Jump to content

హరి గౌర

వికీపీడియా నుండి
హరి గౌర
Born14 మార్చి[1]
Occupationsసంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత
Years active2013–ప్రస్తుతం

హరి గౌర భారతదేశానికి చెందిన సంగీతదర్శకుడు, గిటారిస్ట్, గాయకుడు, గీత రచయిత.[2] ఆయన 2013లో కన్నడ సినిమా చార్మినార్‌తో సినీ సంగీత దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2013లో తుంగభద్ర సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకుగాను 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ కంపోజర్‌ అవార్డును అందుకున్నాడు.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

గౌర హరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించి, తణుకులోని SFS పాఠశాలలో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు. ఆయన ఆ తరువాత తణుకులోని SCIM ప్రభుత్వ కళాశాలలో చదివాడు. గౌర హరి సంగీతం పట్ల ఆసక్తితో 2010లో బీఎస్సీ మూడవ సంవత్సరంలో చదువు ఆపివేసి సంగీతం వైపు అడుగు వేశాడు.

సినీ జీవితం

[మార్చు]

హరి గౌర 2013లో కన్నడ సినిమా చార్మినార్‌తో సినీ సంగీత దర్శకుడిగా అరంగ్రేటం చేసి 2015లో తుంగభద్ర సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి 2015లో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమాకుగాను 2015 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో సంవత్సరపు ఉత్తమ కంపోజర్‌ అవార్డును అందుకున్నాడు.

హరి గౌర ఆ తరువాత భలే మంచి చౌకబేరమ్ (2018), వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ (2019), కనక (2018) సినిమాలకు సంగీతం అందించాడు. ఆయన 2024లో విడుదలైన పాన్-ఇండియన్ సూపర్ హీరో సినిమా హను మాన్, 2025లో మిరాయ్ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.[3]

సినిమా

[మార్చు]

సంగీత దర్శకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష ఇతర విషయాలు మూ
2013 చార్మినార్ కన్నడ మొదటి సినిమా [4]
2015 తుంగభద్ర తెలుగు తెలుగులో మొదటి సినిమా
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్‌లో

సంవత్సరపు ఉత్తమ కంపోజర్‌ అవార్డు

2013 చార్మినార్
2017 నక్షత్రం
2018 భలే మంచి చౌకబేరమ్
2019 ఎవడు తక్కువ కాదు
వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ
2021 డియర్ మేఘ
2022 చిత్తం మహారాణి
మాటే మంత్రము సినిమా విడుదల కాలేదు [5]
2023 సిందూరం
దళారి
సూర్యాపేట జంక్షన్ మ్యాచింగ్ మ్యాచింగ్ ఒక పాటకు సంగీతమందించాడు
పాటను రచించి పాడాడు కూడా
2024 హను మాన్ [6]
2025 మిరాయ్ [7]
టిబిఎ జాంబీ రెడ్డి 2 [8]
కాలచక్ర
పినాక
వచ్చినవాడుగౌతమ్
రణమండల
మాస్ మూవీ మేకర్స్ సినిమా

గాయకుడిగా

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పాట మూ
2017 నక్షత్రం తెలుగు సూడిగాలాలే
2018 కనక కన్నడ మొదలాసారి

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం సినిమా భాష ఓటీటీ మూ
2022 గాలివాన తెలుగు జీ5
2023 కోబలి తెలుగు డిస్నీ+ హాట్‌స్టార్

మూలాలు

[మార్చు]
  1. "Composer Gowra Hari rings in birthday with exciting new projects" (in ఇంగ్లీష్). The Hans India. 14 March 2025. Retrieved 19 September 2025.
  2. "నా సంగీతానికి కథే ప్రేరణ". NT News. 16 September 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  3. "'మిరాయ్' మ్యూజిక్.. కీరవాణి గారితో పోల్చడం భయం కలిగిస్తోంది". Chitrajyothy. 16 September 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  4. "ఓటీటీలో 'వైబ్‌' ఉంటుంది: హరి గౌర". Sakshi. 19 September 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  5. "రాహుల్‌ విజయ్, మేఘా ఆకాష్‌ల మూవీ టైటిల్‌ ఖారారు". Sakshi. 8 June 2022. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  6. "Father to mark the debut of Hanu-Man composer Gowra Hari" (in ఇంగ్లీష్). Cinema Express. 24 April 2024. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  7. "శ్రీరాముడి పాత్రకు సంగీతమివ్వడం 'మిరాయ్‌'లో ఓ సవాల్‌". Eenadu. 16 September 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.
  8. "మిరాయ్, హనుమాన్ సూపర్ సక్సెస్.. గౌర హరి మ్యూజిక్ కి ఫుల్ డిమాండ్.. ఒకేసారి నాలుగు భారీ సినిమాలు". 10TV Telugu. 16 September 2025. Archived from the original on 19 September 2025. Retrieved 19 September 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హరి_గౌర&oldid=4652919" నుండి వెలికితీశారు