హెడ్ ఫోన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెన్‌హీజెర్‌ హెడ్‌డి 555 హెడ్‌ఫోన్స్‌, ఆడియో ప్రొడక్షన్‌ ఎన్విరాన్‌మెంట్స్‌లో ఉపయోగించేవి.
సోని ఎమ్‌డిఆర్‌ 7506 హెడ్‌ఫోన్స్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ ఆడియో [1]

హెడ్‌ఫోన్స్‌ అనేవి చిన్న లౌడ్‌ స్పీకర్ల యొక్క జత లేదా చాలా అరుదుగా ఒకే స్పీకర్‌, ఉపయోగించేవారి యొక్క చెవులకు దగ్గరగా పట్టి ఉంచేవి మరియు సాధారణంగా ఇవి ఒక సింగిల్‌ సోర్స్‌ అంటే ఆడియో యాంపిల్‌ఫైర్‌, రేడియో, సిడి ప్లేయర్‌ లేదా పోర్టబుల్‌ మీడియా ప్లేయర్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి. వీటిని స్టీరియోఫోన్స్‌, హెడ్‌సెట్స్‌ లేదా కొలక్వియల్లీ క్యాన్స్‌ అని కూడా పిలుస్తారు. చెవి లోపల ఉంచుకునే వెర్షన్‌ను ఇయర్‌ఫోన్స్‌ లేదా ఇయర్‌బడ్స్‌ అంటారు. టెలికమ్యూనికేషన్ల విషయానికొస్తే, హెడ్‌సెట్‌ అనే పదాన్ని హెడ్‌ఫోన్‌ మరియు టెలిఫోన్ వంటి రెండు వైపులా సమాచార మార్పిడికి వినియోగించే మైక్రోఫోన్‌ యొక్క సమ్మేళనం‌గా నిర్వచిస్తారు‌.

చరిత్ర[మార్చు]

పాత టెలిఫోన్‌ ఇయర్‌పీస్‌

టెలిఫోన్‌ ఇయర్‌పీస్‌, కుడివైపు చిత్రంలో ఉన్న లాంటిది, 20వ శతాబ్దం ప్రారంభంలో చాలా ఎక్కువగా కనిపించేది. హెడ్‌ఫోన్స్‌ అనేవి ఇయర్‌పీస్‌ నుంచి వచ్చాయి. యాంపిల్‌ఫైర్స్‌ అభివృద్ధి చెందక ముందు ఆడియో సిగ్నల్స్‌ వినడానికి ఇదొక్కటే మార్గం. తొలుత నాథానియల్‌ బాల్డ్‌విన్‌ అత్యంత విజయవంతమైన సెట్‌ను అభివృద్ధి చేసాడు. ఈయన వీటిని తన వంటగది‌లో చేతితో తయారు చేసి, వాటిని యు.ఎస్‌. నావికాదళానికి అమ్మేవారు.[2][3]

బ్రాండ్స్‌ రేడియో హెడ్‌ఫోన్స్‌, సిర్కా 1920

1919 కాలంలో బ్రేండ్స్‌ తయారు చేసిన సున్నితమైన హెడ్‌ఫోన్స్‌ను ఆరంభంలో రేడియో పనుల కోసం చాలా ఎక్కువగా ఉపయోగించేవారు. ఈ ఆరంభ హెడ్‌ఫోన్స్‌ ఐరన్‌ డ్రైవర్స్‌ను కదిలించడానికి సింగిల్‌ ఎండెడ్‌ లేదా బ్యాలెన్స్‌డ్‌ అర్మెచ్యూర్‌గా వినియోగించేవారు. శబ్దం యొక్క నాణ్యత సరిగా లేకపోవడం వల్ల, డాంపింగ్‌ పరికరాలను ఉపయోగించడం కుదిరేది కాదు, అందువలన అధిక సున్నితత్వం గల పరికరాల అవసరం ఉండేది. ఆధునిక కాలంలోని రకాలతో పోలిస్తే అవి చాలా తక్కువ సౌకర్యవంతంగా ఉండేవి. సాధారణంగా వీటికి ప్యాడింగ్‌ ఉండేది కాదు. చాలా తరచుగా అధికంగా తలకు క్లాంపింగ్‌ చేయాల్సి వచ్చేది. వీటికి కావలసిన కరెంటు కూడా భిన్నంగా ఉంటుంది: టెలిగ్రాఫ్‌ మరియు టెలిఫోన్‌ పనుల్లో వాడే హెడ్‌ఫోన్స్‌కు 75ohms కరెంటు ఉంటే సరిపోయేది. ఆరంభంలో వాడిన వైర్‌లెస్‌ రేడియో చాలా ఎక్కువ సెన్సిటివిటీని కలిగి ఉండేది మరియు ఎక్కువగా మంచివైర్‌తో నిర్మితమై ఉండేవి. వీటికి 1000 నుంచి 2000 ohms శక్తి చాలా సహజంగా అవసరమయ్యేది. ఇది క్రిస్టల్‌ సెట్స్‌కు మరియు ట్రయోడ్‌ రిసీవర్స్‌కు సరిపోయేది.

ఆరంభంలో శక్తితో నడిచే రేడియోలలో, హెడ్‌ఫోన్స్‌ అనేవి వ్యాక్యూమ్‌ ట్యూబ్‌ యొక్క ప్లేట్‌లో సర్క్యూట్‌లో భాగంగా ఉండేవి. ఇవి సాధారణంగా పాజిటివ్‌ హై వోల్టేజ్‌ బ్యాటరీ టెర్మినల్‌తో అనుసంధానించబడి ఉండేవి మరియు ఇతర బ్యాటరీ టెర్మినల్‌ను భద్రంగా ఎర్త్‌ చేసేవారు. బేర్‌ ఎలక్ట్రికల్‌ కనెక్షన్లను ఉపయోగించడం అంటే, ఉపయోగించేవారు బేర్‌ హెడ్‌ఫోన్‌ కనెక్షన్‌ను ముట్టుకుంటే షాక్‌కు గురవడం అనే భావన ఉండేది. హెడ్‌సెట్‌ సౌకర్యవంతంగా లేనప్పుడు సర్దుకుంటుంటే ఈ షాక్‌ తగిలేది.

అప్లికేషన్స్[మార్చు]

హెడ్‌ఫోన్స్‌ను స్థిరమైన పరికరాలతో అంటే సిడి లేదా డివిడి ప్లేయర్లు, హోమ్‌ థియేటర్‌, పర్సనల్‌ కంప్యూటర్‌లతో మరియు పోర్టబుల్‌ డివైజ్‌లు (ఉదాహరణకు డిజిటల్‌ ఆడియో ప్లేయర్‌ /ఎమ్‌పి3 ప్లేయర్‌, మొబైల్‌ ఫోన్‌ మొదలైనవి) తో కూడా వాడవచ్చు. కార్డ్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ వైర్‌ ద్వారా అనుసంధానం చేయబడి ఉండవు. రేడియో లేదా ఇన్‌ఫ్రారెడ్‌ సిగ్నల్‌ను స్వీకరించి, రేడియో లేదా ఎఫ్‌ఎమ్‌, బ్లూ టూత్‌ లేదా వైఫై వంటి ఇన్‌ఫ్రారెడ్‌ ట్రాన్స్‌మిషన్‌ లింక్‌ను ఉపయోగించి ఎన్‌కోడ్‌ చేస్తుంది. ఇవి సాధారణంగా పవర్డ్‌ రిసీవర్‌ వ్యవస్థ ద్వారా తయారు చేయబడి ఉంటాయి. ఇందులో హెడ్‌ఫోన్స్‌ అనేవి కేవలం ఒక భాగం మాత్రమే. ఇలాంటి కార్డ్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను చాలా ఎక్కువగా డిస్కో లేదా సైలెంట్‌ గిగ్‌లలో ఉపయోగిస్తున్నారు.

ప్రొఫెషనల్‌ ఆడియో సెక్టార్‌లో హెడ్‌ఫోన్స్‌ అనేవి డిస్క్‌ జాకీలు డిజె మిక్సర్‌లో లైవ్‌ సిట్యువేషన్‌ కోసం మరియు సౌండ్‌ ఇంజినీర్లు సిగ్నల్‌ సోర్స్‌లను పర్యవేక్షణ‌ చేయడానికి ఉపయోగిస్తున్నారు. రేడియో స్టేషన్లలో, డిజెలు ఒక జత హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తారు. మాట్లాడే సమయంలో మైక్రోఫోన్‌ ఉపయోగించి, స్పీకర్లను ఆఫ్‌ చేస్తారు. అనవసరమైన ఫీడ్‌బ్యాక్‌ను ఆపడటంతో పాటు తమ సొంత గొంతును పరీక్షించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. స్టూడియో రికార్డింగ్‌లలో సంగీతకారులు మరియు సింగర్స్‌ హెడ్‌ఫోన్స్‌ను బ్యాకింగ్‌ ట్రాక్‌తో పాటు పాడటానికి ఉపయోగించుకుంటారు. అదే సైన్యంలో అయితే, హెడ్‌ఫోన్స్‌ను ఉపయోగించి అనేక రకాల సంకేతాలను పరీక్షించుకుంటారు.

వైర్‌తో ఉన్న హెడ్‌ఫోన్స్‌ అనేవి ఆడియో సోర్స్‌కు తగిలించి ఉంటాయి. సాధారణంగా ప్రామాణిక కనెక్షన్‌ 635 mm‌ (¼″) మరియు 3.5 mm‌ TRS‌ కెనెక్టర్స్‌ మరియు సాకెట్స్‌కు తగిలించి ఉంటాయి. పెద్దవి 6.35 mm‌ కనెక్టర్‌ను ఉపయోగించి ఇంట్లో ఉన్న స్థిరమైన ప్రదేశానికి లేదా ప్రొఫెషనల్‌ పరికరాలకు తగిలించి ఉంటాయి. సోని చిన్న మరియు మరియు ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తున్న 3.5 mm‌ మినిజాక్‌ స్టీరియో కనెక్షన్‌ను 1979లో ఆవిష్కరించింది. పాత మోనోఫోనిక్‌ 3.5 mm‌ కనెక్టర్‌ను తన వాక్‌మెన్‌ పోర్టబుల్‌ స్టీరియో టైప్‌ ప్లేయర్‌కు మరియు 3.5 mm‌ కనెక్టర్‌ను ఇప్పటి చిన్న అప్లికేషన్స్‌కు సాధారణ కనెక్టర్‌గా ఉపయోగించింది. 6.35 mm‌ మరియు 3.55 mm‌ పరికరాలను మార్చుకునేందుకు వీలుగా ఇప్పుడు అడాప్టర్‌లు అందుబాటులో ఉన్నాయి.

హెడ్‌ఫోన్స్‌లో రకాలు[మార్చు]

వినేవారి యొక్క ప్రత్యేకించిన అవసరం హెడ్‌ఫోన్‌ ఎంపికను నిర్దేశిస్తుంది. పోర్టబులిటి అంటే చిన్నవి, తేలికగా ఉండే హెడ్‌ఫోన్స్‌ కావాలని అర్థం. ఇదే సమయంలో ఫిడిలిటి విషయంలో రాజీ పడాలి. ఇంటి లోపల హైఫైలో భాగంగా ఉపయోగించే హెడ్‌ఫోన్స్‌ ఇదే రకమైన నమూనా‌ను కలిగి ఉండవు. ఇది పెద్దగా ఉంటాయి. సాధారణంగా హెడ్‌ఫోన్‌ అంశాలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు: సర్క్యుమరల్‌, సుప్రా అరల్‌, ఇయర్‌బడ్‌ మరియు ఇన్‌ ఇయర్‌ .

సర్క్యుమరల్‌[మార్చు]

సర్క్యుమలర్‌ హెడ్‌ఫోన్స్‌, చెవి చుట్టూ పెద్ద ప్యాడ్స్‌ను కలిగి ఉన్నాయి

సర్క్యుమరల్‌ హెడ్‌ఫోన్స్‌ (కొన్నిసార్లు వీటిని ఫుల్‌సైజ్‌ హెడ్‌ఫోన్స్‌ అని పిలుస్తారు) లో వృత్తాకారంలో లేదా ఎలిపిసోడ్‌ ఇయర్‌ప్యాడ్స్‌ ఉంటాయి. ఇవి చెవులకు తగిలించుకోవాలి. ఈ హెడ్‌ఫోన్స్‌ చెవులను పూర్తిగా మూసి వేస్తున్న కారణంగా, సర్క్యుమరల్‌ హెడ్‌ఫోన్స్‌ను అదనంగా ఎలాంటి శబ్దం వినిపించకుండా చెవులు మొత్తం మూసుకుపోయేలా డిజైన్‌ చేశారు. వీటి పరిమాణం కారణంగా, సర్క్యుమరల్‌ హెడ్‌ఫోన్స్‌ చాలా అధికంగా, ఎక్కువ బరువును కలిగి ఉంటాయి.500 grams (1 lb) మంచి హెడ్‌బ్యాండ్‌ లేదా ఇయర్‌ప్యాడ్‌ అనేది బరువు ద్వారా అసౌకర్యం కలిగించకుండా తయారుచేయబడి ఉండాలి.

సుప్రా-అరల్‌[మార్చు]

సుప్రా అరల్‌ హెడ్‌ఫోన్స్‌ జత

సుప్రా-అరల్‌ హెడ్‌ఫోన్స్‌ లో ప్యాడ్స్‌ చెవుల చుట్టూ కాకుండా చెవుల పైన కూర్చుని ఉంటాయి. ఇవి సాధారణంగా వ్యక్తిగత స్టీరియోలకు అనుసంధానమై 1980ల్లో ఎక్కువగా వినియోగంలో ఉండేవి. ఈ తరహా హెడ్‌ఫోన్స్‌ సాధారణంగా చిన్నవిగా, సర్క్యుమరల్‌ హెడ్‌ఫోన్స్‌తో పోలిస్తే బరువు తక్కువగా ఉంటాయి. ఫలితంగా బయటి శబ్దం కూడా ఎక్కువగా వినిపించదు.

ఇన్‌ ఇయర్‌ హెడ్‌ఫోన్స్‌[మార్చు]

ఇయర్‌బడ్స్‌[మార్చు]

ఇయర్‌ బడ్స్‌ / ఇయర్‌ఫోన్స్‌

ఇయర్‌బడ్స్‌ లేదా ఇయర్‌ఫోన్స్ ‌ అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉండే హెడ్‌ఫోన్స్‌. వీటిని నేరుగా చెవి లోపల కెనాల్‌లో పెట్టుకోవచ్చు, కాకపోతే దానిని పూర్తిగా చుట్టేసి ఉంచాలి. ఇవి సాధారణంగా తక్కువ ఖర్చుతో కూడకున్నవి మరియు దాని సౌకర్యం, పోర్టబులిటీ దృష్ట్యా అందరూ ఎక్కువగా ఇష్టపడేవి. ఇవి ఎక్కువ ఐసోలేషన్‌ను ఇవ్వలేని కారణంగా, ఎక్కువ వాల్యూమ్‌ పెట్టుకుని వినాల్సి ఉంటుంది. వాడేవారికి పరిసరాల్లోని ఇతర శబ్దాలు వినిపించకూడదంటే ఇది తప్పదు. దీనివల్ల వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.[4] 1990లు, 2000లో, ఇయర్‌బడ్స్‌ అనేవి వ్యక్తిగత సంగీత పరికరాలతో పాటు చాలా ఎక్కువగా కనిపించేవి.

ఇన్‌ ఇయర్‌ మానిటర్స్‌[మార్చు]

ఇన్‌ ఇయర్‌ మోనిటర్స్‌ ఇయల్‌ కెనాల్‌లోకి పెంచబడినవి, బయటి శబ్దం నుంచి ఐసోలేషన్‌ను కలిగిస్తాయి.

ఇన్‌ ఇయర్‌ మానిటర్స్‌ (IEM‌లు లేదా కెనాల్‌ఫోన్స్ ‌గా కూడా సుపరిచితం) అనేవి నేరుగా చెవి యొక్క కెనాల్‌లో ప్రవేశపెట్టబడేవి. కెనాల్‌ఫోన్స్‌ పోర్టబులిటీ విషయంలో ఇయర్‌బడ్స్‌కు సమాంతరంగా ఉంటాయి. పర్యావరణ శబ్దాలను ఇయర్‌ప్లగ్స్‌లోకి బ్లాక్‌ అవుట్‌ చేయడంలోనూ ఉపకరిస్తాయి. ప్రధానంగా IEM‌లు రెండు రకాలు: యూనివర్శల్‌ మరియు కస్టమ్‌. యూనివర్శల్‌ కెనాల్‌ఫోన్స్‌ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టాక్‌ స్లీవ్‌ పరిమాణా‌లలో లభిస్తాయి. ఇవి రకరకాల చెవుల కెనాల్స్‌కు సరిపోతాయి. ఇవి సాధారణంగా సిలికాన్‌ రబ్బర్‌, ఎలాస్టోమెర్‌ లేదా ఫోమ్‌తో తయారై, శబ్దాన్ని ఐసోలేట్‌ చేస్తాయి. కస్టమ్‌ కెనాల్‌ఫోన్స్‌ అనేవి ప్రతి వ్యక్తి యొక్క చెవిని బట్టి తయారు చేస్తారు. చెవి కెనాల్‌ యొక్క క్యాస్టింగ్స్‌ను చూసి తయారీదారులు కస్టమ్‌ సిలికాన్‌ రబ్బర్‌ లేదా ఎలాస్టోమెర్‌ప్లగ్స్‌ను ఉపయోగించి శబ్దం యొక్క ఐసోలేషన్‌ లేకుండా వీటిని తయారు చేస్తారు. ఇందులో వ్యక్తిగత శ్రమ ఎక్కువగా ఉన్నందున, IEM‌లు సాధారణంగా కొంత ఎక్కువ ఖరీదు ఉంటాయి. యూనివర్శల్‌ IEM‌లతో పోలిస్తే తిరిగి అమ్మకం విలువ కూడా కొంత తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఇతరులకు పెద్దగా సరిపోయే అవకాశాలు తక్కువ.

హెడ్‌సెట్‌[మార్చు]

వాయిస్‌ చాట్‌ల కొరకు ఉపయోగించే హెడ్‌సెట్‌కు టిపికల్‌ ఉదాహరణ

హెడ్‌సెట్‌ అనేది మైక్రోఫోన్‌తో కలిసి ఉన్న హెడ్‌ఫోన్‌. హెడ్‌సెట్‌ అనేది హ్యాండ్స్‌ ఫ్రీ ఆపరేషన్‌ చేయగలిగిన టెలిఫోన్‌ హ్యాండ్‌సెట్‌తో సమానంగా పనిచేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను ఎక్కువగా కన్‌సోల్‌ లేదా పిసి గేమింగ్‌, కాల్‌ సెంటర్‌ మరియు ఇతర టెలిఫోన్‌ ఆధారిత ఉద్యోగాలలో వాడతారు మరియు వ్యక్తిగత కంప్యూటలర్‌ ఉపయోగంలో, సంభాషనలు మరియు టైపింగ్‌ అవసరం ఉన్నప్పుడు వీటిని ఉపయోగించడం సహజం. హెడ్‌సెట్‌లు సింగిల్‌ ఇయర్‌ పీస్‌ (మోనో) లేదా డబుల్‌ ఇయర్‌ పీస్‌ (రెండు చెవులకు మోనో లేదా స్టీరియో) లతో తయారు చేస్తారు. మైక్రోఫోన్‌ కలిగిన హ్యాండ్‌సెట్‌లు బయట మైక్రోఫోన్‌ను కలిగి ఉండే రకంగా ఉంటాయి. ఇవి వినియోగించేవారి నోటికి దగ్గరలో మైక్రోఫోన్‌ను కలిగి ఉంటాయి లేదా వాయిస్‌ ట్యూబ్‌ రకం అంటే ఇక్కడ మైక్రోఫోన్‌ ఇయర్‌పీస్‌ లోపల ఉంటుంది మరియు మాట‌ ఒక హ్యాలో ట్యూబ్‌ ద్వారా అక్కడకు చేరుతుంది.

టెలిఫోన్‌ హెడ్‌సెట్స్‌[మార్చు]

టెలిఫోన్‌ హెడ్‌సెట్స్‌ స్థిరమైన లైన్‌ కలిగిన టెలిఫోన్‌ వ్యవస్థకు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఒక టెలిఫోన్‌ హెడ్‌సెట్‌ పనితీరు దానిని టెలిఫోన్‌ హ్యాండ్‌సెట్‌కు రీప్లేస్‌ చేయడం పై ఆధారపడి ఉంటుంది. అన్ని టెలిఫోన్‌ హ్యాండ్‌సెట్స్‌ ప్రామాణికంఆ 4P4Cగా ఉంటాయి. వీటిని RJ-9 కనెక్టర్‌ అని పిలుస్తారు.

పాత మోడల్‌ టెలిఫోన్స్‌లో, హెడ్‌సెట్‌ మైక్రోఫోన్‌ ఇంపడేన్స్ అనేది ఒరిజినల్‌ హ్యాండ్‌సెట్‌ నుంచి భిన్నంగా ఉంటుంది. టెలిఫోన్‌ హెడ్‌సెట్‌కు ఒక యాంపిల్‌ఫైర్‌ అవసరం ఉంటుంది. టెలిఫోన్‌ యాంపిల్‌ఫైర్‌ పిన్‌ ఎలైన్‌మెంట్‌ను కలిగి ఉండటం వల్ల, టెలిఫోన్‌ హెడ్‌సెట్‌ అడాప్టర్‌ తరహాలో, ఇది మైక్రోఫక్షన్‌కు మరియు లౌడ్‌ స్పీకర్లకు కూడా శబ్ద యాంపిల్‌కేషన్‌ను ఇస్తుంది. అనేక టెలిఫోన్‌ యాంపిల్‌ఫైర్‌ నమూనాల‌లో లైడ్‌ స్పీకర్‌ కొరకు శబ్ద నియంత్రణ మరియు మైక్రోఫోన్‌ కొరకు శబ్ద నియంత్రణను అందుబాటులో ఉంచుతారు. మ్యూట్‌ ఫంక్షన్‌ మరియు హెడ్‌సెట్‌ / హ్యాండ్‌సెట్‌లో మార్పు కూడా అందుబాటులో ఉంటాయి. టెలిఫోన్‌ యాంపిల్‌పైర్‌లు బ్యాటరీలతో లేదా ఎసి అడాప్టర్‌లతో పవర్‌ను తీసుకుంటాయి.

సాంకేతికపరిజ్ఞానం[మార్చు]

హెడ్‌ఫోన్‌ ట్రాన్స్‌డ్యూసెర్‌కు టిపికల్‌ మూవింగ్‌ కాయిల్‌

హెడ్‌ఫోన్‌ ట్రాన్స్‌డ్యూసెర్స్‌ అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పద్ధతుల్లో శబ్దాన్ని రీప్రొడక్షన్‌ చేసుకుంటాయి.

మూవింగ్‌కాయిల్‌[మార్చు]

మూవింగ్‌ కాయిల్‌ డ్రైవర్‌, సాధారణంగా దీనిని డైనమిక్‌ డ్రైవర్‌ అని అంటారు. ఎక్కువగా దీనిని హెడ్‌ఫోన్స్‌లో ఉపయోగిస్తారు. దీని నిర్వహణ సూత్రం, స్టేషనరీ మేగ్నటిక్‌ ఎలిమెంట్‌ను హెడ్‌ఫోన్‌ యొక్క ఫ్రేమ్‌కు ఫిక్స్‌ చేయడం ద్వారా ఉంటుంది. ఇది స్టాటిక్‌ మ్యాగ్నటిక్‌ ఫీల్డ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ మ్యాగ్నటిక్‌ అంశం హెడ్‌ఫోన్స్‌లో చాలా సంక్లిష్టంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. దీనిని నియోడిమియమ్‌ లేదా ఫెరిట్‌ అని పిలుస్తారు. డయాఫ్రాగమ్‌, తక్కువ బరువుతో ఉంటుంది. అధికమైన దృఢత్వాన్ని కలిగి ఉండి, సెల్యులోస్‌లో మాస్‌ నిష్పత్తిని కలిగి ఉంటుంది. పాలిమర్‌, కార్బర్‌ మెటీరియల్‌ మరియు ఇలాంటి మెటీరియల్‌తో వైర్‌ యొక్క కాయిల్‌ (వాయిస్‌ కాయిల్‌) కలపబడి ఉంటుంది. ఇది స్టాటిక్‌ మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ లేదా స్టేషనరి మ్యాగ్నెట్‌ను నియంత్రిస్తుంది. డయాఫ్రాగమ్‌ వాయిస్‌ కాయిల్‌తో కలిపి ఉంటుంది. కాయిల్‌ ద్వారా ఆడియో కరెంట్‌ పాస్‌ అయినప్పుడు ఇది పనిచేస్తుంది. ఆల్టర్నేట్‌ మ్యాగ్నెటిక్‌ ఫీల్డ్‌ కరెంట్‌ను కాయిల్‌ ద్వారా పంపించి, స్టాటిక్‌ మ్యాగ్నెటిక్‌‌ ఫీల్డ్‌ను ఆన్‌ చేస్తుంది. ఇది కాయిల్‌ మరియు డయాఫ్రాగమ్‌ను గాలిలోకి పంపుతుంది. ఇది శబ్దాన్ని సృష్టిస్తుంది. ఆధునిక మూవింగ్‌ కాయిల్‌ హెడ్‌ఫోన్‌ డ్రైవర్స్‌ అనేవి మైక్రోఫోన్‌ క్యాప్సుల్‌ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తయారు చేస్తున్నారు.

ఎలక్ట్రోస్టాటిక్‌[మార్చు]

ఎలక్ట్రోస్టాటిక్‌ లౌడ్‌ స్పీకర్‌ చిత్రం

ఎలక్ట్రోస్టాటిక్‌ డ్రైవర్స్‌ ఒక పలచటి, ఎలక్ట్రికల్‌ చార్జ్‌ అయిన డయాఫ్రాగామ్‌ను కలిగి ఉంటుంది. దీనిలో పిఇటి కోట్‌ చేసిన ఫిల్మ్‌ మెమ్‌బ్రేన్‌ ఉంటుంది. ఇది రెండు ఫెర్ఫోరేటెడ్‌ మెటల్‌ ప్లేట్స్‌ (ఎలక్ట్రోడ్స్‌) మధ్య అమర్చి ఉంటుంది. ఎలక్ట్రికల్‌ సౌండ్‌ సిగ్నల్స్‌ ఎలక్ట్రోడ్స్‌కు అప్లై అయి, ఎలక్ట్రికల్‌ ఫీల్డ్‌ను సృష్టిస్తాయి. ఇది ఈ ఫీల్డ్‌ యొక్క పొలారిటీ పై ఆధారపడి ఉంటుంది. ఈ డయాఫ్రాగమ్‌ అనేది ప్లేట్ల దిశగా గీయబడి ఉంటుంది. పెర్ఫోరేషన్స్‌ మధ్య గాలి వెళుతుంది. ఇది నిరంతరంగా మారుతూ ఎలక్ట్రికల్‌ సిగ్నల్‌ మెమ్‌బ్రేన్‌ ద్వారా పంపుతుంది. ఇక్కడ శబ్ద తరంగం ఉత్పత్తి అవుతుంది. ఎలక్ట్రోస్టాటిక్‌ హెడ్‌ఫోన్స్‌ సాధారణంగా ఎక్కువ ఖరీదు కలిగి ఉంటాయి. మూవింగ్‌ కాయిల్స్‌ వాటితో పోలిస్తే చాలా ఎక్కువ. అంతేకాదు, చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. దీనికి అదనంగా ఒక ప్రత్యేక యాంపిల్‌ఫైర్‌ కూడా అవసరం. ఇది మెమ్‌బ్రేన్‌ యొక్క సిగ్నల్‌ను యాంపిల్‌ఫై చేయాలి. సాధారణంగా ఇది 100 నుంచి 1000 వాల్ట్‌ల సామర్ధ్యంతో లభిస్తుంది.

చాలా పలచటి, లైట్‌ డయాఫ్రాగమ్‌ మెమ్‌బ్రేన్‌ కలిగి ఉండటం వల్ల, కేవలం కొన్ని మైక్రోమీటర్స్‌ మందంతోనే ఉంటుంది మరియు కదిలే మెటల్‌ వర్క్‌ పూర్తిగా ఉండదు. ఎలక్ట్రోస్టాటిక్‌ పౌనఃపున్యం యొక్క రెస్పాన్స్‌ ఉన్న హెడ్‌ఫోన్స్‌ సాధారణంగా 20 కిలో హెట్జ్‌ కంటే ఎక్కువ ఆడిబులిటీని కలిగి ఉంటాయి. వీటి అధిక పౌనఃపున్యం రెస్పాన్స్‌ అంటే, మిడ్‌బ్యాండ్‌ డిస్టోర్షన్‌ స్థాయి చాలా తక్కువగా నిర్వహించబడుతుంది. ఇది ఆడిబుల్‌ పౌనఃపున్యం బ్యాండ్‌ పరిధిని మించి ఉంటుంది. సాధారణంగా కాయిల్‌ డ్రైవర్స్‌ కదులుతుంటాయి. పౌనఃపున్యం రెస్పాన్స్‌ యొక్క అత్యున్నత స్థాయి‌ సాధారణంగా అధిక పౌనఃపున్య స్థాయి‌లో కనిపిస్తుంది. ఇక్కడ కదిలే‌ కాయిల్స్‌ కనిపించవు. దీని ఫలితం వల్ల మంచి సౌండ్‌ క్వాలిటీ వస్తుంది. అయితే దీనిని జాగ్రత్తగా రూపొందించాల్సి ఉంటుంది.

ఎలక్ట్రాస్టిక్‌ హెడ్‌ఫోన్స్‌ 100 వోల్ట్‌ల నుంచి 1 కెవి వోల్ట్‌ మధ్య ఎంతైనా శక్తిని తీసుకోవచ్చు. వినియోగించేవారి తలమీద అంత ప్రాక్సిమిటీ ఉంటుంది. దీనిని రూపొందించేప్పుడు భద్రత గురించి జాగ్రత్తలు తీసుకుని తక్కువ కరెంట్‌ మరియు భద్రమైన రెసిస్టర్స్‌ను వాడాలి.

ఎలక్ట్రెట్‌[మార్చు]

ఎలక్ట్రెట్‌ డ్రైవర్‌ ఎలక్ట్రోమెకానికల్‌ తరహాలోనే పనిచేస్తుంది. అంటే ఒక ఎలక్ట్రోస్టాటిక్‌ డ్రైవర్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఏదేమైనా ఎలక్రెట్‌ డ్రైవర్‌ దానిలో శాశ్వత చార్జ్‌ను దానిలో బిల్ట్‌ చేసుకుని ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్‌ చార్జ్‌ను డ్రైవర్‌ను ఒక బాహ్య జనరేటర్‌ ద్వారా పంపుతుంది. ఎలక్ట్రెట్ హెడ్‌ఫోన్స్‌, ఇతర ఎలక్ట్రోస్టాటిక్స్‌ లా వాస్తవానికి చాలా అసహజంగా ఉంటాయి. ఇవి మంచి సాంకేతిక సామర్ధ్యాన్ని తక్కువగా కలిగి ఉంటాయి. రేటు కూడా తక్కువగానే ఉంటుంది. ఎలక్ట్రాస్టిక్స్‌తో పోలిస్తే ఫిడెలిటీ కూడా తక్కువగానే ఉంటుంది.

బ్యాలెన్స్‌డ్‌ అర్మాచ్యుర్‌[మార్చు]

బ్యాలెన్స్‌డ్‌ అర్మాచ్యుర్‌ ట్రాన్స్‌డ్యూసెర్‌, అర్మాచ్యుర్‌ బ్యాలెన్స్‌డ్‌ మరియు ఎక్సర్టింగ్‌ నో ఫోర్స్‌ ఆన్‌ డయాఫ్రాగమ్‌
బ్యాలెన్స్‌డ్‌ అర్మాచ్యుర్‌ ట్రాన్స్‌డ్యూసెర్‌, అర్మాచ్యుర్‌ టార్‌క్యుడ్‌ అండ్‌ ఎక్సర్టింగ్‌ ఎ ఫోర్స్‌ ఆన్‌ డైఫాగ్రామ్‌

బ్యాలెన్స్‌డ్‌ అర్మాచ్యుర్‌ అనేది ఒక శబ్ద ట్రాన్స్‌డ్యూసర్‌. ఇది ప్రాథమికంగా ఎలక్ట్రికల్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు తయారు చేయబడింది. అనేక ఇతర మ్యాగ్నటిక్‌ ట్రాన్స్‌డ్యూసెర్‌ వ్యవస్థలలో డయాఫ్రాగామ్‌ అంశాలను మెరుగుపరచడం ద్వారా ఇది తయారయింది. మొదటి చిత్రంలో స్కెమటికల్‌గా చూపించినట్లు, ఇది ఒక కదిలే మాగ్నెటిక్‌ అర్మాచ్యూర్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫీల్డ్‌లో శాశ్వత మ్యాగ్నెట్‌గా కదులుతూ ఉంటుంది. మాగ్నెటిక్‌ ఫీల్డ్‌లో సెంటర్‌లో ఉంచితే, అక్కడ అర్మాచ్యుర్‌ మీద నెట్‌ ఫోర్స్‌ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్‌డ్‌ అనే పదం వచ్చింది. రెండో చిత్రంలో ఉదహరించినట్లుగా, అక్కడ ఎలక్ట్రిక్‌ కరెంట్‌ కాయిల్‌ ద్వారా వెళితే, అది అర్మచ్యూర్స్‌ను మరో విధంగా మ్యాగ్నటైజ్‌ చేస్తుంది. ఇది చిన్నగా రొటేర్‌ అవుతూ మరోవైపు పివోట్‌గా పనిచేస్తుంది. ఇది డయాఫ్రాగమ్‌ నుంచి శబ్దాన్ని సృష్టిస్తుంది.

ఈ నమూనా పూర్తిగా యాంత్రికం‌గా స్థిరమైనది కాదు. కొద్దిగా బ్యాలెన్స్‌ లేకపోవడం వల్ల అర్మచ్యూర్‌ అనేది ఒక మ్యాగ్నెట్‌ పోల్‌తోనే అతుక్కుని ఉంటుంది. అర్మాచ్యూర్‌ను బ్యాలెన్స్‌ పొజిషన్‌లో ఉంచేందుకు ఒక స్థిరమైన రీస్టోరింగ్‌ ఫోర్స్‌ అవసరం ఉంటుంది. ఏదేమైనా ఇది సామర్ధ్యాన్ని తగ్గిస్తుంది. ఈ డిజైన్‌ ఇప్పటికీ ఎక్కువ శబ్దాన్ని తక్కువ పవర్‌ను ఉపయోగించి సృష్టిస్తుంది. 1920ల్లో బాల్డ్‌విన్‌ మికా డయాఫ్రాగమ్‌ రేడియో హెడ్‌ఫోన్స్‌ బాగా ప్రాచుర్యం పొందాయి. బ్యాలెన్స్‌డ్‌ అర్మాచ్యుర్‌ ట్రాన్స్‌డూసెర్స్‌ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పున:నిర్వచించబడ్డాయి. మిలటరీలో సౌండ్‌ పవర్డ్‌ టెలిఫోన్ల ఉపయోగం కోసం వీటిని రూపొందించారు. వీటిలో కొన్ని ఎలక్ట్రో అకోస్టిక్‌ మార్పు సామర్ధ్యాన్ని వాటి స్థాయి 20 శాతం నుంచి 40 శాతం వరకు నారో బ్యాండ్‌విడ్త్‌ వాయిస్‌ సిగ్నల్స్‌ కలిగి ఉన్నాయి.

ప్రస్తుతం వీటిని కెనాల్‌ఫోన్స్‌ మరియు హియరింగ్‌ ఎయిడ్స్‌లో ఎక్కువగా వాడుతున్నారు. కారణం వీటి పరిమాణం ‌చిన్నగా ఉండటం మరియు తక్కు ఇమ్‌పెడెన్స్‌ను కలిగి ఉండటం. ఇవి సాధారణంగా తక్కువగా మరియు వినికిడి స్ప్రెక్ట్రమ్‌ (ఉదాహరణకు 20 హెట్జ్‌ కంటే తక్కువగా 16 కిలో హెట్జ్‌ కంటే కంటే ఎక్కువగా) కలిగి ఉండి, వాటి పూర్తి సామర్ధ్యాన్ని బయటకు తేవడానికి ఇతర రకాల డ్రైవర్స్‌ కంటే ఎక్కువగా సీల్‌ను కలిగి ఉంటాయి. మంచి నమూనాల‌లో అనేక రకాల అర్మాచ్యుర్‌ డ్రైవర్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఇవి పౌనఃపున్యంని వాటి స్థాయిని బట్టి పాసివ్‌ క్రాస్‌ఓవర్‌ నెట్‌వర్క్‌తో మారుస్తాయి. కొన్ని కలిసి ఉన్న అర్మచ్యూర్‌ డ్రైవర్స్‌ చిన్న కదిలే కాయిల్‌ డ్రైవర్‌ను ఉపయోగించి బాస్‌ అవుట్‌పుట్‌ను పెంచుతాయి.

ఇతర ట్రాన్‌డ్యూసెర్‌ టెక్నాలజీస్‌[మార్చు]

ట్రాన్‌డ్యూసెర్‌ టెక్నాలజీస్‌ చాలా తక్కువగా హెడ్‌ఫోన్స్‌లో హీల్‌ను కలిపి ఉపయోగిస్తారు. అవి ఎయిర్‌ మోషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (AMT) ; పీజోఎలక్ట్రిక్‌ ఫిల్మ్‌; రిబ్బన్‌ ప్లానర్‌ మ్యాగ్నెటిక్‌; మ్యాగ్నెటోస్ట్రిక్షన్‌ మరియు ప్లాస్మా-ఐయానైజేషన్‌ మొదలైనవాటిని కలిగి ఉంటాయి. మొదటి హీల్‌ AMT హెడ్‌ఫోన్‌ను ESS ల్యాబరేటరీస్‌ మార్కెటింగ్‌ చేసింది మరియు ఇవి తప్పనిసరిగా ESS‌ AMT ట్వీటర్‌ను కంపెనీ యొక్క స్పీకర్లలో పూర్తి స్థాయిలో చేస్తాయి. శతాబ్దం ఆరంభం నుంచి, కేవలం స్విట్జర్లాండ్‌లోని ప్రెసైడ్‌ మాత్రమే AMT హెడ్‌ఫోన్స్‌ను తయారు చేసింది. పీజోఎలక్ట్రిక్‌ హెడ్‌ఫోన్స్‌ను తొలుత పయనీర్‌ అభివృద్ధి చేసింది. వారి రెండు నమూనాలను‌ ఫిల్మ్‌ యొక్క ఫ్లాట్‌షీట్‌లా చేశారు. అంటే ఇవి గాలిలోకి వెళ్లే గరిష్ఠ వాల్యూమ్‌ను తగ్గించగలుగుతాయి. ప్రస్తుతం టేక్‌ టి పీజో ఎలక్ట్రిక్‌ ఫిల్మ్‌ హెడ్‌ఫోన్‌ను తయారు చేస్తుంది. ఇవి AMT ఆకారం మాదిరిగా కాకుండా, ప్రిసైడ్‌ డ్రైవర్‌ మాదిరిగా ఉండి, వాటి హెడ్‌ఫోన్స్‌లో ఉపయోగిస్తున్నారు. డయాఫ్రాగమ్‌ మీద ట్రాన్యూడర్స్‌ ఫోల్డ్‌ను రకరకాల పరిమాణాలలో తయారు చేస్తున్నారు. ఇవి అదనంగా రెండు విధాలుగా నమూనా‌ను ఇన్‌కార్పొరేట్‌ చేస్తుంది. ఇవి ఒక డెడికేటర్‌ ట్వీటర్‌ /సూపర్‌ ట్వీటర్‌ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. డయాఫ్రాగమ్‌ యొక్క ఆకారం, ట్రాన్స్‌డ్యూసర్‌ను పెద్ద ఉపరితల ప్రాంతంలో ఫిట్‌గా ఉంచడానికి సహకరిస్తుంది. తక్కువ స్పేస్‌ సరిపోతుంది. ఇది గాలిలో వాల్యూమ్‌ యొక్క మొత్తాన్ని తగ్గిస్తుంది. ట్రాన్స్‌డ్యూసెర్‌ రేడియేటింగ్‌ ప్రాంతాన్ని ప్రతిసారీ కదిలిస్తుంది.

మ్యాగ్నెటోస్ట్రిక్షన్‌ హెడ్‌ఫోన్స్‌ కొన్నిసార్లు బోనోఫోన్స్‌ లేబుల్‌తో అమ్ముతారు. ఈ హెడ్‌ఫోన్స్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా పని చేస్తాయి. హెడ్‌ వైపు వైబ్రేషన్స్‌ ఉంటాయి, శబ్దాన్ని బోన్‌ కండక్షన్‌ ద్వారా సరఫరా చేస్తాయి. ఇవి వినికిడికి సంబంధించిన నరాల పై ఎలాంటి ప్రభావం చూపకపోవటం వలన ప్రత్యేకించి చెవులు యునోబ్‌ రూపంలో ఉన్నప్పుడు ఉపయోగపడతాయి. చెవిటివారు ఉపయోగించినప్పుడు వినడానికి ఉపయోగపడతాయి. మ్యాగ్నెటోస్ట్రిక్షన్‌ హెడ్‌ఫోన్స్‌ అయినప్పలటికీ, వాటి ఫిడిలిటీ విషయంలో లిమిటేషన్స్‌ ఉంటాయి. సాధారణ హెడ్‌ఫోన్స్‌తో పోలిస్తే ఇవి సాధారణంగా చెవి పై ప్రభావం చూపుతాయి. అదనంగా, ప్లాస్మా ఐసోనేషన్‌ హెడ్‌ఫోన్‌ మార్కెట్‌లోకి 1990ల ఆరంభంలో ప్లాస్మాసోనిక్స్‌ అనే ఫ్రెంచ్‌ కంపెనీ ప్రారంభించింది. ఇక్కడ ఫంక్షనల్‌ ఉదాహరణలు ఏవీ వదల్లేదని నమ్మడం జరిగింది.

లాభాలు మరియు నష్టాలు[మార్చు]

రెండు సోని ఎమ్‌డిఆర్‌ వి 6 హెడ్‌ఫోన్స్‌; ఒకటి ట్రావెల్‌ కోసం ఫోల్డ్‌ చేయబడింది.

హెడ్‌ఫోన్స్‌ను ఒక వ్యక్తి ఇతరలకు ఇబ్బంది లేకుండా, ఆంతరంగికంగా సంగీతం వినడానికి ఉపయోగించవచ్చు. పబ్లిక్‌ గ్రందాలయాలలో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. లౌడ్‌స్పీకర్‌ కంటే ఎక్కువ ఫిడెలిటీతో సౌండ్‌ స్థాయిని అదే ఖర్చుతో ఆస్వాదించవచ్చు. వాటి సామర్ధ్యం హెడ్‌ఫోన్స్‌ ట్రీట్‌మెంట్‌ రూమ్‌ కరెక్షన్స్‌లో ప్రదర్శనకు తక్కువగా ఉంటుంది. ఎక్కువ నాణ్యత గల హెడ్‌ఫోన్స్‌ పూర్తిగా తక్కువ 20 Hz నుంచి 3 dB లోపల పౌనఃపున్యంతో స్పందిస్తాయి. ఏదేమైనా, పౌనఃపున్యం స్పందనలు సమాచారాన్ని ఏ స్థాయిలో శబ్దం పునరుత్పత్తి‌ అవుతుందని చూపలేవు. మార్కెటెడ్‌ క్లెయిమ్‌లు 'పౌనఃపున్యం రెస్పాన్స్‌ 4 Hz నుంచి 20 kHz' వరకూ సాధారణంగా ఓవర్‌స్టేట్‌మెంట్స్‌ను కలిగి ఉంటాయి. పౌనఃపున్యంలలో ప్రొడక్ట్‌ స్పందన అనేది 20 Hz‌ కంటే తక్కువగా చాలా చిన్నవిగా ఉంటాయి. [5]

హెడ్‌ఫోన్స్‌ సాధారణంగా 3D సామర్ధ్యంతో ఉన్న వీడియోగేమ్‌లలోనూ ఉపయోగపడతాయి. ఆడియో ప్రాసెసింగ్స్‌, అల్గరిథమ్స్‌ ఆటగాళ్లను ఆఫ్‌ స్క్రీన్‌ సౌండ్‌ సోర్స్‌లతో తమ పొజిషన్‌ను అంచనా వేయడానికి ఉపకరిస్తాయి. (ప్రత్యర్థి యొక్క కాళ్ల శబ్దం తెలుసుకోవడం లాంటివి)

ఆధునిక హెడ్‌ఫోన్స్‌ వాక్‌మెన్‌ విడుదలయ్యాక స్టీరియో రికార్డింగ్‌ను వినడానికి చాలా ఎక్కువగా అమ్ముడువుతున్నప్పటికీ, విస్తృతంగా వీటిని ఉపయోగిస్తున్నప్పటికీ, ఇవి స్టీరియో సౌండ్‌ను పునరుత్పత్తి‌ చేసే విషయంలో చాలా చర్చ జరుగుతోంది. స్టీరియో రికార్డింగ్స్‌ సమాంతర డెప్త్‌ ఉన్న క్యూస్‌ (స్టీరియో సెపరేషన్‌) ను ప్రతిబింబిస్తూ తమ స్థానాన్ని కలిగి ఉంటాయి. రెండు చానెళ్ల మధ్య ఉన్న శబ్దంలో ఉండే వాల్యూమ్‌ తేడాలను ఇవి తేవాలి. రెండో స్పీకర్ల నుంచి వచ్చిన శబ్దాలు మిళితం అయినప్పుడు, వాటి ఫేజ్ దిశను గుర్తించడానికి మెదడు‌ ఉపయోగించాల్సి ఉంటుంది. అనేక హెడ్‌ఫోన్స్‌లో, కుడి మరియు ఎడమ‌ చానెల్స్‌ ఒకేలాగా కలిసి ఉండవు. ఫాంటామ్‌ సెంటర్‌ యొక్క ఇల్యుషన్‌ చివరి వరకు రక్షించబడాలి. హార్డ్‌ ప్యాన్‌ ఉన్న శబ్దాలు కూడా ఒక చెవితో వినడానికే బాగుంటాయి. ఒక చెవి నుంచి ఒక చెవికి మారితే బాగుండదు. ఈ చివరి పాయింట్‌ ఒక ముఖ్యమైన అంశం. ఆరంభంలో స్టీరియో రికార్డింగ్స్‌లో ఇవి ఉండేవి కాదు. కొన్నిసార్లు వోకల్స్‌ను ఒక చానల్‌ ద్వారా మ్యూజిక్‌ను మరో వైపు నుంచి కూడా ఇచ్చేవారు.

బైనరల్‌ రికార్డింగ్స్‌ విభిన్నమైన మైక్రోఫోన్‌ టెక్నిక్‌ను ఉపయోగించి దిశ‌ను నేరుగా ఫేజ్‌గా ఎన్‌కోడ్‌ చేస్తాయి. దీని కోసం చిన్న ఆప్లింట్యూడ్‌ తేడాలో (2 కెహెచ్‌జెడ్‌కి పైన) తరచుగా డమ్మీ హెడ్‌ను ఉపయోగిస్తారు. ఇవి ఆశ్చర్యకరంగా లైఫ్‌ లాంటి స్పాటియల్‌ ఇమ్‌ప్రెషన్‌ను హెడ్‌ఫోన్స్‌ ద్వారా అందిస్తాయి. వాణిజ్యపరమైన రికార్డింగ్స్‌ ప్రతిసారీ స్టీరియో రికార్డింగ్స్‌ను ఉపయోగిస్తారు. కాబట్టి చారిత్రాత్మకంగా లౌడ్‌ స్పీకర్లు వినడం చాలా ప్రసిద్ధి చెందింది. హెడ్‌ఫోన్స్‌తో పోలిస్తే ఇది చాలా పెరిగింది. హెడ్‌ఫోన్స్‌లో స్టీరియో సౌండ్‌ యొక్క స్పేషియల్‌ ప్రభావాన్ని మార్చడం సాధ్యమవుతుంది. దీనివల్ల మెరుగైన ప్రెజెంటేషన్‌తో స్పీకర్‌ పునరుత్పత్తి జరిగి, పౌనఃపున్యం ఆధారిత క్రాస్‌ ఫీడ్‌ చానెల్స్‌ మధ్య ఏర్పడుతుంది లేదా మెరుగైన స్టిల్‌ బ్లూమ్‌లీన్‌ షఫ్లర్‌ (కస్టమ్‌ EQ తో అల్ప పౌనఃపున్యం కంటెంట్‌లోని తేడాను స్టీరియో సిగ్నల్‌ సమాచారాన్ని ఇవ్వడానికి వాడతారు). క్రాస్‌ ఫీడ్‌ అనేది చికాకుతత్వాన్ని తగ్గించడంతో పాటు, కొంతమంది శ్రోతలు హెడ్‌ఫోన్స్‌ స్టీరియోలో హార్డ్‌ ప్యాన్‌డ్‌ను గమనిస్తారు. కృత్రిమ పిన్నెతో రికార్డింగ్‌ సమయంలో డమ్మీ హెడ్‌ను ఉపయోగించడం వల్ల, వినేటప్పుడు కలిగే అనుభవం ప్రదర్శన డమ్మీ హెడ్‌ స్థానంలోనే ఎర్పడుతుంది. ఆప్టిమల్‌ సౌండ్‌ అనేది డమ్మీ హెడ్‌ మ్యాచెస్‌ ద్వారా శ్రోత తలకు చేరుతుంది. కాబట్టి పిన్నెఈ అనేది చాలా గొప్ప పరిమాణంలో మరియు ఆకారంలో ఉంటుంది.

హెడ్‌సెట్స్‌ వల్ల ఎర్గోనామిక్‌ లాభాలు కూడా సంప్రదాయ టెలిఫోన్స్‌ హెడ్‌సెట్స్‌లో ఉంటాయి. ఇవి కాల్‌ సెంటర్‌ ఏజెంట్లుకు బాగా ఉపకరిస్తాయి. వారి తలను క్రెడెల్‌ హ్యాండ్‌సెట్‌లో మాదిరిగా కష్టపెట్టనవసరం లేకుండా మంచి పరిస్థితుల్లో పని చేసుకోవడానికి వీలుంటుంది.[6]

కాలక్రమంలో, హెడ్‌ఫోన్‌ కేబుల్స్‌ విఫలమయ్యాయి. ఆ సమయంలో వీటికి ప్రత్యామ్నాయం కనిపెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడింది. కార్డ్‌ మీద జంక్షన్‌ పాయింట్లలో కాపర్‌ వైరింగ్‌ బ్రేక్‌డౌన్‌ కావడం దీనికి ప్రధాన కారణం. (TRS‌ జాక్‌ లేదా హెడ్‌ఫోన్‌ కనెక్షన్‌ పాయింట్‌ దగ్గర). ఈ సైట్స్‌ గొప్ప ఒత్తిడిని తగ్గించే మోషన్‌ను కార్డ్‌ మీద కలిగి ఉండి, వీటని ఒత్తిడి తగ్గించే విధంగా క్లిష్టంగా అమర్చారు.

ప్రమాదాలు మరియు వాల్యూమ్‌ పరిష్కారాలు‌[మార్చు]

హెడ్‌ఫోన్స్‌ను అవసరమైన దానికంటే ఎక్కువ శబ్దంతో వినడం వల్ల తాత్కాలిక లేదా శాశ్వతంగా వినికిడి సమస్యలు రావచ్చు. లేదా చెవుడు రావచ్చు. దీనికి కారణమయ్యే ప్రభావాన్ని మస్కింగ్‌ అని పిలుస్తారు. హెడ్‌ఫోన్స్‌ వాల్యూమ్‌ అనేది నేపథ్య శబ్దంతో పోటీ పడుతూ ఉంటాయి. ప్రత్యేకించి అధికంగా శబ్దం ఉండే ప్రదేశాలు అంటే, సబ్‌వే స్టేషన్లు, ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, పెద్ద సంఖ్యలో జనాలు ఉన్న ప్రదేశాలలో ఈ పోటీ ఉంటుంది. ఇది సాధారణ నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ అధిక స్థాయిలో వాల్యూమ్స్‌ను అనుసంధానం‌ చేయాలి.[ఉల్లేఖన అవసరం] అధిక శబ్దంతో ఎక్కువగా వినేకొద్దీ ఇవి హాని కలిగిస్తాయి.[7][8] ఏదేమైనా, ఒక వినికిడి‌ నిపుణుడు కనుగొన్న దాని ప్రకారం కేవలం 5 శాతం కంటే తక్కువమంది వినియోగదారులు మాత్రమే అధిక వాల్యూమ్‌ స్థాయులతో విని, వినికిడి లోపాన్ని పొందుతున్నారు.[9] కొన్ని తయారీ సంస్థలు పోర్టబుల్‌ మ్యూజిక్‌ పరికరాలలో భద్రత సర్క్యూట్‌ను లిమిటెడ్‌ అవుట్‌పుట్‌ వాల్యూమ్‌ లేదా వినియోగదారుడికి ఎక్కడ ప్రమాదకర స్థితి ఉంటుందో చూసుకుని తయారు చేస్తున్నాయి. కానీ కొనే ప్రజలు అనేక మంది దీనిని తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పెద్ద వాల్యూమ్‌ను కోరుకుంటున్నారు. 1983లో కోస్‌, సేఫ్‌లైట్‌ లైన్‌ అనే క్యాసెట్‌ ప్లేయర్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో ఒక వార్నింగ్‌ లైట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ లైన్‌ పై పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్ల రెండేళ్లలో ఇది విరమించుకోవడం జరిగింది.

ఫ్రాన్స్‌ ప్రభుత్వం తమ దేశంలో అమ్మే మ్యూజిక్‌ ప్లేయర్ల పై ఒక పరిధిని నిర్ణయించింది.[10][10] ఇవి కచ్చితంగా 100dBAను మించి శబ్దాన్ని ఉత్పత్తి చేయకూడదు. (వినడం వల్ల ప్రమాదాలు 80 dB దాటడం వల్ల ఏర్పడతాయి మరియు నొప్పి ఎక్కువగా వచ్చి వినికిడి లోపం ఏర్పడటం అనేది 130 dB దాటితే వస్తుంది). అనేక మంది వినియోగదారులు[ఎవరు?] దీనిని వ్యతిరేకించారు. దీనివల్ల తాము వినదలచుకున్నది దొరకదని వారి వాదన, మరియు మూడో పార్టీ అభిప్రాయాలు వాల్యూమ్‌ పరిధిని రివర్స్‌ చేసి ఇలాంటి పరికరాలను తయారు చేశాయి. ఇప్పటికీ, ఇతర వినియోగదారులు ప్రభుత్వం యొక్క ఆరోగ్యకరమైన ఈ నిర్ణయాలన్ని స్వాగతిస్తున్నారు.

కెనాల్‌ ఫోన్స్‌ మరియు ఇన్‌ ఇయర్‌ మానిటర్స్‌ అనేవి తక్కువ ఇష్టపడేవిగా నిర్వచించారు. ఇవి శబ్దం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లోనూ చెడును చేయవు. ఎక్కువగా బయటి శబ్దం బయటే నిరోధించబడుతుంది. ఇన్‌ ఇయర్‌ సీల్‌ వల్ల శబ్దం ఐసోలేషన్‌ జరుగుతుంది. ఇది వినియోగదారులకు తక్కువ స్థాయిలో సంగీతం వినేందుకు ఉపకరిస్తుంది.[ఉల్లేఖన అవసరం] ఏదేమైనా వినియోగదారుడు ప్రమాదకరమైన ఎక్కువ స్థాయిలోనే సంగీతం వినడానికి ఇష్టపడుతున్నాడు.

ఇతర ప్రమాదాలు బాహ్య శబ్దాల గురించి అవగాహనను తగ్గించడం వల్ల ఏర్పడుతున్నాయి. కొన్ని పరిధుల్లో హెడ్‌ఫోన్స్‌ యొక్క ఉపయోగాన్ని వాహనాలు నడిపే సమయంలో నిషేధించారు. సాధారణంగా ఒక చెవికే ఇయర్‌ఫోన్‌ ఉండాలని కొన్ని ఆంక్షలు ఉన్నాయి. బయటి శబ్దం యొక్క పూర్తి ఐసోలేషన్‌ ప్రమాదకరమైనది. దీనివల్ల వినియోగదారుడు ఒక కార్‌ హారన్‌ను లేదా ట్రాఫిక్‌లో ఎదురయ్యే అవాంతరాలను గమనించలేకపోవచ్చు. పరిస్థితుల పై అవగాహనను కోల్పోవడం వల్ల దొంగతనాలు కూడా జరగొచ్చు. ముఖ్యంగా రద్దీగా ఉండే వాతావరణాల్లో మరో వ్యక్తికి తగులుతున్న విషయం కూడా గమనించకపోవచ్చు; ఉదాహరణకు సబ్‌వే స్టేషన్లు.

మోటార్‌ సైకిల్‌ మరియు ఇతర పవర్‌ స్పోర్ట్‌ రైడర్స్‌ హెడ్‌ఫోన్స్‌ను ఉపయోగించడం వల్ల లాభం పొందగలుగుతారు. దీనికి వారికి న్యాయపరమైన అనుమతి ఉంది. అధికంగా ఉండే రోడ్‌ను అధిగమించడానికి, ఇంజిన్‌ మరియు గాలి శబ్దాన్ని తగ్గించుకోవడం కోసం సంగీతం వినడంతో పాటు ఇంటర్‌కమ్‌ స్పీచ్‌ను వింటూ ఉంటారు. ఇక్కడ చెవి సాధారణంగా బిలియన్‌లో ఒక వంతు శబ్ద ఒత్తిడి స్థాయిని గుర్తించగలుగుతుంది. కాబట్టి ఇది చాలా సున్నిమతమైనదిగా చెప్పాలి.[11] ఎక్కువ శబ్దం ఒత్తిడి స్థాయి వల్ల, చెలిలోని కండరాలు గట్టిగా అయిపోయి టిమ్‌పానిక్‌ మెమ్‌బ్రేన్‌ పై ప్రభావం చూపుతాయి. ఇది ఒసిక్లెస్‌ యొక్క కూర్పులో చిన్న మార్పులను తీసుకొస్తుంది. దీనివల్ల లోపల చెవి విండోలో శక్తి యొక్క బదిలీకి కారణమవుతుంది.[12] ఇయర్‌ప్లగ్స్‌ శబ్దాన్ని ఆడియోటరీ కెనాల్‌లోకి వెళ్లకుండా రక్షిత మెకానిజమ్‌ను ఏర్పాటు చేశారు. పూర్తి సెన్సిటివిటీ కూడా మెయిన్‌టైన్‌ చేయాలి. సాధారణ సెన్సిటివిటీతో ఒక వినియోగదారుడు చక్కగా వినాలంటే ఇయర్‌ ప్లగ్స్‌ ద్వారా హెల్మెట్‌ స్పీకర్స్‌ ఏర్పాటు చేసుకోవాలి.[ఉల్లేఖన అవసరం] ఈ టెక్నిక్‌ స్పీచ్‌ను వినడానికి చక్కగా ఉపకరిస్తుంది. సంగీతంతో పాటు ఇతర బయట శబ్దాలను సాధారణ స్థాయిలో వింటూ, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఉపకరిస్తుంది.

హెడ్‌ఫోన్స్‌ ద్వారా సంగీతం వినడం కొంత మేరకు ప్రమాదకరం. రక్తం చెవుల నుంచి లింబ్స్‌లోకి వెళ్లే సమయంలో లోపల చెవిలో పెద్ద శబ్దాలను తట్టుకోలేని ప్రమాదం జరుగుతుంది.[13] ఒక ఫిన్నిష్‌ స్టడీ[14] రికమెండ్‌ చేసిన దాని ప్రకారం వ్యాయామం చేసేవారు‌ వారి హెడ్‌ఫోన్‌ వాల్యూమ్‌ను సాధారణ స్థాయితో పోలిస్తే సగానికి పెట్టుకోవాలి మరియు వాటిని కేవలం అరగంట సేపు మాత్రమే వినియోగించాలి.[13]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • మెత్తటి దిండులతో ప్యాకేజీ చేయుట
 • బోన్‌ కండక్షన్‌
 • డిజిటల్ ఆడియో ప్లేయర్‌లు
 • హెడ్‌ఫోన్‌ యాంపిల్‌ఫయర్‌
 • ఇన్‌ ఇయర్‌ మానిటర్‌
 • నాయిస్‌ క్యాన్సిలింగ్‌ హెడ్‌ఫోన్‌
 • టిఆర్ఎస్ కనెక్టర్
 • ఇయర్‌ ప్యాడ్‌

సూచనలు[మార్చు]

 1. [2]
 2. యునైటెడ్‌ స్టేట్స్‌ నావికాదళంలో ఆరంభ రేడియో పరిశ్రమ
 3. ఉటా హిస్టరీ టు గో. రూయిన్‌ ఫాలోడ్‌ రిచెస్‌ ఫర్‌ ఎ ఉత్‌ జీనియస్‌ (విల్‌ బేజ్‌లీ ఫర్‌ద సాల్ట్‌ లేక్‌ ట్రిబ్యూన్‌, జులై 8, 2001)
 4. ఇయర్‌ అండ్‌ హియరింగ్‌ - అబ్‌స్ట్రాక్ట్‌: వాల్యూమ్‌ 25(6) డిసెంబరు 2004 పి 513-527 అవుట్‌పుట్‌ లెవల్స్‌ ఆఫ్‌ కమర్షియల్లీ ఎవైలబుల్‌ పోర్టబుల్‌ కాంపాక్ట్‌ డిస్క్‌ ప్లేయర్స్‌ మరియు పొటెన్షియల్‌ రిస్క్‌ టు హియరింగ్‌.
 5. Steve Appleford (26 September 2004). "The Past, the Present & the Future". Los Angeles CityBeat. మూలం నుండి 26 September 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 11 May 2007. Critics have called The Good, the Bad & the Queen (Virgin) a “headphones record,” which is one way of pointing to the layers of sound and subtlety within its grooves. Cite news requires |newspaper= (help)
 6. యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌.ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌. కంప్యూటర్‌ వర్క్‌ స్టేషన్‌. చెక్‌లిస్టు‌. ఫిబ్రవరి 18, 2009న తిరిగి పొందబడింది.
 7. అషాఆర్గ్‌
 8. ఎన్‌ఐహెచ్‌. గవ్‌
 9. ఆడియాలజీఆన్‌లైన్‌.కామ్‌
 10. 10.0 10.1 యూరోపా. ఇయు. కన్సూమర్స్‌: ఇయు యాక్ట్స్‌ టు లిమిట్‌ హెల్త్‌ రిస్క్స్‌ ఫ్రమ్‌ ఎక్స్‌పోజర్‌ టు నాయిస్‌ ఫ్రమ్‌ పర్సనల్‌ మ్యూజిక్‌ ప్లేయర్స్‌. ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "imposed" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 11. ప్రామాణికtచెవిలో వినికిడి సామర్ధ్యం at 1000 Hz మానవ చెవిలో 2 x 10-5 Pa (Marsh, Andrew (1999). "Human Ear and Hearing". Online Course on Acoustics. The School of Architecture and Fine Arts, The University of Western Australia. Retrieved 23 August 2010.); ప్రామాణిక అట్మాస్‌ఫెరిక్‌ ప్రెసర్‌ is 101,325 Pa. 2 x 10-5 / 100,000 = 0.2 x 10-9, బిలినోత్‌ కంటే తక్కువ నిష్పత్తి.
 12. జిఎస్‌యు. ఇడియు
 13. 13.0 13.1 హెడ్‌వైజ్‌.కామ్ హెడ్‌ఫోన్స్‌తో వినేటప్పుడు హియరింగ్‌ డ్యామేజ్‌ను అరికట్టడం.
 14. ఎయిరో, ఇర్కో; జె.పెక్కరినెన్‌; పి. ఒలికినుయోరా. ఇయర్‌ఫోన్స్‌తో సంగీతం వినడం: శబ్దం ఎక్స్‌పోజర్‌ను ఎసెస్‌ చేయడం అక్యుస్టికా-యాక్టా అక్యుస్టికా, పిపి. 82, 885-894 (1996)

బాహ్య లింకులు[మార్చు]

హెడ్‌ఫోన్‌ రిసోర్సెస్‌