హారూన్ ప్రవక్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హారూన్ : ఇతను ఒక ఇస్లామీయ ప్రవక్త. మూసా ప్రవక్త సోదరుడు. ఐగుప్తు (ఈజిప్ట్) నుండి యూదుల విడుదలకోసం మూసాతో కలిసి ఫిరౌన్ (ఫరో) ఎదుట అనేక అద్భుతాలు చేసినవాడు. మూసా నత్తి వాడు. ఆయనకు బదులుగా మాట్లాడటానికి హారూన్ (అహరో) ను దేవుడు పంపాడని క్రైస్తవులు భావిస్తారు. ఇస్లామీయ చారిత్రక పుస్తకాలు, ఖురాన్ ఆధారంగా చూస్తే, మూసా ప్రవక్తకు సహాయకుడిగా అల్లాహ్ పంపాడు. మూసాకు కొద్దిగా నత్తి వుండడము వాస్తవమే అయినా, మూసా వాగ్ధాటి, హేతువుల ప్రదర్శన, హారూన్ కు అలవడలేదు. మూసా కాలములో హారూన్, మూసాతో సహా ప్రవక్తగా ప్రకటింపబడిననూ, మూసా ముందు నిస్సహాయుడిగానుండి పోయాడు.