హరి వినాయక్ సాఠే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హరి వినాయక్ సాఠే

హరి వినాయక్ సాఠే బొంబాయిలో డిప్యూటీ కలెక్టర్ . అతని భార్య అతని 44 ఏట మరణించింది . వారికి మగ సంతానం లేదు . వంశం నిలబెట్టుకోవడానికి తప్పకుండా మగపిల్లవాడు కలుగుతాడని ఏ మహాత్ముడైనా అభయమిస్తె మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు . సాఠే ఏప్రిల్ 1904 సం ॥లో ఒక మిత్రుని ద్వారా సాఠే బాబా గురించి తెలుసుకుని ఆయనను దర్శించాడు . బాబా అతనిని చూడగానే, అతడేమీ చెప్పకముందే "ఇతడు పెళ్ళి చేసుకుంటే మగబిడ్డ కలుగుతాడు "అన్నారు . బాబాకు తన గురించి అంతా తెలుసునని సాఠేకు అర్ధమైంది . దాదా కేల్కర్ బాబా అనుమతి తీసుకుని తన కుమార్తెను సాఠే కిచ్చి వివాహం చేశాడు . బాబా చెప్పినట్లే వారికి 1913 లో ఒక మగబిడ్డ జన్మించాడు .

సం॥ 1908లో బాబా సాఠేను తమ గురుస్ధానమైన వేపచెట్టు దగ్గర ఒక వసతి గృహం నిర్మించమని ఆదేశించారు . దానికి శంకుస్థాపన తేదీ కూడా ఆయనే నిర్ణయించారు . బాబా ఆజ్ఞను అనుసరించి శిరిడీలో బాబాను దర్శించడానికి వచ్చే భక్తుల వసతి కోసం 'సాఠే వాడా'ను నిర్మించాడతడు . అప్పటికింకా దీక్షిత్ వాడా కూడా లేదు . శిరిడీ వచ్చే భక్తులకు సాఠే వాడా ఒక్కటే వసతి గృహంగా ఉపయోగపడేది . ఇలా అతని చేత ఎన్నో పుణ్యకార్యాలు చేయించారు బాబా, దాసగణు 'సంత కథామృతము' అనే గ్రంథం వ్రాశాడు . దాని ముద్రణకు బాబా సాఠే చేత రూ. 75 /-లు ఇప్పించారు . అలా ధనాన్ని ఎలా సద్వినియోగ పరచుకోవాలో బాబా అతనికి నేర్పించారు . మనమూ మనకు భగవంతుడు ప్రసాదించిన ధనాన్ని మంచి కార్యాలకు ఉపయోగించాలి .

బాబా ఒకరోజు సాఠే మామగారైన దాదాకేల్కర్ ను పిలిచి గురుపూజ చేసుకోమన్నారు . ఆ రోజు గురుపూర్ణిమ . దాదా కేల్కర్ తో కలిసి సాఠే, ఇతర భక్తులూ బాబాకు గురుపూజ చేసుకున్నారు . అప్పటి నుంచి గురుపూర్ణిమ జరుపుకోవడం శిరిడీలో ఆచారమైంది . సాఠేకు అంతటి సేవను ప్రసాదించారు బాబా . గురుపూర్ణిమ రోజు బాబాను ప్రత్యేకంగా పూజించుకుంటే బాబాకు ఎంతో ఇష్టం . ఒక రోజు సాఠే అత్యవసరంగా క్యాంపుకు వెళ్ళవలసి ఉన్నది . అతడు క్యాంపుకు వెళ్ళడానికి బాబా అనుమతించలేదు . కనుక అతడు శిరిడీలోనే ఉండిపోయాడు . బాబా ఎందుకు తనను పంపలేదో సాఠేకు అప్పుడు అర్ధం కాలేదు . ప్రభుత్వాధికారులు ఆ క్యాంపును అర్ధాంతరంగా నిలిపివేశారని తరువాత తెలిసింది . అతడు క్యాంపుకు వెళ్లి ఉంటే ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చేది . అంతటి ఇబ్బందిని తొలగించారు బాబా . బాబా కరుణకు సాఠే పులకించిపోయాడు . బాబా ఆశీస్సులతో అతనికి ఉద్యోగంలో మంచి ప్రమోషను వచ్చింది . అందువల్ల ఎక్కువ జీతము, ఫించనూ లభించాయి .

సాఠేను ఇలా ఎన్నో రీతుల అనుగ్రహించారు సాయి . అతని గురించి సాయి, "సాహెబ్ చాలా మంచివాడు, అమాయకుడు, ఆడంబరమే లేనివాడు !"అన్నారు . అతనికి కాకా మహారాజ్ వంటి సత్పురుషుల దర్శన, ఆశీస్సులు లభించేలా చేశారు సాయి . సాఠేను సాధు సత్పురుషులను భక్తి శ్రద్ధలతో సేవించమని ఆదేశించారు సాయి . బాబా సాఠేతో, "నీవు ఎల్లప్పుడూ నన్నే తలచుకుంటూ ఉండు . నీకు ఇహపర శ్రేయస్సును ప్రసాదిస్తాను "అన్నారు . అంతటి అభయం పొందిన ధన్య జీవి సాఠే .