హెర్బాలైఫ్‌

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Herbalife International
రకం Public (మూస:NYSE)
స్థాపితం Los Angeles, CA (1980)
ప్రధానకార్యాలయం Los Angeles, CA
కీలక వ్యక్తులు

Michael O. Johnson, Chief Executive Officer
Brett R. Chapman, General Counsel and Corporate Secretary
Des Walsh, President
Richard P. Goudis, Chief Operating Officer
John DeSimone, Chief Financial Officer

Y. Steve Henig, Ph.D., Chief Scientific Officer
పరిశ్రమ Nutrition & Skin Care products
ఉత్పత్తులు Weight management, nutritional supplements, personal care
ఆదాయం Decrease US$ 2.324 billion (2009)[1]
నిర్వహణ రాబడి US$ 296.031 million (2009)[1]
మొత్తం ఆదాయము US$ 203.346 million (2009)[1]
ఆస్తులు Increase US$ 1.146 billion (2009)[1]
Total equity Increase US$ 359.311 million (2009)[1]
ఉద్యోగులు 4,330 (2010)[2]
వెబ్‌సైటు www.herbalife.com

హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ NYSE: HLF అనేది పౌష్టికాహారం, బరువు తగ్గింపు మరియు చర్మ సంరక్షణకు సంబంధించిన విశ్వవ్యాప్త సంస్థ. ఈ సంస్థని 1980లో స్థాపించారు మరియు దీనిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 4వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2009లో హెర్బాలైఫ్‌ నికర అమ్మకాలు 2.3 బిలియన్‌ US డాలర్లను చేరుకున్నాయి. ఈ సంస్థ కార్పొరేట్‌ ప్రధాన కార్యాలయం USAలోని లాస్‌ఏంజిలెస్‌లో ఉంది.[3]

ఈ సంస్థ తన ఉత్పత్తులను 74 దేశాలలో పంపిణీ చేస్తుంది. దీని కోసం సుమారు 2 మిలియన్ల పంపిణీదారులతో నెటవర్క్‌ను కలిగి ఉంది. వీరిలో కొందరు ఉత్పత్తుల మీద లాభాలు గడించడంతో పాటు అదనంగా కమిషన్‌ను కూడా మల్లీలెవల్‌ మార్కెటింగ్‌ (MLM) పరిహారం ఏర్పాటు వల్ల పొందుతున్నారు.[4]

చరిత్ర[మార్చు]

1980 ఫిబ్రవరిలో మార్క్‌ హగ్స్‌ హెర్బాలైఫ్‌ బరువు తగ్గింపు ఉత్పత్తిని తన కారు ట్రంక్‌లో పెట్టి అమ్మడం ప్రారంభించారు. హగ్స్‌ తరచుగా చెప్పేదాని ప్రకారం, ఆయన తల్లి బరువు తగ్గించుకునేందుకు చేసిన ప్రయత్నాలను చూసిన తర్వాత బరువు తగ్గించే ఉత్పత్తిని తను తయారు చేశాడు. ఆయన తల్లి తినే విషయంలో సరిగా లేక, బరవు తగ్గింపు కొరకు అనారోగ్య విధానాలు పాటించి మరణించారు. బహుళస్థాయి‌ మార్కెటింగ్‌ పంపిణీ మరియు ఎదుగుదల పద్ధతిని ఎంచుకున్నాక సంస్థ, అనేక వేల మంది పంపిణీదారులను ఆకర్షించింది. వీరు ఉత్పత్తులను ఇళ్లకు వెళ్లి అమ్మేవారు. కేవలం నోటి ద్వారా ప్రచారము జరిగేది. తర్వాత కాలంలో చిల్లర‌ వాణిజ్య దుకాణాలలో ఈ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభమయింది.

ఈ సంస్థ యొక్క నినాదం ఇప్పుడే బరువు తగ్గించుకోండి. ఎలాగో నన్ను అడగండి. ఈ మార్కెటింగ్‌ ఆలోచనను పంపిణీదారులు పెద్ద బ్యాడ్జ్‌లు, ఫ్లయర్‌లు, పోస్టర్‌ల ద్వారా తీసుకెళ్లారు. ఆరంభ పద్ధతులో పంపిణీదారులను సెమినార్లు నిర్వహించడం ద్వారా తీసుకునేవారు. ఇందులో పంపిణీదారులకు ఆరోగ్యం గురించి బరువు తగ్గించుకునే విధానం గురించి హెర్బాలైఫ్‌ ఉత్పత్తులను చూపించి, హగ్స్‌ వారికికీ నోట్స్‌ ఇచ్చేవారు. 1982 నాటికి హెర్బాలైఫ్‌ 2 మిలియన్ల US‌డాలర్లకు అమ్మకాలను పెంచుకుని కెనడాకు విస్తరించింది.

1985లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ సంస్థ మీద దావా వేశారు. సంస్థ దాని ఉత్పత్తుల గురించి తప్పు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాజ్యాన్ని ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూనే 8.5 లక్షల US డాలర్లకు సెటిల్‌ చేసుకున్నారు.[5] 1986లో హెర్బాలైఫ్‌ నాస్‌డాక్‌లో పబ్లిక్‌ ట్రేడింగ్‌ సంస్థగా మారింది. 1996లో హెర్బాలైఫ్‌ బిలియన్‌ డాలర్ల వార్షిక అమ్మకాలను చేరుకుంది.

మార్క్‌ హగ్స్‌ 44 ఏళ్ల వయసులో మరణించారు.[6] లాంస్‌ ఏంజిలెస్‌ కౌంటీ కార్నర్‌ అటాప్సీ పేర్కొన్న దాని ప్రకారం, ఆయన ప్రమాదవశాత్తు అధిక మోతాదు‌ తీసుకోవడం వల్ల మరణించారు. ఆయన మరణం తర్వాత కూడా సంస్థ ఎదుగుదల ఆగలేదు. 2002లో దీనిని విట్నీ అండ్‌ కో LAల్‌సి మరియు గోల్డెన్‌ గేట్‌ క్యాపిటల్‌ అనే సంస్థలు కలిసి 685 మిలియన్‌ US డాలర్లకు సొంతం చేసుకున్నాయి. దీనిని వీరు ప్రైవేట్‌ సంస్థగా చేశారు.[7]

2003 ఏప్రిల్‌లో, మైకెల్‌ ఓ. జాన్సన్‌ అనే వ్యక్తి హెర్బాలైఫ్‌ సిఈఓగా చేరారు. దీనికి ముందు ఆయన 17 సంవత్సరాల పాటు వాల్ట్‌డిస్నీ సంస్థలో పనిచేశారు. ఇక్కడకు వచ్చే ముందు ఆయన వాల్ట్‌ డిస్నీ ఇంటర్నేషనల్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.[5] 2004 డిసెంబరు 16న, సంస్థ తొలిసారి న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌లో 1.45లక్షల కామన్‌ షేర్లను, వాటా ఒక్కింటికి 14 డాలర్లు చొప్పున అందుబాటులోకి తెచ్చింది. 2004లో వార్షిక అమ్మకాలు 1.3 బిలియన్ల US డాలర్లుగా నమోదయ్యాయి. 2005 ఏప్రిల్‌లో సంస్థ తన 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 35వేల మంది పాల్గన్నారు. ప్రపంచవాప్తంగా ఉన్న హెర్బాలైఫ్‌ స్వతంత్ర పంపిణీదారులు దీనికి హాజరయ్యారు. 2005 ఆగస్టులో డాక్లర్‌ స్టీవ్‌ హెనిగ్‌ సంస్థ ముఖ్య శాస్త్రీయ పరిశోధన అధికారిగా చేరారు. ఉత్పత్తుల పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఈయన పనిచేశారు. 2008లో సిఓఓ గ్రెగ్‌ ప్రోబర్‌ ప్రెసిడెంట్‌గా రాజీనామా చేశారు. తన రెజ్యూమ్‌లో పేర్కొన్న అవసరమైన ఎంబిఎ డిగ్రీని ఆయన పూర్తి చేయకపోవడమే దీనికి కారణం.[8]

వ్యాపారం[మార్చు]

హెర్బాలైఫ్‌ బహుళస్థాయి‌ మార్కెటింగ్‌ (కొన్నిసార్లు MLM‌ లేదా నెట్‌వర్క్‌ మార్కెటింగ్‌ అంటారు) సంస్థ. దీనికి అదనంగా ఉత్పత్తుల అమ్మకాల మీద లాభాలు కూడా ఉంటాయి. హెర్బాలైఫ్‌ పంపిణీదారులు తమ కింద స్థాయిలో ఉన్న పంపిణీదారులకు అమ్మిన ఉత్పత్తులపై కమిషన్‌ పొందుతారు. MLM యొక్క మద్దతుదారులు ఇది సరైన పరిహార పద్ధతి అని భావించారు. MLM పద్ధతి పిరమిడ్‌ పద్ధతికి సమాంతరంగా ఉందనే విమర్శలు కూడా వచ్చాయి.[9] వ్యక్తిగత పంపిణీదారులకు దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదని కూడా విమర్శలు వచ్చాయి. అయితే హెర్బాలైఫ్‌ ఇలాంటి ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చింది.[10] హెర్బాలైఫ్‌ తన ఉత్పత్తులు ఉన్న అనేక దేశాలలో డైరెక్ట్‌ సెల్లింగ్‌ అసోసియేషన్‌లలో సభ్యురాలు.

యు.ఎస్‌.సెక్యూరిటీ అండ్‌ ఎక్చేంజ్‌ కమిషన్‌ (SEC) దగ్గర దరఖాస్తు చేసుకున్న సమయంలో సంస్థ యాజమాన్యం గతంలో సరిగా వ్యాపార వ్యవహారాలు చేయనందుకు కలిగిన సమస్యలను కూడా పేర్కొంది. వాటి వల్ల దీర్ఘకాలంలో కలుగుతున్న సమస్యలను విశిదీకరించింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాల్సిన అవసరాలను పేర్కొన్నారు. సంస్థ యాజమాన్యం, పంపిణీదారుల సంఖ్య, కొనసాగింపును కీలక అంశంగా పరిగణించి, ఆర్థిక నివేదికల్లో పేర్కొంది. ప్రతి ఏడాది జనవరిలో, అమ్మకాల నాయకులు తిరిగి అర్హత సాధించాల్సిన అవసరం ఉంది. గత 12 నెలల కాలంలో ఎవరైతే అమ్మకాల నాయకునిగా ఉండాల్సిన అర్హతను చేరుకోలేదో అలాంటి వారిని ఆ పదవి నుంచి తొలగిస్తారు. తాజాగా గత 12 నెలల కాలంలో జనవరి 2010 నాటికి నాయకుల అర్హత విషయంలో 2008తో పోలిస్తే 40.3 శాతం పెరుగుదల కనిపించింది.[11] లాస్‌ ఏంజెలిస్‌ కౌంటీలో అత్యధిక లాభాలు సాధిస్తున్న సంస్థలలో హెర్బాలైఫ్‌ ఒకటిగా నిలిచింది.[12]

హెర్బాలైఫ్‌ కుటుంబ ఫౌండేషన్‌[మార్చు]

1994లో సంస్థ వ్యవస్థాపకులు మార్క్‌ హగ్స్‌ హెర్బాలైఫ్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ను, ఒక 501 (సి) (3) లాభాపేక్ష లేని కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఆపదలో ఉన్న సరైన పౌష్టికాహారం లేని పిల్లలకు సహాయం చేసే సంస్థలకు ఈ సంస్థ సహాయం చేస్తుంది. అదనంగా, ఈ ఫౌండేషన్‌ ప్రకృతి విపత్తుల సమయంలోనూ సహాయం అందజేస్తోంది.[13]

2005లో HFF‌ కాసా హెర్బాలైఫ్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. పిల్లలకు సేవల చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో కలిసి, పౌష్టికాహారాన్ని అదించడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అపాయం‌ ఎక్కువగా ఉన్న పిల్లలకు సహాయం చేస్తారు. కాసా హెర్బాలైఫ్‌ 1998లో బ్రెజిల్‌లో ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికీ దీనికి సహాయం చేస్తోంది. ఆరు ఖండాల్లో 50కి పైగా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

HFF‌కు హెర్బాలైఫ్‌ మద్దతు ఇస్తోంది. దీని స్వతంత్ర పంపిణీదారులు, ఉద్యోగులు మరియు స్నేహితులు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. ప్రారంభంలో ఇచ్చిన గ్రాంట్‌తో పాటు, స్థానికంగా ఉన్న స్వతంత్ర పంపిణీదారులు మరియు ఉద్యోగులు కూడా ఇందులో నేరుగా పాల్గంటున్నారు. వీరందరూ స్థానిక కాసా హెర్బాలైఫ్‌ కార్యక్రమం ఆర్థిక విరాళాల ద్వారా, వాలంటీర్ల కార్యక్రమాల ద్వారా పాల్గంటున్నారు.

క్రీడలకు స్పాన్సర్‌షిప్‌[మార్చు]

హెర్బాలైఫ్‌ సంస్థ అనేక మంది అథ్లెట్లను, క్రీడాజట్లను, క్రీడాంశాలను ప్రపంచ వ్యాప్తంగా స్పాన్సర్‌ చేస్తోంది:

  • సెర్గీ కొన్యుషోక్‌ (స్ట్రాంగ్‌మన్‌ పోటీలలో ఏడు గిన్నిస్‌ రికార్డులను అధిగమించారు)
  • LA ట్రయథ్లాన్‌[14]
  • AYSO (ది అమెరికన్‌ యూత్‌ సాకర్‌ ఆర్గనైజేషన్‌) [15]
  • LA గెలాక్సీ సాకర్‌ జట్టు[16]
  • ఇండికార్‌ డ్రైవర్స్‌ టౌన్‌సెండ్‌ బెల్‌ అండ్‌ ఇ.జె.విసో ఇన్‌ ది 2010 ఇండి 500[17]
  • వలెన్సియా CF ఫుట్‌బాల్‌ క్లబ్‌[18]
  • మెక్సికో నుంచి పుమాస్‌
  • మెక్సికో నుంచి క్లబ్‌ శాన్‌ లూయిస్‌
  • శాంటస్‌ FC, అధికారిక పౌష్టికాహార సలహాదారు
  • బార్సిలోనా ఎఫ్‌సి, అధికారిక స్పాన్సర్‌[19]
  • CAలానుస్‌, అధికారిక స్పాన్సర్‌
  • లైనల్ మెస్సీ
  • MC మేరీకామ్‌
  • క్లబ్‌ మకాబి హైఫా, ఇజ్రాయెలీ ఫుట్‌బాల్‌ క్లబ్‌

దీనికి సంబంధించిన పూర్తి జాబితాను హెర్బాలైఫ్‌ స్పోర్ట్స్‌ స్పాన్సర్‌షిప్‌ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఉత్పత్తుల పరిధి[మార్చు]

హెర్బాలైఫ్‌ యొక్క ఉత్పత్తులు అనేక ప్రొటీన్‌ షేక్స్‌, ప్రొటీన్‌ స్నాక్స్‌, పౌష్టికాహారం, శక్తి మరియు ఫిట్‌నెస్‌ సప్లిమెంట్స్‌ మరియు వ్యక్తిగత సంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులను కలిగి ఉంది.[20] ఫార్ములా 1 ప్రొటీన్‌ షేక్‌, సోయ ఆధారిత మీల్‌ రీప్లేస్‌మెంట్‌ షేక్‌ అనేది సంస్థ యొక్క నెంబర్‌వన్‌ ఉత్పత్తి. సంస్థ తొలుత అమ్మిన ఉత్పత్తి కూడా ఇదే. గుండె ఆరోగ్యానికి, అరుగుదల ఆరోగ్యానికి మరియు చర్మసంరక్షణకు సంబంధించిన ఉత్పత్తులు కూడా సంస్థ తయారు చేస్తోంది. కొన్ని ఉత్పత్తులు శాకాహారం, కోషెర్‌ లేదాహలాల్‌ చేసినవి మరియు హెర్బాలైఫ్‌ టెస్టిమోనియల్స్‌ను అందజేస్తోంది. ఉత్పత్తి మార్కెటింగ్‌లో భాగంగా, ఆరోగ్య వృత్తి నిపుణుల సలహాలను కూడా అందిస్తోంది.

2009 10K ప్రకారం, బరువు నియంత్రణకు సంబంధించి, పౌష్టికాహార మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మూడో పార్టీ తయారీ సంస్థలు తయారు చేస్తుంటాయి. అనేక సంస్థలు చైనాలో ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. అయితే హెర్బాలైఫ్‌ మాత్రం కాలిఫోర్నియాలోని లేక్‌ ఫారెస్ట్‌లో ఉన్న తమ సొంత తయారీ సంస్థలో వీటని తయారు చేస్తోంది. హెర్బాలైఫ్‌ ప్రస్తుతం తాను ఇటీవల తీసుకున్న తయారీ సంస్థకు అనేక మార్పులను చేస్తోంది. ఈ మార్పులు కూడా పూర్తయితే సొంత తయారీ సామర్ధ్యం మరింత పెరుగుతుంది.[21]

క్లినికల్‌ అధ్యయనాలు[మార్చు]

హెర్బాలైఫ్‌ యొక్క ఫార్ములా 1 ప్రొటీన్‌ షేక్‌ ఉత్పత్తి గురించి రెండు విభిన్న ఫార్ములేషన్‌లతో క్లినికల్‌ అధ్యయనాలు‌ పూర్తి చేయడం జరిగింది. ఈ అధ్యయన‌ ఫలితాలను చూస్తే హెర్బాలైఫ్‌ న్యాయవాదులు చేస్తున్న ఆరోపణలకు మద్దతుగా నిలవడంలో రెండూ విఫలమయ్యాయి.[22][23] ట్రెజాన్‌ గురించి అధ్యయనంలో పౌష్టికాహార సప్లిమెంట్‌లను పోల్చి చూస్తే (ప్రొటీన్‌ పౌడర్‌ యొక్క ప్రదర్శన, హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌, లాస్‌ ఏంజెలిస్‌) ఒకే తరహా రుచి ఉన్న కార్బొహైడ్రేట్‌ ప్లేసెబో ఉంది. ఈ రెండు చికిత్సలు‌ కూడా స్పష్టమైన తేడాలు చూపలేదు. శరీర బరువును తగ్గించడంలో ఇది ప్రాథమిక ప్రభావం కలిగి ఉంది. శరీరం యొక్క బరువు సూచీ‌ ప్రభావం, చుట్టుకొలత లేదా కొవ్వును తగ్గించే అనేక అంశాలు కూడా పెద్దగా తేడాను కలిగి లేవు. హై ప్రొటీన్‌ పౌడర్‌ ఎక్కువ కొవ్వు పరిమాణాన్ని కోల్పోయింది. 1.01 కేజీలలో 0.05 ప్రొటీన్ ఉంది. ఇది రెండో విశ్లేషణ. స్వతంత్ర అధ్యయనాలతో విశ్లేషణ చేసే వరకూ దీని గురించి ఒక అవగాహనకు రావడం మంచిది కాదు. ది లీ అధ్యయనము అనేది అదే తరహా నమూనాను కలిగి ఉన్నా, ప్రొటీన్‌ పౌడర్‌ విషయంలో విభిన్నమైన పేరు కలిగి ఉంది. (షేప్‌ వర్క్స్‌ ఫార్ములా 3, హెర్బాలైఫ్‌). లీ మొదలైనవారు ప్లేసేబోతో పోలిస్తే కొవ్వు పరిమాణం పై ఈ ప్రోటీన్ యొక్క ప్రభావంలో ఎలాంటి తేడాను చూడలేదు. ఇతర శరీర బరువు మరియు మిశ్రమాల ఫలితాలు కూడా హెర్బాలైబ్‌ ప్రొటీన్‌ మరియు ప్లేసెబోల మధ్య తేడాలను చూపలేదు. ఒక సబ్‌గ్రూప్‌ విశ్లేషణ ప్రకారం, డైటరీ కంప్లయన్స్‌ 70 శాతం అధికంగా ఉంది. ఇందులోని హై ప్రొటీన్‌ చికిత్స‌ చాలా ప్రభావాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ ద్వితీయ శ్రేణి విశ్లేషణ ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలను విశిదీకరించింది. వ్యక్తిగత అధ్యయనములు‌ జరిగే వరకూ వీటిని పరిగణలోకి తీసుకోలేం. సాధారణంగా, ఈ అధ్యయనములు‌ హెర్బాలైఫ్‌ ప్రోటీన్‌ పౌడర్‌ను సమర్ధించడానికి సాక్ష్యంగా సరిపోవు. ఈ పౌడర్‌ శరీరంలో కొవ్వును ప్లేసిబో కంటే ఎక్కువగా కరిగించగలదని చెప్పలేం.

శాస్త్రీయ సలహా బోర్డు[మార్చు]

హెర్బాలైఫ్‌ యొక్క శాస్త్రీయ సలహా బోర్డుకు డేవిడ్‌ హెబెర్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఈయన UCLAలో ఉన్న సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ న్యూట్రిషన్‌ ఇన్‌ ది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడిసిన్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2004 ఫోర్బ్స్‌ ఆర్టికల్‌ ప్రకారం, హెబెర్‌ యొక్క సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ న్యూట్రిషన్‌లోని మార్క్‌ హగ్స్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ న్యూట్రిషన్‌ లాబరేటరీకి హెర్బాలైఫ్‌ 3 మిలియన్‌ డాలర్లు విరాళం ఇవ్వగానే హెబెర్‌ ఆ సంస్థలో చేరారు.

UCLA స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో, ఫార్మాకాలజీ విభాగంలో మెడిసిన్‌ అండ్‌ డిస్టింగ్విష్డ్‌ ప్రొఫెసర్‌గా పని చేసే లూయిస్‌ జె. ఇగ్నారో కూడా హెర్బాలైఫ్‌ యొక్క శాస్త్రీయ సలహా బోర్డులో సభ్యుడిగా చేరారు. శరీరంలో నైట్రిక్‌ ఆక్సైడ్‌ను సొంతంగా పెంచుకునే విధంగా ఆహార సప్లిమెంట్స్‌ను పెంచే నెట్వర్క్స్‌ను అభివృద్ధి చేయడంలో ఇగ్నారో పనిచేశారు. తర్వాత కాలంలో ఆయన సంస్థ యొక్క శాస్త్రీయ సలహా బోర్డులో సభ్యుడయ్యారు. ఇగ్నారో ఈ ఉత్పత్తిని తొలి 12 నెలల కాలానికి ఒక మిలియన్‌ డాలర్లకు పైగా రాయల్టీ తీసుకుని సంస్థకి ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇగ్నారో నైట్‌వర్క్‌ యొక్క ఉత్పత్తిని ప్రఖ్యాత ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు కూడా ప్రమోట్‌ చేయగలిగారు. అయితే ప్రచురణ‌లో ఉన్న ఆర్థిక ఆసక్తి గురించి మాత్రం తెలపలేదు. హెర్బాలైఫ్‌తో ఇగ్నారోకు ఉన్న బంధాలు బయటకు వచ్చాక, ఈ జర్నల్‌ వ్యాసమునకు సంబంధించి సవరణలు చేసింది. ఇందులో ఇగ్నారో యొక్క కనబడని ఆసక్తి గురించి పేర్కొంది. UCLA తన సొంత విచారణను చేపట్టి, ఇగ్నారో ఎలాంటి అసహజ పనులు చేయలేదని, దీనికి సంబంధించిన పరిశోధన ఇటలీలో చేశారని, దీనికి UCLA ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపింది.[ఆధారం కోరబడింది] కాబట్టి, న్యాయపరంగా దీని గురించి బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇగ్నారో హెర్బాలైఫ్‌ యొక్క నైట్‌వర్క్స్‌ యొక్క ప్రమోషనల్‌ వీడియోలో గంటసేపు కనిపించారు.

వివాదాలు[మార్చు]

బహుళస్థాయి‌ మార్కెటింగ్‌[మార్చు]

  • 8700 మంది సంస్థ యొక్క ప్రస్తుత మాజీ పంపిణీదారులు, 2004లో దీని సెటిల్‌మెంట్‌లో భాగంగా సంస్థ కచ్చితంగా పిరమిడ్‌ పద్దతిని అవలంభిస్తోంది అంటూ సంస్థ పై వ్యాజ్యం దాఖలు చేశారు. 6 మిలియన్‌ డాలర్ల మొత్తం చెల్లించబడింది. ఇందులో ప్రతివాదలు ఎలాంటి తప్పు చేసినట్లు అంగీకరించలేదు.
  • కాలిఫోర్నియా క్లాస్‌ యాక్షన్‌ సూట్‌ మింటన్‌ వర్సెస్‌ హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ మొదలైనవారి కేసులో, హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ యొక్క స్వతంత్ర పంపిణీ దారులు మరియు హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ అనేక అంశాల విషయంలో రాష్ట్ర న్యాయసూత్రాలను ఉల్లంఘించి మార్కెటింగ్‌ పద్దతులను అవలంబిస్తోంది, మార్కెటింగ్‌ ప్రణాళికలో సరిపడా బయటకు చెప్పకుండా, వ్యాపార నిర్వహణకు సంబంధించి మోసానికి పాల్పడిందని వ్యాజ్యం దాఖలయింది.[24]

మార్కెటింగ్‌ అలవాట్లు[మార్చు]

వెస్ట్‌ వర్జీనియా క్లాస్‌ యాక్షన్‌ సూట్‌లో, మే వర్సెస్‌ హెర్బాలైఫ్‌ ఇంటర్నేషన్‌ సంస్థ మొదలైనవి కొన్ని ఆరోపణలు చేశారు. హెర్బాలైఫ్‌ ఇంటర్నేషన్‌ పంపిణీదారులు టెలి మార్కెటింగ్‌ పద్దతిలో టెలిఫోన్‌ వినియోగదారుల రక్షణ చట్టాన్ని లేదా TCPAను ఉల్లంఘించారు. ఇలాంటి పంపిణీదారులను హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ నియంత్రించాలి. మరీ ముఖ్యంగా, వాది ఆరోపణ ప్రకారం, అనేకమంది హెర్బాలైఫ్‌ పంపిణీదారులు ముందే రికార్డు చేసిన టెలిఫోన్‌ సంభాషణలను వినియోగదారులకు వినిపిస్తున్నారు. ఇది కూడా TCPA చట్టాన్ని ఉల్లంఘించినట్లే". హెర్బాలైఫ్‌ యాజమాన్యం రెండు కేసులనూ సమర్ధంగా ఎదుర్కోగలిగింది. వర్జీనియా కేసులో, హెర్బాలైఫ్‌ విధానాలకు విరుద్ధంగా ఏ పంపిణీదారుడూ పని చేయలేదని సంస్థ తెలిపింది. ఈ కేసుల వల్ల తమ సంస్థ ఆర్థిక అంశాల పై ప్రభావం పడకుండా యాజమాన్యం చూసుకుంది. ప్రత్యేకించి ఇలాంటి వివాదాల వల్ల ఎలాంటి తీర్పులు వస్తాయనే అంశాన్ని గమనించి కొంత మొత్తాన్ని ముందుగానే కేటాయించారు.[24] హెర్బాలైఫ్‌ మరియు దాని పంపిణీదారులు 7 మిలియన్‌ డాలర్లు చెల్లించడం ద్వారా ఈ కేసును పరిష్కరించుకున్నారు.[25] ఇందులో ఎలాంటి తప్పు చేయలేదని హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది. పంపిణీదారుల పై ఎలాంటి చర్యలు జరగకుండా చూసుకుంది.

ఉత్పత్తి వివాదాలు[మార్చు]

హెర్బాలైఫ్‌ బరువు తగ్గింపు ఉత్పత్తుల్లో కొన్ని మా హూఆంగ్‌ లేదా సిడా కార్డిఫోలియా అనే పదార్థాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు మూలికలు ఎఫెడ్రైన్‌ ఇల్కాలాయిడ్స్‌ను కలిగి ఉన్నాయి. 2002లో యు.ఎస్‌. రాష్ట్రాలు ఎఫెడ్రైన్‌ అల్కాలాయిడ్స్‌ను నిషేధించిన తర్వాత హెర్బాలైఫ్‌ కూడా ఎఫెడ్రైన్‌ను తమ ఉత్పత్తుల్లో వాడటాన్ని నిషేధించింది.[26][27] యు.ఎస్‌. ఆహారం మరియు డ్రగ్‌ నిర్వహణ సంస్థ ఎఫెడ్రా అనే పదార్థాన్ని 2004లో నిషేధించింది.[28]

2007లో స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో ఉన్న యూనివర్శిటీలోని ఆసుపత్రిలో వైద్యులు శాస్త్రీయ పరిశోధనలు చేశారు. వీరికి ఇజ్రాయెల్‌లోని లివర్‌ యూనిట్‌ ఆఫ్‌ హాడాస్సా హీబ్రూ విశ్వవిద్యాలయ మెడికల్‌ సెంటర్‌ కూడా జతకలిసింది. హెర్బాలైఫ్‌ ఉత్పత్తులు మరియు హెపటైటిస్‌ల మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి గుర్తించాయి.[29][30] దీనికి బదులుగా, స్పానిష్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హెర్బాలైప్‌ ఉత్పత్తుల వినియోగం గురించి హెచ్చరిక జారీ చేసింది.[31] తాము స్పానిష్‌ అధికారులతో పూర్తిగా సహకరిస్తామని హెర్బాలైఫ్‌ ప్రకటించింది.[32]

2008 మేలో వినియోగదారుల ఆసక్తిని కాపాడే సంస్థ అయిన ఫ్రాడ్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొన్న దాని ప్రకారం, హెర్బాలైఫ్‌ ఉత్పత్తులు కాలిఫోర్నియాలో చట్టం యొక్క ప్రొపోజిషన్‌ 65ను ఉల్లంఘిస్తున్నాయని నివేదిక ఇచ్చింది.[33][34] ది ఫ్రాడ్‌ డిస్కవరీ సంస్థను వ్యాపారవేత్త బారీ మిన్‌కో స్థాపించారు. ఈయన స్టాక్‌ విషయంలో మోసాలు చేసినందుకు ఏడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు.[35] హెర్బాలైఫ్‌ స్టాక్‌ గురించి ఆరోపణలను తగ్గించడం ద్వారా తమ సంస్థకి లాభమని ఆయన గుర్తించారు.[36] అయితే దీనికి హెర్బాలైఫ్‌ స్పందించి, తమ ఉత్పత్తులు FDA నిబంధనలకు అనుగుణంగా తయారవుతున్నాయని తెలిపింది.[37][38] ప్రొపోజిషన్‌ 65 పరిధిని తాము ఉల్లంఘించలేదని చెబుతూ, ల్యాబ్‌ పరీక్షలను కూడా సమర్పించింది.[36][39]

2008 మే 10న, ఒక మహిళ వాజ్యం దాఖలు చేసింది. హెర్బాలైఫ్‌ ఉత్పత్తులు వాడటం వల్ల కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని పేర్కొంది.[35][40] ఈ సూట్‌ను న్యాయవాది క్రిస్టోఫర్‌ గ్రెల్‌ దాఖలు చేశారు. దీనిని డైటరీ సప్లిమెంట్‌ సేఫ్టీ కమిటీ సహ వ్యవస్థాపకులు కూడా సమర్ధించారు. ఇది బ్యారీ మిన్‌కోకు చెందిన సంస్థ.[35] 2008 జూన్‌ 17న, ఈ వాజ్యంలో ఉత్పత్తులను పంపిణీ చేసిన వారిని కూడా చేర్చారు. హెర్బాలైఫ్‌ ఉత్పత్తుల వల్ల సమస్యలు ఎదుర్కొన్న వారందరినీ ఒక దగ్గరకు చేర్చేందుకు గ్రెల్‌ ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు.[41] 2008 ఆగస్టులో, మిన్‌కో హెర్బాలైఫ్ ‌పై చేసిన ఆరోపణలన్నింటినీ విరమించుకోవడంటో పాటు, తన వెబ్‌సైట్‌ నుంచి సంస్థకి సంబంధించిన అంశాలను కూడా తొలగించారు.[42]

క్రేజీ ఫాక్స్‌ వాణిజ్య ప్రకటనలు[మార్చు]

2008 ఏప్రిల్‌ నాటికి, అనేక వాణిజ్యపరమైన సిరీస్‌లో, ఫాక్స్‌ ప్రకటనల గృహ‌ ఆధారిత వ్యాపారంలో US ‌టెలివిజన్‌లో పెద్ద సంఖ్యలో కనిపించాయి. ఈ ప్రకటనలు ఒక సిరీస్‌గా వచ్చి నటులు వ్యక్తిగతంగా డబ్బు సంపాదించుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ వ్యాపార కార్యక్రమం వల్ల నెలకు 5 నుంచి 15 వేల డాలర్లు సంపాదించుకున్నారు. ఈ ప్రకటనలు వీక్షకులను ఒక వైబ్‌సెట్‌కు తీసుకెళతాయి. అక్కడ వారు ఒక సక్సెస్‌ కిట్‌ను పొందవచ్చు. ఈ కిట్‌ తమ వ్యాపార అవకాశాలను ఎలా విస్తరించుకోవచ్చనే అంశాన్ని చూపించలేకపోయాయి.

ఈ ప్రకటనలను హెర్బాలైఫ్‌ యొక్క స్వతంత్ర పంపిణీదారులు నడిపించారు. వీటిని కొత్తగా తమ దగ్గర పంపిణీదారులను నియమించుకోవడం కోసం ఉపయోగించారు.[43] ఇది చట్టవ్యతిరేకం కాదు, ఇలాంటి ప్రకటనలను విమర్శించేవారు ప్రకటనదారులు తమ సంస్థ సమూహాల గురించి ప్రచారం చేసుకోవాలని సూచిస్తారు.

హెర్బాలైఫ్‌ మరియు ఇజ్రాయెల్‌[మార్చు]

2005లో ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రి, హెర్బాలైఫ్‌ ఉత్పత్తుల గురించి విచారణకు ఆదేశించారు. తమ దేశంలో మరణించిన నలుగురు వ్యక్తుల కాలేయంలో, ఈ ఉత్పత్తులు వాడటం వల్ల సమస్యలు వచ్చాయనేది ఆరోపణ. హెర్బాలైఫ్‌ ఉత్పత్తులలో టాక్సిక్‌ పదార్థాలు క్వాక్వా, కొంప్రి, క్రాస్కా కలిసి ఉన్నాయి. ఈ ఉత్పత్తులను, బయో మెడికల్‌ రీసెర్చ్‌ డిజైన్‌ లిమిటెడ్‌ (B.R.D.) లాబరేటరీకి పంపించారు. ఇది USలో ఉన్న ఒక ప్రైవేట్‌ లాబరేటరీ. ఈ పరిశోధనలు, విచారణలు అన్నింటిలోనూ, హెర్బాలైఫ్‌ ఉత్పత్తులు వాడటం క్షేమమేనని తేలింది.[ఆధారం కోరబడింది]

అగ్లీ బెట్టీ పారడీ[మార్చు]

హెర్బాలైఫ్‌ ఉత్పత్తులు అగ్లీబెట్టీ అనే హాస్య కార్యక్రమంలో తమ తొలి ఎపిసోడ్‌ నుంచే పారడీ చేయబడ్డాయి. పైలట్‌లో, అనధికారికంగా తెలిసిన దాని ప్రకారం నేను హెర్బాలెక్స్‌ను అమ్మడం లేదు అని వస్తుంది. బ్రెట్టీ యొక్క సోదరి హిల్డా హెర్బాలెక్స్‌ అనే సంస్థ యొక్క పంపిణీదారుగా కనిపిస్తారు. దీని లోగో హెర్బాలైఫ్‌ లోగోకు దగ్గరగా ఉంది. వాస్తవంలో హెర్బాలెక్స్‌ అనేది పోలండ్‌లో ఉన్న ప్రత్యామ్నాయ మందులను తయారు చేసే సంస్థ. దీనికి హెర్బాలైఫ్‌తో సంబంధం లేదు.[44]

ట్రస్ట్‌, లస్ట్‌ అండ్‌ మస్ట్‌లో బెట్టీ ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక హెర్బాలెక్స్‌ ఉత్పత్తులు అమ్మడానికి సిద్ధపడతారు. ఆమె పది రోజుల్లో పది పౌండ్లు అనే ట్యాగ్‌ను తగిలించుకుని ఉంటుంది. ఇది ఇప్పుడే బరువు తగ్గండి. ఎలాగో నన్ను అడగండి అనే హెర్బాలైఫ్‌ పంపిణీదారులు తగిలించుకునే బ్యాడ్జ్‌లాగే ఉంది.

లా ఫీయా మాస్‌ బెల్లా లో ఇది అగ్లీబెట్టీ తరహా కథనంతో ఉండే స్పానిష్‌ భాషా కార్యక్రమం. ఇందులో ప్రధాన పాత్ర హెర్బాలైఫ్‌ యొక్క అసలు ఉత్పత్తులను వాడుతుంది. షో యొక్క ఆరు ఎపిసోడ్‌లలో దీని యొక్క భౌతిక మార్పులను స్క్రీన్‌ మీదే చూపిస్తారు.[45]

కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ రిఫరెన్స్‌[మార్చు]

2000లో కింగ్‌ ఆఫ్‌ ద హిల్‌ ఎపిసోడ్‌ బిల్‌ ఆఫ్‌ సేల్స్‌ పేరుతో వచ్చింది. పెగ్గీ తన సొంత వ్యాపారాన్ని ఒక MLM అమ్మకాల సంస్థ అయిన "మెటాలైఫ్"లో ‌ప్రారంభిస్తుంది.[46]

వీటిని కూడా చూడండి[మార్చు]

  • నేరుగా అమ్మకాలు
  • బహుళస్థాయి‌ మార్కెటింగ్‌

సూచనలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 Herbalife / 2009 Annual Report Selected Financial Data (pdf) - page 49/50
  2. Herbalife / 2009 Annual Report Corporate Information (pdf) - page 131
  3. హెర్బాలైఫ్‌ కాల్స్‌ బయ్‌ అవుట్‌ టూ లో
  4. హెర్బాలైఫ్‌ వార్షిక నివేదిక 2008
  5. 5.0 5.1 హెర్బాలైఫ్‌ కంటెంట్‌ను నోబుల్‌ బహూమతి విజేత బయటకు తెలపలేదు. బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ నివేదిక
  6. కోపేజ్‌ ఇవి. మార్క్‌ ఆర్‌. హగ్స్‌, 44; పౌష్టికాహార సప్లిమెంట్‌ను కనుగొన్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌, 23 మే 2000. సెక్షన్‌ బి, పేజి 11, కాలమ్‌ 5.
  7. హెర్బాలైఫ్‌ ఎక్విజిషన్‌ పూర్తి(పరిశ్రమ వార్తలు) (విట్నీ అండ్‌ కో మరియు గోల్డెన్‌ గేట్‌ క్యాపిటల్‌ కలిసి హెర్బాలైఫ్‌ ఇంటర్నేషనల్‌ను సొంతం చేసుకున్నాయి) (సంక్షిప్త వ్యాసం) న్యూట్రాస్యూటికల్‌ ప్రపంచం. ఆర్టికల్స్‌ను కనుగొనడం....
  8. ఎథికల్‌ ఫ్లాప్‌ ఫోర్స్‌ ఎగ్జిట్‌ ఆఫ్‌ ప్రెసిడెంట్‌: హెర్బాలైఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోబెర్ట్‌కు సంస్థ యొక్క ఎదుగుదల గురించి క్రెడిట్‌ ఇచ్చారు.(హెల్త్‌కేర్‌) (గ్రెగరీ ప్రొబెర్ట్‌) లాస్‌ ఏంజెలిస్‌ బిజినెస్‌ జర్నల్‌ నుంచి వ్యాసం.
  9. "Herbalife Sets More Layoffs". The New York Times. 1985-05-30. 
  10. నార్డిక్‌ హెర్బాలైఫ్‌ డైరెక్టర్‌ నుంచి ప్రకటన, హెర్బాలైఫ్‌ ఉత్పత్తుల్లో టక్సిసిటీ ఉందనే వార్తలకు ఖండన - పిరమిడ్‌ మార్కెటింగ్‌ పద్దతి.
  11. http://ir.herbalife.com/phoenix.zhtml?c=183888&p=irol-newsArticle&ID=1394343&highlight=
  12. http://labusinessjournal.com/news/2010/jul/19/herbalife-leads-lean-mean-pack-profitability/
  13. హెర్బాలైఫ్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ వెబ్‌సైట్‌
  14. LA ట్రయథ్లాన్‌ వెబ్‌సైట్‌
  15. AYSO వెబ్‌సైట్‌
  16. LA గెలాక్సీ
  17. 2010 ఇండికార్‌ సిరీస్‌ సీజన్‌ టీమ్‌ మరియు డ్రైవర్‌ చార్ట్‌
  18. సూపర్‌డిపోర్ట్‌.ఇఎస్‌(Spanish)
  19. [1]
  20. హెర్బాలైఫ్‌ కార్పొరేట్‌ ప్రొఫైల్‌
  21. 2009 ఫామ్‌ 10కె http://ir.herbalife.com/phoenix.zhtml?c=183888&p=irol-sec
  22. నియంత్రణ కలిగి ప్రొటీన్‌ ఎనిరిచ్‌మెంట్‌ మీల్‌ రీప్లేస్‌మెంట్‌ను బరువు తగ్గించడంలో భాగంగా బాడీ మాస్‌లో ఉపయోగించడం; లియో ట్రేజాన్‌, స్టీవ్‌ చెన్‌, కుర్ట్‌ హాంగ్‌, ఎరిక్‌ యాన్‌, కేథరిన్‌ ఎల్‌ కార్పెంర్‌, గెయిల్‌ థేమ్స్‌, సుసాన్‌ బరెమన్‌, హీ జింగ్‌ వాంగ్‌, రాబర్ట్‌ ఎలాష్‌హాప్‌ మరియు జావోపింగ్‌ లి; UCLA సెంటర్‌ ఫర్‌ హA్యమన్‌ న్యూట్రిషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌, డేవిడ్‌ జెఫెన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎట్‌ UCLA, లాస్‌ ఏంజెలిస్‌, యుఎస్‌ఎ.
  23. తక్కువ క్యాలెరీల యొక్క సామర్ధ్యం, బరువు, పొత్తికకడుపులో కొవ్వును తగ్గించడం కోసం కొంత మీల్‌ కలిసి ఉన్న ప్రణాళికలు, ఇవి మెటా బయోలిక్‌ సిండ్రోమ్‌తో ఉంటాయి. డబుల్‌ బ్లైండ్‌, రెండు డైట్‌ ప్రణాళికల యొక్క రాండమైజ్‌ కంట్రోల్‌, ఒకటి ఎక్కువ ప్రోటీన్లతో మరొకటి సమానమైన న్యూట్రిషన్లతో ఉండటం. బిలోంగ్‌ చో; క్లినికల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన అంతర్జాతీయ జర్నల్‌, ఫిబ్రవరి 2009.
  24. 24.0 24.1 ఎస్‌ఇసికి హెర్బాలైఫ్‌ యొక్క త్రైమాసిక ఫలితాలు, జూన్‌ 2006
  25. హెర్బాలైఫ్‌ లిమిటెడ్‌ - HLF‌ వార్షిక నివేదిక (10-కె) ఐటమ్‌ 3,లీగల్‌ ప్రొసీడింగ్స్‌
  26. Herbalife Ltd. (2005-03-14). "Form 10-K". United States Securities and Exchange Commission. pp. page 15. 
  27. Evans, D. (2002-04-11). "Herbalife, Other Ephedra Marketers Face Soaring Insurance Rates". Bloomberg L.P. 
  28. "Sales of Supplements Containing Ephedrine Alkaloids (Ephedra) Prohibited". U.S. Food and Drug Administration. 
  29. హెర్బాలైఫ్‌ పౌష్టికాహార సప్లిమెంట్స్‌ మరియు అక్యూట్‌ హెపాటోటోక్సిసిటీకి మధ్య ఉన్న వినియోగంకు సంబంధించిన బంధం.
  30. హెర్బాలైఫ్‌ అంటే ఇన్నోకుయస్‌ కాదు: హెపటోటోక్సిసిటీకి సంబంధించిన పది కేసులు, హీర్బాలైఫ్ ఉత్పత్తుల నుండి వచ్చిన హెర్బాలైఫ్‌ డైటరీ సప్లిమెంట్స్‌కు సంబంధము కలిగినవి
  31. స్పానిష్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఇష్యూస్‌, హెర్బాలైఫ్‌ గురించి జారీ చేసిన ముందు జాగ్రత్తలు
  32. లివర్‌కు సంబంధించిన సమస్యలు వస్తాయని ఎలాంటి నిరూపణా జరగలేదు. హెర్బాలైఫ్‌ రెస్పాండ్స్‌ టు స్పానిష్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అలర్ట్‌
  33. హెర్బాలైఫ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. - రెగ్యులేషన్‌ - యుఎస్‌ఎ న్యూట్రల్‌ ఇంగ్రెడెంట్స్‌ - ఆహారం, బ్రేవరేజ్‌ మరియు న్యూట్రిషన్‌ - పబ్లికేషన్‌ - డెసిషన్‌ న్యూస్‌ మీడియా.
  34. రెండో, ఎఫ్‌డిఎ రిజిస్టర్డ్‌, స్వతంత్ర ల్యాబ్‌ అఫర్మ్స్‌ హయ్యర్‌ లీడ్‌ లెవల్స్‌, హెర్బాలైఫ్‌ ఉత్పత్తుల్లో ఉన్నవి. ఫ్రాడ్‌ డిస్కవరీ సంస్థ యొక్క నివేదికలు. పిల్లల యొక్క హెర్బాలైఫ్‌ ఉత్పత్తులలో కొత్త ల్యాబ్‌ ఫలితాల ప్రకారం అవసరమైన దానికంటే మెటీరియల్స్‌ ఉపయోగించారు, ఫ్రాడ్‌ డిస్కవరీ సంస్థ యొక్క నిపుణుల నివేదిక, కొత్త పరీక్షలు 904 శాతం హెర్బాలైఫ్‌ను ఎక్కువ లీడ్‌ చేశాయి, నుస్కిన్‌ న్యూట్రిషనల్‌షేక్స్‌, పోటీదారుల కంటే ఎక్కువ, ఫ్రాడ్‌డిస్కవరీ సంస్థ యొక్క నివేదిక.
  35. 35.0 35.1 35.2 లాస్‌ ఏంజెలిస్‌ బిజినెస్‌ జర్నల్‌ ఆన్‌లైన్‌ - బిజినెస్‌ వార్తలు మరియు సమాచారం ఫర్‌ లాస్‌ ఏంజెలిస్‌, కాలిఫోర్నియా.
  36. 36.0 36.1 హెర్బాలైఫ్‌ తనపై ఉన్న ఆరోపణలను రీబఫ్‌ చేయడం
  37. ఫాక్స్‌ న్యూస్‌. కామ్‌-గ్రూప్‌ చెప్పిన దాని ప్రకారం ఆరు డైటరీ సప్లిమెట్‌లు ప్రమాదకర స్థాయిలో లీడ్‌లను కలిగి ఉన్నాయి. - ఆరోగ్య వార్తలు ప్రస్తుత ఆరోగ్య వార్తలు ఆరోగ్యో వార్తలు
  38. హెర్బాలైఫ్‌ ప్రాప్‌ 65 టెస్టింగ్‌ సంస్థతో ఏర్పడ్డ వివాదం
  39. మోర్‌లీడ్‌ పరీక్షల్లో ఉత్పత్తుల భద్రత గురించి కన్‌ఫమ్‌, హెర్బాలైఫ్‌చెప్పింది - పరిశ్రమ - న్యూట్రా ఇంగ్రెడెంట్స్‌ USఎ - ఫుడ్‌, బేవరేజ్‌ మరియు న్యూట్రిషన్‌ - పబ్లికేషన్‌ - డెసిషన్‌ న్యూయార్క్‌ మీడియా
  40. హెర్బాలైఫ్‌ను నిర్లక్ష్యం మరియు మోసం చేసినందుకు బాధితుల దావా
  41. CNN.com
  42. Reuters.com
  43. ఇంటి నుంచి పని - నిజమైన ఒప్పందం - న్యూస్‌చానల్‌ 9 WSYR
  44. హెర్బాలక్స్‌
  45. హెర్బాలైఫ్‌ లా ఫీ మాస్‌ బెల్లాలో ప్రధాన క్యారెక్టర్‌గా మారడం, మెక్సికో యొక్క అగ్లీ బెట్టీలో
  46. http://www.tv.com/king-of-the-hill/bill-of-sales/episode/9194/summary.html
గమనికలు

బాహ్య లింకులు[మార్చు]