హిందూజనసంస్కారిణి
1912 అక్టోబరు సంచిక | |
| సంపాదకులు | మన్నవ సింహాచలం పంతులు |
|---|---|
| తరచుదనం | మాసపత్రిక |
| స్థాపకులు | మన్నవ బుచ్చయ్య పంతులు |
| మొదటి సంచిక | 1885 ఆగస్టు |
| దేశం | భారతదేశం |
| కేంద్రస్థానం | మద్రాసు |
| భాష | తెలుగు |
హిందూజనసంస్కారిణి 1885 లో మద్రాసు నుండి మొదలైన తెలుగు మాసపత్రిక. మన్నవ బుచ్చయ్య పంతులు ఈ పత్రికను స్థాపించి సంపాదకత్వం నెరపాడు.[1] 1912 నుండి అతని కుమారుడు మన్నవ సింహాచలం పంతులు సంపాదకత్వం చేపట్టాడు. పున్తక నమీక్షలకు సంబంధించి ఒక పద్ధతిని ఏర్పరిచిన పత్రిక ఇదే.[2]
చరిత్ర
[మార్చు]హిందూజనసంస్కారిణి 1885 ఆగస్టులో మద్రాసులో మాసపత్రికగా మొదలైంది. వ్యవస్థాపకుడైన బుచ్చయ్య పంతులు మరణంతో పత్రిక ఆగిపోయింది. ఆ తరువాత అతని కుమారుడు మన్నవ సింహాచలం పంతులు 1912 లో స్వీయ సంపాదకత్వంలో పత్రికను పునరుద్ధరించాడు. 1912 ఆగస్టు నుండి మళ్ళీ సంపుటి 1, సంచిక 1 తో మొదలైంది.
బ్రిటిషు ప్రభుత్వ అధికారులు నెలనెలా పంపే గోప్య నివేదికలో వివిధ పత్రికల సర్క్యులేషను సంఖ్యలతో పాటు, పరిపాలనకు సంబంధించి ఆయా పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన సామాజిక వార్తలు, విశేషాలను కూడా ఇంగ్లీషు లోకి అనువదించి పంపేవారు. 1885 ఆగస్టు నివేదికలో ఈ పత్రిక కొత్తగా వచ్చిందని రాసారు. 1885 సెప్టెంబరు నివేదికలో దీని సర్క్యులేషను 100 అని నివేదించారు.[3] 1887 నవంబరు నాటి నివేదికలో ఈ పత్రిక సర్క్యులేషను 100,[4] 1888 ఫిబ్రవరి నాటికి 950 కి చేరింది. ఆ కాలంలో పత్రిక బాగా వృద్ధి చెందిందని తెలుస్తోంది. అయితే ఆ తరువాత సర్క్యులేషను క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1889 మార్చిలో 700, 1890 డిసెంబరులో 544 అని రాసారు.[5] 1893 జూన్ నాటికి పత్రిక సర్క్యులేషను 600 కు చేరింది.[6] 1899 జనవరిలో 394 గా ఉన్న సర్క్యులేషను 1900 జనవరి నాటికి 300 కు తగ్గింది.
రచనలు
[మార్చు]ఈ పత్రికలో పుస్తక పరిచయాలను విశేషంగా ప్రచురించేవారు. పున్తక నమీక్షలకు సంబంధించి ఒక పద్ధతిని ఏర్పరిచిన పత్రిక ఇదే.[2] సాటి పత్రికల గురించి కూడా రాసేవారు.
పత్రికలో రాజకీయ సామాజిక వార్తలు, విశ్లేషణలు, ప్రభుత్వం పై విమర్శలూ ఉండేవి. పోలీసు శాఖ లోని ఐరోపా అధికారులు సూపర్నెంటులూ, సహాయ సూపర్నెంటులూ పనిచెయ్యరనీ, వాళ్ళని తీసివేసి స్థానికులను నియమించాలనీ, తద్వారా వాళ్ళకు ఇచ్చే జీత భత్యాలు కూడా తగ్గుతాయనీ, 1896 జనవరిలో రాసింది. తిరుమల దేవాలయ ఆదాయాన్ని బైరాగులు, ఉద్యోగులూ దుబారా చేస్తున్నారనీ, పట్టణ పరిశుభ్రతకు, మురుగు నీటి పారుదల వంటివాటికి అయ్యే ఖర్చును దేవాలయ ఆదాయం నుండి వసూలు చెయ్యాలనీ రాసింది.
1888 - 1896 మధ్య వచ్చిన కొన్ని వార్తలు:
- రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, ఇంజనీర్ల జీతాలు తగ్గిస్తే , ఆదా అయిన డబ్బును రోడ్ల మరమ్మతుకు వాడవచ్చనీ రాసింది. బ్రిటిషర్లు దేశాన్ని వ్యాపారస్థుల్లా పాలిస్తున్నారనీ, వాళ్ళ చట్టాలను తమకు అనుకూలంగా చేసుకుంటున్నారు గానీ, ప్రజల ప్రయోజనం కోసం కాదనీ రాసింది.[7]
- మద్రాసు ప్రెసిడెన్సీలో పశువుల పేడకు కొరత ఉందనీ, ఇక పంటలేం పండుతాయనీ రాసింది. ఏ ఊళ్ళో చూసినా పశిగ్రాసానికి కొరత ఉందనీ ఇదే కొరతకు ముఖ్య కారణమనీ రాసింది.[8]
- మద్రాసు ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వ్య్తిరేకిస్తే గవర్నరు మాట కూడా చె;ల్లదని తెలుస్తోందనీ, అది సరికాదని చెబుతూ, గవర్నరు నిర్ణయమే అంతిమంగా నెగ్గాలని రాసింది.[9]
- భారతదేశాన్ని ఎప్పటికీ బ్రిటిషు వారే పాలించాలని రాసింది.[10]
- నీటి లభ్యత లేనిచోట ప్రభుత్వమే బావులు తవ్విస్తే రైతుల స్థితిగతులు మెరుగౌతాయని, ప్రభుత్వం వారివద్ద బావుల ఖర్చును శిస్తు ద్వారా వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చనీ రాసింది.[11]
- విపిపి పద్ధతిలో గ్రాహకుడు డబ్బులు కట్టకపోతే అతనికి కార్డు ఖర్చు తప్ప నష్టమేమీ ఉండదనీ, కానీ పంపేవారికి మాత్రం పోస్టేజీ, మనీయార్డరు ఖర్చులు తప్పవనీ, ఈ డబల్ ట్యాక్సును తీసెయ్యాలనీ కోరింది.[12]
- ఏజన్సీ ప్రాంతాల్లోని కోయలు ఉపాధి ఏమీ లేక దోపిడీలకు పాల్పడుతున్నారనీ, ఆ ప్రాంతాల్లో వ్యవసాయం, వాణిజ్యం నిలిచిపోయాయనీ రాసింది.[13]
- 1897 లో స్వాతంత్ర్యానికి సంసిద్ధం అనే వ్యాసంలో భారతదేశానికి కూడా కెనడా లాంటి స్వాతంత్ర్యం వచ్చే అవకాశం ఉందని రాసిన ప్రటోడా అనే గుజరాతీ వార్తాపత్రిక సంపాదకునికి ప్రభుత్వం యావజ్జీవ ద్వీపాంతరవాస జైలుశిక్ష, ప్రచురణ కర్తకు ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంత పెద్ద శిక్షను విమర్శిస్తూ హిందూజనసంస్కారిణి, భారతీయ చట్టాలను దురుపయోగం చేసి, భారతీయుల్లో ద్వేషం పెంచేది ఇలాంటి జడ్జీలేనని రాసింది.[14]
- బర్మాలో తిరుగుబాటును అణచేందుకు అవసరమైన డబ్బు కోసం ఇక్కడ ఉప్పు పన్ను పెంచడంపై నిరసన తెలియజేసింది.[15]
- ఒంగోలు, గుంటూరుల అసిస్టెంటు పోలీసు సూపర్నెంటులకు తమ ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాల పట్ల చర్యలపై శ్రద్ధ లేదనీ, ఒకరు ఎప్పుడూ కుక్కలు, పందులను కాల్చి చంపడంలో నిమగ్నమై ఉంటాడనీ, మరొకరు ఉంపుడుగత్తెతో కలిసి జిల్లా అంతా తిరుగుతూ ఉంటాడనీ రాసింది. వాళ్ళకి ఈ ఉద్యోగాలు తమ తండ్రులు చేసిన ఉద్యోగాల కారణంగా వచ్చాయనీ, సమర్థులైన వారికి ఇలాంటి పదవులు ఇవ్వాలనీ రాసింది.[16]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రభాషా సంజీవని - సమకాలిక పత్రిక
మూలాలు
[మార్చు]- ↑ వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: తెలుగు అకాడమీ. pp. 22, 23.
- ↑ 2.0 2.1 కె., రామదాస్ (2012). "తొలి తెలుగు వార్తాపత్రిక వర్తమాన తరంగిణి". తెలుగు దిన పత్రికలు సాసొత్య సేన. హైదరాబాదు: తెలుగు అకాడమీ. p. 3.
- ↑ ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్.
- ↑ ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
- ↑ ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
- ↑ ఇండియన్ న్యూస్‌పేపర్ రిపోర్ట్స్ 1868-1942.
- ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 184.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 210.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 257.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 422.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 444.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 446.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 548.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1896-1898 (in English). Internet Archive. [Publishers vary]. 1896–1898. p. 642.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1888-1890 (in English). Internet Archive. [Publishers vary]. 1888–1890. p. 30.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link) - ↑ Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1888-1890 (in English). Internet Archive. [Publishers vary]. 1888–1890. p. 314.
{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)