హెచ్. ఎల్. కపూర్
హరికిషన్ లాల్ కపూర్ (1923 డిసెంబరు 10 - 2020 ఫిబ్రవరి 14), భారత వైమానిక దళ మాజీ ఎయిర్ వైస్ మార్షల్, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు, ఆయన 1985 నవంబరు 16 నుండి 1988 ఆగస్టు 3 వరకు ఢిల్లీకి 11వ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేసాడు.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]సివిల్ సర్జన్ రాయ్ బహదూర్ డాక్టర్ రామ్ చంద్ కపూర్ కు 1923 డిసెంబర్ 10న రోహ్తక్ లో ఆయన జన్మించాడు. ఆయన 1942లో లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.[2]
సైనిక సేవ
[మార్చు]ఆయన 1943 జనవరి 11న రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నియమితులయ్యాడు. 37 సంవత్సరాల సేవ తర్వాత 1979 జూన్ 30న ఎయిర్ వైస్ మార్షల్ గా పదవీ విరమణ చేసాడు.[3]
రాజకీయం
[మార్చు]భారత వైమానిక దళం నుండి పదవీ విరమణ చేసిన తరువాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 1985లో రాజ్యసభకు నామినేట్ అయ్యాడు. ఆయన 1985 జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసాడు, అయితే, 1985 నవంబరు 14న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అవకాశం రావడంతో పదవి విరమణ చేసాడు.[4]
క్రీడా నిర్వహణ
[మార్చు]హెచ్. ఎల్. కపూర్ వైమానిక దళంలో తన సేవతో పాటు క్రీడా పరిపాలనలో కూడా చురుకుగా ఉండేవాడు. అతను మార్చి 1976 నుండి జూన్ 1979 వరకు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడిగా పనిచేసాడు.[5] 1976 నుండి 1985 వరకు హ్యాండ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.[6]
పురస్కారాలు
[మార్చు]1983లో హెచ్. ఎల్. కపూర్ కు భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[7]
| అలంకరణ | దేశం | సంవత్సరం | |
|---|---|---|---|
| పద్మశ్రీ | 1983 | ||
| పరమ్ విశిష్ట్ సేవా మెడల్ | 1979 | ||
| అతి విశిష్ట సేవా పతకం | 1974 | ||
మరణం
[మార్చు]హెచ్. ఎల్. కపూర్ తన 96 సంవత్సరాల వయస్సులో 2020 ఫిబ్రవరి 14న డెహ్రాడూన్ లో సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Former Lieutenant Governors". www.lg.delhi.gov.in. 24 July 2020. Retrieved 24 July 2020.
- ↑ "Former Lieutenant Governors". www.lg.delhi.gov.in. 24 July 2020. Retrieved 24 July 2020.