Jump to content

హర్తాలు హాలప్ప

వికీపీడియా నుండి
హర్తాలు హలప్ప

మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్
పదవీ కాలం
2020 జులై 28 – 2023 మే

ఆహార, పౌర సరఫరాల & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
2008 మే 30 – 2010 మే 2

కర్ణాటక శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2018 – 2023
ముందు కాగోడు తిమ్మప్ప
తరువాత బేలూర్ గోపాలకృష్ణ
నియోజకవర్గం సాగర్
పదవీ కాలం
2008 – 2013
ముందు కుమార్ బంగారప్ప
తరువాత మధు బంగారప్ప
నియోజకవర్గం సోరబ్
పదవీ కాలం
2004 – 2008
ముందు జి.డి. నారాయణప్ప
తరువాత నియోజకవర్గం రద్దు చేయబడింది
నియోజకవర్గం హోసానగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-07) 1961 మార్చి 7 (వయసు: 65)
హోసకొప్ప
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

హర్తాలు హాలప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై బిఎస్ యడ్యూరప్ప మంత్రివర్గంలో ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా మంత్రిగా,[1][2][3] ఎంఎస్ఐఎల్ ఛైర్మన్‌గా పని చేశాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

హర్తాలు హాలప్ప భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో హోసానగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి డాక్టర్ నారాయణప్ప జిడిపై 16851 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో సొరబ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కుమార్ బంగారప్ప పై 21053 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 మే 30 నుండి 2010 మే 2 వరకు ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశాడు.

హర్తాలు హలప్ప ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష పార్టీలో చేరి 2013 శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి మధు బంగారప్ప చేతిలో 21225 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరి 2013 శాసనసభ ఎన్నికలలో సాగర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కాగోడు తిమ్మప్పపై ఓట్ల మెజారిటీతో గెలిచి[5][6], 2020 జూలై 28న మైసూర్ సేల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.

హర్తాలు హలప్ప 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బేలూర్ గోపాలకృష్ణపై 16,022 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Ex-Minister Halappa acquitted in rape case". The Hindu. 18 August 2017. Retrieved 22 October 2019.
  2. ↑ Hartal Halappa quits, jolt to BJP Ministry
  3. ↑ Halappa case: Court reserves order
  4. ↑ "Board chiefs appointed, but many miffed".
  5. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. ↑ The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  7. ↑ "Karnataka Assembly Elections 2023: Sagar". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.