హర్పాల్ సింగ్ సతి
| హర్పాల్ సింగ్ సతి | |||
| పదవీ కాలం 1996 – 2004 | |||
| ముందు | రామ్ సింగ్ సైనీ | ||
|---|---|---|---|
| తరువాత | రాజేంద్ర కుమార్ బాడి | ||
| నియోజకవర్గం | హరిద్వార్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1942 ఆగస్టు 1 పినాని , ఉత్తరాఖండ్ , భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| తల్లిదండ్రులు | శక్తి సింగ్, లాలి దేవి | ||
| జీవిత భాగస్వామి | రాజ్బతి | ||
| సంతానం | 4 | ||
| నివాసం | డెహ్రాడూన్ , ఉత్తరాఖండ్ | ||
| పూర్వ విద్యార్థి | బి.ఎ (రాజకీయ శాస్త్రం) మహారాజ్ సింగ్ డిగ్రీ కళాశాల, మీరట్ విశ్వవిద్యాలయం | ||
హర్పాల్ సింగ్ సతి (జననం 01 ఆగస్టు 1942) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
రాజకీయ జీవితం
[మార్చు]హర్పాల్ సింగ్ సతి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి జగ్ పాల్ సింగ్‌పై 66,100 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి జగ్ పాల్ సింగ్‌పై 1,29,873 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
హర్పాల్ సింగ్ సతి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హరిద్వార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి రమేష్ కుమార్ బర్మన్ పై 32,847 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన 1,17,979 ఓట్లతో 3వ స్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Harpal Singh Sathi" (in ఇంగ్లీష్). Digital Sansad. 4 June 2024. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
- ↑ "Uttarakhand: 3-time Lok Sabha MP & Congress leader joins BJP". The Times of India. 6 September 2022. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
- ↑ "पूर्व लोकसभा सांसद हरपाल सिंह साथी ने थामा 'कमल' का फूल, कांग्रेस में जाने को बताया 'भूल'". ETV Bharat News. 5 September 2022. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
- ↑ "Senior Cong leader from Haridwar joins BJP". ThePrint. 5 September 2022. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.
- ↑ "Hardwar Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2 July 2025. Archived from the original on 2 July 2025. Retrieved 2 July 2025.