హెచ్.కె. కుమారస్వామి
| హెచ్.కె. కుమారస్వామి | |||
కర్ణాటక శాసనసభ సభ్యుడు | |||
| పదవీ కాలం 2008 – 2018 | |||
| ముందు | హెచ్. ఎం. విశ్వనాథ్ | ||
|---|---|---|---|
| తరువాత | సిమెంట్ మంజు | ||
| నియోజకవర్గం | సకలేష్పూర్ | ||
కర్ణాటక శాసనసభ సభ్యుడు | |||
| పదవీ కాలం 2004 – 2008 | |||
| తరువాత | రుద్రేష్ గౌడ | ||
| నియోజకవర్గం | బేలూరు | ||
కర్ణాటక శాసనసభ సభ్యుడు | |||
| పదవీ కాలం 1994 – 1999 | |||
| నియోజకవర్గం | బేలూరు | ||
| పదవీ కాలం 1985 – 1989 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1955 మే 31 కుప్పగడ్డె, కర్ణాటక | ||
| రాజకీయ పార్టీ | జనతాదళ్ (సెక్యులర్) | ||
| జీవిత భాగస్వామి | సి.టి. చంచల కుమారి | ||
| సంతానం | 3 | ||
| నివాసం | బెంగళూరు | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
హెచ్.కె. కుమారస్వామి (జననం 31 మే 1955) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మహిళా & శిశు సంక్షేమ మంత్రిగా పని చేశాడు.[1]
హెచ్.కె. కుమారస్వామి జెడి(ఎస్) పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్గా, జెడి(ఎస్) రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]హెచ్.కె. కుమారస్వామి జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బేలూరు శాసనసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి హెచ్.కె. నరస్వమహాస్వామిపై 11713 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పుట్టరంగనాథ్ పై 1953 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హెచ్.కె. కుమారస్వామి 2004 శాసనసభ ఎన్నికలలో బేలూరు శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి మల్లేష్ డి పై 4949 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో సకలేష్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నిర్వాణయ్యపై 13295 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి డి. మల్లేష్ పై 33069 ఓట్ల మెజారిటీతో గెలిచి ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
హెచ్.కె. కుమారస్వామి 2018 శాసనసభ ఎన్నికలలో సకలేష్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోమశేఖర్ జయరాజ్ పై 4942 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆరవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సిమెంట్ మంజు చేతిలో 2056 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[6]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కుమారస్వామి సి.టి. చంచల కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka Cabinet Expansion: Full List Of HD Kumaraswamy Ministers". www.india.com.
- ↑ "H.K. Kumaraswamy named Karnataka JD(S) chief". The Hindu.
- ↑ "In revamp, JD(S) names H.K. Kumaraswamy as Karnataka unit chief". LiveMint.
- ↑ "Sakleshpur Constituency Election Results". The Times of India. 6 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Sakleshpur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.