హల్దీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హల్దీరామ్
Typeప్రైవేట్
పరిశ్రమఆహరం
స్థాపనబికనీర్, రాజస్థాన్, భారత దేశం
(1941; 83 సంవత్సరాల క్రితం (1941))
Foundersగంగా బిషన్ అగర్వాల్l (హల్దీరామ్ జీ)
ప్రధాన కార్యాలయం,
భారత దేశం
Areas served
ప్రాంతాల సేవలు
Productsతినుబండారాలు, తీపి మిఠాయిలు, పానీయాలు, నిల్వ ఆహారాలు, ఆలు చిప్స్
Revenueమూస:Up7,130 crore (US$890 million) (2019) [1]
Website

హల్దీరామ్ (Haldiram) తినుబండారాలను ఉత్పత్తి చేసే, రెస్టారెంట్లను నిర్వహించే ఒక భారతీయ బహుళజాతి సంస్థ.[2]. దీని ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగ పూర్ లో ఉంది. న్యూఢిల్లీ, గుర్ గావ్, హుగ్లీ, రుద్రపూర్, నోయిడా వంటి వివిధ రకాల ప్రదేశాలలో ఈ వస్తువులను తయారు చేస్తారు. హల్దీరామ్ వ్యాపార సంస్థకు స్వంత రిటైల్ చైన్ దుకాణములు ఉన్నాయి. పూణే, నాగపూర్, రాయ్ పూర్, కోల్ కతా, నోయిడా, ఢిల్లీలో అనేక రకాల రెస్టారెంట్లు కలిగి ఉన్నాయి.[3][4]

చరిత్ర[మార్చు]

హల్దీ రామ్ 1937 సంవత్సరంలో రాజస్థాన్ లోని బికనీర్ లో హల్దీరామ్ అగర్వాల్ అని పిలువబడే గంగాబిసంజీ అగర్వాల్ తో ప్రారంభించబడింది. హల్దీరామ్ అక్కడ హల్దీరామ్ ఒక చిన్న చిరుతిండి దుకాణం. 1982 సంవత్సరంలో తన వ్యాపార విస్తరణకు నాంది పలికింది. ఢిల్లీలో తన మొదటి దుకాణాన్ని ఏర్పాటు చేసింది.  ఒక దశాబ్దం తరువాత, సంస్థ అమెరికా దేశానికి తన ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, హల్దీరామ్ ఉత్పత్తులు 50 కి పైగా దేశాలలో అందుబాటులో ఉన్నాయి. టెస్కో, సోమర్ఫీల్డ్, స్పిన్నీస్, కారెఫోర్ వంటి అంతర్జాతీయ సూపర్ మార్కెట్లలో గణనీయమైన అమ్మకాలను కొనసాగించింది.భారతదేశంలో, హల్దీరామ్ ఆహార ప్రత్యేకతలను అందించే రెస్టారెంట్లను నడుపుతుంది. కంపెనీ తెలిపిన ప్రకారం, రెస్టారెంట్లు ప్రతి సంవత్సరం సగటున 3.8 బిలియన్ లీటర్ల పాలు, 80 మిలియన్ కిలోగ్రాముల వెన్న, 62 మిలియన్ కిలోల బంగాళాదుంప,, 60 మిలియన్ కిలోల నెయ్యిని తమ ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నాయి.[5] హల్దీరామ్ అగర్వాల్ కేవలం రూ.100తో తన వ్యాపారం ప్రారంభించాడు. 1970లో హల్దీరామ్ సంస్థ నాగపూర్ లో మొట్టమొదటి పూర్తి-ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించింది, రుచికరమైన వివిధ రకాల రుచికరమైన వంటకాలు, మిఠాయిలను, పానీయాలను మార్కెట్ కు పరిచయం చేసింది. హల్దీరామ్ 2019 సంవత్సరానికి సంస్థ ఆదాయం: రూ.7130 కోట్ల ఆదాయంతో ప్రాఫిట్ మార్జిన్ 9%, 80% అమ్మకాలలో రెస్టారెంట్, ప్యాకేజ్డ్ స్నాక్స్ నుండి ఉన్నాయి. మార్కెట్ వాటా: 20% (ఇది మార్కెట్ లీడర్) తో తన వ్యాపారం నిర్వహిస్తున్నది.[6]

అభివృద్ధి[మార్చు]

హల్దీరామ్ బికనీర్ లో తన వ్యాపారంలో విజయం సాధించిన తరువాత, తన నమ్ కీన్ వ్యాపారాన్ని కోల్ కతాలో విస్తరించాలని నిర్ణయించుకున్నారు. బికనీర్ వెలుపల హల్దిరామ్ బ్రాండ్ పేరును ప్రచారం చేయడం ఇదే మొదటిసారి. భారతదేశంలో సూపర్ బ్రాండ్లలో ఒకటిగా మారడానికి బ్రాండ్ మరింత పెరగడం ఇక్కడి నుంచి ప్రారంభమైంది. 1970 - 1980 కాలంలో గంగా బిషన్ మనుమలు కోల్ కతాలో స్థాపించిన తరువాత తమ వ్యాపారమును న్యూఢిల్లీ, నాగపూర్ కుటుంబ వ్యాపారాన్ని ప్రాంతాలుగా విభజించి గంగా బిషన్ మనుమలు నిర్వహించారు.

గుర్గావ్‌లోని హల్దీరామ్‌లో దక్షిణ భారత వంటలు సాంబార్, కొబ్బరి చట్నీ, మసాలా దోస, ఇడ్లీ, ఉల్లిపాయ ఊతప్ప, వడ..

వీటిలో పశ్చిమ- దక్షిణ భారతదేశ ప్రాంతాలలో శివ కిషన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉండి, హల్దీరామ్స్ నాగ్ పూర్ అనే బ్రాండ్ ను సృష్టించాడు. పశ్చిమ భారత దేశ (నార్త్ ఇండియా) ప్రాంతములో మనోహర్ అగర్వాల్, మధుసూదన్ అగర్వాల్ ల నిర్వహణలో హల్దీరామ్స్ అనే బ్రాండ్ పేరును సృష్టించారు. తూర్పు భారతదేశ (ఈస్ట్ఇండియా) ప్రాంతములో ప్రభు శంకర్ అగర్వాల్, అశోక్ అగర్వాల్ లకు ఇవ్వబడింది, వారు తమ బ్రాండ్ పేరును హౌస్ ఆఫ్ హల్దీరామ్స్ గా మార్చారు. బహుళ జాతి వ్యాపార సంస్థలు హల్దీరామ్స్ సంస్థలో భాగస్వామ్యం కోసం అగర్వాల్స్ ను సంప్రదించినప్పటికీ, హల్దీరామ్స్ సంస్థ నిర్వాహకులు వారి స్వంత భవిష్యత్తు, ప్రతిష్ఠాత్మకత కోసం ప్రణాళికలతో వ్యాపారం నిర్వహణ చేసి, వారి ఉత్పత్తులు బాగా ప్రసిద్ధి చెందడంతో, వ్యాపారంలో అంతర్జాతీయ మార్కెట్లలో విజయం సాధించారు. రూ .5, రూ. 10 ధరలతో గల చిన్న ప్యాకెట్లతో నమ్ కీన్ లభ్యత భారతదేశం అంతటా 'హల్దీరామ్స్' బ్రాండ్ పేరుగా గుర్తించడానికి చాలావరకు దోహదపడింది.[7]

ఉత్పత్తులు[మార్చు]

గంగా భిషేన్ మనుమడు శివ్ కిషన్, 100 దేశాల్లోని ఫ్రాంఛైజీలు, ఫుడ్ మాల్స్, కార్నర్ షాపుల్లో 400 ఉత్పత్తి శ్రేణిలో సాంప్రదాయ నమ్‌కీన్‌లు, పాశ్చాత్య స్నాక్స్, భారతీయ స్వీట్లు, కుకీలు, షర్బత్, గులాబ్ జామున్, బికనేరి భుజియా, పాపడు వంటి ఊరగాయలు ఉన్నాయి.భారతీయ స్వీట్లు, బేక్డ్ ఫుడ్స్, ఫ్రెష్, ఫ్రోజెన్ ఫుడ్స్ మొదలైనవి ఉన్నాయి.[8]

ఢిల్లీలోని సరితా విహార్‌లోని హల్దీరామ్ రెస్టారెంట్‌లో చాట్ ఐటెమ్‌లు.

మూలాలు[మార్చు]

  1. "Economic Times article about Haldiram's". Retrieved June 13, 2020.
  2. "Philadelphia students have a taste of India". web.archive.org. 2014-09-28. Archived from the original on 2014-09-28. Retrieved 2022-07-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Malviya, Sagar. "Bikaneri Namkeen hits $1 billion sweet spot". The Economic Times. Retrieved 2022-07-21.
  4. "Bhujia to billions: Ganga Bhishen's Haldiram's has now become $3 bn biz empire". The Economic Times. Retrieved 2022-07-21.
  5. Malhotra, Aditi (2015-06-15). "A Short History of India's Haldiram's". Wall Street Journal (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0099-9660. Retrieved 2022-07-21.
  6. "What is Haldiram's story? How it became the largest snack seller?". The Strategy Story (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-14. Retrieved 2022-07-21.
  7. India, The Brands of (2020-11-18). "Haldiram : A legacy carried on by 3 different brands". The Brands of India (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-08. Retrieved 2022-07-21.
  8. Khandekar, Omkar (2020-02-07). "The bhujia king: Haldiram's' Shiv Kishan Agarwal". mint (in ఇంగ్లీష్). Retrieved 2022-07-21.