హర్మీత్ సింగ్ సంధు
| హర్మీత్ సింగ్ సంధు | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2025 నవంబర్ 14[1] | |||
| ముందు | కాశ్మీర్ సింగ్ సోహల్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | తరన్ తరణ్ | ||
| పదవీ కాలం 2002 – 2017 | |||
| ముందు | ప్రేమ్ సింగ్ లాల్‌పుర్ | ||
| తరువాత | ధరమ్‌బీర్ అగ్నిహోత్రి | ||
| నియోజకవర్గం | తరన్ తరణ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1969 డిసెంబర్ 14 అమృత్‌సర్, పంజాబ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | శిరోమణి అకాలీ దళ్ | ||
| జీవిత భాగస్వామి | కవల్జిత్ కౌర్ | ||
| పూర్వ విద్యార్థి | గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హర్మీత్ సింగ్ సంధు పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పంజాబ్ శాసనసభకు తరన్ తరణ్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]హర్మీత్ సింగ్ సంధు స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2002 పంజాబ్ శాసనసభ ఎన్నికలలో తరన్ తరణ్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత శిరోమణి అకాలీ దళ్ పార్టీలో చేరి 2007, 2012 శాసనసభ ఎన్నికలలో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన జూన్ 2011లో చీఫ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యాడు.[2]
హర్మీత్ సింగ్ సంధు 2017, 2022 శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయి జూలై 2025లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.[3] ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కాశ్మీర్ సింగ్ సోహల్ మరణం తరువాత తరన్ తరణ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శిరోమణి అకాలీదళ్ సుఖ్విందర్ కౌర్ రాంధ్వాపై 12,091 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "2025 Tarn Taran Assembly constituency By Poll Result" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Badal gives approval to induct 3 more MLAs as CPS". Zee News. 15 June 2011. Retrieved 20 May 2013.
- ↑ "3-time MLA, who quit SAD in 2024, joins AAP in Tarn Taran". The Times of India. 16 July 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "AAP retains Tarn Taran assembly seat, Akali Dal in second spot, Congress finishes fourth and BJP fifth" (in ఇంగ్లీష్). The New Indian Express. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "AAP wins Tarn Taran bypoll as Congress, BJP lose deposits" (in Indian English). The Hindu. 14 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Ground work, involvement of leaders: How AAP secured seat in Tarn Taran Bypoll" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.