Jump to content

హర్యానా

వికీపీడియా నుండి
(హర్యాణా నుండి దారిమార్పు చెందింది)
Haryana
From top, left to right: Cyber City in Gurgaon, Pinjore Gardens, bronze chariot of Krishna and Arjuna at Kurukshetra, Asigarh Fort, Ghaggar river, Lake in Surajkund.
Etymology: Abode of God or Green Forest
Nickname: 
"Denmark of India"
Motto(s): 
Satyameva Jayate
(Truth alone triumphs)
The map of India showing Haryana
Location of Haryana in India
Coordinates: 30°44′N 76°47′E / 30.73°N 76.78°E / 30.73; 76.78
Country India
RegionNorth India
Before wasPunjab
Formation
(as a state)
1 November 1966
CapitalChandigarh
Largest CityFaridabad
Districts22 (6 divisions)
Government
  BodyGovernment of Haryana
  GovernorBandaru Dattatreya
  Chief MinisterManohar Lal Khattar (BJP)
State LegislatureUnicameral
  AssemblyHaryana Legislative Assembly (90 seats)
National ParliamentParliament of India
  Rajya Sabha5 seats
  Lok Sabha10 seats
High CourtPunjab and Haryana High Court
Area
  Total
44,212 కి.మీ2 (17,070 చ. మై)
  Rank21st
Elevation
200 మీ (700 అ.)
Highest elevation1,499 మీ (4,918 అ.)
Lowest elevation
169 మీ (554 అ.)
Population
 (2011)
  Total
Increase 2,53,51,462
  Rank18th
  Density573/కి.మీ2 (1,480/చ. మై.)
  Urban
34.88%
  Rural
65.12%
DemonymHaryanvi
Language
  OfficialHindi
  Additional OfficialEnglish and Punjabi
  Official ScriptDevanagari script, Gurmukhi script
GDP
  Total (2020–21)Increase7.65 trillion (US$96 billion)
  Rank13th
  Per capitaNeutral increase2,39,535 (US$3,000) (6th)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-HR
Vehicle registrationHR
HDI (2019)Increase 0.708 High[3] (12th)
Literacy (2011)Increase 83.78% (21th)
Sex ratio (2021)926/1000 [4] (29th)
Symbols of Haryana
Emblem of Haryana
భాషHindi
Foundation dayHaryana Day
పక్షిBlack francolin
పువ్వుLotus
MammalBlackbuck
TreeBodhi tree
State Highway Mark
State Highway of Haryana
HR SH1 – HR SH33
List of State Symbols
^† Joint Capital with Punjab
†† Common for Punjab, Haryana and Chandigarh.

హర్యానా, భారతదేశ ఉత్తర భాగంలో ఉన్న ఒక రాష్ట్రం. ఇది భాషా ప్రాతిపదికన 1966 నవంబరు 1న పూర్వపు తూర్పు పంజాబ్ రాష్ట్రం నుండి వేరు చేయబడింది. ఇది భారతదేశ భూభాగంలో 1.4% (44,212 కిమీ2 లేదా 17,070 చదరపు మైళ్ళు) కంటే తక్కువ విస్తీర్ణంతో 21వ స్థానంలో ఉంది.[1][5] రాష్ట్ర రాజధాని చండీగఢ్, ఇది పొరుగు రాష్ట్రం పంజాబ్‌తో సరిహద్దు పంచుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన నగరం ఫరీదాబాద్, ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగమైంది. గురుగ్రామ్ నగరం భారతదేశ అతిపెద్ద ఆర్థిక, సాంకేతిక కేంద్రాలలో ఒకటి.[6] హర్యానాలో 6 పరిపాలనా విభాగాలు, 22 జిల్లాలు, 72 ఉప-విభాగాలు, 93 రెవెన్యూ తహసీల్‌లు, 50 ఉప-తహసీల్‌లు, 140 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు, 154 నగరాలు, పట్టణాలు, 7,356 గ్రామాలు, 6,222 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[7][8] హర్యానాలో 32 ప్రత్యేక ఆర్థిక మండలాలు (సెజ్‌ల ) ఉన్నాయి, ఇవి ప్రధానంగా జాతీయ రాజధాని ప్రాంతాన్ని అనుసంధానించే పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులలో ఉన్నాయి.[9][10] గుర్గావ్ భారతదేశంలోని ప్రధాన సమాచార సాంకేతికత, ఆటోమొబైల్ హబ్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది.[11][12] హర్యానా మానవ అభివృద్ధి సూచికలో భారతీయ రాష్ట్రాలలో 11వ స్థానంలో ఉంది.

రాష్ట్ర చరిత్ర, స్మారక చిహ్నాలు, వారసత్వం, వృక్షజాలం, జంతుజాలం, పర్యాటకం, బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో సమృద్ధిగా ఉంది. దీనికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి, అయితే యమునా నది ఉత్తర ప్రదేశ్‌తో దాని తూర్పు సరిహద్దును ఏర్పరుస్తుంది. హర్యానా దేశ రాజధాని ఢిల్లీ భూభాగాన్ని మూడు వైపులా (ఉత్తరం, పశ్చిమం, దక్షిణం) చుట్టుముట్టింది, తత్ఫలితంగా, ప్రణాళిక, అభివృద్ధి ప్రయోజనాల కోసం హర్యానా రాష్ట్ర పెద్ద ప్రాంతం ఆర్థికంగా ముఖ్యమైన భారతదేశ జాతీయ రాజధాని ప్రాంతంలో చేర్చబడింది.

వ్యుత్పత్తి శాస్త్రం

[మార్చు]

మహాభారతానంతర కాలంలో,[13] వ్యవసాయ కళలో ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకున్న అభిరాలు ఇక్కడ నివసించినందున హర్యానాను ఈ పేరుతో పిలుస్తారని శాస్త్రవేత్తలు అభిప్రాయం.[14] ప్రాణ్ నాథ్ చోప్రా అభిప్రాయం ప్రకారం, హర్యానాకు అభిరాయణ-అహిరాయణ-హిరాయణ-హర్యానా అనే పేరు వచ్చిందని తెలుస్తుంది .[15]

భౌగోళికం

[మార్చు]

హర్యాణా ఉత్తరాన 27 డిగ్రీల 37' నుండి 30 డిగ్రీల 35' అక్షాంశాల మధ్య, 74 డిగ్రీల 28' నుండి 77 డిగ్రీల 36' రేఖాంశాల మధ్య ఉంది. హర్యాణా రాష్ట్రం సముద్రమట్టమునకు 700 నుండి 3600 అడుగుల ఎత్తున ఉంది. పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రం నాలుగు విభాగాలుగా విభజించారు. అవి అంబాలా, రోతక్, గుర్‌గావ్, హిస్సార్. రాష్ట్రంలో 1,553 చ.కి. విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. హర్యాణా నాలుగు ముఖ్య భౌగోళిక విశేషాలు.

చరిత్ర

[మార్చు]

ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద నాగరికతలలో, సింధు లోయ నాగరికత ఉంది. రాఖిగిరి వంటి అనేక తవ్వకాల ప్రదేశాలు పురావస్తు పరిశోధనల ముఖ్యమైన ప్రదేశాలు. అత్యంత అభివృద్ధి చెందిన మానవ నాగరికత సింధు నది వెంట వృద్ధి చెందింది.[16]

ఇది ఈ ప్రాంతం మధ్యలో ఒక సారి ప్రవహించింది.సింధు లోయలో సుగమం చేసిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పెద్ద ఎత్తున వర్షపునీటి సేకరణ వ్యవస్థ, టెర్రకోట ఇటుక, విగ్రహ ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన లోహపు పని (కాంస్య, విలువైన లోహాలు రెండింటిలోనూ) ఉన్నాయి. వాస్తవానికి సింధు నాగరికత ఆధునిక మానవ అభివృద్ధికి దారితీసింది. హర్యానాను సుల్తానేట్లు, మొఘలులు వంటి అనేక రాజవంశాలు పాలించాయి. ఇది ఆఫ్ఘన్లు, తిముత్ ఆక్రమణల క్రింద కూడా ఉంది.పంజాబ్ ప్రాంతములో అధికముగా హిందీ మాట్లాడే భాగం హర్యానా అయింది. పంజాబీ మాట్లాడే భాగం పంజాబ్ రాష్ట్రం అయింది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న ఛండీగఢ్కేంద్ర పాలిత ప్రాంతముగా ఏర్పడి రెండు రాష్ట్రాలకు రాజధానిగా వ్యవహరింపబడుతుంది.

4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా వైదిక, హిందూ నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితం ఇక్కడే శ్రీ కృష్ణభగవానుడు మహాభారతయుద్ధ ప్రారంభ సమయాన గీతను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధం జరిగింది. మహాభారతములో (సా.శ..పూ.900) హర్యాణా బహుధాన్యక (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. హరియానా అన్న పదం మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు సంస్కృత శాసనములో కనిపిస్తుంది. ఈ శాసనములో ఈ ప్రాంతం భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగిన ప్రాంతం అని చాటుతుంది.

నౌరంగాబాద్, భివానీలోని మిత్తతల్, ఫతేబాద్ లోని కునాల్, హిస్సార్ దగ్గరి అగ్రోహా, జింద్ లోని రాఖీగర్హీ, రోతక్ లోని రూఖీ, సిర్సాలోని బనావలి మొదలైన ప్రాంతములలో జరిపిన పురావస్తు త్రవ్వకాలలో హరప్పా సంస్కృతి, హరప్పా పూర్వ సంస్కృతుల ఆధారాలు లభించాయి. కురుక్షేత్ర, పెహోవా, తిల్‌పట్, పానిపట్ ప్రాంతాలలో దొరకిన మట్టి కుండలు, శిల్పాలు, ఆభరణాలు మహాభారత కథకు చారిత్రతకు ఆధారాలు సమకూర్చాయి. ఈ ప్రాంతాలన్ని మహాభారతములో ప్రీతుదక (పెహోవ), తిలప్రస్థ (తిల్‌పట్), పానప్రస్థ (పానిపట్), సోనప్రస్థ (సోనిపట్) గా ఉల్లేఖించబడినవి.

రాష్ట్ర గణాంకాలు

[మార్చు]
  1. అవతరణ - 1966 నవంబరు 1,
  2. వైశాల్యం. 44,212 చ.కి.
  3. జనసంఖ్య -25,353,081, స్త్రీలు. 11,847,951 పురుషులు. 13,505,130, లింగనిష్పత్తి . 877
  4. జిల్లాల సంఖ్య -21
  5. గ్రామాలు - 6,764
  6. పట్టణాలు.106
  7. ప్రధాన భాషలు- హిందీ, పంజాబి
  8. ప్రధాన మతాలు- హిందు, ఇస్లాం, క్రిష్టియన్
  9. పార్లమెంటు సభ్యుల సంఖ్య - 10
  10. శాసన సభ్యుల సంఖ్య-90

హర్యానా జిల్లాలు

[మార్చు]
వ.సం. కోడ్ ‌జిల్లా ముఖ్య పట్టణం జనాభా (2011) విస్తీర్ణం (కి.మీ.²) జన సాంద్రత

(/కి.మీ.²)

1AMఅంబాలాఅంబాలా11,36,7841,569722
2BHభివానిభివాని16,29,1095,140341
3 CD చర్ఖీ దాద్రి ఛర్ఖి దాద్రి 5,02,276 1370 367
4FRఫరీదాబాద్ఫరీదాబాద్17,98,9547832,298
5FTఫతేహాబాద్ఫతేహాబాద్9,41,5222,538371
6GUగుర్‌గావ్గుర్‌గావ్15,14,0851,2581,241
7HIహిసార్హిస్సార్17,42,8153,788438
8JHఝజ్జర్ఝజ్జర్9,56,9071,868522
9JIజింద్జింద్13,32,0422,702493
10KTకైతల్కైతల్10,72,8612,799467
11KRకర్నాల్కర్నాల్15,06,3232,471598
12KUకురుక్షేత్రకురుక్షేత్ర9,64,2311,530630
13MAమహేంద్రగఢ్నార్నౌల్9,21,6801,900485
14 MW నూహ్ నూహ్ 10,89,406 1,765 729
15 PW పల్వల్ పల్వల్ 10,40,493 1,367 761
16PKపంచ్‌కులాపంచ్‌కులా5,58,890816622
17PPపానిపట్పానిపట్12,02,8111,250949
18REరేవారీరేవారీ8,96,1291,559562
19ROరోహ్‌తక్రోహ్‌తక్10,58,6831,668607
20SIసిర్సాసిర్సా12,95,1144,276303
21SOసోనీపత్సోనీపత్14,80,0802,260697
22YNయమునా నగర్యమునా నగర్12,14,1621,756687

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 "Haryana at a Glance". Government of Haryana. the original నుండి 14 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 March 2016.
  2. "Economic Survey of Haryana 2020-21" (PDF). Government of Haryana. 1 February 2022. pp. 2–3. the original (PDF) నుండి 19 January 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 February 2022.
  3. "Sub-national HDI - Area Database". Global Data Lab. Institute for Management Research, Radboud University. the original నుండి 23 September 2018 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 October 2018.
  4. "Sex ratio of State and Union Territories of India as per National Health survey (2019-2021)" (PDF). Ministry of Health and Family Welfare, India.
  5. "Haryana State Budget 2017-18" (PDF). Haryana Finance Dept. the original (PDF) నుండి 22 August 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2017.
  6. "This is NCR's new foodie magnet; have you been yet?". India Today. 26 March 2017. ఒరిజినల్ నుండి 22 April 2017 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 April 2017.
  7. "Haryana State Budget 2017-18" (PDF). Haryana Finance Dept. the original (PDF) నుండి 22 August 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2017.
  8. NIDM, p. 4.
  9. "Haryana State Budget 2017-18" (PDF). Haryana Finance Dept. the original (PDF) నుండి 22 August 2017 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2017.
  10. Industrial Development & Economic Growth in Haryana Archived 6 అక్టోబరు 2018 at the Wayback Machine, India Brand Equity Foundation, Nov 2017.
  11. "Gurugram among top 5 IT hubs in Asia Pacific". Hindustan Times. 28 May 2019. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 May 2019.
  12. Julka, Harsimran (30 September 2011). "IT firms looking beyond Gurgaon, Noida, Greater Noida to other cities in north India". The Economic Times. ET Bureau. ఒరిజినల్ నుండి 5 November 2013 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 October 2013.
  13. Lal, Muni (1974). Haryana: On High Road to Prosperity. Vikas Publishing House. ISBN 978-0-7069-0290-7.
  14. Punia, Bijender K. (1994). Tourism Management: Problems and Prospects (in ఇంగ్లీష్). APH Publishing. ISBN 978-81-7024-643-5.
  15. Chopra, Pran Nath (1982). Religions and Communities of India (in ఇంగ్లీష్). Vision Books. ISBN 978-0-391-02748-0.
  16. Subramanian, T. S. (27 March 2014), "Rakhigarhi, the biggest Harappan site", The Hindu, the original నుండి 27 November 2016 న ఆర్కైవు చెయ్యబడింది, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 January 2016

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హర్యానా&oldid=4833938" నుండి వెలికితీశారు