హేండ్సప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌హాండ్సప్
దర్శకత్వంశివనాగేశ్వర రావు
రచన
  • జయసుధ (కథ)
  • జనార్ధన మహర్షి (మాటలు)
  • శివ నాగేశ్వరరావు (చిత్రానువాదం)
నిర్మాతనితిన్ కపూర్
తారాగణంబ్రహ్మానందం,
నాగేంద్ర బాబు ,
జయసుధ
సంగీతంశశి ప్రీతమ్
నిర్మాణ
సంస్థ
జె.ఎస్.కె. కంబైన్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 10, 2000 (2000-02-10)
భాషతెలుగు

హాండ్సప్ 2000లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు హాస్య భరిత చిత్రం.[1] ఇందులో జయసుధ, నాగేంద్రబాబు, బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించారు.

హైదరాబాదు నగరం బాంబు పేలుళ్ళతో దద్దరిల్లుతుంటుంది. హైదరాబాదు పోలీసులు, ప్రాంతీయ సి. బి. ఐ అధికారులు సమస్యను అరికట్టడంలో విఫలమవుతారు. దాంతో ఢిల్లీ నుంచి సరస్వతి అనే కొత్త సి. బి. ఐ ఆఫీసరుని నియమిస్తుంది ప్రభుత్వం. ప్రాంతీయ సి. బి. ఐ అధికారియైన గిరిబాబు ఆమెకు పెద్దగా సహకారం అందకుండా ఉండాలని పెద్దగా అనుభవం లేని ముద్దుకృష్ణ, జగన్ అనే అధికారులుని ఆమెకు సహాయకులుగా నియమిస్తాడు. ఇలా చేస్తే వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఆమె సకాలంలో పనిచేయకుండా ఉంటే పై అధికారుల నుంచి తను చేపట్టిన పని ఎంత క్లిష్టమైన పనో నిరూపించాలని అతని పథకం.

జగన్, ముద్దుకృష్ణ ఇద్దరూ తెలివి తక్కువ తనంలో ఒకరికొకరు పోటీ పడుతుంటారు. తుగ్లక్ అనే హిందీ వ్యక్తి హైదరాబాదు తన స్థావరంగా చేసుకుని నగరంలో బాంబు పేలుళ్ళతో అస్థిరపరచాలనుకుంటూ ఉంటాడు. అతని అనుచరులెవరికీ హిందీ తెలియకపోవడంతో ఒక అనువాదకుడిని నియమించుకుంటాడు. సరస్వతి చార్జి తీసుకోగానే జగన్, ముద్దు కృష్ణల అమాయకత్వం వల్ల ఆమె పథకాలు బెడిసికొడుతుంటాయి. అయినా సరే ఆమె వాళ్ళిద్దరి సహాయంతోనే కేసుకు ఛేదించాలనుకుంటుంది.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత -
  • దర్శకుడు -
  • కథ -
  • చిత్రానువాదం -
  • మాటలు -
  • పాటలు -
  • స్వరాలు -
  • సంగీతం -
  • పోరాటాలు -
  • కళ -
  • దుస్తులు -
  • అలంకరణ -
  • కేశాలంకరణ -
  • ఛాయాగ్రహణం -
  • ధ్వని విభాగం (సౌండ్ ఎఫెక్ట్) -
  • ఎడిటర్ -
  • జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ -
  • పబ్లిసిటీ -
  • పోస్టర్ డిజైనింగ్ -
  • ప్రెస్ -

మూలాలు

[మార్చు]
  1. "Handsup review". teluguone.com. Archived from the original on 28 ఏప్రిల్ 2021. Retrieved 18 December 2017.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=హేండ్సప్&oldid=4211594" నుండి వెలికితీశారు