హార్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హార్వే
తారాగణంజేమ్స్ స్టీవర్ట్

పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న హార్వే అనే నాటకం ఆధారంగా 1950లో జేమ్స్ స్టీవర్ట్ కథానాయకుడిగా ఈ చిత్రం నిర్మింపబడినది. ఒక వ్యక్తి ఆరడుగులు పైగా పొడవున్న కుందేలును తన మితృడిగా ఊహించుకొంటూ జీవనం చేయడం ఈ చిత్ర కథాంశం.

కథాంశం[మార్చు]

ఎల్‌వుడ్ ఒక ధనిక మధ్యవయస్కుడు . ఎల్‌వుడ్ తల్లి చనిపోతూ ఆస్తి మొత్తం ఎల్‌వుడ్ పేరున రాస్తుంది. అప్పటినుండి ఎల్‌వుడ్ అక్క తన కూతురుతో కలసి ఎల్‌వుడ్ ఇంటిలో ఉంటూ అన్నీ చూసుకుంటుంటుంది. ఎల్‌వుడ్ మానసికంగా పూర్తిగా ఎదగని వాడు. ఎపుడు తన వెంట తన కల్పిత మితృడయిన ఆరడుల పైన పొడవున్న కుందేలును చెయ్యి పట్టుకొని పట్టణంలో తిరుగుతూ, కొత్తవాళ్ళతో పరిచయం చేసుకుంటూ వారికి సహాయం చేసి వారి జీవితంలో అనుభవించిన కష్టసుఖాలు అడిగి తెలుసుకొని హార్వేని పరిచయం చేస్తుంటాడు. తాను పరిచయం చేసుకున్న వాళ్ళకు తన విజిటింగ్ కార్డు ఇచ్చి విందుకు ఆహ్వానిస్తుంటాడు. తాను ఏ పని చేయాలన్నా పక్కకు తిరిగి హార్వేతో సంభాషించి హార్వే సలహాలు తీసుకుంటాడు. ఎల్‌వుడ్ మంచితనం తెలిసినవాళ్ళు అందరూ హార్వే ఉన్నట్టే భావిస్తూ అతనిని నొప్పించరు.

ఒక రోజు ఎల్‌వుడ్ అక్క ఆ ధనవంతురాళ్ళకు తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తుంది. ఆ సమయంలో బయట వెళ్ళిన ఎల్‌వుడ్ ఎలా అయినా ఇంటికి రాకుండా చూడమని తన లాయరుకు చెబుతుంది. తన ఇంట్లో విందు జరుగుతున్న సంగతి తెలుసుకున్న ఎల్‌వుడ్ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళను పలకరిస్తుంటాడు. ఎల్‌వుడ్ ఎక్కడ హార్వే గురించి చెబితే అతనికి మతిస్తిమితం లేదని తెలిసి తమ పరువు పోతుందో అని ఎల్‌వుడ్ అక్క, ఆమె కూతురు అతన్ని అక్కడి నుండి తప్పించాలని చూస్తారు కానీ వారి ప్రయత్నాలు ఫలించవు. ఎల్‌వుడ్ విందుకు వచ్చినవారికి హార్వేని పరిచయం చేయడం మొదలుపెడతాడు. కనిపించని హార్వేని పరిచయం చేస్తుండడం చూసి అందరూ భయపడి ఏదో దయ్యం పట్టిందనుకొని భయపడి వెళ్ళిపోతారు. తన తమ్ముడి పైన ఎంతో ప్రేమ ఉన్నా అతడు హార్వే ద్వారా చేస్తున్నవి భరించలేక అతడిని మానసిక వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించాలనుకొని అక్కడకు తీసుకు వెళ్తుంది.

జేమ్స్ స్టీవర్ట్

అక్కడ డాక్టరు చేసిన పొరపాటు వల్ల ఎల్‌వుడ్ అక్క పిచ్చిది అనుకొని ఆమెకు చికిత్స చేయాలని ఒక గదిలో బంధిస్తారు. ఎల్‌వుడ్ మాట తీరు, మంచితనం చూసి అతడు చాలా గొప్పవాడు అనుకుంటారు. ఎల్‌వుడ్ డాక్టరును నర్సును ఆ రాత్రి విందుకు ఆహ్వానిస్తాడు. బయట వచ్చిన ఎల్‌వుడ్, హార్వే కనపడలేదు అంటూ కనపడిన వాళ్ళను అడగడం మొదలు పెడతాడు. డాక్టర్లు కొద్ది సేపటికి జరిగిన తప్పు తెలుసుకొని ఎల్‌వుడ్ అక్కను బయట తీసుకువచ్చి ఎల్‌వుడ్ కోసం వెతకడం మొదలు పెడతారు. చివరగా ఎల్‌వుడ్‌ను బార్‌లో కలుసుకొని అందరూ కలసి హాస్పిటలుకు వస్తారు.

ఎల్‌వుడ్ అక్క తాను తన తమ్ముడు-హార్వే వల్ల ఎన్నో బాధలు పడుతున్నానని అంటుంది. ఎల్‌వుడ్ తన అక్క బాధపడడం చూసి ఆమె సంతోషంగా ఉండడానికి ఏమి చేయడానికయినా సిద్దం అంటాడు. అపుడు ఎల్‌వుడ్ ను చికిత్స తీసుకోమని చెప్తుంది. తన అక్క సంతోషంకోసం చికిత్స కోసం గదిలోకి వెళ్తాడు. అపుడు ట్యాక్సీ డ్రైవర్ ఈ చికిత్స పూర్తి అయిన తర్వాత ఎల్‌వుడ్ కూడా అందరిలా మామూలు మనిషి అవుతాడని, అతడి మనసు కూడా స్వార్థం, కుట్రలతో నిండుతాయని, తాను ఎందరినో చూసానని చెప్తాడు.

ఒక్కసారిగా తన తమ్ముడిలోని మంచితనం, చికిత్స జరిగిన తర్వాత అతడూ అందరిలా ఉండడం ఊహించుకొన్న ఎల్‌వుడ్ అక్క చికిత్స వద్దని, తన తమ్ముడు ఎప్పటికీ ఇలాగే కల్మషంలేని వాడిలా ఉండిపోవాలని చెప్పి చికిత్స ఆపివేయిస్తుంది.. హార్వేతో మాటాడుతూ ఎల్‌వుడ్ ఇంటికి బయలుదేరుతాడు.


స్పందన[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హార్వే&oldid=2622570" నుండి వెలికితీశారు