హల్దీఘాటీ
హల్దీఘాటీ | |
---|---|
ప్రదేశం | రాజ్‌సమంద్ జిల్లా, రాజస్థాన్ |
శ్రేణి | ఆరావళి |
హల్దీఘాటి అనేది ఖమ్నోర్, బలిచా గ్రామాల మధ్య ఉన్న ఒక పర్వత కనుమ. ఇది రాజస్థాన్‌లోని ఆరావళి శ్రేణిలో, రాజ్‌సమంద్, ఉదయపూర్ జిల్లాలను కలుపుతూ ఉంది. ఈ కనుమ దారి ఉదయపూర్ నుండి 44 కిలోమీటర్ల దూరంలో ఉంది. 'హల్దీఘాటి' అనే పేరు ఈ ప్రాంతంలోని పసుపు రంగు మట్టి నుండి వచ్చిందని భావిస్తున్నారు. (హిందీలో హల్దీ అంటే పసుపు). [1]
చరిత్ర
[మార్చు]ఈ పర్వత కనుమ ఒక ముఖ్యమైన చారిత్రక ప్రదేశం. ఖమ్నోర్ లోని రక్త్ తలై హల్దీఘాటీ యుద్ధం జరిగిన ప్రదేశం. ఈ యుద్ధం 1576 జూన్ 18 న మేవార్ రాజ్యానికి, మొఘల్ సైన్యానికీ మధ్య జరిగింది. అంబర్‌కు చెందిన మాన్ సింగ్ I నేతృత్వం లోని మొగలు సైన్యాలతో జరిగిన యుద్ధానికి మహారాణా ప్రతాప్, మేవార్ సైన్యానికి నాయకత్వం వహించాడు.
స్మారకం
[మార్చు]హల్దీఘాటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ గుర్రం చేతక్, కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధంలో చేతక్ ఘోరంగా గాయపడి 1576 జూన్ 18 న మరణించింది. చేతక్ పడిపోయిన ప్రదేశంలో మహారాణా ప్రతాప్ దాని కోసం ఒక చిన్న స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ఆ సమాధి ఇప్పటికీ హల్దీఘాటిలో ఉంది.
భారత ప్రభుత్వం 1997 సంవత్సరంలో మహారాణా ప్రతాప్ నేషనల్ మెమోరియల్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 2009 జూన్‌లో స్మారకాన్ని ప్రారంభించారు. [2] స్మారక కట్టడంలో చేతక్‌పై ఎక్కి కూచున్న మహారాణా కాంస్య విగ్రహం ఉంది.
పర్యాటకం
[మార్చు]హల్దీఘాటి గులాబీ ఉత్పత్తికి, మోలెలా మట్టి కళకు ప్రసిద్ధి చెందింది. ప్రైవేట్ కుటీర పరిశ్రమను ప్రోత్సహించడం కోసం పర్యాటక శాఖ కృషిచేస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ ""Haldighati"".
- ↑ www.haldighati.com, retrieved 19 January 2010