Jump to content

హర్షద్ ఖాదీవాలే

వికీపీడియా నుండి
హర్షద్ ఖాదీవాలే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హర్షద్ హేమంత్ కుమార్ ఖాదీవాలే
పుట్టిన తేదీ (1988-10-21) 1988 October 21 (age 37)
పుణె, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మన్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentMaharashtra
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 80 22 26
చేసిన పరుగులు 5,367 981 630
బ్యాటింగు సగటు 40.96 30 25
100s/50s 12/26 0/8 0/3
అత్యధిక స్కోరు 183 66 88
వేసిన బంతులు 1,313 320 6
వికెట్లు 11 11 0
బౌలింగు సగటు 62.55 30.45
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/46 3/55
క్యాచ్‌లు/స్టంపింగులు 25/– 7/– 5/–
మూలం: ESPNcricinfo, 2012 10 May

హర్షద్ ఖాదీవాలే (జననం 1988, అక్టోబరు 21) భారత దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున ఆడే క్రికెటర్.[1] అతను కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పూణే వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఖాదీవాలే 2006/07 సీజన్‌లో 18 సంవత్సరాల వయసులో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌తో మహారాష్ట్ర తరఫున అరంగేట్రం చేశాడు. ఆ సీజన్లో, అతను 6 ఇన్నింగ్స్‌లలో 33 సగటుతో 198 పరుగులు చేశాడు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. 2007/08 సీజన్ మొదటి మ్యాచ్‌లో తమిళనాడుపై తన మొదటి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు.[2] తరువాతి సీజన్‌లో మహారాష్ట్ర తరఫున కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన నేపథ్యంలో, దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు.[3] అప్పటి నుండి, అతను మహారాష్ట్ర తరపున అత్యంత స్థిరమైన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.

2010లో, అతను ఐపిఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2011లో, అతను ఐపిఎల్ ఫ్రాంచైజీ పూణే వారియర్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు.[4]

మూలాలు

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]