హృదయ స్పందన రేటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక నిర్దిష్ట సమయంలో హృదయ స్పందనల సంఖ్యను హృదయ స్పందన రేటు (Heart rate) గా సూచిస్తారు- ఎక్కువగా దీనిని ఒక నిమిషానికి స్పందనలు (bpm) గా వ్యక్తపరుస్తారు - ప్రాణవాయువును గ్రహించడం మరియు బొగ్గుపులుసు వాయువును బయటకు పంపడంలో శరీరం యొక్క అవసరం మారేకొద్ది ఇది మారుతుంటుంది, వ్యాయమం లేదా నిద్రిస్తున్నప్పుడు హృదయ స్పందనలు రేటులో మార్పు ఉంటుంది. రోగ నిర్ధారణ మరియు వైద్య పరిస్థితులను గుర్తించేందుకు వైద్య నిపుణులు హృదయ స్పందన రేటు గణనను ఉపయోగిస్తారు. తమ శిక్షణలో గరిష్ఠ సామర్థ్యాన్ని పొందేందుకు హృదయ స్పందన రేటును మాపనం చేసే అథ్లెట్‌ల వంటి వ్యక్తులు కూడా దీనిని ఉపయోగిస్తారు. ఆర్ తరంగం నుంచి ఆర్ తరంగం మధ్య అంతరాన్ని (RR అంతరం ) హృదయ స్పందన రేటు యొక్క విలోమంగా గుర్తిస్తారు.

శరీరం యొక్క నాడిని గుర్తించడం ద్వారా హృదయ స్పందన రేటును లెక్కిస్తారు. ఒక ధమని యొక్క స్పందనను ఉపరితలంలో గుర్తించేందుకు వీలున్న శరీరంలోని ఏ భాగం వద్దనైనా చూపుడు మరియు మధ్య వేలితో నొక్కిపట్టుకోవడం ద్వారా ఈ నాడీ రేటును కొలవవచ్చు - తరచుగా ఎముక వంటి ఒక అంతర్గత నిర్మాణంపై ధమనిని నొక్కి పట్టుకుంటారు. మరొక వ్యక్తి యొక్క హృదయ స్పందన రేటును కొలిచేందుకు బొటను వేలును ఉపయోగించరాదు, ఎందుకంటే నాడీ స్పందన ప్రదేశంలో బొటను వేల యొక్క నాడి భేదభావాన్ని చూపుతుంది.[1]

హృదయ స్పందనను కొలిచేందుకు సాధ్యనీయ ప్రదేశాలు:

 1. బొటనువేలు వైపు మణికట్టు ముందు నుంచి కనిపించే భాగం (ప్రకోష్టీయ ధమని).
 2. చిటికెన వేలికి సంబంధించిన ధమని.
 3. మెడ (కారోటిడ్ ధమని).
 4. మోచేయి లోపలి లేదా ద్విశిర కండరం (చేతి సంబంధిత ధమని).
 5. గజ్జ (తొడలో ఉండే ధమని).
 6. పాదంపై మెడియల్ మల్లెయోలస్ వెనుక (పృష్ట జంఘాస్తి ధమని).
 7. పాదం పృష్టభాగం మధ్యలో (డోర్సాలీస్ పెడిస్).
 8. మోకాలి వెనుక (పోప్లిటియల్ ధమని).
 9. పొత్తికడుపుపై (పొత్తికడుపు మహాధమని).
 10. ఛాతీ (గుండె యొక్క శిఖరం), ఒకరి చేయి లేదా వేళ్లతో దీనిని గుర్తించవచ్చు. ఇదిలా ఉంటే, స్టెథస్కోప్‌ను ఉపయోగించి గుండె యొక్క శబ్దాన్ని వినడం సాధ్యపడుతుంది.
 11. కణత (బాహ్య కర్ణాస్థుల సంబంధ ధమని)
 12. దవడ ముఖ ధమని యొక్క ఒక పక్క అంచు.

ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ లేదా ECG (EKGగా కూడా దీనిని సంక్షిప్తీకరిస్తారు) ని ఉపయోగించడం నాడీ స్పందనను గుర్తించేందుకు మరింత కచ్చితమైన పద్ధతిగా ఉంది. గుండె యొక్క నిరంతర ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ పర్యవేక్షణను అనేక వైద్య పద్ధతుల్లో, ముఖ్యంగా క్లిష్టపరిస్థితుల్లో అందించే వైద్యం (క్రిటికల్ కేర్ మెడిసిన్) లో తరచుగా నిర్వహిస్తారు. వ్యాపార హృదయ స్పందన మాపకాలు కూడా అందుబాటులో ఉన్నాయి, వీటిలో ఎలక్ట్రోడ్‌లు గల ఒక ఛాతీ బెల్టు ఉంటుంది. ప్రదర్శన కోసం సంకేతం ఒక మణికట్టు గ్రాహకికి బదిలీ చేయబడుతుంది. హృదయ స్పందన మాపకాలు నిరంతరం కచ్చితమైన కొలతలు తీసేందుకు వీలు కల్పిస్తాయి, శారీరక పనితో ముడిపడిన కొలత కష్టంగా మరియు అసాధ్యంగా ఉండే పరిస్థితుల్లో (చేతులు ఉపయోగించే పరిస్థితులు), ఉదాహరణకు వ్యాయామ సమయంలో, వీటిని ఉపయోగించవచ్చు.

విశ్రాంతి హృదయ స్పందన రేటు[మార్చు]

విశ్రాంతిలో హృదయ స్పందన రేటు (HRrest) అనేది విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క హృదయ స్పందన రేటును సూచిస్తుంది: ముందుగా ఎటువంటి శ్రమ చేయకుండా, పడుకొని మేల్కొని ఉన్నప్పుడు దీనిని లెక్కిస్తారు. వయోజనుల్లో ఎక్కువగా ఆరోగ్యకరమైన విశ్రాంతి హృదయ స్పందన రేటు 60–80 bpm ఉంటుంది [2], 60 bpm కంటే తక్కువ రేట్లను బ్రాడీకార్డియా (అసాధారణ స్థాయిలో తక్కువ హృదయ స్పందన వేగం) గా మరియు 100 bpm కంటే ఎక్కువ రేట్లను టాచీకార్డియా (అసాధారణ స్థాయిలో ఎక్కువ హృదయ స్పందన వేగం) గా సూచిస్తారు. శిక్షణ పొందిన అథ్లెట్‌లకు తరచుగా విశ్రాంతి హృదయ స్పందన రేట్లు 60 bpm కంటే తక్కువగా ఉండటం గమనార్హమైన విషయం. సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఒక విశ్రాంతి HR సుమారుగా 32 bpmగా నమోదయింది, క్రమం తప్పకుండా వ్యామాయం చేసేవారికి హృదయ స్పందన రేటు 50 bpm కంటే కింది స్థాయికి పడిపోవడం అసాధారణ విషయమేమీ కాదు. మైగ్వెల్ ఇండురైన్[3] మరియు అల్బెర్టో కాంటాడోర్[ఉల్లేఖన అవసరం] వంటి ఇతర సైక్లిస్ట్‌లకు విశ్రాంతి హృదయ స్పందన రేట్లు 20ల్లో నమోదయ్యాయి, అమెరికా మారథాన్ క్రీడాకారుడు రైయాన్ హాల్‌కు విశ్రాంతి హృదయ స్పందన రేటు 29గా నమోదయింది.

సంగీత జోరు పదాలు విశ్రాంతి హృదయ స్పందన రేటుకు సాపేక్ష స్థాయిలను ప్రతిబింబిస్తాయి; విళంబితానికి (అడాగియో) (మందమైన స్థితిలో, విశ్రాంతి వద్ద) ఎక్కువగా 66–76 bpm ఉంటుంది, ఇది మానవ విశ్రాంతి హృదయ స్పందన రేటుకు సారూప్యంగా ఉంటుంది, లెంటో మరియు లార్గో ("మందమైన") లకు 40–60 bpm ఉంటుంది, ఈ వేగాలు సాధారణ హృదయ స్పందన రేటుకు మందమైన సాపేక్షత కలిగివుంటాయని ఇది సూచిస్తుంది. అదేవిధంగా, వేగవంతమైన సంగీత జోరు శ్రమించినప్పుడు అధిక స్థాయి హృదయ స్పందనల రేటుకు అనుగుణంగా ఉంటుంది, ఉదాహరణ అడాంటే (నడక: 76–108 bpm).

HRmax కొలత[మార్చు]

HRmax అనేది ఒక వ్యక్తి యొక్క గరిష్ఠ సురక్షితమైన హృదయ స్పందన రేటు. హృదయ ఒత్తిడి పరీక్ష HRmaxను కొలవడానికి అత్యంత కచ్చితమైన మార్గంగా గుర్తించబడుతుంది. ఇటువంటి ఒక పరీక్షలో, వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒక EKGని ఉపయోగించి వ్యక్తిని పరిశీలిస్తారు. పరీక్ష సందర్భంగా, వ్యాయామం యొక్క తీవ్రతను నిర్ణీతకాలంలో పెంచుతారు (ఒక త్రెడ్‌మిల్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, వ్యక్తి వేగాన్ని లేదా త్రెడ్‌మిల్ వాలు పెంచడం ద్వారా), EKGలో గుండె పనితీరులో నిర్దిష్ట మార్పులు కనిపించే వరకు దీనిని కొనసాగిస్తారు, మార్పులు కనిపించిన తరువాత వ్యక్తి చేత వ్యాయామాన్ని విరమింపజేస్తారు. ఇటువంటి పరీక్షకు ఎక్కువగా 10 నుంచి 20 నిమిషాల వరకు సమయం పడుతుంది.

ఒక గరిష్ఠ వ్యాయామ పరీక్షను నిర్వహించేందుకు వ్యయభరితమైన పరికరాలు అవసరమవతాయి. అధిక హృదయ స్పందన రేట్ల కారణంగా హాని జరిగే అవకాశం ఉండటంతో, ఒక వ్యాయామ నియమాన్ని ప్రారంభిస్తున్న వ్యక్తులు సాధారణంగా వైద్య సిబ్బంది సమక్షంలోనే ఈ పరీక్షలో పాల్గొనాలని సూచించడం జరుగుతుంది. సాధారణ ప్రయోజనాల కోసం, వ్యక్తులు తమ వ్యక్తిగత గరిష్ఠ హృదయ స్పందన రేటును అంచనా వేయడానికి ఈ పరీక్షకు బదులుగా ఒక సూత్రాన్ని ఉపయోగించవచ్చు.

HRmax సూత్రం[మార్చు]

ఫాక్స్ మరియు హాస్కెల్ సూత్రం; ఇది విస్తృత ఉపయోగంలో ఉంది.

వయస్సు ఆధారంగా, వ్యక్తిగత గరిష్ఠ హృదయ స్పందన రేట్లను అంచనా వేసేందుకు వివిధ సూత్రాలను ఉపయోగిస్తున్నారు, అయితే గరిష్ఠ హృదయ స్పందన రేట్లు వ్యక్తులను బట్టి గణనీయంగా మారుతుంటాయి.[4] ఇరవైల్లో వయస్సు ఉన్న ఒలింపిక్ రోవర్‌ల వంటి, ఒకే ప్రధాన క్రీడా జట్టులోని సభ్యుల్లో కూడా గరిష్ఠ హృదయ స్పందన రేట్లు 160 నుంచి 220 వరకు ఉంటాయి.[4] కింద ఇవ్వబడిన సరళ సమీకరణాల ద్వారా ఈ వ్యత్యాసం ఒక 60 లేదా 90 ఏళ్ల వయస్సు అంతరం స్థాయిలో ఉంటుంది, ఈ సగటు గణాంకాల గురించి తీవ్రమైన వ్యత్యాసాన్ని సూచిస్తుంది.

ప్రామాణిక వ్యత్యాసం సూచన లేకుండా, ఎక్కువగా ఉపయోగించే సూత్రం ఏమిటంటే:

HRmax = 220 − వయస్సు

ఈ సూత్రాన్ని అనేక మంది కనిపెట్టినట్లు చెప్పబడుతుంది, అయితే దీనిని డాక్టర్ విలియమ్ హాస్కెల్ మరియు డాక్టర్ శామ్యేల్ ఫాక్స్ 1970లో కనిపెట్టినట్లు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు.[4] ఈ సూత్రం యొక్క చరిత్రపై జరిపిన పరిశీలనలో వాస్తవ పరిశీలన నుంచి దీనిని అభివృద్ధి చేయలేదని వెల్లడైంది, ప్రచురించబడిన పరిశోధన లేదా ప్రచురితంకాని శాస్త్రీయ కూర్పులతో కూడిన సుమారుగా 11 సూచనల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నిర్వహించిన పరిశీలనలో ఈ సూత్రాన్ని కనిపెట్టారు.[5] పోలార్ ఎలెక్ట్రో దాని యొక్క హృదయ స్పందన మాపకాల్లో ఉపయోగించడంతో దీనికి విశేష ప్రాచుర్యం లభించింది, [4] డాక్టర్ హాస్కెల్ దీనిని చూసి నవ్వారు, [4] వ్యక్తుల శిక్షణకు ఇది ఎన్నడూ కచ్చితమైన మర్గదర్శిని కాబోధని పేర్కొన్నారు.[4]

ఇది అత్యంత సాధారణ (మరియు సులభంగా గుర్తుపెట్టుకోదగిన మరియు లెక్కించదగిన) సూత్రంగా గుర్తించబడుతున్నప్పటికీ, ప్రముఖ ఆరోగ్య మరియు దృఢత్వ నిపుణులు మాత్రం దీనిని HRmaxను గుర్తించేందుకు ఉత్తమ మార్గంగా పరిగణించడం లేదు. ఈ సూత్రాన్ని విస్తృతంగా ప్రచురించినప్పటికీ, రెండు దశాబ్దాలకుపైగా సాగిన పరిశోధనలో దీని యొక్క పెద్ద అంతర్లీన దోషం (Sxy=7–11 b/min (నిమిషానికి స్పందనలు) ) వెల్లడైంది. పర్యవసానంగా, HRmax=220−వయస్సు సూత్రం ద్వారా లెక్కించే అంచనాకు వ్యాయామ శరీరధర్మ శాస్త్రం మరియు సంబంధిత రంగాల్లో ఉపయోగించేందుకు కచ్చితత్వం లేదా శాస్త్రీయ యోగ్యత లేదు.[5]

2002నాటి ఒక అధ్యయనం[5]లో HRmax కోసం (ఫైనపేర్కొన్న సూత్రంతోపాటు) 43 వివిధ సూత్రాలను పరిశీలించి ఈ కింది నిర్ధారణలకు వచ్చారు:

1) అంగీకారయోగ్యమైన సూత్రం ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదు ( మరియు వ్యాయామ శిక్షణ HR పరిధులు యొక్క సూచన, రెండింటికీ ఆమోదయోగ్యమైన అనే అర్థం కోసం ఇక్కడ అంగీకారయోగ్యత అనే పదాన్ని ఉపయోగించారు)
2) తక్కువ అభ్యంతరాలు వ్యక్తమైన సూత్రం:
HRmax = 205.8 − (0.685 × వయస్సు)
దీనిలో కూడా ఒక పెద్ద (6.4 bpm) ప్రామాణిక వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఈ సూత్రాన్ని ఇప్పుడు కూడా వ్యాయామ శిక్షణ HR పరిధులను సూచించేందుకు అంగీకారయోగ్యమైనదిగా పరిగణిస్తున్నారు.

తరచుగా సూచించే ఇతర సూత్రాలు:

HRmax = 206.3 − (0.711 × వయస్సు)
(మిస్సౌరీ యూనివర్శిటీకి చెందిన లండరీ మరియు మోయెష్‌బెర్గర్‌లు దీనిని కనిపెట్టినట్లు భావిస్తున్నారు)
HRmax = 217 − (0.85 × వయస్సు)
(ఇండియానా యూనివర్శిటీకి చెందిన మిల్లెర్ మరియు ఇతరులు దీనిని కనిపెట్టినట్లు భావిస్తున్నారు)
HRmax = 208 − (0.7 × వయస్సు)
(దీనిని సాంప్రదాయిక సూత్రానికి మరో "మెలిక"గా మరియు తనకా పద్ధతిగా గుర్తిస్తారు. వేలాది మంది వ్యక్తులపై జరిపిన ఒక అధ్యయనం ఆధారంగా, ఈ కొత్త సూత్రాన్ని కనిపెట్టారు, దీనిని అత్యంత కచ్చితమైనదిగా భావిస్తున్నారు).[6]

2007లో ఓక్లాండ్ యూనివర్శిటీ పరిశోధకులు 132 మంది వ్యక్తుల గరిష్ఠ హృదయ స్పందన రేట్లను ప్రతి ఏడాది 25 ఏళ్లపాటు నమోదు చేశారు, ఈ విధంగా సేకరించిన సమాచారాన్ని వారు విశ్లేషించారు, తద్వారా తనకా సూత్రానికి బాగా సారూప్యంగా ఉండే HRmax = 206.9 − (0.67 × వయస్సు) అనే ఒక సరళ సమీకరణాన్ని మరియు HRmax = 191.5 − (0.007 × వయస్సు2) అనే ఒక విరళ సమీకరణాన్ని సృష్టించారు. సరళ సమీకరణానికి ±5–8 bpm విశ్వాస అంతరం మరియు విరళ సమీకరణానికి ±2–5 bpm సమీప పరిధి ఉంటుంది. HRmax = 163 + (1.16 × వయస్సు) − (0.018 × వయస్సు2) అనే ఒక మూడో విరళ సమీకరణం కూడా సృష్టించబడింది.[7]

ఈ గణాంకాలు బాగా ఎక్కువ సగటులను ఇస్తాయి, ఎక్కువగా వ్యక్తి శరీరధర్మాలు మరియు దృఢత్వంపై ఆధారపడతాయి. ఉదాహరణకు, వ్యాయామానికి మద్దతు ఇచ్చేందుకు గుండె పరిమాణం పెరుగుతుంది కాబట్టి మంచి నిభాయింపు ఉన్న ఒక పరుగు క్రీడాకారుడి యొక్క రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయి, ఇదిలా ఉంటే ఒక స్ప్రింటర్ యొక్క రేట్లు మెరుగైన స్పందన సమయం మరియు తక్కువ నిడివి కారణంగా ఎక్కువగా ఉంటాయి, వీరి యొక్క ఊహాత్మక హృదయ స్పందన రేట్లు 180 (= 220−వయస్సు) వరకు ఉంటాయి, అయితే ఈ ఇద్దరు వ్యక్తులకు 20 స్పందనలు (ఉదాహరణకు 170-190) తేడాతో వాస్తవ గరిష్ఠ HR ఉండవచ్చు.

అంతేకాకుండా, ఒకే వయస్సులో మరియు ఒకే శిక్షణ మరియు ఒకే క్రీడలో మరియు ఒకే జట్టులో ఉన్న వ్యక్తుల మధ్య వాస్తవ గరిష్ఠ HR తేడా 60 bpm (160 నుంచి 220) వరకు ఉండవచ్చు;[4] పరిధి విస్తృతంగా ఉంటుంది, క్రీడాకారులను పోల్చడంలో హృదయ స్పందన రేటును కనీస ముఖ్యమైన చలరాశిగా కొందరు చెబుతారు.[4]

నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీలో 2010లో జరిగిన ఒక పరిశోధనలో మహిళల్లో గరిష్ఠ హృదయ స్పందన రేటు సూత్రాన్ని సవరించారు. మార్థా గులాటీ మరియు ఇతరుల ప్రతిపాదించిన ఈ సూత్రం:

HRmax = 206 − (0.88 × వయస్సు)[8][9]

స్వీడన్‌లోని లుండ్‌లో జరిగిన ఒక అధ్యయనంలో పురుషులకు సంబంధించిన విలువలను (సైకిల్ ఎర్గోమట్రీ సందర్భంగా సేకరించారు) ప్రతిపాదించారు.

HRmax = 203.7 / (1 + exp(0.033 x (వయస్సు - 104.3)))[10]

మహిళలకు

HRmax = 190.2/(1 + exp (0.0453 * (వయస్సు - 107.5)))[11]

ఉద్దేశిత హృదయ స్పందన రేటు[మార్చు]

ఉద్దేశిత హృదయ స్పందన రేటు (టార్గెట్ హార్ట్ రేట్) (THR) లేదా శిక్షణ హృదయ స్పందన రేటును అనేది శరీరంలోకి ప్రాణవాయువును పంపడానికి చేసే వ్యాయామం సందర్భంగా చేరుకునే ఒక వాంఛిత హృదయ స్పందన రేటు పరిధిగా గుర్తిస్తారు, ఈ వ్యాయామం వలన వ్యక్తి గుండె మరియు ఊపిరితిత్తులు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయి. ఈ సైద్ధాంతిక పరిధి ఒక వ్యక్తి యొక్క శారీరక స్థితి, లింగం మరియు పూర్వ శిక్షణ వంటి అంశాల ఆధారంగా మారుతుంది. ఒక వ్యక్తి యొక్క ఉద్దేశిత హృదయ స్పందన రేటును లెక్కించేందుకు ఇక్కడ రెండు పద్ధతులు ఇవ్వబడ్డాయి. ఈ రెండు పద్ధతుల్లో ప్రతి దానిలోనూ, "తీవ్రత"గా పిలిచే ఒక అంశం ఉంటుంది, దీనిని ఒక శాతంలో సూచించడం జరిగింది. THRను 65%–85% తీవ్రత యొక్క ఒక పరిధిగా లెక్కించవచ్చు. అయితే, ఈ గణనలను అర్థవంతంగా ఉండేలా చూడాలంటే ఒక కచ్చితమైన HRmaxను గుర్తించడం చాలా ముఖ్యం (పైభాగాన్ని చూడండి).

HRmax 180 (వయస్సు 40, HRmaxను 220-40గా అంచనా వేస్తే) ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నట్లయితే:
65% తీవ్రత: (220 − (వయస్సు = 40) ) × 0.65 → 117 bpm
85% తీవ్రత: (220 − (వయస్సు = 40) ) × 0.85 → 153 bpm

కార్వోనెన్ పద్ధతి[మార్చు]

ఉద్దేశిత హృదయ స్పందన రేటు (THR) ను లెక్కించేందుకు విశ్రాంతిలో హృదయ స్పందన రేటు (HRrest) లో కార్వోనెన్ పద్ధతి కారకాలు 50%–85% పరిధిని ఉపయోగిస్తాయి:

THR = ((HRmax − HRrest) × %తీవ్రత) + HRrest

HRmax 180 మరియు HRrest 70 గల వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటే:
50% తీవ్రత: ( (180 − 70) × 0.50) + 70 = 125 bpm
85% తీవ్రత: ( (180 − 70) × 0.85) + 70 = 163 bpm

జోలాడ్జ్ పద్ధతి[మార్చు]

కార్వోనెన్ పద్ధతికి ఒక ప్రత్యామ్నాయ విధానం ఏమిటంటే జోలాడ్జ్ పద్ధతి, ఇది HRmax నుంచి విలువల వ్యవకలనం ద్వారా వ్యాయామ జోన్‌లను గుర్తిస్తుంది.

THR = HRmax – అడ్జెస్టర్ ± 5 bpm
జోన్ 1 అడ్జెస్టర్ = 50 bpm
జోన్ 2 అడ్జెస్టర్ = 40 bpm
జోన్ 3 అడ్జెస్టర్ = 30 bpm
జోన్ 4 అడ్జెస్టర్ = 20 bpm
జోన్ 5 అడ్జెస్టర్ = 10 bpm

HRmax 180 గల వ్యక్తిని ఉదాహరణకు తీసుకుంటే:
జోన్ 1 (సులభ వ్యాయామం) : 180 − 50 ± 5 → 125 – 135 bpm
జోన్ 4 (కఠిన వ్యాయామం) : 180 − 20 ± 5 → 155 – 165 bpm

హార్ట్ రేట్ రిజర్వ్[మార్చు]

హార్ట్ రేట్ రిజర్వ్ (HRR) అనే పదాన్ని ఒక వ్యక్తి యొక్క కొలిచిన లేదా అంచనావేసిన గరిష్ఠ హృదయ స్పందన రేటు మరియు విశ్రాంతిలో హృదయ స్పందన రేటు మధ్య వ్యత్యాసాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. కొన్ని వ్యాయామ తీవ్రత మాపన పద్ధతులు హార్ట్ రేట్ రిజర్వ్ యొక్క శాతాన్ని కొలుస్తాయి. అంతేకాకుండా, ఒక వ్యక్తి తన హృదయసంబంధ దృఢత్వాన్ని మెరుగుపరుచుకున్నట్లయితే, వారి HRrest తగ్గిపోతుంది, అందువలన హార్ట్ రేట్ రిజర్వ్ పెరుగుతుంది. HRR శాతం VO2 రిజర్వ్ యొక్క శాతానికి సమానంగా ఉంటుంది.

HRR = HRmax − HRrest

ఆరోగ్య ప్రాప్తి హృదయ స్పందన రేటు[మార్చు]

దీనిని కార్యకలాపం నిలిచిపోయిన తరువాత ఒక నిర్దిష్ట (లేదా నమూనా) కాలంలో కొలిచే హృదయ స్పందన రేటుగా గుర్తిస్తారు; ఎక్కువగా 1 నిమిషం తరువాత దీనిని కొలుస్తారు.

వ్యాయామం తరువాత హృదయ స్పందన రేటులో నెమ్మదైన క్షీణత హృదయ సమస్యలను సూచించవచ్చు. వ్యాయామం ఆపివేసిన తరువాత నిమిషానికి 12 bpm కంటే తక్కువ స్థాయికి హృదయ స్పందన పడిపోయినట్లయితే, వారికి గుండె పోటు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది.[12]

శిక్షణ కేంద్రాలు కొన్నిసార్లు ఆరోగ్యప్రాప్తి హృదయ స్పందన రేటును పురోభివృద్ధికి ఒక మార్గదర్శినిగా ఉపయోగిస్తాయి, శరీరంగా బాగా వేడెక్కడం లేదా నిర్జలీకరణ వంటి సమస్యలను గుర్తించేందుకు దీనిని ఉపయోగిస్తారు.[13] కఠినమైన వ్యాయామం కొద్ది సమయం చేసిన తరువాతైనా హృదయ స్పందన రేటు విశ్రాంతి స్థాయిలకు చేరుకునేందుకు సుదీర్ఘ సమయం (సుమారుగా 30 నిమిషాలు) పట్టవచ్చు.

శరీరధర్మ శాస్త్రం మరియు వైద్య శాస్త్ర ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో ECG నుంచి ఈ కింది విధంగా హృదయ స్పందన రేటును (HR) తక్షణమే లెక్కించవచ్చని ఉంటుంది:

HR = 1,500/RR అంతరం మిల్లీమీటర్లలో, HR = 60/RR వ్యవధి సెకన్లలో, లేదా HR = 300/వరుస ఆర్ తరంగాల మధ్య పెద్ద చతురస్రాల సంఖ్య. ప్రతి సందర్భంలో, రచయితలు వాస్తవానికి తక్షణ HRను సూచిస్తారు, RR అంతరాలు స్థిరంగా ఉన్నట్లయితే ఇది హృదయ స్పందనల సంఖ్యను సూచిస్తుంది.

హృదయ స్పందన రేటు అసాధారణతలు[మార్చు]

టాకీకార్డియా (గుండె అసాధారణ స్థాయిలో ఎక్కువ వేగంతో కొట్టుకోవడం)[మార్చు]

విశ్రాంతిలో హృదయ స్పందన రేటు నిమిషానికి 100 బీట్‌ల కంటే ఎక్కువగా ఉండటాన్ని టాకీకార్డియా (Tachycardia) అంటారు. తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు మరియు పిల్లలో ఈ సంఖ్య మారుతుంటుంది, వీరిలో సగటు వయోజనుల కంటే వేగవంతమైన హృదయ స్పందన రేట్లు ఉంటాయి.

బ్రాడీకార్డియా[మార్చు]

నిమిషానికి 60 బీట్‌ల కంటే తక్కువ హృదయ స్పందన రేటును బ్రాడీకార్డియా (Bradycardia) గా గుర్తిస్తారు, అయితే అప్పుడప్పుడు ఒక వ్యక్తి సంపూర్ణ విశ్రాంతిలో ఉన్నప్పుడు 50 bpm కంటే తక్కువ స్థాయిని బ్రాడీకార్డియాగా సూచిస్తారు. శిక్షిత అథ్లెట్‌లకు తక్కువ విశ్రాంతి హృదయ స్పందన రేట్లు కలిగివుంటారు, దీనికి సంబంధించిన లక్షణాలేవీ కనిపించనట్లయితే, అథ్లెట్‌లలో విశ్రాంతి బ్రాడీకార్డియాను అసాధారణ పరిస్థితిగా పరిగణించరాదు. పిల్లలు మరియు తక్కువ వయస్సు ఉన్న వయోజనుల్లో కూడా ఈ సంఖ్య మారుతుంటుంది, వీరికి సగటు వయోజనుల కంటే వేగవంతమైన హృదయ స్పందన రేట్లు ఉంటాయి.

ఐదు సార్లు టూర్ డి ఫ్రాన్స్ విజేత మరియు స్పెయిన్ సైక్లిస్ట్ మిగ్వెల్ ఇండురైన్‌కు ఒక విశ్రాంతి హృదయ స్పందన రేటు నిమిషానికి 28 బీట్‌లుగా నమోదయింది, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఒక మానవులలో నమోదయిన అతి కనిష్ఠ హృదయ స్పందన రేట్లలో ఇది కూడా ఒకటి.[14]

ఎరిత్మియా[మార్చు]

ఎరిత్మియా (Arrhythmia) అనేది హృదయ స్పందన రేటు మరియు లయలో అసాధారణతలను సూచిస్తుంది (కొన్నిసార్లు దీనిని గుండెదడగా భావించడం జరుగుతుంది). దీనిని రెండు విస్తృత విభాగాలుగా విభజించవచ్చు, అవి: వేగవంతమైన మరియు నెమ్మదైన హృదయ స్పందన రేట్లు. కొన్ని ఎరిత్మియాలు అతికొద్ది లేదా కనీస లక్షణాలకు కారణమవతాయి. ఇతరాలు లైట్‌థియాడెడ్నెస్, కళ్లుతిరిగి పడిపోవడం, కళ్లు చీకట్లు కమ్మడం, మూర్ఛ వంటి మరింత తీవ్రమైన లక్షణాలను సృష్టిస్తాయి.

జఠిరిక సహాయ ఉపకరణం[మార్చు]

విఫలమవుతున్న గుండెకు సాయంగా ఉండేందుకు ఒక జఠరిక సహాయ ఉపకరణం లేదా VADను ఏర్పాటు చేసినట్లయితే, హృదయ స్పందన రేటు మరియు నాడీ స్పందనను గుర్తించలేము, ఎందుకంటే ఇది నిరంతరం రక్తాన్ని సరఫరా చేసే పంపుగా పనిచేస్తుంది.

ఒక హాని కారకంగా హృదయ స్పందన రేటు[మార్చు]

వేగవంతమైన విశ్రాంతి హృదయ స్పందన రేటు హోమియోథెర్మిక్ క్షీరదాల్లో మృత్యువుకు దారితీసే ఒక కొత్త హాని కారకంగా గుర్తించబడుతుంది, ముఖ్యంగా దీనిని మానవుల్లో హృద్రోగ సంబంధ మరణాలకు దారితీసే హాని కారకంగా అనేక పరిశోధనల్లో గుర్తించారు. వేగవంతమైన హృదయ స్పందన రేటుతో తాప పరమాణుల ఉత్పత్తి పెరగడం మరియు ప్రతిక్రియాశీల ప్రాణావాయువు రకాల ఉత్పత్తి హృదయ వ్యవస్థలో పెరగడం, అంతేకాకుండా గుండెకు యాంత్రిక ఒత్తిడి పెరిగిపోవడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. విశ్రాంతి రేటు పెరగడం మరియు హృదయసంబంధ హానికి మధ్య ఒక సహసంబంధం ఉంది. దీనిని ఒక హృదయ స్పందనల కేటాయింపును ఉపయోగించినట్లు కాకుండా, పెరిగిన రేటు నుంచి వ్యవస్థకు నష్టభయం పెరిగినట్లు పరిగణించాలి.[15]

ఆస్ట్రేలియా నేతృత్వంలో హృద్రోగులపై జరిగిన ఒక అంతర్జాతీయ అధ్యయనంలో గుండె పోటుకు హృదయ స్పందన రేటును కీలకమైన సూచికగా గుర్తించారు. అధ్యయన సమాచారాన్ని ది లాన్సెట్ (సెప్టెంబరు 2008) లో ప్రచురించారు, ఈ అధ్యయనంలో 33 దేశాల్లో 11,000 మంది వ్యక్తులు పాల్గొన్నారు, వీరందరూ హృద్రోగాలకు చికిత్స పొందుతున్నవారు కావడం గమనార్హం. నిమిషానికి 70 బీట్‌ల కంటే ఎక్కువ హృదయ స్పందన రేటు గల రోగుల్లో గుండె పోటు సంభవించేందుకు, ఆస్పత్రిలో చేరడం మరియు శస్త్రచికిత్స అవసరం ఏర్పడేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లు గుర్తించారు. సిడ్నీ విశ్వవిద్యాలయ హృదయకోశాధ్యయన శాస్త్ర అధ్యాపకుడు, సిడ్నీలోని కాంకార్డ్ ఆస్పత్రి వైద్యుడు బెన్ ఫ్రీడ్‌మ్యాన్ మాట్లాడుతూ, అధిక హృదయ స్పందన రేటు ఉన్నట్లయితే, గుండె పోటీ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉందన్నారు, ప్రాణాపాయం లేని లేదా ప్రాణాంతక గుండెపోటు కారణంగా ఆస్పత్రి పాలయ్యేందుకు సుమారుగా 46 శాతం ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు.[16]

శరీరధర్మ శాస్త్రం మరియు వైద్య శాస్త్ర ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో ECG నుంచి ఈ కింది విధంగా హృదయ స్పందన రేటు (HR) ను తక్షణమే లెక్కించవచ్చని సూచిస్తాయి:

HR = 1,500/RR అంతరం మిల్లీమీటర్లలో, HR = 60/RR వ్యవధి సెకన్లలో, లేదా HR = 300/వరుస ఆర్ తరంగాల మధ్య పెద్ద చతురస్రాల సంఖ్య. ప్రతి సందర్భంలో, రచయితలు వాస్తవానికి తక్షణ HRను సూచిస్తారు, RR అంతరాలు స్థిరంగా ఉన్నట్లయితే ఇది హృదయ స్పందనల సంఖ్యను సూచిస్తుంది. ఇదిలా ఉంటే, పైసూత్రం దాదాపుగా ఎల్లప్పుడూ ప్రస్తావించబడుతుండటంతో, విద్యార్థులు ECGని చూడకుండా ఈ మార్గంలో HRను గుర్తిస్తారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

 1. రెగ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ రేట్. సెరెండిప్. సేకరణ తేదీ జూన్ 27, 2007.
 2. రెస్టింగ్ హార్ట్ రేట్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్
 3. [1],[1991-1995: బిగ్ మిగ్స్ మాస్టర్‌క్లాస్, BBC, ఆగస్టు 3, 2004]
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Kolata, Gina (2001-04-24). 'Maximum' Heart Rate Theory Is Challenged. New York Times.
 5. 5.0 5.1 5.2 Robergs R and Landwehr R (2002). "The Surprising History of the "HRmax=220-age" Equation" (PDF). Journal of Exercise Physiology. 5 (2): 1–10. ISSN 1097-9751. మూలం (PDF) నుండి 2010-06-28 న ఆర్కైవు చేసారు. Retrieved 4-1-09. Check date values in: |accessdate= (help)
 6. [ఏజ్ ప్రెడిక్టివ్ మాగ్జిమమ్ హార్ట్ రేట్ http://content.onlinejacc.org/cgi/content/abstract/37/1/153]
 7. Gellish, Ronald (May, 2007). "Longitudinal Modeling of the Relationship between Age and Maximal Heart Rate". Medicine & Science in Sports & Exercise. American College of Sports Medicine. 39 (5): 822–828. doi:10.1097/mss.0b013e31803349c6. PMID 17468581. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Check date values in: |date= (help)
 8. [న్యూ ఫార్ములా గివ్స్ ఫస్ట్ యాక్యురేట్ పీక్ హార్ట్ రేట్ ఫర్ వుమెన్ http://www.physorg.com/news196962986.html]
 9. http://circ.ahajournals.org/cgi/content/abstract/CIRCULATIONAHA.110.939249v1
 10. Wohlfart, Björn (2003). "Reference values for the physical work capacity on a bicycle ergometer for men -- a comparison with a previous study on women". Clin Physiol Funct Imaging. 23 (3): 166–70. doi:10.1046/j.1475-097X.2003.00491.x. PMID 12752560. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 11. Farazdaghi, GR (2001). "Reference values for the physical work capacity on a bicycle ergometer for women between 20 and 80 years of age". Clin Physiol. 21 (6): 682–7. doi:10.1046/j.1365-2281.2001.00373.x. PMID 11722475. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 12. హార్ట్-రేట్ రికవరీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎక్సెర్‌సైజ్ యాజ్ ఎ ప్రెడిక్టర్ ఆఫ్ మోర్టిలిటీ, స్టడీ బై: క్రిస్టోఫర్ ఆర్. కోల్, ఎం.డి., యుజెన్ హెచ్. బ్లాక్‌స్టోన్, ఎం.డి., ఫ్రెడ్రిక్ జే. పాష్కో, ఎం.డి., క్లైర్ ఈ. స్నాడెర్, ఎం.ఏ., అండ్ మైకెల్ ఎస్. లాయెర్, ఎం.డి. ; ఆర్ట్. రిఫెరెన్స్. ఫ్రమ్ ది NEJM, వాల్యూమ్ 341:1351-అక్టోబరు 28, 1357, 1999. అబ్‌స్ట్రాక్ట్ ఆన్‌లైన్ ఎట్ http://content.nejm.org/cgi/content/short/341/18/1351.
 13. హైడ్రేషన్ ఎఫెక్ట్స్ ఆన్ ఫిజియోలాజికల్ స్ట్రెయిన్ ఆఫ్ హార్సెస్ డ్యూరింగ్ ఎక్సెర్‌సైజ్-హీట్ స్ట్రెస్ J Appl Physiol వాల్యూమ్ 84, ఇష్యూ 6, 2042-2051, జూన్ 1998
 14. కార్డియాక్ అవుట్‌పుట్ Archived 2010-05-30 at the Wayback Machine.. లిడ్కో లిమిటెడ్. సేల్స్ అండ్ మార్కెటింగ్. సేకరణ తేదీ మే 1, 2007.
 15. "హార్ట్ రేట్, లైఫ్‌స్పాన్ అండ్ మోర్టలిటీ రిస్క్"[permanent dead link] ఏజింగ్ రీసెర్చ్ రివ్యూ 2009;8:52
 16. "హార్ట్‌బీట్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ డిసీజ్ రిస్క్: స్టడీ" సెప్టెంబరు 1, 2008

బాహ్య లింకులు[మార్చు]

మూస:Cardiovascular physiology