హర్భజన్ సింగ్ రిస్సాం
హర్భజన్ సింగ్ రిస్సామ్ | |
|---|---|
| జననం | 1951 ఆగస్టు 10 జమ్మూ, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
| మరణం | 2013 అక్టోబరు 17 (వయసు: 62) జమ్మూ |
| Resting place | శాస్త్రి నగర్ దహన వాటిక, జమ్మూ 32°41′22″N 74°51′11″E / 32.68944°N 74.85306°E |
| వృత్తి | ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు రచయిత |
| పేరుపడ్డది | కార్డియాలజీ మెడి-ఫిక్షన్ |
| భాగస్వామి | బల్బీర్ కౌర్ రిస్సాం |
| తల్లిదండ్రులు | రంజీత్ కౌర్ |
| పురస్కారాలు | పద్మశ్రీ |
హర్భజన్ సింగ్ రిస్సామ్ (1951 ఆగస్టు 10 - 2013 అక్టోబర్ 17) భారతీయ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, పరోపకారి [1] రచయిత. వైద్య సేవకూ, వైద్య వృత్తి ఆధారంగా రాసిన నవలకూ అయన ప్రసిద్ధి చెందాడు.[2] ఆయన ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో కార్డియాక్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆయన తొలి నవల, ది స్కాల్పెల్ - గేమ్ బినీత్, [3] 2010లో ప్రచురించబడింది. ఇది ప్రతిపాదిత త్రయంలోని మొదటి పుస్తకం. ఇది మెడిసిన్ మాఫియాపై ఒక మెడికల్ థ్రిల్లర్. [4] వైద్య శాస్త్రానికి ఆయన చేసిన కృషికి గాను, భారత ప్రభుత్వం 2006 లో ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర గౌరవం పద్మశ్రీని ప్రదానం చేసింది.[5]
జీవిత చరిత్ర
[మార్చు]1951లో జమ్మూలోని[6] కాశ్మీరీ సిక్కు కుటుంబంలో జన్మించిన హర్భజన్ సింగ్ రిస్సామ్, జమ్మూలోని సెంట్రల్ బేసిక్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత అతను ప్రభుత్వ గాంధీ మెమోరియల్ సైన్స్ కళాశాల నుండి సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. [7] అతని కుటుంబం పూంచ్ నుండి పారిపోయినప్పుడు, అతను వారితో పంజాబ్‌కు వెళ్లి, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో కార్డియాలజీలో MD చేసాడు. అంతకు ముందు అమృత్‌సర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల నుండి బంగారు పతకంతో వైద్య డిగ్రీని పొందాడు.[8] ప్రభుత్వ గాంధీ మెమోరియల్ సైన్స్ కళాశాలలో తన వృత్తిని ప్రారంభించాడు.[9] సౌదీ అరేబియాలో కొంతకాలం పనిచేసిన తర్వాత, భారతదేశానికి తిరిగి వచ్చి, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా చేరాడు. కానీ తరువాత, ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌కు కార్డియాక్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా మారాడు. [1] షేర్-ఇ-కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీ నగర్, ఫోర్టిస్ హెల్త్‌కేర్, న్యూఢిల్లీ లోని బాత్రా హాస్పిటల్ లతో కూడా అతనికి అనుబంధం ఉంది.[7] ఆయన వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 100 కి పైగా వైద్య పత్రాలను ప్రచురించాడు. 2010 నవంబరులో జరిగిన నేపాల్ కార్డియాక్ సొసైటీ వారు నిర్వహించిన హిమాలయ ప్రాంతంలో గుండె జబ్బులను జయించడం అనే సమావేశంతో సహా పలు వైద్య సమావేశాలలో పత్రాలను సమర్పించాడు.[10] భారతదేశంలో వైద్య విద్యకు అత్యున్నత సంస్థ అయిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గవర్నర్ల బోర్డు సభ్యుడిగా ఆయన పనిచేశాడు.[11][12] కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పునర్నిర్మించిన తర్వాత 2011 మే 14 న ఆయన్ను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బోర్డ్ ఆఫ్ గవర్నర్ల సభ్యుడిగా నియమించారు. [13] ఆయన ఆసియా పసిఫిక్ వాస్కులర్ సొసైటీలో,[14] కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో కూడా సభ్యుడు.[15]
రచనపై మక్కువ ఉన్న రిస్సామ్, పదమూడేళ్ల వయసులో తన మొదటి చిన్న కథ, మాస్కో స్ట్రీట్‌ను ప్రచురించాడు. [16] 2006 లో అతను ఉద్యోగం నుండి చాలా విరామం తీసుకుని, మూడు నెలలు పారిస్‌లో ఉండి, అక్కడ ఒక నవల రాశాడు. 2010 లో అతను దానిని ది స్కాల్పెల్ - గేమ్ బినీత్ అనే పేరుతో ప్రచురించాడు. ఇది వైద్య పర్యాటకం, అవయవ వాణిజ్యంతో సంబంధం ఉన్న మాఫియా కార్యకలాపాలపై ఒక వైద్య థ్రిల్లర్. ఈ నవలను చాలా మంది విజిల్-బ్లోయింగ్ ప్రయత్నంగా భావించారు. ఇది భారతదేశంలో, ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుడి మొదటి ఇన్‌సైడర్ రచనగా గుర్తింపు పొందింది.[9] ఒక భారతీయ రచయిత రాసిన మొదటి వైద్య థ్రిల్లర్ అది.[17] అతను వైద్య సంస్థలో జరిగే సంఘటనల ఆధారంగా మరో రెండు నవలలు రాసి, మెడికల్ థ్రిల్లర్ల త్రయాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ అవి ప్రచురణకు నోచుకోలేదు.[18] భారత ప్రభుత్వం అతనికి 2006 లో పద్మశ్రీ పౌర గౌరవాన్ని ప్రదానం చేసింది. [5]
రిస్సామ్, వైద్యురాలైన బల్బీర్ కౌర్‌ను పెళ్ళి చేసుకున్నాడు. ఈ దంపతులకు హర్బీర్ సింగ్ రిస్సామ్ అనే కుమారుడు, హర్మీత్ కౌర్ అనే కుమార్తె ఉన్నారు. [7] ఆయన తల్లి రంజీత్ కౌర్, సోదరుడు జుఝర్ సింగ్ రిస్సామ్, మేనల్లుళ్ళు సత్వంత్ సింగ్ రిస్సామ్ & సందీప్ సింగ్ రిస్సామ్ జీవించి ఉన్నారు.[19] ఆయన చిన్న మేనల్లుడు సందీప్ సింగ్ రిస్సామ్, ఇంజనీరు. అతను రిస్సామ్‌తో కలిసి దాతృత్వం, రక్తదాన అవగాహన తదితర ప్రాజెక్టులను నిర్వహించడం వంటి సామాజిక కార్యక్రమాలలో పనిచేస్తున్నాడు.[20] ఆయన 2013 అక్టోబరు 17 న ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని మాక్స్ హెల్త్‌కేర్‌లో ఆసుపత్రిలో చేరి, అక్కడే మరణించాడు. మరుసటి రోజు జమ్మూలోని శాస్త్రి నగర్‌లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.[7]
ఇవి కూడా చూడండి
[మార్చు]- అవయవ వ్యాపారం
- వైద్య పర్యాటకం
మూలాలు
[మార్చు]- 1 2 "Two great doctors". Greater Kashmir. 27 August 2015. Retrieved 23 August 2016."Two great doctors". Greater Kashmir. 27 August 2015. Retrieved 23 August 2016.
- ↑ "Bigger the hospital, the more the corruption". Indian Express. 6 January 2012. Archived from the original on 26 August 2016. Retrieved 23 August 2016.
- ↑ H. S. Rissam (2010). The Scalpel: Game Beneath. Rupa & Company. ISBN 978-81-291-1602-4.
- ↑ "Written by heart". Hindustan Times. 23 May 2010. Retrieved 23 August 2016.
- 1 2 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2013. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 20 August 2016.
- ↑ Vaishali Tanwar (2016). "A Doctor with Scalpel and Pen". Uday India. Archived from the original on 18 February 2017. Retrieved 23 August 2016.
- 1 2 3 4 "Dr HS Rissam passes away". Kashmir Times. 17 October 2013. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 23 August 2016.. Kashmir Times. 17 October 2013. Archived from the original Archived 2021-06-02 at the Wayback Machine on 2 June 2021. Retrieved 23 August 2016.
- ↑ Kushwant Singh (8 May 2010). "Zafar and the Mutiny". Sunday Extra feature. The Tribune. Retrieved 23 August 2016.
- 1 2 Aparna Banerji (10 March 2013). "Medical field and the art of veiled whistle blowing". JallandharTribune. Retrieved 24 August 2016.
- ↑ Abhilasha Subba (16 November 2010). "Harbhajan Singh Rissam Dr. Scalpel Wields His Pen". The Himalayan. Retrieved 23 August 2016.
- ↑ Express News Service (9 July 2011). "Take heart from Mediterranean diet, wine". Indian Express. Retrieved 23 August 2016.
- ↑ "Special meeting of ethics committee" (PDF). Medical Council of India. 18 October 2013. Archived from the original (PDF) on 20 May 2016. Retrieved 23 August 2016.
- ↑ "Dr K K Talwar appointed new chairman of MCI Board of Governors | India Medical Times". Archived from the original on 23 March 2019. Retrieved 19 November 2016.
- ↑ "APVIC Feedback". Asia Pacific Vascular Society. 2016. Retrieved 23 August 2016.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ "Writing with the scalpel". Deccan Herald. 2016. Archived from the original on 11 October 2016. Retrieved 24 August 2016.
- ↑ Parthasarathy, Anusha (8 April 2012). "Visible scars". The Hindu. Retrieved 24 August 2016.
- ↑ Yogesh Vajpeyi (24 July 2011). "Diagnosis by fiction, prognosis by plotline". Indian Express. Archived from the original on 26 August 2016. Retrieved 23 August 2016.
- ↑ "Dr K K Talwar appointed new chairman of MCI Board of Governors | India Medical Times". Archived from the original on 23 March 2019. Retrieved 19 November 2016.
- ↑ "PASJ frames body of volunteers for blood donation - Early Times Newspaper Jammu Kashmir". www.earlytimes.in. Retrieved 2018-01-20.