హిందూ వితంతు పునర్వివాహ చట్టం, 1856
హిందూ వితంతు పునర్వివాహ చట్టం, 1856 | |
---|---|
![]() హిందూ వితంతువు (1774–1781 నాటి చిత్రం) |
భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వితంతువుల పునర్వివాహాలను చట్టబద్ధం చేసిన చట్టమే హిందూ వితంతువుల పునర్వివాహ చట్టం 1856. దీన్ని 1856 జూలై 16 న ఆమోదించగా, 1856 జూలై 26 న అమలులోకి వచ్చింది. డల్హౌసీ ఈ చట్టాన్ని రూపొందించగా, 1857 భారత తిరుగుబాటుకు ముందు కానింగ్ ఆమోదించాడు. 1829 లో లార్డ్ విలియం బెంటింక్, సతీసహగమనాన్ని రద్దు చేసిన తర్వాత జరిగిన ప్రధాన సామాజిక సంస్కరణ చట్టం ఇది.[1][2][3][4][5][6]
కుటుంబ గౌరవాన్ని, కుటుంబ ఆస్తినీ కాపాడుకోటానికి, హిందూ సమాజంలో వితంతువుల పునర్వివాహాలు జరగకూడదనే సంప్రదాయం ఏర్పడింది. పిల్లలు కౌమారదశలో ఉన్న వితంతువులకు కూడా ఇది వర్తించేది. ఈ వితంతువుల జీవితం కష్టాలతో, త్యాగాలతో కూడుకుని ఉండేది.[7] 1856 నాటి హిందూ వితంతువుల పునర్వివాహ చట్టంలో,[8] హిందూ వితంతువు తిరిగి వివాహం చేసుకోవడం వల్ల కొన్ని రకాల వారసత్వాన్ని కోల్పోకుండా చట్టపరమైన రక్షణలను అందించింది.[7] అయితే, ఈ చట్టం ప్రకారం, వితంతువు మరణించిన తన భర్త నుండి తనకు రావాల్సిన వాటిని, అతని వారసత్వాన్నీ వదులుకోవాలి.[9] ఈ చట్టంలో ముఖ్యంగా శోభనం జరగకముందే భర్తలు మరణించిన బాల వితంతువులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు.
హిందూ ధర్మ శాస్త్రాల ఆధారంగా విద్యాసాగర్ వాదన
[మార్చు]బ్రాహ్మణుడు, సంస్కృత పండితుడూ అయిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించిన ప్రముఖుడు. దీనిపై ఆయన శాసన మండలికి[10] ఒక పిటిషన్ వేశాడు. కానీ రాధాకాంత దేబ్, అతను స్థాపించిన ధర్మ సభ దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ సంతకాలతో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఒక ప్రతి-పిటిషన్ వేసారు.[11] విద్యాసాగర్ హిందూ సనాతన సమూహాల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, వితంతు పునర్వివాహానికి శాస్త్రాల్లో మద్దతు సేకరించేందుకు, సంస్కృతంలో తన సంస్కృత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రామాణిక హిందూ చట్టాల (అంటే ధర్మ శాస్త్రాలు) సమగ్రంగా శోధించాడు. పరాశర మహర్షి రాసిన పరాశర స్మృతిలో వితంతు పునర్వివాహాన్ని సమర్థించే కొన్ని శ్లోకాలు అతను కనుక్కున్నాడు.
1902 లో విద్యాసాగర్ జీవిత చరిత్ర రాసిన రచయిత సుబల్ చంద్ర మిత్ర, విద్యాసాగర్ ప్రతిస్పందనను ఇలా ప్రస్తావించారు: "అనంతమైన శ్రమ, బాధల తర్వాత, ఒక రాత్రి, అతను అకస్మాత్తుగా పారవశ్యంలో పైకి లేచి బిగ్గరగా అరిచాడు: — 'ఎట్టాకేలకు నేను దానిని కనుగొన్నాను.'." అన్నాడు.[12] పద్యం
నష్టే మృతే ప్రప్రజితే క్లీబే చ పతితే పతౌ
పంచస్వాపత్సు నారీణాం పతిరన్యో విధీయతే (పరాశర స్మృతి 4-30)[13][14]
"1. పరదేశగతుడైన భర్త తిరిగిరానపుడు, 2. భర్త మరణించినపుడు, 3. భర్త సన్యాసం స్వీకరించినపుడు, 4. నపుంసకుడైనపుడు, 5. పాపకార్యాలతో పతనమైనపుడు, — ఈ ఐదు సందర్భాల్లో, ఆ స్త్రీ మరొక భర్తను స్వీకరించవచ్చు."
పైన పేర్కొన్న శ్లోకాల ఆధారంగా, విద్యాసాగర్ ఒక వాదనను ముందుకు తెచ్చాడు. పరాశర మహర్షి వితంతువుకు మూడు ఎంపికలను సూచించాడు, మొదటిది తిరిగి వివాహం చేసుకోవడం, రెండవది బ్రహ్మచారిగా ఉండటం, చివరిది సహగమనం చేయడం. కలియుగంలో రెండవ ఎంపిక చాలా కఠినమైనది. చివరి ఎంపికను బ్రిటిష్ వారు ఇప్పటికే నిషేధించారు. అందువల్ల పరాశరుడు సూచించినట్లుగా మొదటి ఎంపిక మాత్రమే ఉంది, అంటే తిరిగి వివాహం చేసుకోవడం అనేది అతని వాదన.[15]
చట్టం
[మార్చు]దీనికి వ్యతిరేకత ఉన్నప్పటికీ డల్హౌసీ స్వయంగా బిల్లును ఖరారు చేశాడు. అప్పట్లో ప్రబలంగా ఉన్న ఆచారాల ఉల్లంఘనగా దీన్ని పరిగణించారు.[16] ఆ విధంగా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ భారతదేశమంతటా హిందూ వితంతువుల తలరాతను మార్చాడు. 19వ శతాబ్దంలో హిందూ మతంలో ఉన్న సామాజిక దురాచారాలను సంస్కరించడంలో ఇది ముఖ్యమైన అడుగు.[17]
1983లో రద్దు
[మార్చు]1983 లో ఈ వితంతు పునర్వివాహ చట్టాన్ని రద్దు చేసారు. ఆరు సంవత్సరాల తరువాత హిందూ వితంతువుల పునర్వివాహం, ఆస్తి చట్టం, 1989 అమలులోకి వచ్చింది.
మూలాలు
[మార్చు]- ↑ Chandrakala Anandrao Hate (1948). Woman and Her Future. New Book Company. p. 156. Retrieved 16 December 2018.
- ↑ Penelope Carson (2012). The East India Company and Religion, 1698-1858. Boydell Press. pp. 225–. ISBN 978-1-84383-732-9.
- ↑ B. R. Sunthankar (1988). Nineteenth Century History of Maharashtra: 1818-1857. Shubhada-Saraswat Prakashan. p. 522. ISBN 978-81-85239-50-7. Retrieved 16 December 2018.
- ↑ Mohammad Tarique. Modern Indian History. Tata McGraw-Hill Education. pp. 4–. ISBN 978-0-07-066030-4. Retrieved 17 December 2018.
- ↑ John F. Riddick (2006). The History of British India: A Chronology. Greenwood Publishing Group. pp. 53–. ISBN 978-0-313-32280-8. Retrieved 17 December 2018.
- ↑ Indrani Sen (2002). Woman and Empire: Representations in the Writings of British India, 1858-1900. Orient Blackswan. pp. 124–. ISBN 978-81-250-2111-7.
- ↑ 7.0 7.1 Peers 2006
- ↑ Forbes 1999
- ↑ Carroll 2008
- ↑ Iswar Chandra was supported in this by many wise and elite gentlemen of the society and the first signatory on his application to the then Governor General was Shri Kasinath Dutta, belonging to the Hatkhola Dutta lineage,Chakraborty 2003
- ↑ Pratima Asthana (1974). Women's Movement in India. Vikas Publishing House. p. 22. ISBN 978-0-7069-0333-1. Retrieved 17 December 2018.
- ↑ Subal Chandra Mitra (1902). Isvar Chandra Vidyasagar. Sarat Chandra Mitra, New Bengal Press. Retrieved 3 January 2024.
- ↑ Kandukuri Veeresalingam (1907). Śrī Parāśara smṛtiḥ (in Telugu). Chennapuri: Sri Chintamani Mudraksharasala. p. 22.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Guru Prasad Sharma (1998). Parāśara smṛtiḥ (in Hindi). Varanasi: Chowkhamba Vidyabhavan. p. 31.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Ishvarchandra Vidyasagar (translated by Brian A. Hatcher) (2012). Hindu Widow Marriage. Columbia University Press. ISBN 9780231526609.
- ↑ Amit Kumar Gupta (5 October 2015). Nineteenth-Century Colonialism and the Great Indian Revolt. Taylor & Francis. pp. 30–. ISBN 978-1-317-38668-1. Retrieved 17 December 2018.
- ↑ Grin, ed. (26 September 2020). "How Ishwar Chandra Vidyasagar used an ancient Hindu text to make widow remarriage legal in the 19th century". Medium. Retrieved 3 March 2024.