హెరాల్డ్ లాయిడ్
హెరాల్డ్ లాయిడ్ | |
---|---|
జననం | హెరాల్డ్ క్లేటన్ లాయడ్ 1893 ఏప్రిల్ 20 బుచర్డ్, నెబ్రాస్కా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు |
మరణం | 1971 మార్చి 8 బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | (వయసు 77)
విశ్రాంతి ప్రదేశం | ఫారెస్ట్ లాన్ మెమోరియల్ పార్క్ |
వృత్తి |
|
క్రియాశీలక సంవత్సరాలు | 1913–1963 |
భార్య / భర్త | మిల్డ్రెడ్ డేవిస్
(m. 1923; died 1969) |
పిల్లలు | హెరాల్డ్ లాయిడ్ జూనియర్ సహా 3 |
హెరాల్డ్ క్లేటన్ లాయిడ్, సీనియర్ (ఏప్రిల్ 20, 1893– మార్చి 8, 1971) (అమెరికన్ ఉచ్చారణ ప్రకారం లాయ్‌డ్) ఒక అమెరికన్ నటుడు, హాస్యనటుడు, స్టంట్ పెర్ఫార్మర్. ఇతను అనేక అమెరికన్ నిశ్శబ్ద హాస్యచిత్రాల్లో నటించాడు.[1]
లాయిడ్ మూకీ చలనచిత్ర యుగంలో లాయిడ్ అత్యంత ప్రభావవంతమైన హాస్యనటుడు. ఈ విషయంలో బస్టర్ కీటన్, చార్లీ చాప్లిన్లకు ఇతను సమవుజ్జీ.[2] 1914 నుంచి 1947 మధ్యకాలంలో దాదాపు 200 పైచిలుకు హాస్య చిత్రాలు నిర్మించాడు. వీటిలో మూకీలతో పాటు టాకీలు కూడా ఉన్నాయి. అతని కృషికి, ప్రాధాన్యతకు గుర్తింపుగా ఆస్కార్ గౌరవ పురస్కారం (1953),[3] హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో అతని పేరిట ఒక తారను ఏర్పాటుచేయడం[4] వంటి గౌరవాలు దక్కాయి.
లాయిడ్ బాల్యం అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో గడవగా తల్లిదండ్రులు విడాకుల వల్ల టీనేజీలోకి ప్రవేశిస్తూనే తండ్రితో కలసి కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోకు వచ్చేశాడు.[5][6] అక్కడే అతనికి రంగస్థలంపై ఆసక్తి కలిగింది.[7]
1913 నుంచి ప్రయత్నాలు ప్రారంభించిన లాయిడ్ కొద్ది సంవత్సరాల పాటు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు.[8][9] చార్లీచాప్లిన్ స్ఫూర్తితో రూపొందించిన తన "లోన్‌సమ్ ల్యూక్" పాత్ర కొద్దిమేరకు విజయవంతం అయింది. అయితే, ఆ తర్వాత రూపొందించిన "గ్లాస్" లేదా "గ్లాసెస్" పాత్ర అతని కెరీర్‌ని మలుపుతిప్పింది.[10]"గ్లాసెస్ పాత్ర" ఉత్సాహవంతుడైన, అనుకున్న పనిని ఎలాగైనా సాధించే గో-గెటర్ తరహా పాత్ర. ఇది 1920ల నాటి అమెరికన్ సమాజం తాలూకు యుగలక్షణాన్ని ప్రతిబింబించే పాత్ర.[11][12][13]
అతని సినిమాల్లో తరచుగా ఛేజ్‌లు, సాహసోపేతమైన ఫీట్లతో కూడిన థ్రిల్ కలిగించే సీక్వెన్సులు ఉండేవి. వీటన్నిటిలోకీ సేఫ్టీలాస్ట్ సినిమాలో వీధి గడియారం ముల్లు పట్టుకుని వేలాడున్న సన్నివేశం హాలీవుడ్ సినిమా చరిత్రలో ఐకానిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది.[14]
రోచ్ స్టూడియో కోసం 1919 ఆగస్టులో అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నప్పుడు అతనికి ప్రమాదం జరిగింది. నిజమైన బాంబును సెట్ ప్రాపర్టీ అనుకుని సిగరెట్‌తో వెలిగించడం వల్ల జరిగిన ప్రమాదం వల్ల అతని కుడిచేతి బొటనవేలు, చూపుడువేలు కోల్పోయాడు.[15] తర్వాతి సినిమాల్లో చేతికి ఒక ప్రత్యేకమైన తొడుగు ఉపయోగించి తనకు వేళ్ళు లేవన్న సంగతి తెలియకుండా కవర్ చేసేవాడు.
హెరాల్డ్ లాయిడ్ తన సహనటి మిల్డ్రేడ్ డేవిస్‌ని 1923లో పెళ్ళిచేసుకున్నాడు.[16] ముగ్గురు పిల్లలు, వీరిలో హెరాల్డ్ క్లేటన్ లాయిడ్ జూనియర్ సినిమాల్లో నటించాడు.[17]
77 ఏళ్ళ వయసులో 1971 మార్చి 8న లాయిడ్ ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కారణంగా మరణించాడు.[18]
మూలాలు
[మార్చు]- ↑ Obituary Variety, March 10, 1971, page 55.
- ↑ Chad (2019-10-25). "Harold Lloyd". Hollywood Walk of Fame (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
- ↑ "The 25th Academy Awards (1953) Nominees and Winners". Oscars.org (Academy of Motion Picture Arts and Sciences). Archived from the original on July 6, 2011. Retrieved 2011-08-20.
- ↑ "Harold Lloyd | Hollywood Walk of Fame". www.walkoffame.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved June 27, 2017.
- ↑ Lloyd, Annette D'Agostino; D'Agostino, Annette M. (2004). The Harold Lloyd Encyclopedia (in ఇంగ్లీష్). McFarland. p. 190. ISBN 978-0-7864-1514-4.
- ↑ Wishart, David J. (January 1, 2004). Encyclopedia of the Great Plains (in ఇంగ్లీష్). U of Nebraska Press. p. 272. ISBN 978-0-8032-4787-1.
- ↑ Wynn, Neil A. (July 16, 2009). The A to Z from the Great War to the Great Depression (in ఇంగ్లీష్). Scarecrow Press. p. 174. ISBN 978-0-8108-6330-9.
- ↑ Albert, Lisa Rondinelli (2008). So You Want to Be a Film Or TV Actor? (in ఇంగ్లీష్). Enslow Publishers, Inc. p. 10. ISBN 978-0-7660-2741-1.
- ↑ Harold Lloyd with Wesley W. Stout, An American Comedy, Longmans, Green and Co., 1928; reprinted by Dover Publications, 1971, p. 44.
- ↑ "Harold Lloyd biography". haroldlloyd.com. Archived from the original on April 28, 2019. Retrieved November 12, 2013.
- ↑ Austerlitz, Saul (2010). Another Fine Mess: A History of American Film Comedy. Chicago, Illinois: Chicago Review Press. p. 28. ISBN 978-1569767634.
- ↑ D'Agostino Lloyd, Annette. "Why Harold Lloyd Is Important". haroldlloyd.com. Archived from the original on July 1, 2015. Retrieved November 12, 2013.
- ↑ Halley, Catherine (2019-09-12). "Harold Lloyd's Death-Defying Comedy". JSTOR Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-16.
- ↑ Slide, Anthony (September 27, 2002). Silent Players: A Biographical and Autobiographical Study of 100 Silent Film Actors and Actresses. Lexington, Kentucky: University Press of Kentucky. p. 221. ISBN 978-0813122496.
- ↑ An American Comedy; Lloyd and Stout; 1928; page 129
- ↑ Los Angeles, California, County Marriages 1850-1952
- ↑ "Harold Lloyd Jr. Dies; Actor, Son of Comedy Star (Published 1971)". The New York Times. 10 June 1971. Retrieved 20 December 2020. (NYT Paid Archive)
- ↑ "Died". Time. March 22, 1971. Archived from the original on December 21, 2008. Retrieved June 8, 2008.