హెలికోబాక్టర్ పైలోరీ
| హెలికోబాక్టర్ పైలోరీ | |
|---|---|
| ఇతర పేర్లు | హెచ్. పైలోరీ సంక్రమణం, క్యాంపిలోబాక్టర్ పైలోరీ |
| గ్యాస్ట్రిక్ బయాప్సీ నుండి H. పైలోరి (గోధుమ రంగులో)|ఇమ్యునోహిస్టోకెమికల్ మరకలు | |
| ఉచ్చారణ | |
| ప్రత్యేకత | అంటు వ్యాధులు, గ్యాస్ట్రోఎంటరాలజీ |
| లక్షణాలు | కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట |
| సంక్లిష్టతలు | గ్యాస్ట్రిటిస్, కడుపులో పూత, కడుపు క్యాన్సర్ |
| కారణాలు | హెలికోబాక్టర్ పైలోరీ మల నోటి మార్గం లేదా నోటి-నోటి మార్గం ద్వారా వ్యాపిస్తుంది |
| రోగనిర్ధారణ పద్ధతి | యూరియా శ్వాస పరీక్ష, మల యాంటిజెన్ అస్సే, వేగవంతమైన యూరియా పరీక్ష, కణజాల బయాప్సీ |
| భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | ఉదరకుహర వ్యాధి, క్రోన్'స్ వ్యాధి, నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ వాడకం, లాక్టోస్ సున్నితత్వం |
| ఔషధం | ప్రోటాన్-పంప్ ఇన్హిబిటర్లు, క్లారిథ్రోమైసిన్, అమోక్సిసిలిన్, బిస్మత్ సబ్సాలిసిలేట్, మెట్రోనిడాజోల్ |
| తరుచుదనము | 60% (2015) |
హెలికోబాక్టర్ పైలోరీ సంక్రమణం (ఇన్ఫెక్షన్) అంటే హెలికోబాక్టెర్ పైలోరీ అనే బ్యాక్టీరియా ద్వారా జీర్ణకోశానికి సంక్రమించే వ్యాధి.[1] హెలికోబాక్టర్ పైలోరీ అనేది గ్రామ్-నెగటివ్, మైక్రోఎరోఫిలిక్, వక్రరాడ్ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా. సాధారణంగా ఈ సంక్రమణంలో ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ ఇది 25% మందిలో పొట్టలో పుండ్లు (కడుపు వాపు) లేదా 10% లో పూత కలిగించవచ్చు.[2][3] కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ సంక్రమణం అట్రోఫిక్ గ్యాస్ట్రిటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, మ్యూకోసల్ అనుబంధ-లింఫాయిడ్ (మాల్ట్ లింఫోమా) వంటి వ్యాధులకు కూడా అనుబంధంగా కనపడుతుంటుంది.[2]
ఇది ఎక్కువగా మల-నోటి మార్గం ( Fecal–oral route), ఇంకా నోటి-నోటి మార్గం (oral-oral route) ద్వారా వ్యాపిస్తుందని తెలుస్తోంది. వ్యాధి సాధారణంగా పేదరికం ఉన్న ప్రాంతంలో నివసించేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది[2][1] యూరియా శ్వాస పరీక్ష, మల యాంటిజెన్ పరీక్ష, వేగవంతమైన యురేస్ పరీక్ష లేదా కణజాల బయాప్సీ ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది. సెరోలజీ[గమనిక 1] అంటే ప్రస్తుత లేదా గత సంక్రమణను సూచించే పరీక్ష.[2]
నిర్దిష్ట లక్షణాలు లేని వ్యక్తులకు చికిత్స అవసరం లేదు.[2] లక్షణాలు ఉన్నప్పుడు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ (పిపిఐ), అమోక్సిసిలిన్, మెట్రోనిడాజోల్, క్లారిథ్రోమైసిన్ సమ్మేళనాలని ఉపయోగించుతారు.[3] ఇవి కాకుండా పిపిఐ, బిస్మత్ సబ్సాలిసిలేట్, మెట్రోనిడాజోల్, టెట్రాసైక్లిన్ లు కూడా వాడుతారు. చికిత్స సాధారణంగా 14 రోజులు ఉంటుంది.[2] 2015 నాటికి హెచ్. పైలోరీ టీకా అభివృద్ధి జరిగింది.
2015 లో ప్రపంచం మొత్తానికి 60% మందికి వ్యాధి సోకిందని అంచనా. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది.[2] తరచుగా బాల్యంలో మొదట సోకుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 10 ఏళ్లలోపు పిల్లలలో సుమారు 5% మంది ప్రభావితమయ్యారు.[1] ఇటీవలి దశాబ్దాలలో, అనేక దేశాలలో ఈ సంక్రమణం ఉధృతం తగ్గింది. ఈ బాక్టీరియాను మొట్టమొదట 1982లో ఆస్ట్రేలియన్ వైద్యులు బారీ మార్షల్, రాబిన్ వారెన్ గుర్తించారు.[4]
సూచనలు
[మార్చు]- 1 2 3 . "Helicobacter Pylori". MerriamWebsterDictionary.
- 1 2 3 4 5 6 7 "Helicobacter pylori - Chapter 4 - 2020 Yellow Book | Travelers' Health | CDC". wwwnc.cdc.gov. Archived from the original on 20 January 2022. Retrieved 23 February 2022.
- 1 2 "Management of Helicobacter pylori in 2023: who should be tested, treated, and how | This Changed My Practice". thischangedmypractice.com. Archived from the original on 20 October 2023. Retrieved 24 September 2023.
- ↑ Rees, Alan M. (1997). Consumer Health USA (in ఇంగ్లీష్). Greenwood Publishing Group. p. 194. ISBN 978-1-57356-068-9. Archived from the original on 2022-02-23. Retrieved 2022-02-23.
గమనిక
[మార్చు]- ↑ రక్త సీరాన్ని (రక్తంలోని ద్రవం) శాస్త్రీయ అధ్యయన రోగనిర్ధారణ పరీక్ష. వ్యాధికారక క్రిములు ప్రవేశపెట్టిన పదార్థాలకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనకు సంబంధించిన యాంటీబాడీస్ పరీక్ష.