హేతుబద్ధీకరణ (సమాజశాస్త్రం)
సమాజ శాస్త్రం లో, హేతుబద్ధీకరణ (Rationalisation) అనగా సమాజంలో సంప్రదాయాలు, విలువలు, భావోద్వేగాల పై ఆధారపడ్డ ప్రవర్తన క్రమంగా హేతుబద్ధత, తర్కం పై ఆధార పడడం. ఉదాహరణకు, ప్రభుత్వంలో ఉద్యోగిస్వామ్యం అమలు అనేది ఒక విధమైన హేతుబద్ధీకరణ. ఆధునిక యుగంలో సంస్కృతి హేతుబద్ధీకరణకు ప్రపంచీకరణ ఒక ప్రధాన కారణం. సాంకేతికాభివృద్ధితో దేశాలు ముందెన్నడు లేనంతగా ఒకదానితో ఒకటి అనుసంధానింపబడుతున్నాయి. అలాగే దేశాలపై బయటి మీడియా, సామాజికమాధ్యమాల, రాజకీయాల ప్రభావం అధికమయ్యింది.శ స్థానిక హేతుబద్ధీకరణకు ఆఫ్రికాలో నాటువైద్యుల పరిస్థితి ఒక ఉదాహరణ. చాలా మంది స్థానికులు వారిని వారి సంస్కృతిసంప్రదాయాలలో ముఖ్యభాగంగా చూసినా, అభివృద్ధి కార్యక్రమాలు, సహాయక కార్యకర్తలు స్థానిక ప్రజలకు ఆధునిక వైద్యంపై అవగాహన కల్పించే యత్నంలో ఆ పద్ధతిని హేతుబద్ధీకరించడానికి ప్రయత్నించారు.
చాలా మంది సమాజశాస్త్రవేత్తలు, విమర్శనాత్మక సిద్ధాంతకర్తలు, సమకాలీన తత్వవేత్తలు హేతుబద్ధీకరణను పురోగతిగా భావించడం తప్పని వాదించారు. హేతుబద్ధీకరణవల్ల సమాజం ప్రతికూల మానవీయ ప్రభావాలకు గురై, ఆధునికతను జ్ఞానోదయ కేంద్ర సిద్ధాంతాల నుండి దూరం చేసిందని వాదించారు.
పెట్టుబడిదారీ విధానం
[మార్చు]శాస్త్రీయ సమాజశాస్త్రం స్థాపనలో, ముఖ్యంగా ఆధునిక పాశ్చాత్య సమాజాల స్వభావంపై క్రమశిక్షణకు ప్రాధాన్యతను పెంచడంలో, హేతుబద్దీకరణ ముఖ్యపాత్రను పోషించింది. ఈ ప్రక్రియను అధ్యయనం చేయడంలో జర్మన్ ప్రతి-సానుకులతావాది మాక్స్ వెబెర్ ముఖ్యభూమికను పోషించాడు.
వెబెర్ ది ప్రొటెస్టంట్ ఎథిక్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజంలో హేతుబద్ధికరణను గురించి విపులంగా చర్చించాడు. ఇందులో కొన్ని ప్రొటెస్టంట్ వర్గాలు, ముఖ్యంగా కాల్విన్-వాదులు, వారి మతవిశ్వాలసాలలో అంతర్లీనంగా ఉన్న మోక్షంపై అనిశ్చితిని ఎదుర్కొనేందుకు హేతుబద్ధ ఆర్థికలాభార్జనవైపు మరలారని వివరించాడు. ఈ సిద్ధాంతం హేతుబద్ధమైన పరిణామాలు, త్వరలోనే దాని మతపరమైన మూలాలకు విరుద్ధంగా పెరుగుతాయని, అందువల్ల చివరకు అది దాని మతపరమైన మూలాలను త్యజిస్తుందని అతను వాదించాడు. వెబెర్ ఈ విషయంపై పరిశోధనను తన తదుపరి రచనలలో కొనసాగించాడు. ముఖ్యంగా, ఉద్యోగిస్వామ్యం, అధికార వర్గీకరణలపై తను చెసిన అధ్యయనాలలో ఈ పరిణామాన్ని కూడా చర్చించాడు. ఈ రచనలలో అతను హేతుబద్ధీకరణ అనివార్యమైన సూచించాడు. [1]
మూలాలు
[మార్చు]- ↑ Macionis, J., and Gerber, L. (2010). Sociology, 7th edition