హిసాబ్ బరాబర్
హిసాబ్ బరాబర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | అశ్విని ధీర్ |
రచన | స్క్రీన్ ప్లే: అశ్విని ధీర్ పూర్వ నరేష్ రితేష్ శాస్త్రి డాల్ఫీ ఫెర్నాండెజ్ మాటలు: అశ్విని ధీర్ పూర్వ నరేష్ |
కథ | రితేష్ శాస్త్రి |
నిర్మాత | శరద్ పటేల్ శ్రేయాన్షి పటేల్ జ్యోతి దేశ్ పాండే |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | ఎం. సుకుమార్ |
కూర్పు | మనన్ సాగర్ |
సంగీతం | అమన్ పంత్ |
నిర్మాణ సంస్థలు | జియో స్టూడియోస్ ఎస్పీ సినీకార్ప్ |
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీs | 26 November 2024(గోవా) 24 జనవరి 2025 |
సినిమా నిడివి | 111 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
హిసాబ్ బరాబర్ 2025లో విడుదలైన యాక్షన్ కామెడీ సినిమా. జియో స్టూడియోస్, ఎస్పీ సినీకార్ప్ బ్యానర్స్‌పై నిర్మించిన ఈ సినిమాకు అశ్విని ధీర్ రచించి దర్శకత్వం వహించాడు. ఆర్. మాధవన్, నీల్ నితిన్ ముఖేష్, కీర్తి కుల్హారి, రషమి దేశాయ్, ఫైసల్ రషీద్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి,[2] 2025 జనవరి 24న జీ5లో విడుదలైంది.[3]
కథ
[మార్చు]రాధే మోహన్ శర్మ (మాధవన్) రైల్వే డిపార్ట్మెంట్లో టికెట్ కలెక్టర్. ఆయన ఓసారి తన బ్యాంక్ ఖాతాలో చిన్న తేడాని గుర్తించి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తాడు. దాని గురించి ఆరా తీయగా అదొక పెద్ద ఆర్థికమైన మోసమని తెలుస్తుంది. దాని చుట్టు ఉన్న మోసం, అవినీతి వంటి వాటిని సదరు టికెట్ కలెక్టర్ గుర్తిస్తాడు. ఈ క్రమంలో తను ఆ బ్యాంక్ హెడ్ మిక్కీ మెహతా (నీల్ నితిన్) తో పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాధే మోహన్ శర్మ (మాధవన్) అవినీతితో వ్యవస్థీకృతమైన సమస్య నుంచి ఎలా ఎదుర్కొంటాడు? దాని నుండి సురక్షితంగా ఎలా బయట పడతాడు? అనేదే మిగతా సినిమా కథ.[4][5]
నటీనటులు
[మార్చు]- రాధే మోహన్ శర్మగా ఆర్. మాధవన్[6]
- మిక్కీ మెహతాగా నీల్ నితిన్ ముకేష్
- ఇన్స్పెక్టర్ పూనమ్ జోషిగా కీర్తి కుల్హారీ[7][8]
- మోనాలిసా యాదవ్‌గా రష్మీ దేశాయ్
- మన్నుగా షౌనక్ దుగ్గల్
- ప్రహ్లాద్ గా రవి మరియా
- ఎంపీగా హిమాన్షు మాలిక్
- దయాళ్ గా మను రిషి
- తివారీగా ఫైసల్ రషీద్
- బ్యాంక్ మేనేజర్ గా రాజేష్ జైస్
- షాలీన్ శ్రీవాస్తవగా ఇమ్రాన్ హస్నీ
- క్రెడిట్ కార్డ్ విక్రేతగా ఇస్తియాక్ ఖాన్
- ఎయిర్పోర్ట్ ఆఫీసర్‌గా వినీత్ వశిస్ట్
- కుమార్‌గా యోగేష్ త్రిపాఠి
- రాజుగా సౌరవ్ లోకేష్
- ఇన్ స్పెక్టర్ తియాగిగా సుకుమార్ తుడు
- ఎస్పీ చందేల్ గా రోహిత్ తివారీ
- ఆఫీసర్ మిశ్రాగా హ్యాపీ రంజిత్
- కుండుగా జ్యోతి నేగి
- రోజా కుట్టిగా మెలిస్సా పైస్
మూలాలు
[మార్చు]- ↑ "Hisaab Barabar". Central Board of Film Certification.
- ↑ "Hisaab Barabar Trailer: R Madhavan Exposes Scams Affecting Common Man, OTT Film To Premiere On THIS Date". Times Now (in ఇంగ్లీష్). 2025-01-10. Archived from the original on 2025-01-15. Retrieved 2025-01-20.
- ↑ "ఓటీటీలో మాధవన్ 'హిసాబ్ బరాబర్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?". Sakshi. 11 January 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "Madhavan Takes on Corruption, Deceit in Hisaab Barabar". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). 2025-01-11. Archived from the original on 2025-01-15. Retrieved 2025-01-20.
- ↑ Gupta, Shubhra (24 January 2025). "Hisaab Barabar movie review: Madhavan's film nosedives every time Neil Nitin Mukesh shows up". The Indian Express. Retrieved 24 January 2025.
- ↑ "మరో వైవిధ్యమైన సినిమాతో రానున్న మాధవన్.. ఆకట్టుకుంటున్న హిసాబ్ బరాబర్ ట్రైలర్". TV9 Telugu. 11 January 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "Kirti Kulhari says it was a little intimidating to work with R Madhavan". Mid-day (in ఇంగ్లీష్). 2025-01-18. Retrieved 2025-01-20.
- ↑ "Hisaab Barabar: Kirti Kulhari admits it was 'little intimidating' to work with R Madhavan; 'He is someone who will...'". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2025-01-20.