హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
స్థితి1995లో కూల్చివేయబడింది
మొదలయిన తేదీ1920
Decommission date1992
సంచాలకులుహైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను, హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న ఒక చారిత్రక థర్మల్ విద్యుత్ కేంద్రం. భారతదేశంలోని మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఇది.[1]

చరిత్ర

[మార్చు]

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషనును ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సమయంలో 1920 లో నిర్మించాడు.[2]

ప్లాంట్

[మార్చు]

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను దక్షిణ భారతదేశ మొత్తంలో మొదటి థర్మల్ పవర్ ప్లాంట్, అప్పటి హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ యొక్క భాగంగా ఉండేది. హైదరాబాద్ జంట నగరాలకు విద్యుత్ సరఫరా చేయడానికి పూర్వపు హైదరాబాద్ రాజ్యానికి చెందిన హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ద్వారా దీని నిర్వహణ జరిగేది. పరికరాలను సికింద్రాబాదులోని ఇంగ్లీష్ ఎలక్ట్రిక్, వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేశారు. పవర్ ప్లాంట్ నాలుగు యూనిట్లను కలిగి ఉంది. రోజుకు 200 టన్నుల బొగ్గు వినియోగంపై 22.5 మెగావాట్ల ఉత్పత్తి జరిగింది. 1972లో రెండు యూనిట్లు మూతపడే వరకు ప్లాంట్ పూర్తిగా పనిచేసింది. 1984లో, కొన్ని కారణాల వల్ల ఉత్పత్తి చాలా వరకు ముగిసింది. అయినప్పటికీ, 1992 వరకు ఇది ఉపయోగించబడింది. 1995లో ఇది కూల్చివేయబడింది.[3]

ప్రదేశం

[మార్చు]

హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండేది, నేడు అదే ప్రదేశంలో ప్రసాద్ ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్స్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "V6 Ground Report – History of Hussain Sagar Thermal Power Station". 10 November 2014.
  2. "Hussain Sagar Lake – 450+ years old Man made Lake". Explore Telangana. 21 June 2013. Archived from the original on 9 ఆగస్టు 2020. Retrieved 15 May 2020.
  3. "Reminiscence of a tech marvel". Times of India. 2014. Retrieved 24 August 2014.