హితసూచని
| రచయిత(లు) | స్వామినీన ముద్దునరసింహంనాయుడు |
|---|---|
| దేశం | బ్రిటిషు భారతదేశం |
| భాష | వ్యావహారిక తెలుగు |
| విషయం | విద్య, భాష, సంస్కృతి, మూఢాచారాలు |
| ప్రచురణ సంస్థ | రంగప్రసాద్ నాయుడు (1862) ఆంధ్రకేసరి యువజన సమితి (1986) |
| ప్రచురణ కర్త | స్వామినీన రంగప్రసాద్ నాయుడు |
ప్రచురించిన తేది | 1862 |
| Text | హితసూచని online |
పలు సామాజిక అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం, హితసూచని. ఈ పుస్తకాన్ని 1853 ప్రాంతాలలో స్వామినేని ముద్దునరసింహంనాయుడు రచించాడు. ఆయన మరణం తరువాత, 1862 జూలైలో, ఆయన కుమారుడు రంగప్రసాద నాయుడు తొలిసారి దీన్ని ప్రచురించాడు. ఈ పుస్తకం డెమీ సైజులో 224 పేజీలతో ఉండేది. గ్రంథకర్త బొమ్మ కూడా పుసకంలో ఉంది.
హితసూచని ముఖపత్రంమీద 'మహోపకారులగు రాజమహేంద్రవరపు జిల్లా ఫస్టుక్లాస్ డిస్ట్రిక్టు మునసఫుగా నుండిన స్వామినీవ ముద్దునరసింహనాయనివారు’ దానిని రచించినట్టు ప్రకటించడంవల్ల హితసూచని రచనను ఆయన ఆ హోదాలో ఉన్న సమాయనికే (సుమారు 1853 నాటికి) అచ్చువేయించడానికి సిద్ధం చేసి ఉండవచ్చు.
మళ్ళీ 1986 లో ముద్దు నరసింహం నాయుడి మునిమనుమడైన సామినేని ముద్దుకృష్ణ ఈ పుస్తకాన్ని పునర్ముద్రించాడు. దీనికి ఆరుద్ర ముందుమాట రాసాడు.
పుస్తకం విశేషాలు
[మార్చు]దీనిలో ఎనిమిది వ్యాసాలున్నాయి. రచయిత వాటిని ప్రమేయములు అని పేర్కొన్నాడు. అవి:
- విద్యాపమేయము
- వైద్య ప్రమేయము
- సువర్ణ ప్రమేయము
- మనుష్యేతర జంతు సంజ్ఞా ప్రమేయము
- రక్ష, ప్రభృతి ప్రమేయము
- మంత్ర ప్రమేయము
- పరోక్ష జ్ఞాన ప్రమేయము
- వివాహ ప్రమేయము