హాజోంగ్
| హాజోంగ్ | |
|---|---|
| হাজং | |
బెంగాలీ-అస్సామీ లిపిలో "హాజోంగ్" | |
| ఉచ్ఛారణ | [ha.dʑɔŋ] |
| స్థానిక భాష | భారతదేశం, బంగ్లాదేశ్ |
| ప్రాంతం | భారతదేశంలోని మేఘాలయ, అస్సాం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్‌లోని మైమన్‌సింగ్, షేర్‌పూర్, నెట్రోకోనా, సునమ్‌గంజ్ |
| స్వజాతీయత | హాజోంగ్ ప్రజలు |
స్థానికంగా మాట్లాడేవారు | 80,000 (2011–2022)[1] |
| ప్రాంతీయ రూపాలు |
|
| బెంగాలీ-అస్సామీ లిపి, లాటిన్ లిపి[2] | |
| భాషా సంకేతాలు | |
| ISO 639-3 | haj |
| Glottolog | hajo1238 |
హాజోంగ్ అనేది ఒక ఇండో-ఆర్యన్ భాష.[3] దీనిలో టిబెటో-బర్మన్ భాషా మూలాలు ఉన్నట్లు భావిస్తారు.[4] భారత ఉపఖండంలోని ఈశాన్య ప్రాంతంలో, ముఖ్యంగా ప్రస్తుత భారతదేశంలోని అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో, ప్రస్తుత బంగ్లాదేశ్ లోని మైమన్‌సింగ్, సిల్హెట్ విభాగాలలో నివసించే సుమారు 80,000 మంది హాజోంగ్ తెగ ప్రజలు ఈ భాషను మాట్లాడుతారు. దీనిని బెంగాలీ-అస్సామీ లిపి, లాటిన్ లిపిలను ఉపయోగించి రాస్తారు.[5] ఇందులో అనేక సంస్కృతం ప్రాతిపదిక పదాలు ఉన్నాయి. హాజోంగ్ ప్రజలు మొదట్లో ఒక టిబెటో-బర్మన్ భాషను మాట్లాడేవారు, కాలక్రమేణా అది అస్సామీ, బెంగాలీ భాషలతో మిళితమైంది.[6]
పాత హాజోంగ్
[మార్చు]హాజోంగ్ ప్రజలు ఇప్పుడు మాట్లాడుతున్న భాషను ఇండో-ఆర్యన్ భాషగా పరిగణించవచ్చు, ఎందుకంటే వారు పూర్వపు టిబెటో-బర్మన్ భాష నుండి ఈ భాషా శైలికి మారారు.[7] పాత హాజోంగ్ లేదా ఖాతీ హాజోంగ్ అనేది టిబెటో-బర్మన్ మూలానికి చెందిన గారో భాషకు దగ్గరగా ఉండేది.
వైవిధ్యాలు
[మార్చు]ప్రాంతీయ వైవిధ్యాల వల్ల హాజోంగ్ భాష వివిధ వంశాలలో కొద్దిగా మారుతుంది. హాజోంగ్ ప్రజలలో ఐదు ముఖ్యమైన వంశాలు ఉన్నాయి.
- దోస్కిన్వ
- కోరేబర్యవ
- సుసుంగ్యవ
- బరోహజార్యవ
- మీస్పర్యవ
లిపి విధానం
[మార్చు]హాజోంగ్ భాషను రాయడానికి లాటిన్, బెంగాలీ లిపులు రెండింటినీ ఉపయోగిస్తారు.[8] భారతదేశంలో ఈ రెండు లిపులను ఉపయోగిస్తున్నప్పటికీ, బంగ్లాదేశ్‌లోని హాజోంగ్ ప్రజలు బెంగాలీ లిపిని ఉపయోగించడానికి మొగ్గు చూపుతారు, ఎందుకంటే అక్కడ విద్య ఎక్కువగా బెంగాలీ మాధ్యమంలో సాగుతుంది.[9] ధేమాజీ, దాని పరిసర ప్రాంతాలలో నివసించే హాజోంగ్ ప్రజలు అస్సామీ లిపిని ఉపయోగిస్తారు. ప్రతి లిపిలోనూ, సంవృత పశ్చ అగోళాకార అచ్చు /ɯ/ కొరకు ఒక ప్రత్యేక చిహ్నం చేర్చబడింది. లాటిన్ లిపిలో దీనిని "w" తో, తూర్పు నాగరి లిపిలో అక్షరం చివర "অৗ" తో సూచిస్తారు.[10]
ధ్వనిశాస్త్రం
[మార్చు]హాజోంగ్ భాషలో 23 హల్లు ధ్వనులు, 8 అచ్చు ధ్వనులు, హల్లుల లక్షణాలు కలిగిన 2 అంతస్థాలు ఉన్నాయి: /w/, /j/ లు ద్విస్వరాలుగా పనిచేస్తాయి. అచ్చు ధ్వనులు /a/, /i/, /u/, /e/, /ɛ/, /o/, /ɔ/, /ɯ/. ఇతర ఇండో-ఆర్యన్ భాషల్లా కాకుండా, హాజోంగ్ భాషలో ఒకే ఒక 'i', ఒకే ఒక 'u' ఉంటాయి. ఇతర ఇండో-ఆర్యన్ భాషలలో కనిపించని /ɯ/ అనే అదనపు అచ్చు, టిబెటో-బర్మన్ భాషా కుటుంబంలో సాధారణంగా కనిపిస్తుంది.[11] పదాల చివర ఉండే కొన్ని హల్లులు శ్వాసధ్వనులుగా మారుతాయి.[10]
| ఓష్ఠ్య | దంత్య, వర్త్స్య |
తాలవ్య | కంఠ్య | కాకల్య | |||
|---|---|---|---|---|---|---|---|
| నాసిక్యం | [[|m]] | [[|n]] | [[|ŋ]] | ||||
| స్పర్శ/ స్పర్శసంఘర్షి |
అల్పప్రాణ | శూన్యశ్వాసం | [[|p]] | [[|t]] | [[|tɕ]] | [[|k]] | |
| మహాప్రాణ | [[|pʰ]] | [[|tʰ]] | [[|tɕʰ]] | [[|kʰ]] | |||
| నాదితం | అల్పప్రాణ | [[|b]] | [[|d]] | [[|dʑ]] | [[|ɡ]] | ||
| మహాప్రాణ | [[|bʱ]] | [[|dʱ]] | [[|dʑʱ]] | [[|ɡʱ]] | |||
| సంఘర్షి | శూన్యశ్వాసం | [[|s]] | [[|h]] | ||||
| నాదితం | ([[|z]])[a] | ||||||
| తాడితం | [[|ɾ]] | ||||||
| పార్శ్వీకం | [[|l]] | ||||||
| అంతస్థం | [[|w]] | [[|j]] | |||||
- ↑ హాజోంగ్ భాషలో /z/ ధ్వని, /s/ తో ముగిసే పదం తర్వాత అచ్చుతో ప్రారంభమయ్యే విభక్తి ప్రత్యయాలు వచ్చినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది.
| పూర్వ | మధ్య | పశ్చ | |
|---|---|---|---|
| సంవృత | [[|i]] మూస:Grapheme | [[|ɯ]] మూస:Grapheme, [[|u]] మూస:Grapheme | |
| అర్ధ సంవృత | [[|e]] మూస:Grapheme | [[|o]] మూస:Grapheme | |
| అర్ధ వివృత | [[|ɛ]] మూస:Grapheme | [[|ɔ]] మూస:Grapheme | |
| వివృత | [[|ä]] మూస:Grapheme |
పదాల అర్థాలను, వాక్యాల వ్యాకరణ నిర్మాణాన్ని మార్చడంలో అచ్చులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అస్సామీ, బెంగాలీ వంటి అనేక ఇతర ఇండో-ఆర్యన్ భాషల్లా కాకుండా, హాజోంగ్‌లో దీర్ఘ, హ్రస్వ /i/, /u/ ల మధ్య తేడా లేదు. అస్సామీ లిపిలో హాజోంగ్ ధ్వనిశాస్త్రానికి ప్రత్యేకమైన కొన్ని అచ్చులు లేవు, ఇది క్రమంగా అచ్చుల మార్పుకు దారితీస్తోంది.
వ్యాకరణం
[మార్చు]హాజోంగ్ భాష సాధారణంగా కర్త-కర్మ-క్రియ (subject–object–verb) వాక్య క్రమాన్ని అనుసరిస్తుంది. హాజోంగ్ భాషలో పదబంధాలు తరచుగా కలిసిపోతాయి, వాక్యంలోని పదాల మధ్య పెద్దగా విరామం ఉండదు.
ఇది తూర్పు ఇండో-ఆర్యన్ భాషగా పరిగణించబడుతున్నప్పటికీ, హాజోంగ్ బెంగాలీ లేదా అస్సామీ లాగా క్రియలను రూపాంతరం చేయదు, సరళమైన పద్ధతిని కలిగి ఉంటుంది. హాజోంగ్‌లోని విభక్తి ప్రత్యయాలు ఇతర ఇండో-ఆర్యన్ భాషలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి, ఇవి టిబెటో-బర్మన్ భాషలతో గల సంబంధాన్ని సూచిస్తాయి.[13][14] కింది పట్టిక ఫిలిప్స్ పరిశోధన నుండి తీసుకోబడింది:[14]
| హాజోంగ్ | హాజోంగ్ (IPA లో) | తెలుగు అర్థం | విభక్తి |
|---|---|---|---|
| বুৰি-ৰৗ | buri-rɯ | ముసలి అవ్వ | ప్రథమా |
| বুৰি-ৰৗগে | buri-rɯge | ముసలి అవ్వకు | చతుర్థీ |
| বুৰি-লৗ | buri-lɯ | ముసలి అవ్వ యొక్క | షష్ఠీ |
| বুৰি নি | buri ni | ముసలి అవ్వ వద్ద | సప్తమీ |
| বুৰি ভায় | buri bʰaʲ | ముసలి అవ్వ వైపు | ద్వితీయా (దిశ) |
| বুৰি থিকি | buri t̪ʰiki | ముసలి అవ్వ నుండి | పంచమీ |
| বুৰি দিঅৗ | buri diɯ | ముసలి అవ్వ ద్వారా | తృతీయా |
గౌరవార్థకాలు
[మార్చు]హాజోంగ్ భాష యొక్క ఒక ప్రత్యేక లక్షణం గౌరవార్థకాల ఉపయోగం. హోదాలో పెద్దవారైన వారి గురించి మాట్లాడేటప్పుడు, వక్త వారి గౌరవాన్ని సూచించడానికి ప్రత్యేక నామవాచకాలు లేదా క్రియా ముగింపులను ఉపయోగిస్తారు. పెద్దలను ఎల్లప్పుడూ వారి పేరుతో కాకుండా గౌరవప్రదమైన పదాలతో పిలవాలి. పదాల చివర 'ge', 'ha' చేర్చడం కూడా ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడానికి ఒక పద్ధతి.
నమూనా వాక్యాలు
[మార్చు]కొన్ని నమూనా వాక్యాలు కింది పట్టికలో ఇవ్వబడ్డాయి:[15]
| హాజోంగ్ వాక్యం | లాటిన్ లిపిలో హాజోంగ్ | తెలుగు అర్థం |
|---|---|---|
| কুমায় জায়? | kumai jai? | ఎక్కడికి వెళ్తున్నారు? |
| কিংকৗ আছে? | kingkw ase? | ఎలా ఉన్నారు? |
| তই আহিলে? ভিতুৰ ভায় আয়। | Toi ahile? Bhiturbai ai. | వచ్చావా? లోపలికి రా. |
| তুলা আহাৰা ভালা হুছেই। | Tula ahara bhala husei. | మీరు రావడం చాలా మంచిదయింది. |
| ভাত খাছে? | Bhat khase? | అన్నం తిన్నారా? |
| চা খাবো? | Cha khabo? | టీ తాగుతారా? |
| তই কুন গাওলা? | Toi kun gaola? | మీది ఏ ఊరు? |
| মই তাঙাবাৰিলৗ। | Moi Tangabarilw. | నాది టాంగాబారి. |
| ইলা তই কুমায় থাকে? | Ila toi kumai thake? | ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? |
| তুলা ঘৰৰา কুমায়? | Tula ghorra kumai? | మీ ఇల్లు ఎక్కడ ఉంది? |
| মুলা ঘৰৰา হাৱাখানানি। | Mula ghorra Hawakhanani. | మా ఇల్లు హవాఖానాలో ఉంది. |
| ইদৗ অগে বুজিয়ৗ দি। | Idw oge bujyw di. | ఇది అతనికి వివరించు. |
| ইদৗনি লিখিক। | Idwni likhik. | ఇక్కడ రాయి. |
| ময় জাং। | Moy jang. | నేను వెళ్తున్నాను. |
| আবাৰ লাক পাবোউ। | Abar lak pabou. | మళ్లీ కలుద్దాం. |
గమనికలు
[మార్చు]- ↑ మూస:E28
- ↑ మూస:E28
- ↑ Ghosh, Joydeep (2019). General Knowledge of Northeast India: For All PSC and Competitive Exams. Educreation Publishing. p. 85.
- ↑ Hajong, Biren (2002). The Hajongs and their struggle. Smt. Sushmita Hajong. OCLC 499982956. Foreword(2) by Satyendra Narayan Goswami.
- ↑ Eberhard, David M.; Simons, Gary F.; Fennig, Charles D., eds. (2019). Hajong Ethnologue: Languages of the World (22nd ed.). Dallas, Texas: SIL International. Archived from the original on 28 ఏప్రిల్ 2019. Retrieved 16 మార్చి 2020.
- ↑ Singh, R. P. (2013). "Hajong". In Danver, Steven (ed.). Native Peoples of the World. Vol. 2. Sharpe Reference. p. 531. ISBN 978-0-7656-8222-2.
[The Hajongs] speak the Hajong language, originally a Tibeto-Burman tongue that later mixed with Assamese and Bengali.
- ↑ Hajong, Diarchy, dir. Woven Whispers. Ethnography. Visual Anthropology Lab, Department of Anthropology, University of Delhi, 2024. https://www.youtube.com/watch?v=3x8lit8ZknU.
- ↑ "Hajong". ScriptSource.
- ↑ Ahmad, S., A. Kim, S. Kim, and M. Sangma. (2005). The Hajong of Bangladesh: A sociolinguistic survey. http://www.sil.org/resources/publications/entry/42943, p. 13.
- 1 2 Guts, Y. (2007). Phonological description of the Hajong language. Masters Thesis. Amsterdam, Vrije Universiteit.
- ↑ Guts, Y. (2007). Phonological description of the Hajong language. Masters Thesis. Amsterdam, Vrije Universiteit; p 59.
- ↑ (Mahanta 2012:220)
- ↑ Grierson, G. A. (1967) [First published 1903]. Linguistic survey of India. Delhi: Motilal Banarsidass. p. 215. OCLC 27793754.
- 1 2 Phillips, V. C. (2011). "Case Marking in Hajong" (PDF). In G. Hyslop; S. Morey; M. Post (eds.). North East Indian Linguistics: Volume 3. Delhi: Foundation Books. pp. 224–240.
- ↑ Hajong, Phillips & Phillips 2008
మూలాలు
[మార్చు]- Hajong, Abonis; Phillips, D; Phillips, V (2008), Hajong–English Phrase Book (PDF), SIL International
- Mahanta, Sakuntala (2012). "Assamese". Journal of the International Phonetic Association. 42 (2): 217–224. doi:10.1017/S0025100312000096.
మరింత పఠనం
[మార్చు]- Narzary, A.; Arulmozi, S. (2025). "Noun Morphology in Hajong". In N. S. Dash; S. Arulmozi; N. Ramesh (eds.). Handbook on Endangered South Asian and Southeast Asian Languages. Cham: Springer. pp. 17–54. doi:10.1007/978-3-031-80752-7_2.
- Short description matches Wikidata
- March 2017 from EngvarB
- November 2020 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- Pages with Hajong IPA
- ISO language articles citing sources other than Ethnologue
- Language articles with unsupported infobox fields
- Articles containing Assamese-language text
- Articles containing Hajong-language text
- భారతదేశ భాషలు
- అస్సాం భాషలు
- అరుణాచల్ ప్రదేశ్ భాషలు
- మేఘాలయ భాషలు
- బంగ్లాదేశ్ భాషలు
- ఇండో-ఆర్యన్ భాషలు