖ్య
- సచిత్ర రామాయణ
- ప్రాచిన్ బంగాల్ గౌరబ్
- బౌద్ధధర్మ