Jump to content

హిరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్

వికీపీడియా నుండి
హీరేంద్రనాథ్ ముఖర్జీ
పార్లమెంటు సభ్యుడు
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
In office
1952–1977
అంతకు ముందు వారుకొత్త సీటు
తరువాత వారుప్రతాప్ చంద్ర చుందర్
నియోజకవర్గంకలకత్తా ఈశాన్య (లోక్ సభ నియోజకవర్గం)
వ్యక్తిగత వివరాలు
జననం(1907-11-23)1907 నవంబరు 23
కోల్‌కతా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2004 జూలై 30(2004-07-30) (వయసు 96)
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామిబీభా ఛటర్జీ

హిరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ్ (నవంబర్ 23, 1907 - జూలై 30, 2004) భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది, విద్యావేత్త. అతను హీరేన్ ముఖర్జీగా కూడా సుపరిచితుడు. అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో 1936 లో సభ్యునిగా చేరాడు. అతను 1951, 1957, 1962, 1967, 1971లో భారత లోక్‌సభకు కలకత్తా నార్త్ వెస్టు నియోజక వర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.[1][2][3] అతను 1977లో ఓడిపోయాడు.[4][5] అతను 1991లో భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణను అందుకున్నాడు. 1990లో పద్మభూషణ పురస్కారాన్ని పొందాడు. [6]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

ఈయన 1907, నవంబర్ 23న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కత్తా లో జన్మించాడు. ఈయన తల్తాలా హైస్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తిచేసాడు. ఈయన తన బి.ఏ. పట్టాను కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పూర్తిచేసాడు. ఈయన ఎమ్. ఏ చరిత్ర విభాగంలో పూర్తిచేసాడు.

కెరీర్

[మార్చు]

ఈయన విద్యావేత్తగా తన వృత్తిని ప్రారంభించాడు, చివరికి చరిత్ర, రాజకీయాలలో సీనియర్ లెక్చరర్‌గా,  ఈయన 1934–35 చరిత్ర, రాజకీయ తత్వశాస్త్రంలో లెక్చరర్ గా  కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేశాడు. ఇదే కాలేజ్ లో 1940-44 మధ్య చరిత్ర విభాగాధిపతిగా కొనసాగారు.

మూలాలు

[మార్చు]
  1. Fifth Lok Sabha Members Bioprofile:Hirendranath Mukherjee[permanent dead link] Parliament of India.
  2. Parliamentarian Hiren Mukherjee passes away/2004073106111200.htm Parliamentarian Hiren Mukherjee passes away:The Hindu[permanent dead link]
  3. A passionate revolutionary:Frontline
  4. Far Eastern Economic Review. April 1977. pp. xxiv. Retrieved 25 August 2019.
  5. Ananth (2008). India Since Independence: Making Sense of Indian Politics. Pearson Education India. pp. 182–. ISBN 978-81-317-4282-2. Retrieved 25 August 2019.
  6. "Padma Awards Directory (1954–2007)" (PDF). Ministry of Home Affairs. 30 మే 2007. Archived from the original (PDF) on 10 ఏప్రిల్ 2009. Retrieved 29 డిసెంబరు 2019.

బయటి లంకెలు

[మార్చు]