హేమలత పుట్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హేమలత పుట్ల ప్రముఖ రచయిత. ==జీవిత విశేషాలు ==శ్రీమతి మనోరంజితం , శ్రీ మనష్షే గార్లకు తొలి సంతానం . నెల్లూరు , బెంగుళూరు ల్లో ప్రాథమిక విద్యను కొనసాగించారు . బి . ఎ చదువు తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసారు . పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి “ వెబ్ లో తెలుగు సాహిత్యం తీరు –తెన్నులు అనే అంశం పై పిహెచ్.డి” చేసారు .

ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ తో వివాహం అయ్యింది . వీరికి ఇద్దరు అమ్మాయిలు . మానస,మనోఙ్ఞ. ఎండ్లూరి మానస యువ కథా రచయిత్రి.

1975 లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే మొదటి సారి రాసిన “తిరిగి రాని పయనం ‘” అనే కథను కాథలిక్ చర్చి వెలువరించే క్రీస్తు రాజ దూత అనే పత్రికలో ప్రచురించారు . 1982లో ” గూడు చేరిన గువ్వ” అనే నవల 'స్పందన' ఆధ్యాత్మిక మాసపత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది . దీనినే నర్సాపూర్ లోని జీవన జ్యోతి ప్రెస్ వారు 1990 లో ప్రచురించారు . అనేక సార్లు విశాఖ రేడియో స్టేషను లో కవితలు చదివారు . “ స్త్రీవాద , దళిత సాహిత్య ఉద్యమాలు దళిత స్త్రీల భావాలను చెప్పుకోవడానికి వేదికను కల్పించి గ్రామ స్థాయి అట్టడుగున దళిత స్త్రీల వరకు వెళ్ళాల్సి ఉందని “ ఈమె అభిప్రాయం. విహంగ మహిళా సాహిత్య పత్రిక , కి సంపాదకురాలు. అంతర్జాలంలో ప్రారంభించబడిన తొలి తెలుగు మహిళా పత్రిక , ISSN నెంబర్ పొందిన తొలి అంతర్జాల పత్రిక కూడా విహంగనే . ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) కి జాతీయ అధ్యక్షురాలిగా వున్నారు. ది. 09.02.2019 న ఊపిరితిత్తుల సంభంధిత వ్యాధితో పోరాడుతూ, రాజమహేంద్రవరం నందు తారలా నింగికి ఎగిసారు.


రచనలు:

  • అంతర్జాలంలో తెలుగు సాహిత్యం(పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం)
  • వేకువరాగం(కవితా సంపుటి)

సంపాదకత్వం:

  • లేఖన సాహిత్య వ్యాససంపుటి
  • అంతర్జాలం-సాహిత్య దర్శనం

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

http://vihanga.com manasayendluri.blogspot.in