హరిహర్ కోట
| హర్షగడ్ | |
|---|---|
| हर्षगड | |
| త్రయంబక్ శ్రేణి లో భాగం | |
| త్రయంబకేశ్వర్ తహసీల్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర | |
కోటంవాడి నుండి హరిహర్ కోట | |
| భౌగోళిక స్థితి | 19°54′17.9″N 73°28′19.2″E / 19.904972°N 73.472000°E |
| రకము | కొండ కోట |
| ఎత్తు | 3676 Ft. |
| స్థల సమాచారం | |
| సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | ఉంది |
| పరిస్థితి | శిధిలావస్థలో |
| స్థల చరిత్ర | |
| వాడిన వస్తువులు | రాయి, ఇటుకలు, క్షారము |
హరిహర్ కోట (హర్షగఢ్ కోట) భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రం లోని నాసిక్ జిల్లా ఘోటి నుండి 40 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది నాసిక్ జిల్లాలోని ఒక ముఖ్యమైన కోట, గోండా ఘాట్ గుండా వెళ్లే వాణిజ్య మార్గాన్ని చూడటానికి దీనిని నిర్మించారు. ఇది మహారాష్ట్రలోని అత్యంత ప్రమాదకరమైన ట్రెక్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది సముద్ర మట్టానికి 3,676 అడుగుల ఎత్తులో ఉంది. హరిహర్ కోటను అధిరోహించడానికి, దిగడానికి ఒక మీటరు వెడల్పు గల రాతి మెట్లు చెక్కబడ్డాయి. ఇవి మొత్తం 117 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు అన్ని దాదాపు ఎనభై డిగ్రీలు నిటారుగా ఉంటాయి. ఇలా నిటారుగా ఉండడం వలన వీటిని స్వర్గానికి మెట్లు అని కూడా పిలుస్తారు.[1]
చరిత్ర
[మార్చు]హరిహర్ కోటను సేయునా (యాదవ) రాజవంశ కాలంలో నిర్మించారు. శత్రు సైన్యం సులభంగా లోపలికి ప్రవేశించలేని విధంగా ఈ కోటను రూపొందించారు. దీనిని 1636 సంవత్సరంలో త్రయంబక్, ఇతర పూణే కోటలతో పాటు ఖాన్ జమామ్‌కు అప్పగించారు.[2] 1818 సంవత్సరంలో 17 ఇతర కోటలతో పాటు ఈ కోటను కూడా కెప్టెన్ బ్రిగ్స్ స్వాధీనం చేసుకున్నాడు.[3] హరిహర్ కోట దాని క్రింద గ్రామం నుండి చూస్తే దీర్ఘచతురస్రాకారంలో కనిపిస్తుంది. ఇది త్రిభుజాకార రాతి పట్టకంపై నిర్మించబడింది. దీని మూడు ముఖాలు, రెండు అంచులు 90 డిగ్రీల వద్ద నిలువుగా ఉంటాయి. పశ్చిమం వైపు మూడవ అంచు 75 డిగ్రీల కోణంలో వంపుతిరిగి ఉంటుంది. నిర్గుడ్‌పాడ గ్రామం వైపు ఉన్న హరిహర్ కోట నిలువు ముఖాన్ని "స్కాటిష్ కడా" అని పిలుస్తారు, ఈ కొండ దాదాపు 170 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనిని 1986 సంవత్సరంలో బ్రిటిష్ పర్వతారోహకుడు డగ్ స్కాట్ మొదటిసారిగా అధిరోహించడము వలన దీనికి పర్వతారోహకుడు డగ్ స్కాట్ పేరు పెట్టారు. నేడు, కోటలో ఒక చిన్న భాగం మాత్రమే మిగిలి ఉంది.
అధిరోహణ
[మార్చు]హరిహర్ కోట ట్రెక్కింగ్ చేయడానికి ఉత్తమ సమయం డిసెంబర్ - ఫిబ్రవరి, ఈ సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో ఈ కోట మీదకి ట్రెక్కింగ్ నిషేధించబడింది. [4]
గ్యాలరీ
[మార్చు]-
చుట్టూ కొండలు
-
నిలువు మెట్లు
-
కోట ప్రధాన ద్వారం
-
రెండవ ద్వారం ప్రవేశ మార్గం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ India, Nomads of (2023-06-28). "Harihar Fort Trek Ultimate Guide (2024)". Nomads of India. Retrieved 2025-04-01.
- ↑ "Nasik District Gazetteers". Cultural.maharashtra.gov.in. 1965-03-31. Retrieved 2022-08-11.
- ↑ "Harihar Fort". Fort Trek. Archived from the original on 13 June 2021. Retrieved 2020-11-17.
- ↑ "Harihar, Sahyadri,Shivaji,Trekking,Marathi,Maharastra". Archived from the original on 26 February 2019. Retrieved 28 December 2016.