హాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హాలియా, నల్గొండ జిల్లా, అనుముల మండలానికి చెందిన గ్రామం.

ఆ మండలంలో వ్యాపార కేంద్రంలు, వ్యవసాయం ఏక్కువగా సాగుతుంది. హలియా మిర్యాలగూడ నుంచి 31 కిలో మిటర్ల దూరంలో ఉంది.

ఇక్కడ సాగర్ ఎడమ కాలువ (ఎ.కె.ఎ. లాల్ బహాదుర్ శాస్త్రి కాలువ) వెళుతుంది. దీని వలన 0.32 మిలియన్ల ఏకరాలకు (800 km2) భూమికి సాగునీరందుతుంది. అనుముల మండలంలో కుందూరు జానారెడ్డి (మాజీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి) అనుముల మండలంలోనే జన్మించారు. హైద్రాబాద్ నుంచి హాలియాకు 150 కి.మీ. దూరంలో ఉంది. హాలియా పబ్లిక్ పాఠశాల ఎంతగానో ప్రఖ్యాతి గాంచింది.

గ్రామ చరిత్ర[మార్చు]

ఈ గ్రామానికి ఎలాంటి చరిత్ర లేదు. ఈ ఊరు ఏర్పడి 2010 నాటికి 50 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు ఇక్కడ మూడు రోడ్ల కూడలి మాత్రమే వుండేది. ప్రస్తుతం ఇక్కడ నివసిస్తున్న ప్రజలు చుట్టుపక్కలగల గ్రామీణ ప్రాంతాలలోని వారు. ఈ ఊరికి చుట్టుపక్కల గ్రామాలు, తాండాలు ఎక్కువగా వుండటంతో ఈ ప్రాంతం చిన్న నగరంగా అభివృద్ధి చెందుతుంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వం హలియాని అహల్యా అని పిలిచేవారు. ఈ ఊరు పక్కన ఒక వాగు ప్రవహిస్తుంది, దీనికి అహల్యా అనే పేరు కలదు‌, దీని వలన ఈ ఊరికి హాలియా అనే పేరు వచ్చింది. ఈ వాగు ఈ ఊరికి పక్కన ప్రవహించే కృష్ణా నదిలో కలుస్తుంది

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ ఊరికి దక్షిణంగా 22 కిలోమీటర్ల దూరంలో నాగర్జున సాగర్ ప్రజెక్టు కలదు‍, ఉత్తరంగా 40 కిలోమీటర్ల దూరంలో నల్లగొండ పట్టణం, ఈశాన్యంగా 30 కిలోమీటర్ల దూరంలో మిర్యాలగూడ పట్టణం, అదేవిధంగా పడమరగా హైదరాబాద్ 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరికి ఆనుకొని లాల్ బహుదూర్ శాస్త్రి ఎడమ కాలువ ప్రవహిస్తుంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ ఊరికి సమీపంలో ఇబ్రహీంపేట, నిడమనూరు, పేరూరు, తిరుమలగిరి, అల్వల, చలకుర్తి, పెద్దవూర, అనుముల, యాచారం వంటి చిన్న గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

ఈ ఊరికి సమీపంలో అనుముల, గుర్రంపూడు, నిడమనూరు అనే మండలాలు ఉన్నాయి. ఈ హలియా మండలం కాకపోయినా ఈ మూడు మండలాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామంలో 1 నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. మరియు ప్రభుత్వ జూనియర్ కళశాల ఉంది. ఇంకా ప్రవేటు పాఠశాల కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నిర్మల పాఠశాల, నలందా విద్యాలయం ఉంది. హాలియా పబ్లిక్ పాఠశాల, అక్షయ పబ్లిక్ పాఠశాల, వివేకానంద పాఠశాల, నవోదయా పాఠశాల, ఒక ఉర్దూ పాఠశాల ఉంది. అంతేకాకుండా నాగార్జున జూనియర్ కళాశాల, సృజన జూనియర్ కళాశాల, స్పందన జూనియర్ కళాశాలలు అనే మూడు ప్రవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రామకృష్ణ, యం.సి.యమ్. అనే రెండు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ ఊరికి రోడ్డు సౌకర్యం తప్ప మరే ఇతర రవాణా సౌకర్యాలు లేవు. ఈ గ్రామం నుండి నల్లగొండ పట్టణం కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖ పర్యటక ప్రాంతం నాగార్జున సాగర్ 22 కిలోమీటర్ల దూరంలో మరియు రాజధాని హైదరాబాద్ ఈ ప్రాంతనికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆధ్యాత్మిక ప్రదేశాలు[మార్చు]

ఇక్కడ పురాతన కాలం నుండి హనుమంతుడి ఆలయం ఉంది. అదే ప్రదేశంలో నూతనంగా శ్రీ సీతారాముల మందిరమును నిర్మిచారు. అదేవిధంగా శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేద్ర స్వామి ఆలయం ఉంది.ఇవేకాకుండా శ్రీ షిరిడి సాయి మందిరం, శ్రీ వేంకటేశ్వర మందిరములు ఉన్నాయి. అంతే కాకుండా హాలియకు 5 km దూరంలో గల పేరూరు గ్రామంలో పురాతన దేవాలయం శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయం కొలువై ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=హాలియా&oldid=2844828" నుండి వెలికితీశారు