హలాసనము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హలాసనం

హలాసనము (సంస్కృతం: हलसन) యోగాలో ఒక విధమైన ఆసనము. నాగలి రూపంలో ఉంటుంది కాబట్టి ఈ ఆసనాన్ని హలాసనమంటారు.

పద్ధతి[మార్చు]

  • మొదట శవాసనం వేయాలి.
  • తరువాత కాళ్ళు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి.
  • చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి.
  • ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులువుగా వేయవచ్చును.

ప్రయోజనం[మార్చు]

హలాసనం వలన వెన్నెముక సంబంధిత కండరాలకు, నరాలకు బలం హెచ్చుతుంది. వెన్నెముక మృదువుగా ఉంటుంది. మెడకు రక్తప్రసారం చక్కగా జరుగుతుంది. నడుము సన్నబడుతుంది. బాణపొట్ట తగ్గుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=హలాసనము&oldid=2952470" నుండి వెలికితీశారు