Jump to content

హర్మిలన్ బైన్స్

వికీపీడియా నుండి
హర్మిలన్‌ బైన్స్‌
Personal information
Full nameహర్మిలన్ కౌర్ బైన్స్
Nicknameది క్వీన్ [1]
Born23 July 1998 (1998-07-23) (age 27)
హోషియార్‌పూర్, పంజాబ్
Height168 cm (5 ft 6 in)
Parent
Sport
Sportఅథ్లెటిక్స్
ట్రాక్ అండ్ ఫీల్డ్
Events
  • 800 m
  • 1500 m
  • 3000 m
Achievements and titles
Personal bests
  • 800 m
  • 2:03.06 (2023)
  • 1500 m
  • 4:05.39 (2023)
  • 3000 m
  • 9:01.30 (2023)

హర్మిలన్‌ బైన్స్‌ (ఆంగ్లం: Harmilan Bains; జననం 1998 జూలై 23), ఒక భారతీయ ట్రాక్ అథ్లెట్.[2] ఆమె ఆసియా క్రీడలలో 800 మీటర్లు, 1500 మీటర్ల ఈవెంట్లలో డబుల్ వెండి పతక విజేత.[3] ఆమె ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్ లో బంగారు పతక విజేత.[4] కె. ఎం. దీక్ష దానిని బద్దలు కొట్టడానికి ముందు 1500 మీటర్ల ఈవెంట్లో ఆమె జాతీయ రికార్డును కలిగి ఉన్నది.[5]

ప్రారంభ జీవితం

[మార్చు]

హర్మిలన్‌ బైన్స్‌ పంజాబ్ లోని హోషియార్‌పూర్ కు చెందినది. ఆమె తన పాఠశాల విద్యను మహిల్పూర్ లోని దోబా పబ్లిక్ స్కూల్, హోషియార్‌పూర్ లోని సెయింట్ సోల్జర్ స్కూల్లో పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ అథ్లెట్లు.[6] ఆమె తండ్రి అమన్ దీప్ బైన్స్ దక్షిణాసియా క్రీడలలో 1500 మీటర్ల పరుగులో పతకాన్ని గెలుచుకోగా, ఆమె తల్లి మాధురి సక్సేనా ఆసియా క్రీడలలో 800 మీటర్ల పరుగులో రజత పతకాన్ని కైవసం చేసుకున్నది.[7] మాధురి సక్సేనా 2003లో అర్జున అవార్డు గ్రహీత.

కెరీర్

[మార్చు]
  • 2024: హర్మిలన్ బైన్స్ తన అథ్లెటిక్ కెరీర్ లో అనేక గాయాలను ఎదుర్కొంది. ఆమె 2024లో పారిస్ ఒలింపిక్స్ కోసం శిక్షణ సమయంలో గాయంతో బాధపడింది. ఆ సంవత్సరం ప్రారంభంలో, ఆమె చీలమండ గాయంతో బాధపడింది.
  • 2023: చైనాలోని హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో 1500 మీటర్లలో హర్మిలన్ రజత పతకాన్ని గెలుచుకున్నది.[8]
  • 2023: భువనేశ్వర్ లో జరిగిన ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 1500 మీటర్లు, 800 మీటర్లు రెండింటిలోనూ ఆమె రజత పతకాలు గెలుచుకుంది.
  • 2022: మోకాలి శస్త్రచికిత్స కారణంగా, ఆమె 2022లో కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ల అవకాశం కోల్పోయింది.
  • 2021: వరంగల్‌లో జరిగిన నేషనల్ ఓపెన్ ఛాంపియన్‌షిప్స్ 2021లో ఆమె 1500 మీటర్ల పరుగును 4:05.39 నిమిషాల్లో పూర్తి చేసి, సునీతా రాణి 2002లో నెలకొల్పిన 4:06.03 నిమిషాల రికార్డును చెరిపివేసి కొత్త జాతీయ రికార్డును సృష్టించింది.[9]
  • 2021: పాటియాలాలో జరిగిన 2021 నేషనల్స్ లో 800 మీటర్లలో ఆమె వ్యక్తిగత ఉత్తమమైన సమయం 2: 02.57.
  • 2020: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ లో 1500 మీటర్లు, 800 మీటర్లలోనూ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
  • 2016: వియత్నాంలోని హో చి-మిన్లో జరిగిన ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో 1500 మీటర్లలో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. Nag, Utathya (1 May 202). "Harmilan Bains - A queen born to run". Olympics.com. Retrieved 1 February 2025.
  2. "Asian Games: Ajay Kumar, Harmilan Bains and Jinson Johnson win medals after impressive show in 1500m race". India Today (in ఇంగ్లీష్). October 2023. Retrieved 2023-10-01.
  3. Sportstar, Team (2023-10-01). "Asian Games: Harmilan Bains wins silver in women's 1500m; Ajay Kumar, Jinson Johnson take silver and bronze in men's 1500m". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  4. "Asian Games 2023 Day 8 Live Updates: India clinch shooting silver". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-01. Retrieved 2023-10-01.
  5. Rayan, Stan (2024-05-12). "Deeksha breaks 1500m National Record at competition in Los Angeles". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2024-05-13.
  6. "Athletics: Sable, Tajinderpal win gold; silver for Sreeshankar, Ajay Kumar, Harmilan Bains & Jyothi Yarraji". OnManorama. Retrieved 2023-10-01.
  7. "Asian Games: Ajay Kumar, Harmilan Bains and Jinson Johnson win medals after impressive show in 1500m race". India Today (in ఇంగ్లీష్). October 2023. Retrieved 2023-10-01.
  8. Sportstar, Team (2023-10-01). "Asian Games: Harmilan Bains wins silver in women's 1500m; Ajay Kumar, Jinson Johnson take silver and bronze in men's 1500m". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-10-01.
  9. K, Baraneetharan (2023-10-01). "Sportskeeda-supported athlete Harmilan Bains wins Asian Games Silver in 1500m". sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-01.